విదేశాల్లో మేనేజ్మెంట్ విద్యనభ్యసించాలంటే మార్గం.. గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు (జీమ్యాట్).
|
||||||||||||||||||
గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్(జీఎంఏసీ) ఈ పరీక్షను నిర్వహిస్తోంది. జీమ్యాట్ స్కోరు ఆధారంగా భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 110 దేశాల్లోని 2300కు పైగా ప్రముఖ యూనివర్సిటీలు/ఇన్స్టిట్యూట్లు మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ప్రస్తుత కోవిడ్–19 కారణంగా జీమ్యాట్ ఆన్లైన్ ఎగ్జామ్‌ను అందుబాటుకి తెచ్చారు. ఈ నేపథ్యంలో.. జీమ్యాట్ పరీక్ష విధానం, ప్రయోజనాలు, ఆన్లైన్ ఎగ్జామ్ వివరాలపై ప్రత్యేక కథనం..
అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ తదితర దేశాల్లోని టాప్ ఇన్స్టిట్యూట్స్లో మేనేజ్మెంట్ కోర్సులను పూర్తిచేస్తే అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఇది కెరీర్ అవకాశాల పరంగా కలిసొస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు సదరు ఇన్స్టిట్యూట్స్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో విదేశీ యూనివర్సిటీల్లో ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి మార్గమైన జీమ్యాట్కు ఆదరణ పెరుగుతోంది.
కరోనా ప్రభావం..
ప్రస్తుత కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా జీమ్యాట్ పరీక్షా కేంద్రాలను జీఎంఏసీ మూసివేసింది. అభ్యర్థులు ఇంటి నుంచే పరీక్ష రాసుకోవడానికి వీలుగా జీమ్యాట్ ఆన్లైన్ ఎగ్జామ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతానికి ఈ ఆన్లైన్ ఎగ్జామ్ జూన్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. చైనా, ఇరాన్, క్యూబా, సుడాన్, స్లోవేనియా, ఉత్తర కొరియా మినహా ప్రపంచవ్యాప్తంగా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. జీమ్యాట్(టెస్ట్ సెంటర్) పరీక్ష విధానం..
జీమ్యాట్ టెస్ట్ సెంటర్లో నిర్వహించే పరీక్షలో.. వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్, అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్ అనే నాలుగు విభాగాలు ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటల 7 నిమిషాలు అయినప్పటికీ.. విరామం, పరీక్ష సూచనలతో కలిపి మొత్తం మూడున్నర గంటలుగా పేర్కొనవచ్చు.
వెర్బల్ రీజనింగ్..
ఈ విభాగంలో రీడింగ్ కాంప్రెహెన్షన్, క్రిటికల్ రీజనింగ్, సెంటెన్స్ కరెక్షన్పై బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. ప్రామాణిక రాత పూర్వక(యూఎస్) ఇంగ్లిష్‌లో ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తీకరించే పరిజ్ఞానం, రాతపూర్వక విషయాలను చదవి, అర్థం చేసుకోగల నైపుణ్యాలు, కారణాలను విశ్లేషించడం, వాదనలను అంచనా వేయడంలో.. అభ్యర్థి సామర్థ్యాన్ని ఈ విభాగంలో పరీక్షిస్తారు. క్లిష్టత స్థాయిపై ఆధారపడి, అభ్యర్థి సరైన సమాధానాలు రాసిన ప్రశ్నల సంఖ్య ఆధారంగా స్కోరు లభిస్తుంది. క్వాంటిటేటివ్ రీజనింగ్..
ఈ విభాగంలో ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా సఫిషియెన్సీపై బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థుల గణితశాస్త్ర నైపుణ్యాలు, పరిమాణాత్మక సమస్యల పరిష్కార నైపుణ్యాలు, గ్రాఫికల్ డేటాను వివరించే సామర్థ్యాన్ని ఈ విభాగంలో పరీక్షిస్తారు. క్లిష్టత స్థాయి, అభ్యర్థి సరిగా సమాధానమిచ్చే ప్రశ్నల సంఖ్య ఆధారంగా∙స్కోరు కేటాయిస్తారు. ఇంటిగ్రేటెడ్ రీజనింగ్..
ఈ విభాగం నుంచి మల్టీ సోర్స్ రీజనింగ్, గ్రాఫిక్స్ ఇంటర్‌ప్రిటేషన్, టు పార్ట్ అనాలసిస్, టేబుల్ అనాలసిస్ నుంచి బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. గ్రాఫిక్, న్యూమరిక్, వెర్బల్ డేటాను అవసరమైన సమాచారంగా మార్చగల సామర్థ్యాన్ని ఈ విభాగం పరీక్షిస్తుంది. రిలేషన్షిప్స్ ఏర్పడేలా ఇన్ఫర్మేషన్ను ఆర్గనైజ్ చేయడం, మల్టిపుల్ ఇంటర్రిలేటెడ్ సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను కూడా అంచనావేస్తుంది. అభ్యర్థి సరిగా సమాధానమిచ్చే ప్రశ్నల సంఖ్య ఆధారంగా స్కోరు లభిస్తుంది. అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్..
ఈ విభాగంలో ఆర్గ్యుమెంట్ అనాలసిస్‌కు సంబంధించిన వ్యాసరూప ప్రశ్న ఇస్తారు. అభ్యర్థిలోని విమర్శనాత్మక ఆలోచనా సామర్థ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. ఆన్లైన్ పరీక్షలో స్వల్ప మార్పులు:
జీమ్యాట్ స్కోరు..
జీమ్యాట్ అర్హత నిబంధనలు:
రిజిస్ట్రేషన్, పరీక్ష తేదీలు:జీమ్యాట్ పరీక్షను సంవత్సరం పొడవునా నిర్వహిస్తారు. ముందుగా mba.comలో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఫీజు చెల్లించి అందుబాటులో ఉన్న తేదీల్లో పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ ఎగ్జామ్ కోసం అందుబాటులో ఉన్న పరీక్ష విండోకు 24 గంటల ముందు వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం జూన్ 15, 2020 వరకు ఆన్లైన్ ఎగ్జామ్ తేదీలు అందుబాటులో ఉన్నాయి. ఈ తేదీలను పొడిగించే అవకాశం ఉంది.
పరీక్ష కేంద్రాలు
జీమ్యాట్ వందకి పైగా దేశాల్లోని టెస్టు సెంటర్లలో ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను మూసివేశారు. ఇప్పుడు ఇంట్లోనే ఉండి జీమ్యాట్ ఆన్లైన్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్: https://mba.com |
You must log in to post a comment.