ఐఐటీ కల.. సాకారమిలా…

దేశంలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యకు ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాజీలు’(ఐఐటీలు) నిలయాలు.
Edu newsఇక్కడ అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధనతో పాటు పరిశోధనలు సైతం జరుగుతుంటాయి. ఐఐటీల్లో చదువుకున్న ఎంతోమంది దేశ, విదేశాల్లో ప్రముఖ కంపెనీల్లో కీలక పదవులు నిర్వహిస్తుండటం తెలిసిందే. అందుకే ఎంపీసీ చదివే ఎక్కువ మంది విద్యార్థులు ఐఐటీల్లో చేరాలని కలలు కంటారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో అండర్ గ్రాడ్యుయేట్/ఇంటిగ్రేటెడ్ పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘‘జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్–జేఈఈ’’ (అడ్వాన్స్డ్)–2020 నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో… ఐఐటీల్లో ప్రవేశాలు, అడ్వాన్స్‌డ్‌కు అర్హత, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం..

కోర్సులు ఇవే..జేఈఈ(అడ్వాన్స్డ్) ర్యాంకు ఆధారంగా ఐఐటీలు అందించే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ(బీటెక్), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్), బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులతోపాటు డ్యుయెల్ డిగ్రీ బీటెక్–ఎంటెక్, డ్యుయెల్ డిగ్రీ బీఎస్–ఎంఎస్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఆయా కోర్సును బట్టి కాలవ్యవధి ఉంటుంది. బీటెక్, బీఎస్ కోర్సుల కాల వ్యవధి నాలుగేళ్లు, బీఆర్క్ కోర్సు కాల వ్యవధి ఐదేళ్లుగా ఉంది. అదేవిధంగా బీటెక్–ఎంటెక్(డ్యూయల్ డిగ్రీ) ఐదేళ్లు, బీఎస్–ఎంఎస్(డ్యూయల్) ఐదేళ్లు, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్/ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ఐదేళ్లు చదవాల్సి ఉంటుంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హతలు

 • అభ్యర్థి 2019 లేదా 2020లో 10+2/తత్సమాన కోర్సులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ తప్పనిసరి సబ్జెక్టులుగా చదవాలి. 10+2/తత్సమాన కోర్సులో టాప్ 20 పర్సంటైల్‌లో లేదా కనీసం 75 శాతం మార్కులు సాధించాలి (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 65 శాతం మార్కులు). దాంతోపాటు జేఈఈ(మెయిన్)–2020లో టాప్ 2,50,000 జాబితాలో ఉన్న అభ్యర్థులు అర్హులు.
 • అభ్యర్థులు అక్టోబర్ 1, 1995న లేదా తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు లభిస్తుంది. వీరు అక్టోబర్ 1, 1990న లేదా తర్వాత జన్మించి ఉండాలి.
 • అభ్యర్థి వరుసగా రెండేళ్లలో రెండుసార్లు మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం ఉంది.

పరీక్షా విధానం

 • జేఈఈ(అడ్వాన్స్డ్)–2020 పరీక్ష ‘కంప్యూటర్ బేస్డ్ టెస్ట్’(సీబీటీ) విధానంలో ఉంటుంది. రెండు తప్పనిసరి పేపర్లు పేపర్1, పేపర్ 2 ఉంటాయి. మే 17వ తేదీన ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకూ పేపర్1; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పేపర్2 నిర్వహిస్తారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. – అడ్వాన్స్న్స్–2020లో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం 3 గంటలు.
 • అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాయాలంటే.. ముందుగా మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయడం మంచిది. ప్రతి అభ్యర్థికి పరీక్ష కేంద్రంలో కంప్యూటర్ టెర్మినల్ కేటాయిస్తారు. పరీక్షా సమయంలో అభ్యర్థి లాగిన్ కోసం కేటాయించిన కంప్యూటర్‌పై అతడు/ఆమె ఫొటోను చూపిస్తుంది. లాగిన్ ఐడీగా అభ్యర్థి జేఈఈ (అడ్వాన్స్డ్)–2020 రోల్ నంబర్‌ను, పాస్‌వర్డ్‌గా పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి. (ఉదా: అభ్యర్థి పుట్టిన తేదీ ఏప్రిల్ 6, 2001 అయితే 06042001 (తేదీ నెల సంవత్సరం ప్రకారం) ఎంటర్ చేయాలి.
 • లాగిన్ తర్వాత పరీక్ష కోసం పాటించాల్సిన సూచనలను తప్పనిసరిగా చదవాలి. ప్రశ్నల తీరు, మార్కింగ్ తదితర అంశాలను బాగా అర్థం చేసుకోవాలి. పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. అభ్యర్థి తనకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు.
 • పరీక్షకు ఇచ్చిన మొత్తం సమయంలో నమోదు చేసిన సమాధానాలను ఎప్పుడైనా మార్చుకోవచ్చు.
 • పరీక్ష జరుగుతున్నప్పుడు కంప్యూటర్/మౌస్/కీబోర్డు పనిచేయకపోతే కంగారు పడాల్సిన పనిలేదు. సమస్యను ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్తే వెంటనే మరో కంప్యూటర్ ఇస్తారు. దీనివల్ల కోల్పోయిన సమయాన్ని సర్వర్‌లో సర్దుబాటు చేస్తారు. –పేపర్–1, 2 (రెండు పేపర్లు) తప్పనిసరిగా రాయాలి.

మొత్తం 23 ఐఐటీలు

 • ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం ఐఐటీల సంఖ్య 23.
 • ఈస్ట్ జోన్: ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ భువనేశ్వర్, ఐఐటీ ధన్‌బాద్, ఐఐటీ భిలాయ్.
 • సెంట్రల్ జోన్: ఐఐటీ కాన్పూర్, ఐఐటీ వారణాసి, ఐఐటీ ఇండోర్.
 • నార్త్ సెంట్రల్ జోన్: ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ జమ్మూ, ఐఐటీ జోధ్‌పూర్.
 • నార్త్ ఈస్ట్ జోన్: ఐఐటీ గౌహతి, ఐఐటీ పట్నా
 • నార్త్ జోన్: ఐఐటీ రూర్కీ, ఐఐటీ మండి, ఐఐటీ రోపార్.
 • సౌత్ జోన్: ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ పాలక్కడ్, ఐఐటీ తిరుపతి.
 • వెస్ట్ జోన్: ఐఐటీ బాంబే, ఐఐటీ ధార్వాడ్, ఐఐటీ గాంధీనగర్, ఐఐటీ గోవా.

మరికొన్ని ఇన్స్టిట్యూట్స్
జేఈఈ అడ్వాన్స్డ్ స్కోరు ఆధారంగా మరికొన్ని ప్రముఖ ఇనిస్టిట్యూట్స్ సైతం ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అవి…

 • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–ఐఐఎస్సీ (బెంగళూరు)
 • ఐఎస్ఈఆర్–బెర్హంపూర్, భోపాల్, కోల్‌కతా, మొహాలి, పూణే, తిరువనంతపురం, తిరుపతి.
 • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐఐఎస్టీ)– తిరువనంతపురం.
 • రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ(ఆర్‌జీఐపీటీ), రాయ్‌బరేలి.
 • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, విశాఖపట్నం.

దరఖాస్తు ఫీజు

 • దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
 • భారతీయ మహిళ/ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు: రూ.1400, ఇతరులు రూ.2800
 • విదేశీయులు (సార్క్ దేశాలకు చెందినవారు): 75 యూఎస్డీ (అమెరికా డాలర్లు)
 • నాన్–సార్క్ దేశాలవారు: 150 యూఎస్డీ.
 • విదేశాల్లో పరీక్ష రాయాలనుకునే భారతీయులు/సార్క్ దేశాలకు చెందినవారు: 75 యూఎస్డీ, ఇతర విదేశీయులకు: 150 యూఎస్డీ ఫీజుగా నిర్ణయించారు.
%d bloggers like this:
Available for Amazon Prime