న‌చ్చిన కొలువు దక్కించుకోవాలంటే…‘ఇంగ్లిష్‌’ తప్పనిసరి

ఇంగ్లిష్‌ నైపుణ్యం ఉంటే.. ప్రపంచాన్నే చుట్టేయొచ్చు అనే నానుడి! కంపెనీలు నియామకాలప్పుడు ఇంగ్లిష్‌పై పట్టును ప్రత్యేకంగా పరిశీలిస్తున్న పరిస్థితి.
Career guidance

ఐఐటీలు, ఐఐఎంల నుంచి స్థానిక కళాశాలల్లో చదివిన విద్యార్థుల వరకూ.. ఇంగ్లిష్‌ స్కిల్స్‌ ఉంటేనే అవకాశం కల్పిస్తున్న వైనం! సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ ఎంత ఘనంగా ఉన్నా.. ఇంగ్లిష్‌ నైపుణ్యం లేకపోతే ఆఫర్‌ అనుమానమే! దీంతో.. ఇప్పుడు నచ్చిన కొలువు దక్కించుకోవాలంటే.. ముందుగా ఇంగ్లిష్‌ స్కిల్స్‌ను పెంచుకోక తప్పని పరిస్థితి! ఈ నేపథ్యంలో.. ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌కు కంపెనీలు ఇస్తున్న ప్రాధాన్యం.. భాషపై పట్టును పెంచుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాల గురించి తెలుసుకుందాం…
ఇప్పుడు ఏ ఉద్యోగ ప్రకటనను చూసినా.. ఇంగ్లిష్‌లో రాయడం, మాట్లాడం వచ్చి ఉండటం తప్పనిసరి నిబంధనగా మారింది. కంపెనీలు ఇంగ్లిష్‌ స్కిల్స్‌కు ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం ఇది. మరోవైపు నూటికి 70 శాతం మంది ఇంగ్లిష్‌ నైపుణ్యాలు లేని కారణంగా అవకాశాలను చేజార్చుకోవాల్సి వస్తోంది. ఐఐటీలు మొదలు స్థానిక కళాశాల వరకూ.. ఎక్కడ చదివినా, ఎలాంటి కోర్సు పూర్తి చేసినా.. ఇంగ్లిష్‌ నైపుణ్యం లేకుంటే.. అవకాశం దక్కడం కష్టమే. దక్కినా నిలబెట్టుకోవడం అసాధ్యం. ఇంతలా ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు ప్రాధాన్యం పెరగడానికి కారణం.. మారుతున్న కంపెనీల వ్యాపార కార్యకలాపాలు.. రోజు రోజుకూ మారిపోతున్న టెక్నాలజీ!అంతర్జాతీయ క్లయిం ట్స్‌ సంస్థలు, వినియోగదారులతో సంప్రదింపుల పరంగా ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యం పెరిగింది. కాబట్టి విద్యార్థులు సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌కే పరిమితం కాకుండా.. ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పెంచుకోవడానికి కృషిచేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
విదేశీ విద్యకు లాంగ్వేజ్‌ టెస్ట్‌లు :
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ స్కిల్‌ ఇప్పుడు కేవలం ఉద్యోగాల సాధనకే పరిమితం కాకుండా.. ఇతర విషయాల్లోనూ యువతను ముందంజలో నిలిచేలా చేస్తోంది. ముఖ్యంగా విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందాలంటే.. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టుల్లో ప్రతిభ చూపడం తప్పనిసరి. ముఖ్యంగా టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, పీటీఈ వంటి స్టాండర్డ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ల్లో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్‌ పాత్ర కీలకం. స్పోకెన్, రిటెన్‌ ఇంగ్లిష్‌ నైపుణ్యాలు మెరుగ్గా ఉంటేనే లాంగ్వేజ్‌ టెస్టుల్లో రాణించే వీలుంటుంది.
ప్రజెంటేషన్‌ స్కిల్స్‌ :
ఇంగ్లిష్‌ నైపుణ్యం పెంచుకుంటే.. అభ్యర్థుల్లో ప్రజెంటేషన్‌ స్కిల్స్‌ కూడా మెరుగవుతాయి. ఇది ఉద్యోగ సాధనకు దోహదపడుతుంది. ఇప్పుడు చాలా కంపెనీలు ఏదైనా ఒక టాపిక్‌పై ప్రజెంటేషన్‌ను కోరుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇంగ్లిష్‌ ప్రజెంటేషన్‌ స్కిల్స్‌ ప్రధానంగా మారాయి. అంతేకాకుండా ప్లేస్‌మెంట్స్‌ ప్రక్రియలో భాగంగా నిర్వహించే గ్రూప్‌ డిస్కషన్స్‌లోనూ ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కీలకం. కాబట్టి విద్యార్థులు తాము కోర్సులో చేరిన రోజు నుంచే ఇంగ్లిష్‌ భాషపై పట్టు పెంచుకునేందుకు ప్రత్యేకంగా దృష్టిసారించాలి. అలాగే స్టార్టప్‌ ఔత్సాహికులు తమ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌లను వివరించేందుకు ఇంగ్లిష్‌ స్కిల్‌ తప్పనిసరి. మరోవైపు పోటీ పరీక్షల్లో రాణించేందుకు కూడా ఇంగ్లిష్‌ భాషపై పట్టుండటం తప్పనిసరి.
ప్రముఖ విద్యాసంస్థల్లో సైతం :ఇంగ్లిష్‌ నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు ఆన్‌లైన్‌ వేదికలను ఉప యోగించుకోవచ్చు. వీటిల్లో బ్లాగులు, సోషల్‌ నెట్‌వర్క్‌ మెసేజింగ్, చాటింగ్, య్యూటూబ్‌ వీడియోలు, లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ పోర్టల్స్‌ వంటివి ముఖ్యమైనవి. బ్లాగుల్లో ఏదైనా ఒక విషయానికి సంబంధించి పోస్ట్‌ చేసిన కామెంట్లు లేదా అనాలిసిస్‌లను చదివి.. వాటికి ఇంగ్లిష్‌లో సమాధానం రాయడం అలవర్చుకోవాలి. తొలిదశలో నచ్చిన రీతిలో రాస్తూ.. క్రమేణా రాత నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్స్‌లో నిపుణుల కామెంట్స్‌ను క్షుణ్నంగా చదవడం ఎంతో లాభిస్తుంది. ఒక టాపిక్‌కు సంబంధించి సదరు నిపుణులు ఉపయోగించిన భాషపై అవగాహన వస్తుంది. తద్వారా భాషా పరిజ్ఞానాన్ని క్రమేణా పెంచుకోవచ్చు. అలాగే యూట్యూబ్‌తోపాటు ఇతర వెబ్‌పోర్టల్స్‌లో వీడియోలు చూడటం ద్వారా ఇంగ్లిష్‌పై పట్టు సాధించే వీలుంది.
స్పోకెన్‌ ఇంగ్లిష్‌ :
స్పోకెన్‌ ఇంగ్లిష్‌.. ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్, లాంగ్వేజ్‌ స్కిల్‌ పరంగా అత్యంత కీలకమైన నైపుణ్యం. ఇంగ్లిష్‌లో రాయగలిగినా.. చాలామంది మాట్లాడేందుకు జంకుతుంటారు. లిజనింగ్, రైటింగ్‌ పరంగా పట్టు సాధించినప్పటికీ.. స్పీకింగ్‌కు వచ్చేసరికి తడబడుతుంటారు. వాస్తవానికి ప్రస్తుత పోటీ ప్రపంచంలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కీలకంగా మారింది. పట్టుదలతో ప్రయత్నిస్తే స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చు. ఇంగ్లిష్‌లో మాట్లాడటం కోసం ముందుగా.. నిర్దిష్టంగా ఒక అంశాన్ని ఎంపిక చేసుకోవాలి. సదరు విషయానికి సంబంధించి అప్పటివరకు ప్రచురితమైన వ్యాసాలు, వార్తలు చదవాలి.అందులో వినియోగించిన పదజాలం, వాక్య నిర్మాణం వంటివి పరిశీలించాలి. స్థూలంగా దాని సారాంశం తెలుసుకోవాలి. ఆ తర్వాత సంబంధిత టాపిక్‌ను తమదైన శైలిలో పాయింట్ల రూపంలో రాసుకోవాలి. ఆయా అంశాలను ముందుగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. ఈ విషయంలో బిడియం సరికాదు. తొలిదశలో ఒక విషయాన్ని ఎదుటి వారికి అర్థమయ్యేట్లు చెప్పగలుగుతున్నామా లేదా? అనేదే ప్రధానం.
గ్రూప్‌ డిస్కషన్స్‌ :
స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నైపుణ్యం పెంచుకునేందుకు ఉపయోగపడే మరో సాధనం..గ్రూప్‌ డిస్కషన్స్‌(జీడీ). తొలిదశలో గ్రూప్‌ డిస్కషన్స్‌ను స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రారంభించాలి. దీనివల్ల సదరు చర్చ సందర్భంగా బాగా మాట్లాడిన వాళ్లను పరిశీలించే అవకాశం లభిస్తుంది. అలాగే డిబేట్స్‌(చర్చలు)లో పాల్గొనడం కూడా మేలు చేస్తుంది. కాలేజీ, స్కూల్‌ స్థాయి నుంచే ఇంగ్లిష్‌లో మాట్లాడం అలవాటుగా మార్చుకోవాలి. ఫలితంగా నలుగురిలో ఇంగ్లిష్‌లో మాట్లాడేటప్పుడు బెరుకు తగ్గుతుంది.
గ్రామర్, వొకాబ్యులరీ :
  • ఇంగ్లిష్‌ నేర్చుకునేటప్పుడు తొలిదశలో అత్యంత ఉపయుక్త సాధనం.. నిఘంటువు (డిక్షనరీ). ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్‌ వంటి డిక్షనరీల్లో ఒక పదానికి అర్థం తెలియజేయడంతోపాటు.. సదరు పదాన్ని ఏ సందర్భంలో వినియోగిస్తారు? ఎలా మాట్లాడొచ్చు? అనే విషయాలు ఉంటాయి. సదరు పదాలకు సమానార్థాలు, వ్యతిరేకార్థాలు కూడా కనిపిస్తాయి.
  • స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నైపుణ్యం కోణంలో …వొకాబ్యులరీపై పట్టు సాధించడం ఎంతో అవసరం. ప్రతిరోజు కనీసం పదికొత్త పదాలు–వాటి అర్థాలు తెలుసుకోవాలి. వాటిని ఏ సందర్భంలో ప్రయోగించవచ్చో తెలుసుకోవాలి.
  • ఇంగ్లిష్‌ నైపుణ్యం మెరుగుపరచుకునే విషయంలో బేసిక్‌ గ్రామర్‌(వ్యాకరణం)పై అవగాహన మేలు చేస్తుంది. ప్రధానంగా టెన్సెస్, డైరెక్ట్‌–ఇండైరెక్ట్‌ స్పీచ్, యాక్టివ్‌ వాయిస్‌–ప్యాసివ్‌ వాయిస్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఫలితంగా ఒక విషయాన్ని కమ్యూనికేట్‌ చేసే క్రమంలో చక్కటి నైపుణ్యం లభిస్తుంది.
అకడమిక్‌ మార్గాలు :
ఇంగ్లిష్‌ నైపుణ్య సాధనకు ఇప్పుడు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. అకడమిక్‌ స్థాయిలోనే కాలేజీలు, యూనివర్సిటీల పరిధిలో ఫినిషింగ్‌ స్కూల్స్‌ పేరుతో, లేదా ప్రత్యేకంగా ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ క్లబ్‌ల పేరుతో శిక్షణ కేంద్రాలు ఏర్పడుతున్నాయి. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. వీటితోపాటు బ్రిటిష్‌ కౌన్సిల్, కేంబ్రిడ్జ్‌ ఇండియా వంటి ప్రముఖ సంస్థలు లెర్నింగ్‌ ఇంగ్లిష్‌పై దశల వారీగా శిక్షణనిస్తున్నాయి. సదరు శిక్షణ పూర్తయ్యాక నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్‌ సైతం చేతికందుతుంది.
నేర్చుకోండిలా..మరి ఇంగ్లిష్‌ను నేర్చుకోవడం ఎలా.. ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌పై పట్టు సాధించడం ఎలా?! అనే సందేహాలు తలెత్తడం సహజం. విద్యార్థులు నాలుగు అంశాలపై దృష్టి సారిస్తే ఇంగ్లిష్‌ బేసిక్‌ స్కిల్స్‌ అలవడుతాయని నిపుణులు చెబుతున్నారు. అవి.. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్‌.
లిజనింగ్‌: ఇంగ్లిష్‌ను నేర్చుకునే క్రమంలో తొలుత సంభాషణను శ్రద్ధంగా వినడం చాలా ముఖ్యం. ఇంగ్లిష్‌పై అవగాహన ఉన్న వ్యక్తులు తమతో మాట్లాడుతున్నప్పుడు ఏకాగ్రతతో ఆలకించాలి. మధ్యలో అడ్డు తగలకూడదు. దీనివల్ల వారు ఏ అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారో తెలుస్తుంది. వారి లాంగ్వేజ్‌ ఎక్స్‌ప్రెషన్‌ కూడా అర్థం అవుతుంది.
స్పీకింగ్‌: అంటే.. మాట్లాడటం. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ స్కిల్స్‌ను పెంచుకునే విషయంలో స్పీకింగ్‌ ఎంతో కీలకం. నచ్చిన అంశాన్ని ఎంచుకుని మాట్లాడటం సాధన చేయాలి. తొలిదశలో పొరపాట్లు దొర్లినా.. బిడియ పడకుండా మాట్లాడటం కొనసాగించాలి. తద్వారా క్రమేణా తమ తప్పులు తెలుసుకుని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.
రీడింగ్‌: ఒక అంశాన్ని క్షుణ్నంగా చదివి దాని సారాంశాన్ని.. అందులోని పద ప్రయోగాలను గుర్తించాలి. దీనివల్ల సదరు అంశం.. ఉద్దేశం, లక్ష్యం అర్థమవుతుంది.
రైటింగ్‌: ఇంగ్లిష్‌ బేసిక్‌ స్కిల్స్‌లో నాలుగోది చదివిన లేదా విన్న అంశాలను సొంత మాటల్లో రాయడం. ఈ విధానం వల్ల వాక్య నిర్మాణం, పద ప్రయోగం వంటి వాటిపై క్రమేణా పట్టు లభిస్తుంది.
రెండు విధానాల్లోనూ కీలకం :
ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌.. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ఎంతో కీలకంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఇంగ్లిష్‌ నేర్చుకునేందకు కృషి చేయాలి. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో అందుబాటులో ఉన్న ఇంగ్లిష్‌ లెర్నింగ్‌ కోర్సులు అభ్యసించేందుకు ప్రయత్నించాలి.
%d bloggers like this:
Available for Amazon Prime