సైబర్ సెక్యూరిటీతో బంగారు భవిత

సాంకేతికత అనే మంత్రం ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది. నూతన టెక్నాలజీల ఆవిష్కరణతో సమస్తం డిజిటల్ మయమవుతోంది. అయితే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలు సౌలభ్యాన్నే కాదు.. సవాళ్లనూ వెంట తెస్తున్నాయి.
Online coursesఆ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆవిష్కృతమైనదే..సైబర్ సెక్యూరిటీ. కరోనా లాక్‌డౌన్ కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కంపెనీలు సైబర్ సెక్యూరిటీ విభాగాల్ని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలో.. సైబర్ సెక్యూరిటీ నిపుణుడిగా మారేందుకు అర్హతలు.. చదవాల్సిన కోర్సులు.. సైబర్ సెక్యూరిటీ కెరీర్‌పై ప్రత్యేక కథనం..

గ్రోత్ ఘనమే.. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ మార్కెట్ 2025 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుతుందని
అంచనా. 2025 నాటికి భారత ఐటీ మార్కెట్ 350 బిలియన్ డాలర్లకు, అందులో సైబర్ సెక్యూరిటీ సేవల వాటా 10 శాతానికి చేరుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికి 5కోట్ల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఉంటుందని భావిస్తున్నారు.
 దేశీయంగా.. భారత్‌లో డేటా సెక్యూరిటీ, నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ రెగ్యులేషన్ అండ్ కాంప్లియన్స్ సమస్యలు పెరుగుతున్నాయి. ఫలితంగా డేటాసెక్యూరిటీ సొల్యూషన్‌‌స, సర్వీసులకు డిమాండ్ ఏర్పడుతోంది. కన్సల్టెన్సీ సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వాలు, రిటైల్, బీఎఫ్‌ఎస్‌ఐ, ఐటీ కంపెనీలు సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమించుకుంటున్నాయి. ప్రధానంగా బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేలు, ఈ-కామర్స్ సంస్థలు సైబర్ సెక్యూరిటీ నిపుణులకు పెద్దపీట వేస్తున్నాయి. భారత సైబర్ సెక్యూరిటీ మార్కెట్ ఏటా దాదాపు 20 శాతం మేర వృద్ధి సాధిస్తుండటం విశేషం.

 విధులు – బాధ్యతలు.. సైబర్ సెక్యూరిటీ నిపుణులు విస్తృత స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. ఉదాహరణకు ఎథికల్ హ్యాకర్ మాడ్యూల్‌నే తీసుకుంటే.. సంస్థ డిజిటల్ ఇంటర్‌ఫేస్, ఐటీ నెట్‌వర్క్‌లో ప్రవేశించి భద్రతా లోపాలను గుర్తించి సరి చేస్తారు. అదేవిధంగా ఫైర్‌వాల్ వంటి సెక్యూరిటీ ప్రొడక్టుల నిర్వహణ, సైబర్ మోసాలకు అడ్డుకట్టవేయడం, సైబర్ దాడుల నష్టనివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

 కీలక విభాగాలు… సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఐటీ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ, ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ మానిటరింగ్, అప్లికేషన్ సెక్యూరిటీ తదితర విభాగాలు ఉంటారుు. ఇవి సంస్థలు/ప్రొడక్స్/ప్రాజెక్టులకు సంబంధించిన కీలక సమాచార భద్రత, మార్పిడిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎంఎన్‌సీ కంపెనీల నుంచి స్కేల్-3 ఆన్‌లైన్ ఆధారిత సంస్థల వరకూ.. ఆయా సంస్థల ఆర్థిక వ్యవహారాల భద్రతా పర్యవేక్షణకు(మానిటరింగ్) సైబర్ సెక్యూరిటీ అత్యవసరం. దీంతో ఆయా విభాగాల్లో సర్టిఫికేషన్లు చేసిన వారికి జాబ్ మార్కెట్లో అవకాశాలు లభిస్తున్నారుు.

డేటా సెక్యూరిటీ.. ఐటీ సెక్యూరిటీ నిపుణులు ఆన్‌లైన్ మోసాలను అరికట్టడం, సెక్యూర్డ్ అప్లికేషన్ల రూపకల్పన తదితర విధులు నిర్వర్తిస్తారు. అలాగే డేటా సెక్యూరిటీ నిపుణులు డేటాకు సంబంధించి పటిష్ట నిర్వహణ నైపుణ్యాలను అందిస్తారు. ఆన్‌లైన్ సేవల్లో డేటామేనేజ్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఆన్‌లైన్ సేవలు అందించే సంస్థలు తుది వినియోగదారుల వివరాలు, ప్రొడక్ట్స్/సర్వీసుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో చిన్న పొరపాటు జరిగినా.. వెబ్‌సైట్ హ్యాక్ అవుతుంది. అదే జరిగితే సంస్థ వివరాలు క్షణాల్లో హ్యాకర్లకు చేతికి చేరతారుు.

జాబ్ ప్రొఫైల్స్.. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఇన్ఫర్మేషన్ రిస్క్ ఆడిటర్స్, ఫైర్‌వాల్ అండ్ సెక్యూరిటీ డివైస్ డెవలప్‌మెంట్ ప్రొఫెషనల్స్,సెక్యూరిటీ అనలిస్ట్‌లు, ఇంట్రూషన్ డిటెక్షన్ స్పెషలిస్ట్‌లు, కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాండర్లు, క్రిప్టాలజిస్ట్‌లు, వల్నరబిలిటీ అసెసర్లు, లీడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్స్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్స్, సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్స్, డిజిటల్ ఫొరెన్సిక్ ఎక్స్‌పర్ట్స్, ఎస్‌ఓసీ ఇంజనీర్, ఎథికల్ హ్యాకర్, థ్రెట్ మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్‌లు, మాల్వేర్ అనలిస్ట్‌లు, థ్రెట్ అనాలసిస్ మేనేజర్ వంటి జాబ్ ప్రొఫైల్స్ ఉంటాయి.

 అర్హతలు.. ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకొని ఐటీ నైపుణ్యాలున్న వారు సైబర్ సెక్యూరిటీ విభాగంలోకి ప్రవేశించొచ్చు. కొన్ని కంపెనీలు మాత్రం సీఎస్‌ఈ(కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్) నేపథ్యం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. విద్యార్థులు సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సర్టిఫికేషన్లు పూర్తి చేయడం ద్వారా అవకాశాలను అందుకోవచ్చు.
 పీజీ స్థాయిలో స్పెషలైజేషన్.. సైబర్ సెక్యూరిటీ/ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో పూర్తిస్థాయి కోర్సులు అందుబాటులో లేవు. పీజీ స్థాయిలో మాత్రం ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ కోర్సులను పలు ఇన్‌స్టిట్యూట్స్ అందిస్తున్నాయి. జేఎన్‌టీయూ-హైదరాబాద్, ఐఐఐటీ-అలహాబాద్, సీడాక్ తదితర సంస్థలు ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

సర్టిఫికేషన్స్.. సైబర్ సెక్యూరిటీని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి పలు సర్టిఫికేషన్లు అందుబాటులో ఉన్నారుు. సంప్రదాయ గ్రాడ్యుయేట్లతోపాటు ఐటీ ప్రొఫెషనల్స్ సైతం వీటిలో చేరొచ్చు.

సిస్కో.. ఎంట్రీ, అసోసియేట్, ప్రొఫెషనల్ స్థాయిల్లో మూడేళ్ల కాలానికి; ఎక్స్‌పర్ట్, స్పెషలిస్ట్ స్థాయిల్లో ఐదేళ్ల కాలానికి సర్టిఫికేషన్‌‌స అందిస్తోంది. దీంతోపాటు ఐదేళ్ల కాలానికి సిస్కో సర్టిఫైడ్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్‌ను అందిస్తోంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.cisco.com

ఈసీ కౌన్సిల్.. అడ్వాన్స్డ్, కోర్, ఫండమెంటల్స్, మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ అవేర్‌నెస్, స్పెషలిస్ట్ కేటగిరీల్లో సైబర్ సెక్యూరిటీ కోర్సులు అందిస్తోంది.
పూర్తి వివరాలకువెబ్‌సైట్: www.eccouncil.org

డేటా సెక్యూరిటీ కౌన్సిల్ పలు సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్లు అందిస్తోంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.dsci.in

ఎవరైనా ఎంచుకోవచ్చు.. ఇంజనీరింగ్, సైన్స్, ఆర్ట్స్ కోర్సుల్లో డిగ్రీ ఉత్తీర్ణులైన వారెవరైనా సైబర్ సెక్యూరిటీ కెరీర్‌ను ఎంచుకోవచ్చు. ప్రాథమిక కంప్యూటర్ విజ్ఞానంతో సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో చేరి కెరీర్‌కు పునాదులు వేసుకోవచ్చు. కోర్సుల వ్యవధి నెల నుంచి ఏడాది వరకూ ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ డొమైన్‌లో.. పైథాన్, సెక్యూరిటీ అనలిస్ట్, ఎథికల్ హ్యాకర్, సాక్ వంటి 10 నుంచి 15 మాడ్యూల్స్ ఉంటాయి. ఆసక్తి మేరకు అభ్యర్థులు వీటిని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం సాక్ నేర్చుకున్న వారికి ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు లభిస్తున్నాయి. నైపుణ్యాలున్న సైబర్ సెక్యూరిటీ నిపుణులకు వేతనాలు సైతం ఆకర్షణీయంగానే ఉంటున్నాయి.

%d bloggers like this:
Available for Amazon Prime