‘లా’తో భవిత ఇలా..

నేటి యువత మనస్ఫూర్తిగా మొగ్గుచూపే మరో కోర్సు… లా! ఆర్థిక సరళీకరణల నేపథ్యంలో.. ప్రభుత్వ రెగ్యులేటరీ పాత్ర, మారుతున్న ఆర్థిక, సాంఘిక పరిస్థితులు ‘లా’ గ్రాడ్యుయేట్స్‌కు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయ్!!
నియంత్రణలు తొలగి, విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావడంతో బిజినెస్ ‘లా’కు డిమాండ్ పెరిగింది. దాంతోపాటు ‘లా’తో సంబంధమున్న బ్యాంకింగ్, ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్స్, టాక్సేషన్, టెలికాం, ఇన్సూరెన్స్, పవర్, సివిల్ ఏవియేషన్, పోర్ట్స్, షిప్పింగ్, మీడియా, మేథో సంపత్తి హక్కులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ), రియల్ ఎస్టేట్, స్పెషల్ ఎకనమిక్ జోన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డాటా ప్రొటక్షన్ చట్టాలు వంటి విభాగాల్లో పెనుమార్పులు సంభ వించాయి. ఇది న్యాయ విద్యను అభ్యసించిన అభ్యర్థులకు వరంగా మారింది. దాంతో ‘లా’ మళ్లీ క్రేజీ కోర్సుగా మారిపోయింది!!

న్యాయవిద్యకు ప్రపంచవ్యాప్తంగా ఉజ్వల భవిష్యత్తు ఇప్పుడు. గ్లోబలైజేషన్ యువ లా గ్రాడ్యుయేట్స్‌కు ఎన్నడూ లేనన్ని అవకాశాలను ముందుకు తెచ్చింది. భారత్‌తో పాటు అంతర్జాతీయ వ్యాపార సంస్థలు న్యాయ విద్య ను అభ్యసించిన అభ్యర్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఫండ్ రైజింగ్, షేర్లు, జాయింట్ వెంచర్లు, మెర్జర్‌లు, టెక్నాలజీ కొలాబరేషన్ తదితర అంశాల్లో న్యాయ విద్య అభ్యసించినవారి సలహాలు కీలకంగా మారడంతో.. లా గ్రాడ్యుయేట్లకు భవిష్యత్తులో కూడా విసృ్తత అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

ఎన్ని అవకాశాలో:న్యాయశాస్త్రంలో విద్యనభ్యసిస్తే భవిష్యత్తుకు తిరుగుండదు. సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అనేక ప్రముఖ కంపెనీల్లో లా విభాగాల్లో కెరీర్ సొంతం చేసుకోవచ్చు. అనేక న్యాయ స్థానాల్లో మంచి అవకాశాలు వస్తాయి. మరోవైపు లీగల్ అడ్వయిజర్లగా పనిచేయొచ్చు. సుప్రీంకోర్టు జడ్జిలకు సహాయకారులుగా లా కాలేజీల్లో చదివే విద్యార్థులకు మంచి అవకాశాలున్నాయి. వీరికి జ్యుడీషియల్ క్లర్కుల హోదా లభిస్తుంది.

లాయుర్‌కు ఉండాల్సిన లక్షణాలు:

  • విషయు పరిజ్ఞానం
  • జ్ఞాపక శక్తి
  • రచనా నైపుణ్యం
  • సృజనాత్మకత
  • పట్టుదల, నిరంతర శ్రవు
  • భావవ్యక్తీకరణ నైపుణ్యాలు
  • లాజికల్ థింకింగ్
  • టీం ప్లేయుర్

లాలో ఉన్నత విద్య: ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాక.. ఎల్‌ఎల్‌ఎం చేస్తే న్యాయ రంగంలో విజయువంతమైన కెరీర్ నిర్మించుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది.

కొత్త కోర్సులు: ముఖ్యంగా దేశంలోని పలు న్యాయ విశ్వ విద్యాలయాలు అవసరాలకు అనుగుణంగా సివిల్ లా, క్రిమినల్ లా, కార్పొరేట్ లా, టాక్సేషన్ లాస్ (ఇన్‌కంటాక్స్, ఎక్సైజ్ లా), లేబర్ లా, ఇంటర్నేషనల్ లా, ఫ్యామిలీ లా, కాన్స్‌టిట్యూషనల్ లా, అడ్మినిస్ట్రేషనల్ లా, ట్రేడ్‌మార్క్ అండ్ కాపీరైట్ అండ్ ఐపీ రైట్స్, పేటెంట్ లాస్ వంటివి అందిస్తున్నాయి.

లా స్కూల్స్..1986లో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ) ఏర్పాటవడంతో దేశంలో న్యాయ విద్యకు కొత్త ఊపు లభించింది. ఆ తర్వాత నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్; నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ, భోపాల్ ; వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిడికల్ సెన్సైస్, కోల్‌కతా; నేషనల్ లా యూనివర్సిటీ, జోధ్‌పూర్; హిదయ్‌తుల్లా నేషనల్ లా యూనివర్సిటీ, రాయ్‌పూర్; గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ, గాంధీనగర్; డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ, లక్నో; రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా, పాటియాల; చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ, పాట్నా; నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ లీగల్ స్టడీస్, కోచిలలో ప్రముఖ లా స్కూల్స్ ఏర్పాటయ్యాయి. ఈ స్కూల్స్ అన్నీ కలిసి ఏటా కామన్ అడ్మిషన్ టెస్ట్(క్లాట్) ద్వారా ఐదేళ్ల అండర్ గ్రాడ్యుయేట్, రెండే ళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు
క ల్పిస్తున్నాయి.

నల్సార్ లా యూనివర్సిటీ:నల్సార్ ఆఫర్ చేస్తున్న 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బి.ఎ.ఎల్.ఎల్.బి.(ఆనర్స్) కోర్సులో చేరడానికి ఇంటర్‌లో 50 శాతం మార్కులు రావాలి. క్లాట్ ర్యాంకు ఆధారంగా అడ్మిషన్ లభిస్తుంది. దీంతోపాటు పలు పీజీ డిప్లొమా కోర్సులనూ నల్సార్ అందిస్తోంది.
వెబ్‌సైట్: www.nalsar.ac.in

నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియావర్సిటీ:బెంగుళూరులో ఏర్పాటైన తొలి లా యూనివర్సిటీ ఇది. ఇక్కడ 5 ఏళ్ల బి.ఎ.ఎల్.ఎల్.బి.(ఆనర్స్) ఉంది. ఈ కోర్సులో చేరాలంటే ఇంటర్‌లో కనీసం 50శాతంతోపాటు క్లాట్ రాయాలి. ఈ వర్సిటీ దూర విద్యావిధానంలోనూ పలు లా కోర్సులు ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.nls.ac.in

నేషనల్ లా యూనివర్సిటీ,ఢిల్లీ: ఇది 5ఏళ్ల కాలవ్యవధిగల బి.ఎ. ఎల్‌ఎల్.బి(ఆనర్స్) కోర్సు అందిస్తోంది. ఇందులో చేరేందుకు 50 శాతం మార్కులతో ఇంటర్ విద్యార్హత. దీనికి జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష పాసవ్వాలి. దీంతోపాటు ఈ వర్సిటీ పీజీ డిప్లమో కింద జడ్జింగ్ అండ్ కోర్టు మేనేజ్‌మెంట్, ఐపీఆర్ అండ్ పేటెంట్ లా కోర్సు నిర్వహిస్తోంది.
వెబ్‌సైట్: www.nludelhi.ac.in

నేషనల్ లా యూనివర్సిటీ, ఒరిస్సా: ఈ విశ్వవిద్యాలయం 5ఏళ్ల కాలవ్యవధిగల బి.ఎ.ఎల్‌ఎల్.బి. (ఆనర్స్) కోర్సు ఆఫర్ చేస్తోంది. విద్యార్హత: 50 శాతం మార్కులతో ఇంటర్. జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష పాసవ్వాలి.
వెబ్‌సైట్: www.nluo.ac.in

ఉస్మానియా లా కాలేజ్: ఇది బి.ఎ. ఎల్.ఎల్.బి అయిదేళ్ల కోర్సును, మూడేళ్ల ఎల్.ఎల్.బి. పీజీ కోర్సుల కింద ఎల్.ఎల్.ఎం.(ఏడీఆర్), ఎల్.ఎల్.ఎం.(ఐపీఆర్), ఎల్.ఎల్.ఎం(ఐటీ ఈఏఎల్)కోర్సులతోపాటు, మేథోసంపత్తి హక్కులు, సైబర్ చట్టాలు, టాక్సేషన్ అండ్ బీమా ఈ మూడు పీజీ డిప్లమో కోర్సులు ఏడాది కాల వ్యవధితో నిర్వహిస్తోంది.
వెబ్‌సైట్: www.osmania.ac.in/lawcollege

ఇగ్నో స్కూల్ లా: ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) దూర విద్యా విధానం కింద డిప్లమో ఇన్ పారాలీగల్ ప్రాక్టీస్ కోర్సు అందిస్తుంది. కాలవ్యవధి ఏడాది. ఇంటర్ అర్హత. దీంతోపాటు పలు పీజీ డిప్లొమా కో ర్సులనూ ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.ignou.ac.in/schools/sol/

నిర్మా యూనివర్సిటీ: గుజరాత్‌లోని ఈ విశ్వ విద్యాలయం 5ఏళ్ల కాలవ్యవధిగల బి.ఎ.ఎల్‌ఎల్.బి.(ఆనర్స్) కోర్సు ఆఫర్ చేస్తోంది. 50 శాతం మార్కులతో ఇంటర్ విద్యార్హత సరిపోతుంది. దీనికి జాతీయస్థాయి పరీక్ష పాసవ్వాలి.
వెబ్‌సైట్: www.nirmauni.ac.in

కర్ణాటక లా యూనివర్సిటీ: కర్ణాటకలోని హుబ్లీలో ఉన్న కర్ణాటక స్టేట్ లా యూని వర్సిటీ బి.ఎ. ఎల్‌ఎల్.బి.(ఆనర్స్), బి.బి.ఎ. ఎల్.ఎల్.బి.(ఆనర్స్), ఎల్‌ఎల్‌ఎం కోర్సులు నిర్వహిస్తోంది. ఇంటర్‌లో 45శాతం మార్కులు అవసరం. దాంతోపాటు త్వరలో పీజీ డిప్లమో ఇన్ ఇంటలెక్చ్యువల్ ప్రాపర్టీ రైట్స్, హ్యూమన్‌రైట్స్ అండ్ సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లా ప్రవేశపెట్టబోతోంది.
వెబ్‌సైట్: www.kslu.org

రాష్ట్రంలోని లా కాలేజీలు: రాష్ట్రంలోని వివిధ లా కళాశాలల్లో ఐదేళ్ల, మూడేళ్ల లా కోర్సుల కోసం రాష్ట్రస్థారుు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ఏ కాలేజీలో చదవాలన్నా.. లా సెట్ పరీక్షకు హాజరవడం తప్పనిసరి. అరుుదేళ్ల ఎల్‌ఎల్‌బీ, బీఎల్ కోర్సులకు ఇంటర్‌లో 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి. మన రాష్ట్రంలోని 49 కాలేజీల్లో దాదాపు 3000 లా సీట్లు అందుబాటులో ఉన్నాయి.

లా ఎంట్రెన్స్ టెస్టులుకామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్): క్లాట్.. జాతీయ స్థాయిలో 14 ప్రముఖ లా స్కూల్స్ అడ్మిషన్ కోసం ఏటా నిర్వహించే ప్రవేశపరీక్ష. క్లాట్‌లో ప్రతిభ ఆధారంగా బీఏ, ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
అర్హత:10+2లో కనీసం 50 శాతం మార్కులు.
పరీక్ష ప్యాట్రన్: ఆబ్జెక్టివ్ తరహాలో 200 ప్రశ్నలకు ఉంటుంది. పరీక్ష అవధి 2 గంటలు. ఇంగ్లిష్ కాంప్రహెన్షన్‌కు 40 ప్రశ్నలు; జనరల్ నాలెడ్జ్/కరెంట్ అఫైర్స్ 50 ప్రశ్నలు; ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు; లీగల్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు; లాజికల్ రీజనింగ్ 40 ప్రశ్నలు.
వెబ్‌సైట్: www.clat.ac.in

ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్:
(ఏఐఎల్‌ఈటీ): నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీ.. ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్‌ను ప్రతిఏటా నిర్వహిస్తుంది. ఏఐఎల్‌ఈటీ పరీక్ష ద్వారా తన ఐదేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ లా కోర్సులో ప్రవేశం కల్పిస్తుంది.
అర్హత: 10+2లో కనీసం 50 శాతం మార్కులు. అర్హత పరీక్ష ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష ప్యాట్రన్: ఏఐఎల్‌ఈటీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. 90 నిమిషాల్లో 150 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఇంగ్లిష్ 35 ప్రశ్నలు; జన రల్ నాలెడ్జ్/కరెంట్ అఫైర్స్ 35 ప్రశ్నలు; మ్యాథమెటిక్స్ 10 ప్రశ్నలు; లీగల్ అప్టిట్యూడ్ 35 ప్రశ్నలు; లాజికల్ రీజనింగ్ 35ప్రశ్నలు.
వెబ్‌సైట్: http://nludelhi.ac.in/

ఎల్‌శాట్-ఇండియా:
విదేశాల్లో విద్యాభ్యాసానికి ఆయా కోర్సులను బట్టి తప్పనిసరిగా జీఆర్‌ఈ/టోఫెల్/జీమ్యాట్ స్కోర్ ఉండాల్సిందే. అదే కోవలో ‘లా’ చదవాలంటే.. ‘ద లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్(ఎల్‌శాట్)’కు హాజరు కావాలి. ఈ పరీక్షను ద లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ (ఎల్‌ఎస్‌ఏసీ) 1947 నుంచి నిర్వహిస్తోంది. ఈ టెస్ట్ స్కోర్ ఆధారంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలలోని దాదాపు టాప్- 200 ఇన్‌స్టిట్యూట్‌లలో న్యాయ విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది. ఎల్‌శాట్ స్కోర్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.
మన దేశంలో లా కోర్సుకున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎల్‌ఎస్‌ఏసీ, పియర్సన్ వీయూఈ సంస్థలు ఎల్‌శాట్- ఇండియా పరీక్షకు శ్రీకారం చుట్టాయి. ఈ టెస్ట్ స్కోర్ ఆధారంగా ఐఐటీ-ఖరగ్‌పూర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా అండ్ రీసెర్చ్, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ తదితర 20కి పైగా ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్‌లలో లా విద్యను అభ్యసించవచ్చు.

పరీక్ష విధానం: ఎల్‌శాట్-ఇండియా టెస్ట్‌ను దేశంలోని 17 పట్టణాల్లో నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రం ఉంది. లా కెరీర్‌లో రాణించడానికి దోహదం చేసే లాజికల్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, థింకింగ్ స్కిల్స్ వంటి అంశాల్లో అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఎల్‌శాట్- ఇండియా టెస్ట్‌ను రూపొందించారు. మూడేళ్ల, ఐదేళ్ల కోర్సులకు వేర్వేరుగా పేపర్-పెన్సిల్ పద్ధతిలో నాలుగు విభాగాల్లో ఈ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇందులో రెండు విభాగాల్లో లీగల్ రీజనింగ్ సంబంధిత ప్రశ్నలను ఇస్తారు. మిగిలిన విభాగాల్లో ఎనలిటికల్ రీజనింగ్, రీడింగ్ కాంప్రెహెన్షన్ అంశాలపై ప్రశ్నలుంటాయి. మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ప్రశ్నలను అడుగుతారు. ప్రతి విభాగానికి 35 నిమిషాలు చొప్పున మొత్తం 2 గంటల 35 నిమిషాల సమయం (మధ్యలో 15 నిమిషాలు విరామం) ఉంటుంది.
అర్హత: అర్హత విషయానికొస్తే.. ఎంపిక చేసుకున్న ఇన్‌స్టిట్యూట్, కోర్సు ఆధారంగా అర్హత మారుతుంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్‌కు ముందే సంబంధిత అర్హతను తెలుసుకోవడం మంచిది. రిజిస్ట్రేషన్ తర్వాత మీకున్న అర్హత సరిపడకపోతే.. రిజిస్ట్రేషన్ ఫీజును తిరిగి చెల్లించరు.
రిజిస్ట్రేషన్: ఎల్‌శాట్-ఇండియా టెస్ట్ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మూడేళ్ల, ఐదేళ్ల కోర్సుల కోసం వేర్వేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. టెస్ట్ కోసం నిర్దేశించిన ఫీజు *3500 ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్(డీడీ) ద్వారా చెల్లించాలి. ‘ఎన్‌సీఎస్ పియర్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట న్యూఢిల్లీ/నోయిడాలో చెల్లేలా డీడీని తీయాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఎల్‌శాట్-ఇండియా రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ నెంబర్‌ను ఎంపిక చేసుకున్న లా స్కూల్ ప్రవేశ దరఖాస్తులో తప్పనిసరిగా పేర్కొనాలి.

చిరునామా: 
పియర్సన్ వీయూఈ, కేరాఫ్ బ్లూషిఫ్ట్, ఆరో అంతస్తు, ఈస్ట్ వింగ్, శ్రేయస్ టవర్స్, 23-24, చామైర్స్ రోడ్, చెన్నై- 600018.

వెబ్‌సైట్: www.pearsonvueindia.com-/lsatindia/

సింబయాసిస్ ఎంట్రెన్స్ టెస్ట్:సింబయాసిస్ యూనివర్సిటీలో భాగమైన సింబయాసిస్ లా స్కూల్… బీఏ ఎల్‌ఎల్‌బీ/బీబీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఏటా సెట్‌ను నిర్వహిస్తోంది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10+2 పాసై ఉండాలి. అర్హత పరీక్షను మొదటి అటెంప్ట్‌లో పాసైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వ యసు 20 ఏళ్లకు మించరాదు.
పరీక్ష ప్యాట్రన్: 150 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు 2 గంటల్లో సమాధానాలు గుర్తించాలి. ఇం దులో లాజికల్ రీజనింగ్, లీగల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తా యి. సెట్‌లో ప్రతిభ ఆధారంగా గ్రూప్‌డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
వెబ్‌సైట్: www.settest.org

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ:ఐదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశం కోసం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రతిఏటా ఎంట్రెన్స్ టెస్ట్‌ను నిర్వహిస్తోంది. మూడు స్టడీ సెంటర్లలో మొత్తం 220 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10+2 పాసై ఉండాలి. వయసు 22ఏళ్లకు మించరాదు.
పరీక్ష ప్యాట్రన్: పరీక్ష 100 మార్కులకు 2గంటలపాటు జరుగుతుంది. 75 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు.. 10 షార్ట్ ఆన్సర్‌టైప్ ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్/జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్‌పై ప్రశ్నలు ఉంటాయి.
వెబ్‌సైట్: www.amu.ac.in

%d bloggers like this:
Available for Amazon Prime