ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌

యువ‌త కోరుకునే ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌

ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి సివిల్‌ సర్వీసెస్‌.. దేశంలోని విద్యార్థులు, యువతకు క్రేజీ కెరీర్‌. సమాజంలో గుర్తింపు, గ్లామర్‌తోపాటు ప్రజలతో మమేకమై ప్రత్యక్షంగా సేవ చేసేందుకు అవకాశమున్న సర్వీసులు ఇవి. అత్యున్నత శిఖరాలు అధిరోహించేందుకు అవకాశం ఉండటంతో ఈ కొలువుల్లో చేరాలని లక్షల మంది ప్రతిభావంతులు తపన పడుతుంటారు.
Bavitha

ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి సివిల్‌ సర్వీసుల కోవకు చెందిందే.. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌)!. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ.. ఇలా మూడంచెల ప్రక్రియ ద్వారా ఐఎఫ్‌ఎస్‌కు విజేతలను ఎంపిక చేస్తారు. ఏటా యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. అభ్యర్థులు.. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరై.. అర్హత సాధించాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి మెయిన్‌
రాసేందుకు అనుమతి లభిస్తుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పటికే మే 31న జరిగే అవకాశం ఉన్న సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతున్నారు. ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌తోపాటే నవంబర్‌లో జరుగనున్న మెయిన్‌–2020పై ఇప్పటి నుంచే దృష్టి పెడితే చాలావరకు సిలబస్‌ పూర్తి చేసేందుకు అవకాశముంది. ఈ నేపథ్యంలో.. ‘ఐఎఫ్‌ఎస్‌ 2020’ పరీక్ష తీరుతెన్నులపై ప్రత్యేక కథనం…
సైన్స్, ఇంజనీరింగ్‌ అర్హత :
సివిల్స్‌ రాసేందుకు అభ్యర్థి కనీస అర్హత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ రాయాలంటే మాత్రం యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీలలో ఏదేని ఓ సబ్జెక్ట్‌తో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. అలాగే అగ్రికల్చర్‌/ఫారెస్ట్రీ/ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌ కూడా అర్హులే. ఆయా బ్యాచిలర్‌ డిగ్రీ/ఇంజనీరింగ్‌లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. మెయిన్‌ పరీక్ష నాటికి తప్పనిసరిగా డిగ్రీ పాసై ఉండాలి. సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి మెయిన్‌ రాసేందుకు అవకాశం ఉంటుంది.
వయసు :
ఐఎఫ్‌ఎస్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థి వయసు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఆరుసార్లు :
జనరల్‌ అభ్యర్థులు ఆరు సార్లు, ఓబీసీలకు తొమ్మిది సార్లు పరీక్ష రాసేందుకు అనుమతి ఉంది. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు వారివారి రిజర్వేషన్లను అనుసరించి గరిష్ట వయో పరిమితి ముగిసేవరకు ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు.
మూడు దశల్లో ఎంపిక :
ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ మొత్తం మూడు దశల్లో జరుగుతుంది. అందులో మొదటి దశ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌. ఇది మే 31న జరిగే అవకాశముంది. ఇందులో అర్హత సాధించిన వారు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటారు. మెయిన్‌ అనేది ఎంపిక ప్రక్రియలో రెండోదశ. ఈ పరీక్షలు(ఐఎఫ్‌ఎస్‌) 22 నవంబర్‌ 2020 నుంచి పది రోజుల పాటు జరుగుతాయి. మెయిన్‌లో ప్రతిభ చూపిన వారిని మూడో దశ పర్సనాలిటీ టెస్ట్‌(ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. మెయిన్‌ 1400 మార్కులకు, పర్సనాలిటీ టెస్ట్‌ 300 మార్కులకు ఉంటుంది. మెయిన్‌లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూలో సాధించిన స్కోర్, రిజర్వేషన్లను అనుసరించి అభ్యర్థులకు ర్యాంక్‌లు కేటాయిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తవడానికి సుమారు ఏడాది సమయం పడుతుంది.
పరీక్ష విధానం :
ప్రిలిమ్స్‌ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌ 200 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌కు రెండు గంటల సమయం. నెగెటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రిలిమ్స్‌లోని పేపర్‌–2లో 33 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. పేపర్‌–1లో మార్కులు మెయిన్‌కు ఎంపికలో అత్యంత కీలకం. పరీక్ష నిర్వహించిన ఏడాది ప్రకటించిన పోస్టుల సంఖ్యను బట్టి 1:13 నిష్పత్తిలో మెయిన్‌కు ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్‌(సివిల్స్‌ ప్రిలిమ్స్‌)లో అర్హత సాధించిన వారు మాత్రమే ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌కు ఎంపికవుతారు.
మెయిన్‌ పరీక్ష ఇలా..
మెయిన్‌లో ఆరు పేపర్లు(వ్యాసరూప తరహా) ఉంటాయి. ఒక్కో పేపర్‌కు సమయం మూడు గంటలు. ఇందులో జనరల్‌ ఇంగ్లిష్‌–300 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌–300 మార్కులకు; ఆఫ్షన్‌–1 నుంచి రెండు పేపర్లు (200 మార్కుల చొప్పున), ఆఫ్షనల్‌–2 నుంచి రెండు పేపర్లు(200 మార్కుల చొప్పున) మొత్తం 1400 మార్కులకు మెయిన్‌ జరుగుతుంది.
రెండు ఆప్షనల్స్‌ :
ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌లో జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్‌ పేపర్లతోపాటు రెండు సబ్జెక్టులను ఆఫ్షనల్స్‌గా ఎంచుకోవాలి. ఇందుకోసం యూపీఎస్సీ 14 సబ్జెక్టులను ప్రకటించింది. అవి.. అగ్రికల్చర్, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్, యానిమల్‌ హజ్‌బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజినీరింగ్, ఫారెస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ. సివిల్స్‌ మెయిన్‌ ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌/హిందీలో ఉంటుంది. సమాధానాలు రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలోనైనా రాసేందుకు వీలుంది. ఐఎఫ్‌ఎస్‌ అందుకు భిన్నం. ప్రశ్న పత్రాలు ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటాయి. సమాధానాలు సైతం ఇంగ్లిష్‌లోనే రాయాలి. మెయిన్‌ పూర్తిగా అభ్యర్థి విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఉంటుంది.
జనరల్‌ ఇంగ్లిష్‌ :
ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌లో జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్‌ అభ్యర్థి ఇంగ్లిష్‌ భాష పరిజ్ఞానం అంచనా వేసేలా ఉంటుంది. ఇందులో గ్రామర్‌తోపాటు పదాల అమరికను పరీక్షిస్తారు. ప్రధానంగా నాలుగు అంశాలు ఇచ్చి 1000 పదాలకు తగ్గకుండా ఒక వ్యాసం రాయమంటారు. ఈ వ్యాసానికి 100 మార్కులు కేటాయించారు. లెటర్‌ రైటింగ్‌ ఉంటుంది. ఒక పాసేజ్‌ ఇచ్చి దాన్ని మూడో వంతుకు కుదించి రాయమంటారు. మరో ప్రశ్నగా పాసేజ్‌ చదివి, దానికి అనుబంధంగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. వ్యాకరణ దోషాలను సరిచేయడం, ఇచ్చిన ఇడియమ్స్‌ ఆధారంగా సెంటెన్స్‌ ఫార్మేషన్, నౌన్స్, ఆబ్జెక్టివ్‌ వర్డ్స్, వాయిస్, పాజిటివ్‌ అండ్‌ నెగిటివ్‌ సెంటెన్స్, డైరెక్ట్‌ అండ్‌ ఇన్‌ డైరెక్ట్‌ స్పీచ్‌ వంటి పదాల అమరిక ఉంటుంది.
జనరల్‌ నాలెడ్జ్‌ :
మెయిన్‌లో ఇదో కీలకమైన పేపర్‌. ఇందులో మొత్తం ఆరు విభాగాలు.. ఒక్క విభాగం నుంచి నాలుగు ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 15 మార్కుల ప్రశ్నలు(రెండు వందల పదాల ఆన్సర్‌) రెండు, 10 మార్కుల ప్రశ్నలు (125 పదాల్లో జవాబు రాయాలి) రెండు అడుగుతారు. అంటే.. మొత్తం 24 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇందులో కరెంట్‌ ఈవెంట్స్, చరిత్ర, ఇండియన్‌ పాలిటీ, రాజ్యాంగం, ఇండియన్‌ ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, జాగ్రఫీ తదితర అంశాలపై ప్రశ్నలు ఎదురవుతాయి.

ఆప్షనల్‌ పేపర్స్‌.. ఇలా..
మెయిన్‌లో అభ్యర్థి యూపీఎస్సీ పేర్కొన్న ఆఫ్షనల్స్‌ జాబితా నుంచి రెండు సబ్జెక్టులను ఎంచుకోవాలి. ఇందులో ప్రతి సబ్జెక్టు నుంచి రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌ ‘పార్ట్‌–ఎ, పార్ట్‌–బి’గా ఉంటుంది. ఒక్కో పార్ట్‌ నుంచి నాలుగు ప్రశ్నలు చొప్పున మొత్తం 8 ప్రశ్నలు ఇస్తారు. ఒకటి, ఐదు ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబులు రాయాలి. మిగిలిన ఆరింటిలో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రతి విభాగంలో ఒక ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి. ఇలా ప్రతి భాగం నుంచి కనీసం రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

ఉమ్మడి ప్రిపరేషన్‌ :
మే నెలలో సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అందుకు అనుగుణంగా అభ్యర్థులు సీరియస్‌ ప్రిపరేషన్‌ చేస్తూ ఉంటారు. చాలామంది అభ్యర్థులు మెయిన్‌కు చాలా సమయం ఉందని ప్రస్తుతం ప్రిలిమ్స్‌ సిలబస్‌ను మాత్రమే చదువుతుంటారు. సివిల్స్‌తో పోల్చినప్పుడు ఐఎఫ్‌ఎస్‌ పరీక్షలు కాస్త భిన్నంగా ఉంటాయి. కాబట్టి ప్రిలిమ్స్‌ నుంచే మెయిన్‌ సిలబస్‌ను కూడా కొంత పూర్తిచేస్తే ఆ తర్వాత ఒత్తిడి తగ్గుతుంది. ప్రిలిమ్స్‌ కోసం చదివే జనరల్‌ నాలెడ్జ్‌ ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌కు కూడా ఉపయోగపడేలా ప్రిపేర్‌ అవడం మంచిది.
%d bloggers like this:
Available for Amazon Prime