యానిమేషన్

యువతకు మరో కెరీర్ అవకాశం యానిమేషన్. ఈ పరిశ్రమ వేగంగా ఎదుగుతూ.. వేల సంఖ్యలో ఉద్యోగాలు క ల్పిస్తోంది. ప్రముఖ కంపెనీలు యానిమేషన్ కార్యకలాపాలకు భారత్‌ను కేంద్రంగా
చేసుకుంటున్నాయి. క్రియేటివిటీ, టాలెంట్ ఉన్న యువతకు యానిమేషన్ మంచి కెరీర్‌గా నిలుస్తుంది. ఇందులో పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం…
యానిమేషన్ అంటే:వస్తువు, లేదా పాత్రకు ప్రాణం పోసేదే యానిమేషన్. జంతువుల లేదా మనుషుల చిత్రాలను కంప్యూటర్ ద్వారా కదిలిస్తూ.. గేమ్స్, సినిమాలు, కార్టూన్‌లను రూపొందించడమే యానిమేషన్. యానిమేషన్‌లో టూ డెమైన్షనల్ యానిమేషన్(2డి), త్రీ డెమైన్షనల్ యానిమేషన్(3డీ) ముఖ్యమైనవి. వాటితోపాటు క్లె యానిమేషన్, పప్పెట్ యానిమేషన్, శాండ్ యానిమేషన్ కూడా ఉన్నాయి. 2డి, 3డి యానిమేషన్‌లను డిజిటల్‌గా రూపొందించొచ్చు.
యానిమేటర్లు ఏం చేస్తారు:ఐడియా డెవలప్‌మెంట్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్… యానిమేషన్ ప్రక్రియ ఇలా సాగుతుంది. ఐడియా డెవలప్‌మెంట్‌లోనే పాత్రల రూపకల్పన జరుగుతుంది. ఐడియాస్‌ను లే అవుట్‌లుగా మార్చుతారు. ఆ తర్వాత స్క్రిప్ట్ రైటింగ్, స్టోరీ బోర్డింగ్, క్యారెక్టర్ డెవలప్‌మెంట్, బ్యాక్‌గ్రౌండ్స్, లే అవుట్ డిజైనింగ్, యానిమాటిక్స్ అండ్ వాయిస్.. ప్రీ ప్రొడక్షన్ కిందకు వస్తాయి. స్కానింగ్, కంపోజింగ్, బ్యాక్‌గ్రౌండ్ ప్రిపరేషన్, కలరింగ్ పని పూర్తయ్యాక… సౌండ్ రికార్డింగ్స్, కలర్ ఎడిటింగ్, టెస్టింగ్, స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో… ఎడిటింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్, కలర్ కరెక్షన్, కంపోజింగ్, వాయిస్, మ్యూజిక్ ఎడిటింగ్ అండ్ రెండరింగ్ పని జరుగుతుంది.
యానిమేషన్ కోర్సులు:దేశంలో, రాష్ట్రంలో అనేక ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు యానిమేషన్‌లో పీజీ,-గ్రాడ్యుయేషన్, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు అందిస్తున్నాయి. వీటితోపాటు యానిమేషన్ స్టైల్స్, టెక్నిక్స్‌కు సంబంధించి స్టాప్ మోషన్ యానిమేషన్, రాట్‌స్కోపింగ్, కంప్యూటర్ జనరేటెడ్ 3డి, 2డి యానిమేషన్, క్లేమోషన్, ఫొటోషాప్, హ్యూమన్ అనాటమీ, డ్రాయింగ్‌ల్లో ప్రత్యేక తర్ఫీదునిస్తున్నాయి.

యానిమేటర్‌కు అర్హతలు:
బేసిక్ స్కెచింగ్ స్కిల్స్, యానిమేషన్ పట్ల అమితాసక్తి ఉంటే సరిపోతుంది. శిక్షణ మాత్రం తప్పనిసరి. యానిమేషన్‌కు అవసరమైన స్కిల్స్‌కు పదునుపెట్టి అభ్యర్థిని ప్రొఫెషనల్ యానిమేటర్‌గా తయారు చేయడంలో ఈ శిక్షణ దోహదం చేస్తుంది. మంచి ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవాలంటే… యానిమేషన్‌లో డిప్లొమా, లేదా డిగ్రీ చేస్తే మేలు. వీటిలో చేరేందుకు కనీస అర్హత 10+2. డిగ్రీ అభ్యర్థులు యానిమేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరొచ్చు. ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వంటివి మాత్రం ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేట్స్‌కు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నాయి.
స్కిల్స్:యానిమేషన్‌లో రాణించాలనుకునే అభ్యర్థికి సృజనాత్మకత, కల్పనాశక్తి ఉండాలి. దాంతోపాటు డ్రాయింగ్‌పై, స్కెచ్చింగ్‌పై ఆసక్తి, అవగాహన ఉంటే మంచిది. పనిపట్ల నిబద్ధత, క్రమశిక్షణ, సహనం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. కంప్యూటర్ డిజైన్ సాఫ్ట్‌వేర్‌పై అవగాహన, సీ++, జావా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే.. అదనపు అర్హత. దాంతోపాటు ఫొటోగ్రఫీ, లైటింగ్ గురించి కూడా తెలిసుండాలి.
ఉద్యోగావకాశాలు:నైపుణ్యాలున్న యానిమేటర్లకు దేశ విదేశాల్లో అనేక ఉద్యోగావకాశాలున్నాయి. అడ్వర్‌ైటైజింగ్, టీవీ బ్రాడ్‌కాస్టింగ్, ఫిల్మ్, గేమ్స్, ఆర్కిటెక్చర్, వెబ్, ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అప్లికేషన్స్, స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్స్, మెడికల్ ఇమేజింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ అండ్ ఇంజనీరింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ తదితర విభాగాల్లో ఉద్యోగాలుంటాయి. ఫిల్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో రోజురోజుకూ అవకాశాలు విస్తరిస్తున్నాయి. ఒక్కో యానిమేషన్ సినిమాకు 500 మంది యానిమేటర్ల అవసరం ఉంటుంది. అందుకే చిత్ర పరిశ్రమలో యానిమేటర్ల అవసరాలు పెరుగుతున్నాయి.
జీతభత్యాలు:యానిమేషన్ ఉద్యోగాల ప్రత్యేకత మంచి జీతం అని చెప్పొచ్చు. ఎందుకంటే.. టాలెంట్ ఉంటే ఉద్యోగంలో చేరిన కొన్నేళ్లకే ఆరంకెల జీతం సొంతం చేసుకోవచ్చు. ట్రైనీ, లేదా జూనియర్ యానిమేటర్‌గా రూ.8,000-రూ.15,000లతో ప్రారంభమవుతుంది. మూడు నుంచి ఐదేళ్ల అనుభవంతో రూ. 25000- రూ. 40,000ల వరకూ పొందొచ్చు. మరికొంత అనుభవం సంపాదించాక రూ.50,000-రూ.60,000 వరకూ జీతాలు పెరుగుతాయి.
శిక్షణా సంస్థలు:జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనిమేషన్ ప్రత్యేకాంశంగా బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
10+2 ఉత్తీర్ణులు అర్హులు.
వెబ్‌సైట్: http://jnafau.ac.in
ఎరీనా యూనిమేషన్ అకాడెమీ
www.arenaanimationacademy.com

కలర్‌చిప్స్ ఇండియూ
www.colorchipsindia.com

కాలిబర్ ఐటీ సొల్యూషన్స్
www.caliberitsolutions.com

పికాసో యూనిమేషన్
www.picasso.co.in

ప్రిజమ్ మల్టీమీడియూ
www.prismmultimedia.com
ఒపెల్ మల్టీమీడియూ
రేస్ ది యూనిమేషన్
www.raceindia.com
బిగ్ ఫిష్ స్టూడియోస్
www.bigfishanimations.com
నిమ్స్‌మె
www.nimsme.org

యానిమేషన్, గేమింగ్
ఇంట్లో పిల్లలున్నారా..! అయితే టీవీలో టామ్ అండ్ జెర్రీ, మిక్కీమౌస్ వంటి కార్టూన్ ప్రోగ్రామ్స్ హోరెత్తాల్సిందే. లేదా టీవీ, మొబైల్ ఫోన్స్లో వీడియో గేమ్స్ మోత మోగాల్సిందే..! ఆ వీడియో గేమ్స్, కార్టూన్ ప్రోగ్రామ్స్ వెనకున్న వారే… గేమింగ్ అండ్ యానిమేషన్ నిపుణులు.
కంప్యూటర్ను ఉపయోగించి చిత్రాలు, ఇతర ప్రతిబింబాలను కదులుతున్నట్లు చూపించే ప్రక్రియను యానిమేషన్ అంటారు. యానిమేషన్ కోర్సులు పూర్తి చేస్తే వినోద, ప్రకటన విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. వీడియో గేమ్స్ రూపకల్పన, మార్కెటింగ్, ఆదాయ సమీకరణలు గేమింగ్ రంగంలో ప్రధాన విధులు. గేమింగ్, యానిమేషన్ విభాగాలు ఒకదానితో ఒకటి కలసి ఉంటాయి. యానిమేటర్, గేమ్ డిజైనర్ల విధుల్లో చాలా వరకూ సారూప్యత ఉంటుంది. గేమ్ డిజైనర్లు గేమ్ స్టోరీ లైన్, గేమ్ ప్లే స్టైల్ను రూపొందిస్తారు. గేమింగ్ రంగంలో యువతకు పెద్ద సంఖ్యలో కొలువులు లభిస్తున్నాయి.
కోర్సులు
గ్రాడ్యుయేషన్ ఇన్ యానిమేషన్ అండ్ గేమింగ్
పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ యానిమేషన్ అండ్ గేమింగ్
మాస్టర్ డిప్లొమా ఇన్ యానిమేషన్ అండ్ గేమింగ్ »
సర్టిఫికెట్ ఇన్ యానిమేషన్
డిప్లొమా ఇన్ అడ్వాన్స్డ్ 3డీ యానిమేషన్.
అవసరమైన నైపుణ్యాలు
గేమింగ్, యానిమేషన్ రంగంలో రాణించేందుకు పలు నైపుణ్యాలు తప్పనిసరి. అవి.. » సాంకేతిక, కంప్యూటర్ నైపుణ్యాలు » మ్యాథమెటిక్స్పై పట్టు » ప్రోగ్రామింగ్ స్కిల్స్ » సృజనాత్మకత » రంగులు, ఆకారాలపై అవగాహన » స్వీయ ప్రేరణ » బృంద స్ఫూర్తి, స్వశక్తితో పనిచేయగలిగే నేర్పు » మార్కెటింగ్ నైపుణ్యం.
జాబ్ ప్రొఫైల్స్
3డీ మాడ్యులర్, యానిమేటర్, ఆర్ట్ డైరెక్టర్, గ్రాఫిక్ డిజైనర్, వీడియో గేమ్ డిజైనర్, యానిమేషన్ డైరెక్టర్, కార్టూనిస్ట్, డిజిటల్ పెయింటర్, స్టాప్ మోషన్ యానిమేటర్, కలర్ ఆర్టిస్ట్, ఎఫెక్ట్స్ యానిమేటర్, మ్యాథమెటికల్, కాంపొసైటింగ్ ఆర్టిస్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.
%d bloggers like this:
Available for Amazon Prime