ప్రస్తుతం ‘కరోనా’ లాక్డౌన్ కారణంగా దాదాపు అన్ని పోటీ పరీక్షల నిర్వహణ నిలిచిపోయింది. వైరస్ ఉధృతి తగ్గిన తర్వాతే యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్ నియామక పరీక్షలు జరిగే అవకాశం ఉంది. అనుకోకుండా లభించిన ఈ అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే.. ఆయా ఉద్యోగ పోటీ పరీక్షలకు మరింత మెరుగ్గా సన్నద్ధమవ్వచ్చు.
|
![]() సరైన ప్రణాళికతో ముందడుగు వేస్తే.. సర్కారీ కొలువు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ‘కరోనా’ తర్వాత జరిగే అవకాశం ఉన్న ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు.. వాటి తీరుతెన్నులు.. ప్రిపరేషన్ గైడెన్స్, నిపుణుల సలహాలు, సూచనలు…
ఏటా ఫిబ్రవరి–మార్చి రాగానే పదోతరగతి, ఇంటర్మీడియెట్, ఎంసెట్, జేఈఈ, నీట్ తదితర అకడమిక్, ప్రవేశ పరీక్షలతోపాటు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షల సీజన్ ప్రారంభమవుతుంది. కానీ ఈ ఏడాది పరిస్థితి భిన్నం. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 విపత్తు కారణంగా దేశంలో దాదాపు పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. అయితే ఈ లాక్డౌన్ సమయం విద్యార్థులకు, పోటీ పరీక్షార్థులకు అత్యంత కీలకం. కాబట్టి అభ్యర్థులు తమ ప్రిపరేషన్ పక్కదారి పట్టకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు పరీక్షలకు చాలాముందు నుంచే ప్రణాళిక ప్రకారం చదువుతుంటే.. మరికొంతమంది పరీక్షలు సమీపించినప్పుడు మాత్రమే తమ ప్రిపరేషన్ ప్రారంభిస్తారు. నేటి పోటీ ప్రపంచంలో ఏ ఉద్యోగ పరీక్షలో విజయం సాధించాలన్నా.. కనీసం ఆరు నెలల సమయం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి లాక్డౌన్ తర్వాత వెలువడే ఉద్యోగ ప్రకటనలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుంచే సన్నద్ధమవ్వాలి. ‘కరోనా’ సంక్షోభం ముగిసిన తర్వాత యూపీఎస్సీ, బ్యాంకు పరీక్షలు, ఎస్ఎస్సీ సీజీఎల్, రైల్వే ఎన్టీపీసీ, రైల్వే గ్రూప్–డి, డిఫెన్స్ తదితర పరీక్షలు జరిగే అవకాశం ఉంది.
బ్యాంక్ పరీక్షలు..
ఎస్ఎస్సీ
యూపీఎస్సీ
రైల్వే పరీక్షలు
ఉద్యోగ సాధనకు వ్యూహాలు
‘కరోనా’ తర్వాత భవిష్యత్తులో నిర్వహించనున్న ఉద్యోగ నియామక పరీక్షలకు ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం చదివితే.. తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అందుకోసం పరీక్ష ఎంపిక దగ్గర నుంచి మాక్టెస్టుల వరకూ సరైన వ్యూహంతో ముందుకెళ్లాలి. పరీక్ష ఎంపిక
పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ముందుగా తమ అర్హతలకు, నైపుణ్యాలకు, ప్రతిభకు అనుకూలమైన సిలబస్, సబ్జెక్టులు ఉన్న పరీక్షలను ఎంచుకోవాలి. ఆ తర్వాత పరీక్షలో విజయానికి అనుగుణంగా సరైన ప్రిపరేషన్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. క్లిష్టమైన వాటిపై దృష్టి
పరీక్ష ఎంపిక తరువాత అందులోని సిలబస్ అంశాలను పరిశీలించి.. క్లిష్టత స్థాయి ఆధారంగా జాబితా రూపొందించుకోవాలి. సిలబస్‌లో ఇదివరకే తెలిసిన అంశాలను, బాగా అవగాహన ఉన్న అంశాల ప్రిపరేషన్‌ను మొదట పూర్తిచేసుకోవాలి. ఆ తర్వాత క్లిష్టమైన టాపిక్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించి వాటిపై పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల అటు తేలికైన వాటితోపాటు ఇటు క్లిష్టమైన అంశాలపైనా పట్టుచిక్కుతుంది. ప్రీవియస్ పేపర్లు
సిలబస్ ఒకసారి చదవడం పూర్తయ్యాక గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను సాధన చేయాలి.ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇకముందు చేయబోయే ప్రిపరేషన్ పట్ల విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని పెంచుతుంది. మాక్ టెస్ట్లుమాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయడం ద్వారా వేగాన్ని పెంచుకోవడంతోపాటు, కచ్చితత్వంపై స్వీయ విశ్లేషణ చేసుకోవచ్చు. తద్వారా ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకునే వీలు కలుగుతుంది. పరీక్షల ప్రిపరేషన్ తుది దశకు చేరుకున్న తర్వాత చివరి రోజుల్లో కేవలం మాక్ టెస్ట్‌ల సాధనపైనే దృష్టిసారించాలి.
తుది దశ
ప్రిపరేషన్ తుది దశలో.. మాక్ టెస్టులు, మోడల్ టెస్టుల ప్రాక్టీస్ ద్వారా ఏ అంశాల్లో వెనుకంజలో ఉన్నారో పరిశీలించుకోవాలి. ఆయా అంశాల్లో మెరుగైన ప్రతిభ సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి!
ప్రస్తుతం కోవిడ్–19 కారణంగా దేశంలో, రాష్ట్రంలో ‘లాక్డౌన్’ పరిస్థితి నెలకొంది. దాదాపు అన్ని పోటీపరీక్షలు వాయిదా పడ్డాయి. లాక్డౌన్ ముగిసిన తర్వాత ఆయా పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఈ అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కరోనా విపత్తు ముగిసిన తర్వాత ఏ నోటిఫికేషన్ వెలువడినా రాసేందుకు సన్నద్ధంగా ఉండాలి. అందుకోసం ఇప్పటినుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలి. సాక్షిఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లోని ఉచిత లైవ్ క్లాసులతోపాటు ఆన్లైన్లోని వీడియో క్లాసులతో అభ్యర్థులు ప్రయోజనం పొందొచ్చు. |
You must log in to post a comment.