త్రివిధ దళాలు.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్.. వీటిలో కెరీర్ అంటే.. పురుషులకే అనే అభిప్రాయం! మహిళలు రాణించలేరనే అపోహ! మూడు విభాగాల్లో.. ఎందులో చూసినా.. పురుషులకే పెద్దపీట అనే అభిప్రాయం! కానీ.. ఇటీవల కాలంలో పరిస్థితి మారుతోంది.
|
![]() త్రివిధ దళాలు..నిత్యం సరిహద్దుల్లో పహారా.. దేశ రక్షణలో భాగంగా అనుక్షణం అప్రమత్తతో, డేగ కళ్లతో శత్రువులపై నిఘా.. నిద్రాహారాలు మాని.. ప్రాణాలకు తెగించి.. ఉగ్రవాదులను మట్టుబెట్టడం..! ఇలా ఎంతో కఠినమైన విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అందుకే.. సాయుధ దళాల్లో పురుషులు మాత్రమే రాణించగలరనే అభిప్రాయం ఎన్నో ఏళ్లుగా స్థిరపడిపోయింది. ఆడపిల్లలను ఇంతటి కఠినమైన కెరీర్ వైపు పంపడం ఎందుకు? అనే విముఖత తల్లిదండ్రుల్లో సైతం కనిపిస్తుంటుంది. కాని ఇటీవల కాలంలో పరిస్థితి మారుతోంది. త్రివిధ దళాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యం లభిస్తోంది. తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి సైతం మారుతోంది. షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి పర్మనెంట్ కమిషన్ వరకు : ఆ తర్వాత 2008లో జడ్జ్ అడ్వొకేట్ జనరల్(జేఏజీ), ఆర్మీ ఎడ్యుకేషన్ కార్ప్స్ విభాగాల్లో పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా సుప్రీంకోర్టు.. మహిళలకు త్రివిధ దళాల్లోని అన్ని విభాగాల్లో పర్మనెంట్ కమిషన్‌కు అవకాశం కల్పించాలని తీర్పు ఇచ్చింది. దీంతో సాయుధ దళాల్లో మహిళలు దీర్ఘ కాలం పని చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఆర్మీలో మహిళా ఆఫీసర్: యూపీఎస్సీ- సీడీఎస్ఈ ద్వారా..యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) జాతీయ స్థాయిలో నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్ఈ)లో ప్రతిభ ఆధారంగా ఆర్మీలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో.. ఎస్ఎస్సీడబ్ల్యులో(నాన్-టెక్నికల్) ప్రవేశం పొందొచ్చు. ఏటా రెండుసార్లు నిర్వహించే ఈ పరీక్షకు అర్హత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. నోటిఫికేషన్లో పేర్కొన్న కటాఫ్ తేదీ నాటికి 19ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి తర్వాత దశలో ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం ఖరారు చేస్తారు. ఆర్మీ.. నేరుగా : ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ ఫర్ ఉమెన్ : ఎస్ఎస్సీ డబ్ల్యు(జేఏజీ) :ఆర్మీలో నాన్-టెక్నికల్ విభాగంలో కీలకమైనదిగా ఎస్ఎస్సీడబ్ల్యు(జేఏజీ)ని పేర్కొనొచ్చు. కారణం.. ఇది ఆర్మీలో అంతర్గతంగా ఉండే న్యాయ విభాగానికి సంబంధించిన సర్వీస్. అందుకే దీన్ని జడ్జ్ అడ్వొకేట్ జనరల్‌గా పిలుస్తారు. ఏటా రెండుసార్లు(జూలై/ఆగస్ట్; జనవరి/ఫిబ్రవరి) నోటిఫికేషన్ వెలువడుతుంది. గ్రాడ్యుయేట్ టెక్నికల్ ఎంట్రీస్-ఎస్ఎస్సీ (టెక్నికల్) ఉమెన్ : అందరికీ ఓటీఏ-చెన్నైలో శిక్షణ : మిలటరీ నర్సింగ్ సర్వీస్ :ఆర్మీలో మహిళా అభ్యర్థులకు అందుబాటులో ఉన్న మరో మార్గం.. మిలటరీ నర్సింగ్ సర్వీస్. బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల నియామకం ఖరారు చేస్తారు. ఎయిర్‌ఫోర్స్‌లో పెలైట్‌గా:గగనతల గస్తీ విభాగంగా పేరొందిన ఎయిర్‌ఫోర్స్‌లోనూ ఇప్పుడు మహిళలకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఎయిర్‌ఫోర్స్‌లో ఖాళీల భర్తీకి ఏఎఫ్‌క్యాట్(ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్)ను నిర్వహిస్తారు. దీనిద్వారా ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్), గ్రౌండ్ డ్యూటీ(నాన్-టెక్నికల్) విభాగాల్లో ఖాళీలు భర్తీ చేస్తారు. ఎయిర్ ఫోర్స్‌లో మహిళలకు అందుబాటులో ఉన్న మరిన్ని అవకాశాలు.. ఫ్లయింగ్ బ్రాంచ్ : గ్రౌండ్ డ్యూటీ-టెక్నికల్ :ఈ విధానంలో మహిళా అభ్యర్థులను షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఏరోనాటికల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో మహిళలకు అవకాశం కల్పిస్తారు. గ్రౌండ్ డ్యూటీ(నాన్-టెక్నికల్) :ఈ విధానంలో అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, లాజిస్టిక్స్ విభాగాల్లో మహిళలను ఎంపిక చేస్తారు. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్(ఫ్లయింగ్ బ్రాంచ్) :
గెజిటెడ్ ర్యాంకు : ఎయిర్‌ఫోర్స్‌లో ఏఎఫ్‌క్యాట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు గ్రూప్-ఎ గెజిటెడ్ హోదాతో కొలువు లభిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో షార్ట్ సర్వీస్ కమిషన్‌తో కెరీర్ ప్రారంభించిన వారికి సదరు వ్యవధి పూర్తి చేశాక.. పర్మనెంట్ కమిషన్‌కు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. ఏఎఫ్‌క్యాట్ ద్వారా ఆయా పోస్ట్‌లను భర్తీ చేసే క్రమంలో రెండంచెల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. తొలుత 300 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇందులో విజయం సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా ఉన్న మూడు(డెహ్రాడూన్, వారణాసి, గాంధీనగర్) ఎయిర్‌ఫోర్స్ సెలక్షన్ బోర్డ్స్‌లో తదుపరి దశలో ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ప్రక్రియ జరుగుతుంది. ఫ్లయింగ్ బ్రాంచ్ విజేతలకు మలి దశలో కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్(సీపీఎస్‌ఎస్) టెస్టు నిర్వహిస్తారు. వీటిలోనూ విజయం సాధించిన అభ్యర్థులకు చివరగా.. మెడికల్ టెస్టు ఉంటుంది. ఆ తర్వాత రాత పరీక్ష, మెడికల్ టెస్టులో మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందించి కొలువులు ఖరారు చేస్తారు. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ అభ్యర్థులకు ఏఎఫ్‌క్యాట్‌తోపాటు మలి దశలో ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ కూడా ఉంటుంది. వెబ్సైట్: https:afcat.cdac.in నావికా దళంలో.. నారీ భేరీ: విభాగాలు.. అర్హతలు :
త్రివిధ దళాల్లో మహిళలు… ముఖ్యాంశాలు :
|
You must log in to post a comment.