రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను జూన్ 12(శుక్రవారం)న విడుదల చేయనున్నారు. మొదటి, రెండవ సంవత్సర పరీక్షల ఫలితాలను ఒకే సారి విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఇంటర్ బోర్డ్ అధికారులు ఇటీవల ఇంటర్ పరీక్షల పేపర్ల మూల్యాకం పూర్తిచేశారు. ఈ ఫలితాల విడుదలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఫలితాలను రేపు మధ్య్నానం 12:30కు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ ఇంటర్ ఫలితాలను www.sakshieducation.com చూడండి.

Read More

బ్యాం‘కింగ్’ కొలువుల ఎంపిక విధానం, ప్రిపరేషన్ గెడైన్స్..

ఆకర్షణీయమైన వేతనాలు.. సుస్థిరమైన కెరీర్.. ఎదిగేందుకు అపార అవకాశాలు.. తక్కువ వడ్డీకే సులువైన గృహ, వాహన రుణ సదుపాయం.. ఇలా ఎన్నో సౌకర్యాలు బ్యాంకింగ్ రంగంలో పనిచేసే ఉద్యోగుల సొంతం! ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఏటా నియామకాలు చేపడుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్, పీవో (ప్రొబేషనరీ ఆఫీసర్లు) వంటివి క్రేజీ కొలువులు!! వీటితోపాటు మార్కెటింగ్, టెక్నికల్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఆపరేషన్స్, హెచ్‌ఆర్, లా ఆఫీసర్లు, చార్టర్డ్ అకౌంటెంట్స్, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, ఐటీ ఆఫీసర్లు వంటి స్పెషలిస్ట్ ఆఫీసర్(ఎస్‌వో) ఉద్యోగాలను సైతం భర్తీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో..బ్యాంకింగ్ రంగంలో కొలువులు.. ఎంపిక విధానాలు.. పరీక్షల తీరుతెన్నులు.. సిలబస్ విశ్లేషణ.. ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం..! ఎస్‌బీఐ ఎంపిక ప్రక్రియ : దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ. క్లర్క్, పీవో పోస్టుల…

Read More

ఐటీ కొలువులకు.. కలిసొచ్చే కోర్సులు ఇవే..!

లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థుల లక్ష్యం..ఐటీ రంగంలో ఉద్యోగం! మరి ప్రస్తుతం ఐటీలో జాబ్ మార్కెట్ ఎలా ఉంది? కొలువు ఖాయం చేసుకోవాలంటే.. ఎలాంటి స్కిల్స్ అవసరం? నియామకాల పరంగా భరోసా కల్పించే కోర్సులు ఏవి? త్వరలో ఇంజనీరింగ్ పూర్తిచేసుకోనున్న విద్యార్థులకు ఎదురయ్యే ప్రశ్నలు ఇవి!!  ఐటీ రంగంలో ప్రస్తుతం జాబ్ ట్రెండ్‌ను పరిశీలిస్తే.. కోర్ అంశాలైన కోడింగ్, కంప్యూటర్ లాంగ్వేజెస్ మొదలు బ్లాక్‌చైన్, ఐవోటీ వరకూ.. సరికొత్త టెక్నాలజీకి డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఐటీ ఉద్యోగార్థులు ఎమర్జింగ్ టెక్నాలజీపై పట్టుసాధించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఐటీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు దక్కించుకోవడానికి మార్గాలు, నేర్చుకోవాల్సిన కోర్సుల గురించి తెలుసుకుందాం… ముఖ్యంగా బ్లాక్‌చైన్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, జావా, రోబోటిక్స్, పైథాన్, సైబర్ సెక్యూరిటీ, డేవాప్స్, క్లౌడ్ సర్వీసెస్ వయా ఎంఎస్ ఎజ్యూర్, ఐఓటీ, క్లౌడ్ టెక్నాలజీ…

Read More

సాఫ్ట్‌వేర్ కొలువు…ఇలా సులువుగా సాధించండి !

ఐటీ కంపెనీల్లో కొలువు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌తోనే సాధ్యమని భావిస్తున్నారా?! మీ కాలేజీలో క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహించకుంటే.. ఇక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కల్లేనని ఆందోళన చెందుతున్నారా..?! బీటెక్/బీఈ వంటి అర్హతలున్న వారికే ఐటీ ఉద్యోగం లభిస్తుందనే భావనలో ఉన్నారా? అయితే.. ఇప్పుడు వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేయొచ్చు! ఎందుకంటే.. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ సంస్థలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ టెస్ట్‌ల్లో సత్తాచాటితే చాలు.. ఐటీ జాబ్ సొంతమవుతుంది! టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ కంపెనీలు ఆన్‌లైన్ టెస్టుల ద్వారా యంగ్ టాలెంట్‌కు స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఐటీ కంపెనీలు నిర్వహిస్తున్న ఆఫ్-క్యాంపస్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లతో ప్రయోజనాలు, ఆయా పరీక్షల తీరుతెన్నుల గురించి తెలుసుకుందాం…‘ఐటీ కంపెనీల్లో కాలు పెట్టాలంటే క్యాంపస్ డ్రైవ్స్‌లో సత్తా చాటితేనే సాధ్యం. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు అవకాశం లేకుంటే..ఐటీ కొలువు కష్టమే’-ఇది సాధారణంగా వినిపించే అభిప్రాయం.…

Read More

సినిమాటో గ్రఫీ విభాగంలో…ఉపాధి మార్గాలు…

సినిమా అనేది ఒక దృశ్యమాలిక. దాన్ని తెరపై అందంగా, హృద్యంగా చిత్రీకరించేవాడే సినిమాటోగ్రాఫర్. తన సృజనాత్మక శక్తితో దర్శకుడి ఆలోచనలకు, కథకు దృశ్య రూపాన్నిస్తూ.. మాటలకందని భావాలను కెమెరాతో కళ్లకు కడతాడు. దర్శకుని ఉహా శక్తికి ప్రాణం పోస్తాడు. అందుకే ఈ వృత్తి యువతను బాగా ఆకర్షిస్తోంది. సినిమా నిర్మాణాలు, సీరియల్స్, షార్ట్‌ఫిల్మ్స్, యాడ్స్, వెడ్డింగ్ షూట్స్.. ఇలా సరికొత్త వేదికలు పుట్టుకొస్తుండటంతో సినిమాటోగ్రఫీ విభాగంలో డిమాండ్ నెలకొంది. ఉపాధి అవకాశాలు అంతే స్థాయిలో విస్తృతమవుతున్నాయి.ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ కెరీర్.. అందుబాటులో ఉన్న కోర్సులు.. అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు.. ఉపాధి మార్గాల గురించి తెలుసుకుందాం…ఆనంద్.. అకడమిక్ చదువులంటే పెద్దగా ఆసక్తిలేని ఓ సాదాసీదా కుర్రాడు. కానీ అతనికి సినిమాలంటే భలే పిచ్చి. అందులోనూ ఫొటోగ్రఫీ అంటే ప్రాణం. సినిమాటోగ్రాఫరై.. కె.కె సెంథిల్‌లా మగధీర లాంటి దృశ్యకావ్యాన్ని తెరకెక్కించాలని, రత్నవేలులా…

Read More

ఎన్‌డీఏ , ఎన్‌ఏ

ఆర్మీ, నేవీ, ఎరుుర్‌ఫోర్స్.. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే త్రివిధ దళాలు. యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ ఇండియన్ నేవల్ అకాడమీ(ఎన్‌డీఏ-ఎన్‌ఏ)పరీక్ష ద్వారా.. త్రివిధ దళాల్లో కొలువు సొంతం చేసుకోవచ్చు. ఎన్‌డీఏ ఎన్‌ఏ(I) -2020 ప్రిపరేషన్ గెడైన్స్… దేశవ్యాప్తంగా జరిగే ఎంపిక ప్రక్రియలో రాణిస్తే ఎన్‌డీఏ-ఎన్‌ఏలో ప్రవేశం లభిస్తుంది. సైన్యంలో కెరీర్‌కు మార్గం సుగమమం అవుతుంది. యూపీఎస్సీ తాజాగా ఎన్‌డీఏ ఎన్‌ఏ(I) -2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో… అర్హతలు, ఎంపిక విధానం, రాత పరీక్ష, ప్రిపరేషన్ గెడైన్స్… ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్షకు దేశవ్యాప్తంగా లక్షల్లోనే పోటీ. ఎంపిక విధానంలో రెండు దశలు ఉంటారుు. ప్రతి దశ ఎంతో కీలకం. మొదటి దశలో రాత పరీక్ష నిర్వహిస్తే.. రెండో దశలో ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు, మెడికల్ టెస్టులు ఉంటారుు. ఈ రెండు దశలకు…

Read More

ఫిట్‌నెస్ రంగంలో అపార అవకాశాలు-అందుకునేందుకు మార్గాలు…

ప్రస్తుతం ఆహారపు అలవాట్లు, ఉద్యోగాల్లో ఒత్తిళ్లు, జీవనశైలి కారణాలతో.. అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.  అందుకే ప్రతి ఒక్కరూ ఫిజికల్‌గా ‘ఫిట్’గా ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా యువతలో ‘ఫిట్‌నెస్’కు ప్రాధాన్యం ఇచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫిట్‌నెస్ సెంటర్లకు, జిమ్‌లకు వెళ్లడం నేడు సర్వసాధారణంగా మారింది. దాంతో సరికొత్త కెరీర్ మార్గంగా నిలుస్తోంది.. ఫిట్‌నెస్ రంగం! ఈ నేపథ్యంలో… ఫిట్‌నెస్ రంగంలో అవకాశాలు, వాటిని అందుకునేందుకు మార్గాల గురించి తెలుసుకుందాం… ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. శారీరకంగా ఫిట్‌గా ఉంటేనే మానసిక ధృడత్వం సాధ్యం అవుతుంది. మానసికంగా బలంగా ఉంటేనే లక్ష్య సాధనలో ముందడుగు పడుతుంది. కాని ప్రస్తుతం జంక్‌ఫుడ్, జీవన శైలి ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతోంది. ఇది గమనించిన యువత, మధ్యవయస్కులు ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. కొందరు సిక్స్ ప్యాక్ అంటుంటే..…

Read More

‘గ్రాఫిక్ డిజైనింగ్’

ప్రస్తుత పోటీ ప్రపంచంలో వినియోగదారులను ఆకట్టుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా వస్తువు కస్టమర్స్ దృష్టిలో పడాలంటే..అది ఆకర్షణీయంగా ఉండాలి. అందుకు మార్గం.. గ్రాఫిక్ డిజైనింగ్. నేడు మీడియా నుంచి ప్యాకేజింగ్ వరకూ.. అన్ని రంగాల్లో గ్రాఫిక్ డిజైనింగ్ తప్పనిసరిగా మారింది. దీంతో నైపుణ్యం కలిగిన గ్రాఫిక్ డిజైనర్లకు అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు.  దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. గ్రాఫిక్ డిజైనింగ్ రంగంలో కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం… వినియోగదారులను కట్టిపడేసేలా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రకటనలు, బ్రోచర్లు, మ్యాగజీన్‌లు, కార్పొరేట్ నివేదికల కోసం ప్రొడక్ట్ డిజైన్‌లు, లే అవుట్‌లను రూపొందించే వారే గ్రాఫిక్ డిజైనర్‌లు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్న కొద్దీ వీరికి డిమాండ్ ఏర్పడుతోంది. ప్రపంచీకరణ, ఈ కామర్స్, డిజిటల్ మీడియా విప్లవంతో మార్కెట్‌లో వస్తువుల విక్రయానికి…

Read More

పొలిటికల్ సైన్స్ విద్యార్థుల కెరీర్‌కు మార్గాలు…

పొలిటికల్ సైన్స్‌కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. గ్రీకు తత్వవేత్తలు అరిస్టాటిల్, ప్లేటోలను పొలిటికల్ సైన్స్‌కు ఆద్యులుగా చెబుతారు. అరిస్టాటిల్‌ను రాజనీతి శాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. ఆధునిక పొలిటికల్ సైన్స్ మాత్రం 19వ శతాబ్దంలో ఒక అకడెమిక్ సబ్జెక్టుగా రూపుదిద్దుకుంది.   మన దేశంలో బీఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థులు కోర్సులో భాగంగా రాజ్యాంగం, రాజకీయాలు, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం గురించి అధ్యయనం చేస్తారు. వీటితోపాటు ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సమస్యలు, యుద్ధాలు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి అంశాలను పొలిటికల్ సైన్స్ విద్యార్థులు అభ్యసిస్తారు. త్వరలో బీఏ పొలిటికల్ సైన్స్ కోర్సును పూర్తిచేసుకోనున్న విద్యార్థులకు అందుబాటులో ఉన్న కెరీర్ మార్గాల గురించి తెలుసుకుందాం…   సివిల్ సర్వీసెస్: బీఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థులు కోర్సులో చేరినప్పటి నుంచి సివిల్ సర్వీసు పరీక్షలతోపాటు, రాష్ట్ర…

Read More

వీటిలో నెగ్గితేనే.. త్రివిధ దళాల్లో ‘ఆఫీసర్’ కొలువు ఖాయం

వీటిలో నెగ్గితేనే.. త్రివిధ దళాల్లో ‘ఆఫీసర్’ కొలువు ఖాయం త్రివిధ దళాలు.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్. యూపీఎస్‌సీ నిర్వహించే సీడీఎస్‌ఈ, ఎన్‌డీఏ, ఎన్‌ఏ రాత పరీక్షలు, ఏఎఫ్‌క్యాట్, టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ పరీక్షలు.. ఇవన్నీ త్రివిధ దళాల్లో అడుగుపెట్టేందుకు తొలిదశ మాత్రమే. ఇందులో మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులు.. అత్యంత కీలకమైన ఎంపిక ప్రక్రియ.. సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూలోనూ సత్తా చాటాలి. రాత పరీక్ష కంటే క్లిష్టమైనదిగా భావించే ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియలో ఐదు రోజులపాటు అనేక కోణాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు. ఈ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకుందాం..       ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియను ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌గా పేర్కొంటారు. రాత పరీక్షల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఆయా విభాగాలు ప్రత్యేకంగా, వేర్వేరుగా ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలను నిర్వహిస్తాయి.…

Read More

ఈ కామర్స్

ఈ-కామర్స్… ఆన్‌లైన్ షాపింగ్.. నేడు మన దైనందిన జీవితంలో భాగం! బిర్యానీ నుంచి యాపిల్ ఫోన్ వరకూ.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ-కామర్స్ సైట్లను.. ఆశ్రయిస్తున్న వైనం! ఇంటి దగ్గరికే తమకు నచ్చిన వస్తువులను ఈ-కామర్స్ సంస్థలు అందిస్తుండటమే ఇందుకు కారణం! దాంతో గత కొంతకాలంగా ఈ-కామర్స్ రంగం కళకళలాడుతోంది! ముఖ్యంగా ఫుడ్, రిటైల్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్స్, హోమ్ అప్లయన్సెస్ వంటి విభాగాల్లో.. ఈ-కామర్స్ దూసుకుపోతోంది!! ఇదే ఇప్పుడు యువతకు కొలువుల కల్పతరువుగా మారింది. పలు సంస్థల అంచనాల ప్రకారం-ఈ కామర్స్‌లో రానున్న మూడేళ్లలో అందుబాటులోకి వచ్చే ఉద్యోగాల సంఖ్య దాదాపు పది లక్షలు. ఈ నేపథ్యంలో.. ఈ-కామర్స్ రంగంలో లభించే కొలువులు.. సరికొత్త జాబ్ ప్రొఫైల్స్.. అవసరమైన అర్హతలు, నైపుణ్యాల గురించి తెలుసుకుందాం… ‘రానున్న అయిదేళ్లలో భారత్‌లో మిలియన్ ఉద్యోగాలను కల్పిస్తాం’-ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్…

Read More

ఫోరెన్సిక్‌ సైన్స్‌

ఆ నేరం చేసింది నేను కాదు.. నేనంటే గిట్టని వాళ్లు చేసిన కుట్ర..! ఆ వాయిస్ నాది కాదు.. ఎవరో ఇమిటేట్ చేశారు..! ఆ డాక్యుమెంట్ల ఫోర్జరీతో నాకెలాంటి సంబంధం లేదు. కావాలనే నన్ను ఇరికించారు..! నా భార్యది హత్య కాదు, ఆత్మహత్య.. ఆమె అలా ఎందుకు చేసిందో నాకు తెలియదు..! ఇలాంటి వార్తలు మనం నిత్యం టీవీల్లో, పేపర్లలో, వెబ్‌సైట్లలో చూస్తుంటాం. ప్రతి కేసులోనూ ఎన్నో ట్విస్టులు.. మరెన్నో సందేహాలు.. చాలా సందర్భాల్లో పోలీసులకు సైతం ఆధారాలు అంతుచిక్కని వైనం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కఠినమైన మిస్టరీలను ఛేదించడానికి అవసరమైన చదువే ఫోరెన్సిక్ సైన్స్. ఈ కోర్సులో చేరాలంటే.. ఎలాంటి అర్హతలుండాలి.. కోర్సులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి.. ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి.. అవసరమైన నైపుణ్యాలు ఏమిటి..? వంటి అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం..  …

Read More

వెటర్నరీ సైన్స్

వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ.. డిమాండ్ ఉన్న కోర్సు! ప్రస్తుతం జాతీయంగా, అంతర్జాతీయంగా పశువైద్యులకు కొరత నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వెటర్నరీ డాక్టర్ల సేవల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. డెయిరీ, పౌల్ట్రీ రంగాలతోపాటు పెట్‌లు, యానిమల్ హెల్త్‌కేర్‌కు ప్రాధాన్యం పెరగడమే ఇందుకు కారణం! మరోవైపు పెంపుడు జంతువుల ఆరోగ్యంపై ఎన్నడూ లేనంత శ్రద్ధ కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు వెటర్నరీ రంగంలో చక్కటి కెరీర్ అవకాశాలకు మార్గం వేస్తోంది. ఈ నేపథ్యంలో.. వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ విభాగంలో కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం…   ‘వెటర్నరీ సైన్స్ చదివితే.. పశు వైద్యులుగానే స్థిర పడతాం. అవకాశాలు కూడా తక్కువే. ప్రభుత్వ పశువైద్యశాలల్లో మాత్రమే కొలువులు దొరుకుతాయి’-ఇదీ గతంలో వెటర్నరీ సైన్స్ కోర్సుపై నెలకొన్న అభిప్రాయం. కానీ ఇప్పుడు దీనికి భిన్నమైన వాతావరణం…

Read More

సివిల్స్-2020 ప్రిలిమ్స్ పరీక్ష విధానం..సిలబస్..ప్రిపరేషన్ గెడైన్స్

దేశ అత్యున్నత సర్వీసుల్లో చేరడం లక్షల మంది ప్రతిభావంతుల కల. అందుకోసం ఏళ్లతరబడి అహోరాత్రులు పుస్తకాలతో కుస్తీపడుతుంటారు. ఆ స్వప్నం సాకారమైతే.. జీవితాంతం సమాజంలో ఉన్నత హోదా, గుర్తింపుతోపాటు సకల సౌకర్యాలు సొంతమవుతాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) వంటి 24 దేశ అత్యుత్తమ సర్వీసుల్లో చేరాలంటే.. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరవడం తప్పనిసరి. తాజాగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా సివిల్స్ 2020 నోటిఫికేషన్ సమాచారంతోపాటు ప్రిలిమ్స్ పరీక్ష తీరు, సిలబస్, ప్రిపరేషన్‌పై ప్రత్యేక కథనం… పేపర్ 1 కీలకం: మూడు దశలుగా ఉండే సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్‌ను వడపోత పరీక్షగా పేర్కొనవచ్చు. ప్రిలిమ్స్ రెండు పేపర్లుగా ఉంటుంది. ఇందులో పేపర్ 1 అత్యంత కీలకమైంది. ఇందులో…

Read More

డేటాసైన్స్

కళ్లు చెదిరే ప్యాకేజీలతో…ఈ ఏడాదిలో 1.5 లక్షల డేటాసైన్స్ ఉద్యోగాలు!   కళ్లు చెదిరే ప్యాకేజీలతో…ఈ ఏడాదిలో 1.5 లక్షల డేటాసైన్స్ ఉద్యోగాలు! ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో మంచి ఉద్యోగం అందుకోవాలంటే.. ఏ కోర్సులో చేరాలి..ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి.. ఏ విభాగంలో ఉద్యోగావకాశాలెక్కువ?! ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానమే.. డేటాసైన్స్! 2020లో డేటాసైన్స్ విభాగంలో అదిరిపోయే అవకాశాలు లభిస్తాయని అంచనా..!  ఇటీవల కాలంలో.. ఈ రంగం.. ఆ రంగం.. అనే తేడా లేకుండా అన్నింటా డేటాసైన్స్ దూసుకుపోతోంది. ఇదే విషయం పలు సర్వేల్లో స్పష్టమైంది. ఇప్పటికే ఎమర్జింగ్ కెరీర్‌గా వెలుగొందుతున్న డేటాసైన్స్.. 2020లో మరింత హాట్‌ఫేవరెట్‌గా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. డేటాసైన్స్ కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం..   కళ్లు చెదిరే ప్యాకేజీలు :డేటాసైన్స్.. దీన్నే డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ అని…

Read More

త్రివిధ దళాల్లోని వివిధ ఉద్యోగాలకు అర్హతలు..నియామక విధానం ఇలా..

సరిహద్దుల్లో గస్తీ కాసే ఆర్మీ.. సముద్రాలను జల్లెడ పట్టే నేవీ.. ఆకాశంలో రక్షణ కవచాన్ని ఏర్పరిచే ఎయిర్‌ఫోర్స్.. ఈ మూడింటిని కలిపి త్రివిధ దళాలుగా పిలుస్తారు. ఈ మూడు సాయుధ దళాల్లో పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ అర్హతలతో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రక్షణ దళాల్లో కొలువు, కెరీర్ కోరుకునే అభ్యర్థులకు ఉపయోగపడేలా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీల్లో వివిధ ఉద్యోగాలు, నియామక విధానాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియపై సమగ్ర కథనం… 1. ఇండియన్ ఆర్మీ: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ (సీడీఎస్‌ఈ) : సీడీఎస్‌ఈ(I) పరీక్షకు నవంబర్‌లో; సీడీఎస్‌ఈ (II) పరీక్షకు జూలైలో నోటిఫికేషన్ విడుదలవుతుంది. విద్యార్హతలు: ఐఎంఏ, ఆఫీసర్స్‌ ట్రైనీ అకాడెమీకి ఏదైనా డిగ్రీ, నేవల్, ఎయిర్ ఫోర్స్‌ అకాడెమీకి ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎన్‌డీఏ, ఎన్‌ఏ-(I),(II) : ఆర్మీ, నేవీ,…

Read More

న‌చ్చిన కొలువు దక్కించుకోవాలంటే…‘ఇంగ్లిష్‌’ తప్పనిసరి

ఇంగ్లిష్‌ నైపుణ్యం ఉంటే.. ప్రపంచాన్నే చుట్టేయొచ్చు అనే నానుడి! కంపెనీలు నియామకాలప్పుడు ఇంగ్లిష్‌పై పట్టును ప్రత్యేకంగా పరిశీలిస్తున్న పరిస్థితి. ఐఐటీలు, ఐఐఎంల నుంచి స్థానిక కళాశాలల్లో చదివిన విద్యార్థుల వరకూ.. ఇంగ్లిష్‌ స్కిల్స్‌ ఉంటేనే అవకాశం కల్పిస్తున్న వైనం! సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ ఎంత ఘనంగా ఉన్నా.. ఇంగ్లిష్‌ నైపుణ్యం లేకపోతే ఆఫర్‌ అనుమానమే! దీంతో.. ఇప్పుడు నచ్చిన కొలువు దక్కించుకోవాలంటే.. ముందుగా ఇంగ్లిష్‌ స్కిల్స్‌ను పెంచుకోక తప్పని పరిస్థితి! ఈ నేపథ్యంలో.. ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌కు కంపెనీలు ఇస్తున్న ప్రాధాన్యం.. భాషపై పట్టును పెంచుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాల గురించి తెలుసుకుందాం… ఇప్పుడు ఏ ఉద్యోగ ప్రకటనను చూసినా.. ఇంగ్లిష్‌లో రాయడం, మాట్లాడం వచ్చి ఉండటం తప్పనిసరి నిబంధనగా మారింది. కంపెనీలు ఇంగ్లిష్‌ స్కిల్స్‌కు ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం ఇది. మరోవైపు నూటికి 70 శాతం మంది ఇంగ్లిష్‌…

Read More

‘డ్రోన్’ రంగంలో విసృత ఉపాధి అవకాశాలు

ఇప్పుడు డ్రోన్‌ల గురించి తెలియని వారంటూ లేరు. ముఖ్యంగా డ్రోన్ కెమెరాలు ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ సుపరిచితమే! సాంకేతికత పురోభివృద్ధితో ఆయిల్, గ్యాస్, నిర్మాణం, మైనింగ్, అగ్రికల్చర్.. ఇలా అన్ని రంగాలకు డ్రోన్‌లు విస్తరిస్తున్నాయి. డ్రోన్‌ల అవసరం, వినియోగం ద్వారా కలిగే ప్రయోజనాలను గుర్తించిన డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) డ్రోన్ నూతన పాలసీ తీసుకొచ్చింది. దీంతో డ్రోన్‌ల వినియోగం మరింత విస్తృతమైంది. ఫలితంగా కెరీర్ అవకాశాలు సైతం పెరుగుతున్నాయి. పదో తరగతి నుంచి ఏరోడైనమిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పట్టభద్రుల వరకూ.. అర్హతలకు తగ్గ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. డ్రోన్‌ల రంగంలో కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం… 2025 నాటికి డ్రోన్ రంగంలో.. లక్ష కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయని తాజా అంచనా. ఇదే సమయంలో డ్రోన్ టెక్నాలజీ, వాణిజ్య అనువర్తనాల మార్కెట్…

Read More

ఇంటర్ నుంచే ‘సివిల్స్’ పై గురి

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి 24 ప్రతిష్టాత్మక సర్వీసుల్లో పోస్టుల భర్తీకి నిర్వహించే మూడంచెల ఎంపిక ప్రక్రియ! ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించి.. ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఉన్నత కొలువులు సొంతం చేసుకోవాలనేది.. దేశంలోని లక్షల మంది ప్రతిభావంతుల లక్ష్యం!! గతంలో డిగ్రీ, పీజీ పూర్తిచేశాకే సివిల్స్ గురించి ఆలోచించేవాళ్లు. కాని ఇటీవల కాలంలో ఇంజనీరింగ్, మెడిసిన్ లాగే ఇంటర్మీడియెట్‌లోనే సివిల్స్‌పై గురి పెడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది! ఈ నేపథ్యంలో.. ఇంటర్‌తోనే సివిల్స్ ప్రిపరేషన్ సాధ్యాసాధ్యాలపై విశ్లేషణాత్మక కథనం… ఇంటర్ ప్లస్ జేఈఈ కోచింగ్ ఇప్పటివరకు మనందరికీ తెలిసిన విషయమే. ఇంజనీరింగ్ లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు ఇంటర్‌లో చేరిన మరుక్షణం నుంచే ఇంటర్ ప్లస్ జేఈఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ట్రెండే అత్యున్నతమైన…

Read More

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విబాగాల్లో మహిళల ఉన్నత కెరీర్‌కు ధీటైన మార్గాలు ఇవే..

త్రివిధ దళాలు.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్.. వీటిలో కెరీర్ అంటే.. పురుషులకే అనే అభిప్రాయం! మహిళలు రాణించలేరనే అపోహ! మూడు విభాగాల్లో.. ఎందులో చూసినా.. పురుషులకే పెద్దపీట అనే అభిప్రాయం! కానీ.. ఇటీవల కాలంలో పరిస్థితి మారుతోంది. త్రివిధ దళాల్లో మహిళలకు ప్రాధాన్యం లభిస్తోంది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ.. త్రివిధ దళాల్లో చేరిన మహిళలకు పర్మనెంట్ కమిషన్ అవకాశం కల్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో మహిళలకు అందుబాటులో ఉన్న కెరీర్ అవకాశాలు.. అవసరమైన అర్హతలు.. ఎంపిక విధానాల గురించి తెలుసుకుందాం… త్రివిధ దళాలు..నిత్యం సరిహద్దుల్లో పహారా.. దేశ రక్షణలో భాగంగా అనుక్షణం అప్రమత్తతో, డేగ కళ్లతో శత్రువులపై నిఘా.. నిద్రాహారాలు మాని.. ప్రాణాలకు తెగించి.. ఉగ్రవాదులను మట్టుబెట్టడం..! ఇలా ఎంతో కఠినమైన విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అందుకే.. సాయుధ దళాల్లో…

Read More

‘స్టార్టప్’ ఔత్సాహికులకు ఉపయోగపడే..ప్రభుత్వ ప్రథకాలు ఇవే

ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ వరకు.. బీఏ నుంచి ఎంబీఏ దాకా.. ఏ కోర్సు పూర్తవుతున్నా.. కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అడిగే కామన్ ప్రశ్న.. తర్వాత ఏంటి..? అని!! ఇంజనీరింగ్, ఎంబీఏ విద్యార్థుల్లో చాలా మంది ఇప్పుడీ ప్రశ్నకు ‘స్టార్టప్ పెడతా’ అంటూ.. సమాధానం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో.. స్టార్టప్ ఔత్సాహికులకు ఉపయోగపడేలా.. ప్రస్తుతం దేశంలో స్టార్టప్ వాతావరణం..స్టార్టప్‌లకు చేయూతనిస్తున్న ప్రభుత్వ పథకాలు.. అనుకూలమైన రంగాలపై ప్రత్యేక కథనం.. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం- స్థాపించి/నమోదుచేసుకొని పదేళ్లలోపు ఉన్న, ఏ ఆర్థిక సంవత్సరంలోనూ రూ.100 కోట్ల టర్నోవర్ దాటని ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ లేదా పార్టనర్‌షిప్ కంపెనీ లేదా లిమిటెడ్ లయబిలిటీ కంపెనీలను స్టార్టప్‌లుగా వ్యవహరిస్తారు. కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంతగా ప్రముఖ రంగాలు నేల చూపు చూస్తుండటంతో.. ప్రస్తుతం స్టార్టప్…

Read More

మొదటి ప్రయత్నంలో సివిల్స్ సాధించగలమా..?

దేశ సేవ చేయాలనే ఉత్సాహం ఉన్నవారి మొదటి ఛాయిస్ సివిల్ సర్వీస్. దేశ పాలనా వ్యవస్థకు ఉక్కు కవచంగా సివిల్ సర్వీసును భావిస్తారు. అందుకే నేటికీ దేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లంటే విపరీతమైన క్రేజ్. సివిల్ సర్వీస్‌కు ఎంపికైతే సమాజంలో ఉన్నత హొదా, సకల సౌకర్యాలు, ఉద్యోగ భద్రత సొంతమవుతుంది. యూపీఎస్సీ ఏటా వెయ్యిలోపు పోస్టులకు సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల చేస్తే… లక్షల సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతుంటాయి. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల గురించి అభ్యర్థుల సందేహాలకు నిపుణుల సలహాలు… ప్ర‌. సివిల్స్ సాధించడం కష్టమా..? జ. దేశంలో నిర్వహించే పోటీ పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ అత్యున్నత పరీక్ష. ఇది అత్యంత క్లిష్టమైంది కూడా! ఇందులో విజయం సాధించాలంటే.. అంకితభావం, నిబద్ధతతో కూడిన దీర్ఘకాలిక ప్రిపరేషన్ తప్పనిసరి. ప్ర‌. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్…

Read More

ఎంబీబీఎస్‌లో సీటు రాలేదా.. అయితే ఈ సమాచారం మీ కోసమే..

ఇంటర్‌లో బైపీసీ చదివే విద్యార్థుల ప్రధాన లక్ష్యం మెడిసిన్ (ఎంబీబీఎస్)లో చేరడం..! అందుబాటులో ఉన్న సీట్లు, పోటీ పడుతున్న విద్యార్థులను పరిగణనలోకి తీసుకుంటే.. చాలా తక్కువ శాతం మందికి మాత్రమే ఎంబీబీఎస్‌లో ప్రవేశం లభిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో చాలా మందికి ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితి. అయితే బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్‌కు ప్రత్యామ్నాయంగా బ్యాచిలర్ స్థాయిలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిద్వారా చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుకునే వీలుంది. బీహెచ్‌ఎంఎస్ నుంచి బీఎస్సీ(బీజెడ్‌సీ) వరకూ… అందుబాటులో ఉన్న వివిధ కోర్సులు, కెరీర్ అవకాశాల వివరాలు ఇలా… బీఏఎంఎస్మెడికల్ రంగంలో స్థిరపడాలనుకునే బైపీసీ విద్యార్థులకు మరో ప్రత్యామ్నాయం.. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీఏఎంఎస్). ఈ కోర్సులో ఎంబీబీఎస్ మాదిరిగానే అనాటమీ, ఫిజియాలజీ, పెడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ తదితర సబ్జెక్టులు ఉంటాయి. ఉన్నత విద్య…

Read More

ఐఐటీ కల.. సాకారమిలా…

దేశంలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యకు ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాజీలు’(ఐఐటీలు) నిలయాలు. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధనతో పాటు పరిశోధనలు సైతం జరుగుతుంటాయి. ఐఐటీల్లో చదువుకున్న ఎంతోమంది దేశ, విదేశాల్లో ప్రముఖ కంపెనీల్లో కీలక పదవులు నిర్వహిస్తుండటం తెలిసిందే. అందుకే ఎంపీసీ చదివే ఎక్కువ మంది విద్యార్థులు ఐఐటీల్లో చేరాలని కలలు కంటారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో అండర్ గ్రాడ్యుయేట్/ఇంటిగ్రేటెడ్ పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘‘జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్–జేఈఈ’’ (అడ్వాన్స్డ్)–2020 నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో… ఐఐటీల్లో ప్రవేశాలు, అడ్వాన్స్డ్కు అర్హత, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం.. కోర్సులు ఇవే..జేఈఈ(అడ్వాన్స్డ్) ర్యాంకు ఆధారంగా ఐఐటీలు అందించే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ(బీటెక్), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్), బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులతోపాటు డ్యుయెల్ డిగ్రీ బీటెక్–ఎంటెక్, డ్యుయెల్…

Read More

వైరాలజీ (Virology)

వైరస్ను గడగడలాడించే వైరాలజిస్ట్ గతంలో జికా, ఎబోలా.. తాజాగా కరోనా(కొవిడ్–19)!! ఇలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త వైరస్లు ప్రబలుతూ మానవాళి ఉనికినే ప్రశ్నిస్తున్నాయి..! ఇలాంటి ప్రాణాంతక వైరస్ల గుట్టు విప్పి.. వాటిని నియంత్రించే మందులను, వ్యాక్సిన్లను కనిపెట్టే శాస్త్రవేత్తలే.. వైరాలజిస్ట్లు!! వైరస్లను అధ్యయనం చేసే శాస్త్రం… వైరాలజీ. వైరస్లు మానవాళిని గడగడలాడిస్తే.. వైరాలజిస్టులు వైరస్లకు దడపుట్టిస్తారు. వైరాలజిస్టులు వైరస్లపై అధ్యయనం చేస్తారు. వైరస్ ఇన్ఫెక్షన్ల చికిత్స, నియంత్రణ, పరిశోధనల్లో పాల్గొంటూ.. ప్రజల ప్రాణాలను కాపాడుతారు. కరోనా వంటి వైరస్ల ఉధృతి కారణంగా ప్రస్తుతం వైద్య రంగంలో వైరాలజిస్టుల పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో.. వైరాలజీ అంటే ఏమిటి? వైరాలజిస్టుల విధులు, అందుబాటులో ఉన్న కోర్సులు, కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం.. మెడికల్ మైక్రోబయాలజీలో వైరాలజీ ఓ విభాగం. వైరాలజిస్టులు ప్రోటీన్ కవచం కలిగిన సబ్…

Read More

ఫిన్‌టెక్‌ (Financial Technology)

ఫిన్‌టెక్‌.. డిజిట‌ల్ రంగంలో కొలువులు ఫైనాన్షియల్‌ టెక్నాలజీ.. సంక్షిప్తంగా ఫిన్‌టెక్‌! ఇది ఇటీవల కాలంలో ఎంతో సుపరిచితంగా మారింది. నేటి డిజిటల్‌ యుగంలో ఫిన్‌టెక్‌ సంస్థల సంఖ్య ఏటేటా భారీగా పెరుగుతోంది. లోన్స్‌ మొదలు మ్యూచువల్‌ ఫండ్స్‌ వరకు.. డిజిటల్‌ విధానంలో కార్యకలాపాలు నిర్వహించుకునేలా.. వినియోగదారులకు సేవలం దిస్తున్నాయి ఫిన్‌టెక్‌ సంస్థలు! దాంతో ఫిన్‌టెక్‌ రంగం ఇప్పుడు యువతకు సరికొత్త కెరీర్‌గా వేదికగా నిలుస్తోంది.  బ్యాచిలర్‌ డిగ్రీ నుంచి టెక్నికల్, ప్రొఫెషనల్‌ కోర్సుల అభ్యర్థుల వరకు.. వారి అర్హతలు, నైపుణ్యాలకు తగిన ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది ఫిన్‌టెక్‌ రంగం! ఈ నేపథ్యంలో…. ఫిన్‌టెక్‌ ఉద్యోగాలు, అవసరమైన అర్హతలు, నైపుణ్యాల గురించి తెలుసుకుందాం… డిజిటల్‌ యుగం.. ఏ రంగంలో చూసినా.. టెక్నాలజీ ఆధారిత సేవలు. ప్రధానంగా స్మార్ట్‌ఫోన్స్‌తో.. వ్యక్తులు తమకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ కాలు కదపకుండా చక్కబెట్టుకునే అవకాశం…

Read More

సైన్స్‌ పరిశోధనల కోర్సులు

నేడు హాట్‌ కెరీర్‌లుగా నిలుస్తున్న ఇంజనీరింగ్, ఐటీ రంగాలకు మూలం సైన్స్‌. పరిశోధన రంగానికి ఆయువు పట్టు సైన్స్‌. ఉద్యోగాల కల్పనలో సైన్స్‌ కోర్సులది ఎప్పుడూ ముందు వరుసే! సైన్స్‌ పరిశోధనలతోనే ఆవిష్కరణలు సాధ్యమవుతాయి.   జాతీయంగా, అంతర్జాతీయంగా సైన్స్‌ పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని టాప్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ల్లో చదివితే.. ఉజ్వల కెరీర్‌కు ఎర్రతివాచీ పరిచినట్లే! ఈ నేపథ్యంలో దేశంలోని టాప్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, అవి అందిస్తున్న కోర్సులు, ప్రవేశ ప్రక్రియలపై ప్రత్యేక కథనం… ఐఐఎస్సీసైన్స్‌ విద్య, పరిశోధనలకు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ) తలమానికంగా నిలుస్తోంది. ఓ వైపు సైన్స్‌లో వినూత్న కోర్సులు అందిస్తూనే.. మరోవైపు పరిశోధనల్లోనూ దూసుకెళ్తోంది. దీంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి ముందు వరుసలో నిలుస్తోంది. కోర్సులు:అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్, పోస్టుగ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్, ఇంటిగ్రేటెడ్‌…

Read More

లాక్‌డౌన్‌ కాలంలో.. ఆన్‌లైన్‌ విజ్ఞానం

కరోనా కారణంగా విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు.. అన్నింటికీ సెలవులు ప్రకటించారు. కాని ఇంకా అటు అకడెమిక్‌ పరీక్షలు కానీ.. ఇటు పోటీ పరీక్షలు కానీ పూర్తికాలేదు. ఇలాంటి కీలక సమయంలో తరగతి గది బోధన లేని లోటును తీరుస్తున్నాయి.. ఆన్‌లైన్‌ వేదికలు! ముఖ్యంగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఆర్‌డీ) అందుబాటులోకి తెచ్చిన.. స్వయం, ఈ పాఠశాల, స్వయం ప్రభ, నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ, ఈ–సోధ్‌ సింధు వంటివి విద్యార్థులకు వరంగా మారుతున్నాయి. ఇంట్లోనే ఉండి అవసరమైన సబ్జెక్టులను నేర్చుకునేందుకు వీలుండడం, ఎంతో అనుభవం ఉన్న అధ్యాపకులు చెప్పే పాఠాలు, వీడియో లెక్చర్స్‌ అందిస్తుండటంతో.. విద్యార్థులు ఆన్‌లైన్‌ లెర్నింగ్‌వైపు దృష్టి సారిస్తున్నారు. ఎంహెచ్‌ఆర్‌డీ అందిస్తున్న ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ వేదికలపై ప్రత్యేక కథనం… స్వయం నాణ్యమైన, ఉత్తమమైన విద్యను, బోధనను ప్రతి…

Read More

ఫ్రీలాన్సింగ్‌

కార్పొరేట్‌ కంపెనీల్లో పూర్తిస్థాయి ఉద్యోగులుగా చేరకుండా.. ఒకే సమయంలో అనేక కంపెనీలకు తమ∙సేవలను అందిస్తూ.. తమకు ఇష్టమున్నప్పుడే పనిచేస్తూ.. స్వయం ఉపాధిని పొందడమే ఫ్రీలాన్సింగ్‌! ఫ్రీలాన్సర్‌లు ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తూ.. పనికి తగ్గ ఆదాయం ఆర్జిస్తారు. ఇటీవల కాలంలో మిలీనియల్స్‌లో ఫ్రీలాన్సింగ్‌ ట్రెండ్‌ బాగా నడుస్తోంది. కంపెనీలు సైతం వీరిని ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకో తెలుసుకుందాం…!! స్వేచ్ఛగా పనిచేసే సౌలభ్యం.. కంపెనీలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే ఉద్యోగస్తులు స్థిర పని, నిర్దేశిత పనివేళలు, నిర్ణీత ఆదాయం పొందుతారు. కానీ ఎటువంటి నిర్ణీత సమయం, నిబంధనలు, బాస్‌ల బాదరబందీ లేకుండా.. స్వేచ్ఛగా పనిచేసే సౌలభ్యం ఫ్రీలాన్స్‌ ఉద్యోగాలలో ఉంటుంది. ప్రస్తుతం చాలామంది ఫ్రీలాన్స్‌ ఉద్యోగాలవైపు ఆసక్తి చూపడానికి కారణం కేవలం పని సౌలభ్యం కోసం మాత్రమే కాదు. ప్రీలాన్సింగ్‌ విధానంలో.. ఏదో…

Read More

మ్యూజియాలజి

ఏదైనా పాతకాలం వస్తువు, పెయింటింగ్‌ చరిత్ర తెలియాలంటే.. మ్యూజియానికి వెళ్లాల్సిందే! ఆయా పురాతన వస్తువులను సేకరించడానికి, వాటి చరిత్రను అధ్యయనం చేసి ప్రదర్శనలో ఉంచడానికి మ్యూజియాలజిస్టులు ఎంతో కృషి చేస్తారు. ఈ పురావస్తు ప్రదర్శనశాల నిర్వహణకు అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దేందుకు దేశంలోని పలు యూనివర్సిటీలు ప్రత్యేకమైన కోర్సులు సైతం అందిస్తున్నాయంటే.. దీని ప్రాముఖ్యత ఎంతో అంచనా వేయవచ్చు. మ్యూజియం ప్రాధాన్యత, డాక్యుమెంటేషన్, రీసర్చ్, మ్యూజియం నిర్వహణ వంటివన్నీ మ్యూజియాలజీ కిందకు వస్తాయి. మ్యూజియం సంరక్షణ, పరిపాలన సైతం మ్యూజియాలజిస్టుల విధుల్లో భాగమే. ఆసక్తికరమైన రంగం : మ్యూజియాలజీ కోర్సులో భాగంగా పురావస్తు శాస్త్రం, చరిత్ర, పరిశోధన, ఆర్కైవింగ్‌ వంటి అంశాలను అధ్యయనం చేస్తారు. ఈ కోర్సు పూర్తి చేసినవారు మ్యూజియాలజిస్ట్‌గా రాణించే వీలుంది. ప్రభుత్వ మ్యూజియంలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రయివేట్‌ మ్యూజియాల్లో, ఆర్ట్‌ గ్యాలరీల్లో…

Read More