పాలిటెక్నిక్.. ప్రత్యేకతలెన్నో!

పదోతరగతి పూర్తయ్యాక.. ఎటువైపు అడుగు వేయాలని ఆలోచించే విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి మార్గం.. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు! మూడు మూడున్నరేళ్లకే ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తిచేసే అవకాశం ఉండటం పాలిటెక్నిక్ కోర్సుల ప్రత్యేకత. పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆర్థిక స్తోమతకు అనుగుణమైన ఫీజులతో తక్కువ వ్యవధిలోనే కోర్సు పూర్తి చేసుకోవచ్చు. అంతేకాదు చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు.
పదోతరగతి తర్వాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి, ఉపాధి సంపాదించాలంటే ఉత్తమమార్గం పాలిటెక్నిక్. దీనికోసం విద్యార్థులు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలీసెట్)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
పాలిటెక్నిక్ తర్వాత ఉన్నత విద్యకూ అవకాశం ఉన్నా, మూడేళ్లకల్లా ఉపాధి సాధించాలనుకునేవారు ఎక్కువగా పాలిటెక్నిక్ డిప్లొమాపైనే ఆధారపడతారు. పాలిటెక్నిక్‌లో ఏయే బ్రాంచ్‌లు ఉంటాయి? ఏ బ్రాంచ్‌లో చేరితే ఎలాంటి ఉపాధి అవకాశాలు లేదా ఉన్నత విద్యావకాశాలుంటాయో చూద్దామా .
పదోతరగతి పూర్తయ్యాక మూడేళ్లకే ఇంజినీరింగ్ డిప్లొమా పొందాలనుకునే విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సులు అత్యంత అనువైనవి. డబ్బు, సమయం వృథా కాకుండా సాంకేతిక విద్యార్హత సాధించడానికి ఉపకరిస్తాయి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తోంది పాలిటెక్నిక్. పదోతరగతి పూర్తిచేసిన తర్వాత ఇంజినీరింగ్ డిగ్రీ అందుకోవాలంటే రెండేళ్లు ఇంటర్మీడియట్, నాలుగేళ్లు ఇంజినీరింగ్ చదవాలి. ఆర్థికంగా స్థోమత లేనివాళ్లు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పదోతరగతి తర్వాత మూడేళ్లకే సాంకేతిక విద్యలో డిప్లొమా పొందడానికి పాలిటెక్నిక్‌ వైపు మొగ్గు చూపుతారు. మరోవైపు పారిశ్రామిక రంగం ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన విద్యార్థులతో దీటుగా ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్థులకూ ప్రాధాన్యం ఉంటుంది.
పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్లేస్‌మెంట్ అవకాశాలు పెరుగుతున్నాయి. గ్రామీణ, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు చక్కటి అవగాహనతో పని చేయడం, ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఎక్కువ వేతనాలు చెల్లించాల్సి రావడం లాంటి కారణాలతో పారిశ్రామిక రంగం పాలిటెక్నిక్ విద్యార్థులకు అవకాశాలు పెంచింది.
సివిల్, మెకానికల్ లాంటి ప్రాథమిక తరహా కోర్సులకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు చేసిన వారితో పోలిస్తే, పాలిటెక్నిక్ చేసిన వారికి ఉపాధి అవకాశాలూ ఎక్కువే.

 

చిన్న వయసులోనే సాంకేతిక విద్యను పూర్తిచేసుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చక్కటి మార్గం. సాంకేతిక విద్యపై ఆసక్తి ఉండి, కెరీర్ పరంగా త్వరగా జీవితంలో స్థిరపడాలనుకునే వారికి ఉత్తమమైన మార్గం పాలిటెక్నిక్. వాస్తవానికి ఇంజనీరింగ్ డిగ్రీ(బీఈ/బీటెక్) అందుకోవాలంటే.. పదో తరగతి తర్వాత రెండేళ్ల ఇంటర్మీడియట్, అనంతరం నాలుగేళ్ల ఇంజనీరింగ్ పూర్తిచేయాల్సి ఉంటుంది. కానీ పాలిటెక్నిక్తో మూడేళ్లకే ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసుకోవచ్చు. మరోవైపు ప్రాక్టికల్ నాలెడ్జ్ దృష్ట్యా సంస్థలు డిప్లొమా విద్యార్థులకు నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయి.
ప్రవేశం ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాల నుకునే విద్యార్థులు ఆయా‡రాష్ట్ర ప్రభుత్వం నిర్వ హించే పాలీసెట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. పాలీసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి.. ప్రవేశాలు కల్పిస్తారు.
మూడేళ్ల కోర్సులు
సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అప్త్లెడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఐటీ, మైనింగ్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ (సుగర్ టెక్నాలజీ), ప్రింటింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్.
మూడేన్నరేళ్ల కోర్సులు
మెటలర్జికల్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, కెమికల్, కెమికల్(ఆయిల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్, ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్), సిరామిక్, లెదర్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్‌వేర్ టెక్నాలజీ.
స్పెషల్ డిప్లొమా కోర్సులు
స్పెషల్ డిప్లొమా కోర్సులు ఎలక్ట్రానిక్ స్పెషౖలñ జేషన్కు సంబంధించినవి. వీటిలో ముఖ్యంగా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజ నీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ వీడియో ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి.
ఎలక్ట్రానిక్స్‌లో స్పెషల్ డిప్లొమా కోర్సులు
ఎంబెడెడ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్, టీవీ అండ్ సౌండ్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్.
రాష్ట్రవ్యాప్తంగా 248 పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 70620 సీట్లున్నాయి. వీటికోసం ఏటా రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది పోటీ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఉన్నత విద్య
డిప్లొమా పూర్తిచేసిన తర్వాత విద్యార్థుల ముందు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి,ఉద్యోగంలో చేరడం, కాగా రెండోది ఉన్నత విద్య(బీటెక్). విద్యార్థులు తమ ఆసక్తి, ఆర్థిక స్తోమతకు అనుగుణంగా ఉద్యోగం లేదా ఉన్నత విద్యలో ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఆయా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ డిప్లొమా హోల్డర్స్(ఈసెట్–ఎఫ్డీహెచ్) ద్వారా బీటెక్/ బీఈలో చేరే అవకాశం లభిస్తుంది. లేటరల్ ఎంట్రీ వి«ధానంలో డైరెక్ట్గా ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశం పొందవచ్చు.
నైపుణ్యాలు ఎక్కువ
పదో తరగతి తర్వాత ఇంటర్ పూర్తి చేసి.. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థుల కంటే.. ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఇంజనీరింగ్ ఉత్తీర్ణులయ్యే వారికి ప్రాక్టికల్ నైపుణ్యాలు ఎక్కువగా లభిస్తాయనే అభిప్రాయం ఉంది. కారణం.. డిప్లొమా స్థాయిలో ప్రాక్టికల్కు అధిక ప్రాధాన్యం ఉండటమే.
డిప్లొమా చేసిన తరువాత అవకాశాలు
పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఉండే అవకాశాలను ప్రధానంగా రెండు విధాలుగా విభజించవచ్చు.
అవి: ఉద్యోగం, ఉన్నత విద్య.
ఉద్యోగం:
ఇందులోనూ రెండు మార్గాలున్నాయి. ఒకటి స్వయం ఉపాధి; రెండోది ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థల్లో ఉద్యోగం పొందడం. ప్రైవేటు వ్యాపార సంస్థలు, కంపెనీలు, పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలున్నాయి. విదేశాల్లోనూ ఎన్నో అవకాశాలున్నాయి.
బ్రాంచిల ఆధారంగా ఉద్యోగావకాశాలున్న రంగాలు:
  • సివిల్ ఇంజనీరింగ్ : సాగునీరు, ప్రజాఆరోగ్యం, రోడ్లు, రైల్వేలు, బిల్డింగ్ సర్వే, డ్రాయింగ్, మంచినీటి సరఫరా తదితర రంగాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు సదరు విభాగాల్లో డ్రాఫ్ట్స్‌మెన్, కాంట్రాక్టర్లుగా స్వయం ఉపాధి పొందవచ్చు. ఉన్నత చదువులు చదవాలనుకొనేవారు సివిల్ ఇంజనీరింగ్, సివిల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్లతో బీటెక్ పూర్తి చేయొచ్చు.
  • ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ : డిజైన్ అండ్ డ్రాయింగ్ విభాగాల్లో కెరీర్ అవకాశాలు ఉంటాయి. ఆర్కిటెక్చర్ డిజైనర్‌గా స్వయం ఉపాధి పొందవచ్చు. మున్సిపల్ కార్యాలయాల్లో లెసైన్స్‌డ్ డిజైనర్‌గా పనిచేయొచ్చు. ఉన్నత విద్య పరంగా బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అందుబాటులో ఉంది.
  • మెకానికల్ ఇంజనీరింగ్ : మెషినరీ, ట్రాన్స్పోర్ట్, ప్రొడక్షన్ యూనిట్లలో వర్క్షాపులు, మెకానికల్ గ్యారేజీల్లో అవకాశాలు దక్కించుకోవచ్చు. సొంతంగా గ్యారేజీలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి కూడా సొంతం చేసుకోవచ్చు.
  • ఆటోమొబైల్ ఇంజనీరింగ్ :టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, రవాణారంగం, ఆటోమొబైల్ షోరూమ్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీల్లో ఉద్యోగాలు దక్కించుకునే వీలుంది. మెకానికల్, ఆటోమొబైల్ స్పెషలైజేషన్లతో డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు బీటెక్‌లో మెకానికల్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, మెకానికల్ మెరైన్, మెకట్రానిక్స్ స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు.
  • ప్యాకేజింగ్ టెక్నాలజీ : ఫార్మాస్యూటికల్, ఫుడ్, బెవరేజ్, పేపర్, ప్లాస్టిక్ తదితర విభాగాల్లో అవకాశాలు లభిస్తున్నాయి.
  • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్æ : ఏపీ,టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో, ఇండస్ట్రీస్ మెయింటెన్స్ విభాగాల్లో అవకాశాలు ఉంటాయి. ఎలక్ట్రిక్ టెక్నీషియన్, వైరింగ్ కన్సల్టెన్సీ తదితరాల ద్వారా స్వయం ఉపాధి పొందొచ్చు. ఉన్నత విద్య పరంగా బీటెక్‌లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్లను ఎంచుకోవచ్చు.
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ : ఆలిండియా రేడియో, దూరదర్శన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రేడియో, టీవీ సేల్స్ అండ్ సర్వీసింగ్ సెక్టార్‌లో స్వయం ఉపాధి పొందొచ్చు. ఉన్నత విద్య పరంగా బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీమ్యాటిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ అందుబాటులో ఉన్నాయి.
  • అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ : ప్రాసెస్ ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో ఉపాధి పొందవచ్చు.
  • కంప్యూటర్ ఇంజనీరింగ్ : కంప్యూటర్ మెయింటెనెన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తా యి. కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీసింగ్ సెక్టార్‌లో స్వయం ఉపాధి అవకాశాలు ఉంటాయి.
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ : ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్న ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు.
  • మైనింగ్ ఇంజనీరింగ్ : ఈ డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్ మైనింగ్ కంపెనీల్లో ముఖ్యంగా కోల్ ఇండియా, సింగరేణి లాంటి సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
  • కెమికల్ ఇంజనీరింగ్ : ఈ కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు షుగర్, పెట్రో కెమికల్, ప్లాస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పేపర్ తయారీ సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు.
  • ప్రింటింగ్ టెక్నాలజీ : ఈ డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రింటింగ్ పరిశ్రమల్లో కంపోజింగ్ డీటీపీ, ఫిల్మ్ మేకింగ్ తదితర రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు.
  • కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ : ఈ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల్లో స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేయొచ్చు.

డిఫెన్స్ సంస్థల్లో...
1.   టెక్స్‌టైల్ టెక్నాలజీ: టెక్స్‌టైల్ మిల్లులు, వస్త్రాల ఎగుమతి పరిశ్రమల్లో.
2. కెమికల్ ఇంజినీరింగ్: కెమికల్, రిఫైనరీ, పెట్రోకెమికల్ పరిశ్రమలు.
3. కెమికల్ ఇంజినీరింగ్ (ఆయిల్ టెక్నాలజీ): రిఫైనరీ, పేపర్, సుగర్, పెట్రోకెమికల్, ప్లాస్టిక్స్, ఫుడ్ ప్రాసెస్ పరిశ్రమలు.
4. కెమికల్ ఇంజినీరింగ్ (పెట్రో కెమికల్): రిఫైనరీ, పెట్రో కెమికల్, కెమికల్ పరిశ్రమలు.
5. కెమికల్ ఇంజినీరింగ్ (ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్): కెమికల్ పాలిమర్, ప్లాస్టిక్ పరిశ్రమలు.
6. సిరామిక్ టెక్నాలజీ: రిఫ్రాక్టరీ, ఇటుకబట్టీలు, సిమెంట్, గ్లాస్, సిరామిక్, శానిటరీ వేర్ తదితర రంగాలు.
7. లెదర్ టెక్నాలజీ: ట్యానరీ, ఫుట్‌వేర్ పరిశ్రమలు.
8. ఫుట్‌వేర్ టెక్నాలజీ (లెదర్): ఫుట్‌వేర్ మాన్యుఫాక్చరింగ్ అండ్ లెదర్ టెక్నాలజీ.
(15 – 24 వరకు ఉన్న కోర్సులకు కాలవ్యవధి మూడేళ్లు.)
ఉన్నత విద్యావకాశాలు
పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ, రెగ్యులర్ కోర్సులు చేయవచ్చు. తద్వారా కెరీర్ ఎదుగుదలకు ఉపయోగపడే ఉన్నత సాంకేతిక విద్యావకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
* ఈసెట్ (ఎఫ్.డి.హెచ్.): ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ -ఫర్ డిప్లొమా హోల్డర్స్ (ఈసెట్-ఎఫ్‌డీహెచ్)గా వ్యవహరించే ఈ ప్రవేశపరీక్ష ద్వారా ఇంజినీరింగ్ చేయవచ్చు. కాల వ్యవధి మూడేళ్లు. లేటరల్ ఎంట్రీ అని పిలిచే ఈ విధానంలో నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరవచ్చు. పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో 10 శాతం సీట్లను ఈసెట్ (ఎఫ్‌డీహెచ్)కు కేటాయించారు.
* పాలిటెక్నిక్ చదివినవారు ఎంసెట్ రాయడానికీ అర్హులే. ఇందులో వచ్చిన ర్యాంకు ద్వారా తమకు ఆసక్తి ఉన్న బ్రాంచీల్లో చేరవచ్చు.
* జేఈఈ(మెయిన్) రాసి, ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్ లేదా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేయవచ్చు.
* పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి ఇంజినీరింగ్ చేసేందుకు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ అవకాశాలున్నాయి. రెగ్యులర్ కోర్సుల ద్వారా లేదా ఉద్యోగం చేస్తూ కరస్పాండెన్స్-కమ్-కాంట్రాక్టు కోర్సుల ద్వారా చదువుకోవచ్చు.
‘ఎస్‌డీసీ’ శిక్షణ: ఎంసెట్ కోచింగ్ తీసుకుంటూ ఇంటర్మీడియట్ చదివి, ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులతో పోలిస్తే పాలిటెక్నిక్ చేసి లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్ డిగ్రీలో చేరిన విద్యార్థుల్లో సాఫ్ట్ స్కిల్స్, ఇతర నైపుణ్యాలు తక్కువే అనేది పారిశ్రామిక వర్గాలు తరచూ వెల్లడించే అభిప్రాయం. అందుకే పాలిటెక్నిక్ విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్, ఆంగ్లభాషణ లాంటి అంశాల్లో శిక్షణనిచ్చే కార్యక్రమాలను చేపట్టారు. ఇంజినీరింగ్ విద్యార్థులతో పోలిస్తే, టెక్నికల్ సబ్జెక్టుల్లో దీటుగా ఉన్నా, సాఫ్ట్ స్కిల్స్ లాంటి కొన్ని నైపుణ్యాల్లో వెనుకబడి ఉంటారు. ఈ లోపాన్ని సవరించడానికి పాలిటెక్నిక్ కళాశాలల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను (ఎస్‌డీసీ) ఏర్పాటుచేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నందువల్ల వారికి సాఫ్ట్‌స్కిల్స్, ఇతర అవసరమైన అంశాల్లో శిక్షణనిచ్చి పారిశ్రామిక వర్గాల అంచనాలకు అనుగుణంగా తయారుచేయడమే ఈ కేంద్రాల లక్ష్యం. ఇప్పటివరకూ ఈ కేంద్రాల్లో 3400 మంది విద్యార్థులు శిక్షణ పొందారు.

%d bloggers like this:
Available for Amazon Prime