రోబోటిక్స్‌పై అవగాహన పెంచుకుంటే భవిష్యత్తు మీదే..!
ప్రస్తుత కరోనా కాలంలో విద్యార్థులు, ఉద్యోగులు, యువత ఆన్లైన్ విధానంలో రోబోటిక్స్‌పై అవగాహన పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
|
![]()
కమ్యూనికేషన్..ఇళ్లు, ఆఫీసులు, పరిశ్రమల్లో వినియోగించేందుకు మనం రోబోలను తయారుచేస్తున్నాం. కాగా, ఈ కోర్సులో రోబోలు, వాటితో మనిషి ఎలా కమ్యూనికేట్ చేయాలో నేర్చుకుంటారు. కుర్టిన్ యూనివర్సిటీ ఈ కోర్సును ఈడీఎక్స్ ద్వారా ఆఫర్చేస్తోంది. ఈ కోర్సులో ఎన్రోల్మెంట్ ప్రారంభమైంది. కోర్సు వ్యవధి నాలుగు వారాలు. రోబోటిక్స్..కొలంబియా యూనివర్సిటీ రోబోటిక్స్ కోర్సును ఆన్లైన్ విధానంలో అందిస్తోంది. ప్రస్తుతం ఈడీఎక్స్లో ఈ కోర్సు ఎన్రోల్మెంట్కు అవకాశం ఉంది. కోర్సులో 2డీ, 3డీ స్పేషియల్ రిలేషన్షిప్స్, కైనటిక్ చైన్స్ తదితర టెక్నిక్స్ గురించి నేర్చుకుంటారు. కోర్సు వ్యవధి 10 వారాలు. మెకట్రానిక్స్..ఈ కోర్సును జార్జియా టెక్ యూనివరిసటీ ఈడీఎక్స్ ద్వారా అందిస్తోంది. ఇందులో విద్యార్థులు మెకట్రానిక్స్‌కు సంబంధించిన ఫండమెంటల్స్, కోర్ కాన్సెప్టులను అధ్యయనం చేస్తారు. అలాగే సెన్సార్ల తయారీ, ఇంట్రస్టింగ్ రోబోటిక్ పరికరాల తయారీ గురించి నేర్చుకుంటారు. కోర్సు వ్యవధి ఎనిమిది వారాలు. ఏప్రిల్ 28 నుంచి ఎన్రోల్మెంట్ ప్రారంభమైంది. |
You must log in to post a comment.