బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీపీటీ…

ఎంబీబీఎస్ సీటు రానివారికి ప్రత్యామ్నాయ మెడికల్ కోర్సులు.. బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీపీటీ.. లాంటివి ఉన్నాయి. ఈ కోర్సులకు గిరాకీ పెరగడంతో వీటిని చదివినవాళ్లకు అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఆల్టర్నేటివ్ ఎంబీబీఎస్ కోర్సులపై స్పెషల్ ఫోకస్ ఈ రోజు కెరీర్స్ స్పెషల్….
డెంటల్ సెన్సైస్ఎంబీబీఎస్ సీటు మిస్సైనవాళ్లకు వెంటనే కనిపించే ప్రథమ ప్రత్యామ్నాయం బీడీఎస్. దంతవ్యాధుల నుంచి సంరక్షణ, దంతాల ఎగుడుదిగుడుల సర్దుబాటు, కృత్రిమ దం తాలు, దంతాల అలంకరణ, పరిశుభ్రతపై అవగాహన పెరగడంతో డెంటిస్ట్‌లకు డిమాండ్ ఎక్కువైంది.

కోర్సులు: ఇందులోనూ బ్యాచిలర్, పీజీ కోర్సులు ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీని బీడీఎస్(బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ)గా పేర్కొంటారు. బీడీఎస్ తర్వాత పీజీ కోర్సు చేయవచ్చు. ఈ కోర్సును ఎండీఎస్(మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ)గా వ్యవహరిస్తారు.

బీడీఎస్: బీడీఎస్లో చేరడం ద్వారా తమ డాక్టర్ కల నెరవేర్చుకుంటారు. ఇటీవల కాలంలో పెద్దల్లో, పిల్లల్లో, యువతలో దంత సమస్యలు పెరుగుతున్నాయి. అయితే డిమాండ్కు సరిపడా బీడీఎస్ కోర్సు పూర్తిచేసిన వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. దాంతో దేశంలో డెంటిస్ట్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. డెంటిస్ట్గా మారేందుకు అందుబాటులో ఉన్న కోర్సులు.. కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం…

 

 
బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ(బీడీఎస్) కోర్సును పూర్తి చేసినవారిని డెంటిస్ట్లుగా పేర్కొంటారు. వీరు దంత సంబంధిత వ్యాధులకు చికిత్స అందిస్తారు. దంతవ్యాధుల నుంచి సంరక్షణ, దంత క్షయం, పళ్ల మధ్య ఖాళీలు, చిగుళ్ల సమస్యలు, దంతాల సర్దుబాటు, కృత్రిమ దంతాలు అమర్చడం వంటివి డెంటిస్ట్ల ప్రధాన విధులు. బీడీఎస్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఉన్నత విద్య పరంగా మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (ఎండీఎస్) కోర్సు అందుబాటులో ఉంది.
 
ప్రవేశాలు..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)– యూజీలో సత్తా చాటడం ద్వారా బీడీఎస్ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. అలాగే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్బీఈ) నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)–పీజీలో ప్రతిభ చూపి ఎండీఎస్ కోర్సులో ప్రవేశించొచ్చు.
ఐదేళ్ల కోర్సు..బీడీఎస్ కోర్సు వ్యవధి ఐదేళ్లు. ఇందులో ఏడాది పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది. నాలుగేళ్ల కోర్సు తర్వాత ఇంటర్న్షిప్ ప్రారంభమవుతుంది. ఇంటర్న్షిప్లో విద్యార్థులు హౌస్ సర్జన్గా పనిచేయాల్సి ఉంటుంది. ఈ దశలో కాలేజీకి అనుబంధంగా ఉన్న లేదా నిర్దేశించిన హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ పర్యవేక్షణలో విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకుంటారు. హౌస్ సర్జన్సీలో మూడు నెలలు పాటు గ్రామీణ ప్రాంతాల్లోని శాటిలైట్ క్లినిక్స్లో పని చేయాల్సి ఉంటుంది.
బోధించే అంశాలు..
అనాటమీ, హ్యూమన్ ఫిజియాలజీ, బయోకె మిస్ట్రీ అండ్ న్యూట్రిషన్, డెంటల్ అనాటమీ ఎంబ్రీయాలజీ అండ్ ఓరల్ హిస్టాలజీ, జనరల్ పాథాలజీ అండ్ మైక్రోబయాలజీ, డెంటల్ మెటీరియల్స్, జనరల్ అండ్ డెంటల్ ఫార్మాకాలజీ అండ్ థెరపెటిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఓరల్ పాథాలజీ అండ్ మైక్రోబయాలజీ, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ తదితర సబ్జెక్ట్లను బోధిస్తారు.
ఇంటర్న్ షిప్..
ఇంటర్న్షిప్లో భాగంగా విద్యార్థులు వివిధ రకాల పంటి సమస్యలతో బాధపడుతున్న రోగులను కలుస్తారు. తద్వారా దంత వ్యాధులకు సంబంధించి అకడెమిక్గా నేర్చుకున్న విషయాలు, లక్షణాలను వాస్తవ పరిస్థితుల్లో గుర్తించడం.. సదరు వ్యాధులకు గురైన రోగులకు సీనియర్లు అందిస్తున్న చికిత్స తీరును పరిశీలించడం ద్వారా పూర్తి స్థాయి డెంటిస్ట్కు అవసరమైన సామర్థ్యాలను అలవరచుకుంటారు.
 

ఎండీఎస్: బీడీఎస్ పూర్తి చేసిన వారు మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ(ఎండీఎస్) కోర్సు చదివేందుకు అర్హులు. ఇందులో పలు స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అవి.. ఓరల్ పాథాలజీ అండ్ మైక్రోబయాలజీ, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ, కన్సర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడెంటిక్స్, పెన్డోడెంటిక్స్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ, ఆర్థోడెంటిక్స్ అండ్ డెంటో ఫేషియల్ ఆర్థోపెడిక్స్, పరియోడెంటిక్స్, ఓరల్ అండ్ మ్యాక్స్ల్లోఫేషియల్ సర్జరీ తదితరాలు. డెంటిస్ట్గా రాణించాలంటే.. ఎండీఎస్ చేయడం తప్పనిసరి అనే అభిప్రాయం ఉంది. ఎండీఎస్ తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్డీలో కూడా చేరొచ్చు.

స్కిల్స్ తప్పనిసరి..సంబంధిత నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు డెంటల్ కోర్సుల్లో చక్కగా రాణిస్తారు. అవి..
  • సేవా దృక్పథం, ఓర్పు, ఆత్మ విశ్వాసం, ఏకాగ్రత.
  • దృఢ చిత్తంతో వ్యవహరించగలగడం.
  • నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం.
  • కమ్యూనికేషన్ స్కిల్స్.
  • కష్టపడే మనస్తతత్వం.
  • కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి.

క్లినికల్ నాలెడ్జ్..
బీడీఎస్ కెరీర్ పూర్తిగా అభ్యర్థుల నైపుణ్యా లపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కోర్సులో చేరిన విద్యార్థులు థియరీతోపాటు క్లినికల్ నాలెడ్జ్పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. సంబంధి త అన్ని సబ్జెక్ట్లపై అవగాహన పెంచుకోవాలి. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నైపుణ్య తను పెంచుకోవడమే లక్ష్యంగా క్లినికల్ స్కిల్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. హౌస్ సర్జన్సీషిప్లో నిరంతరం వార్డుల్లో పర్యటించి వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న రోగులను పరిశీలిం చాలి. తద్వారా క్లినికల్ నాలెడ్జ్ పెరుగుతుంది. నైపుణ్యత అలవడు తుంది. వృత్తిలో భాగంగా రోగులతో మాట్లాడటం, వారిలో నమ్మకం కలిగించడం ప్రధానం. కాబట్టి విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంపొందించుకోవాలి!!
పాపులర్ స్పెషలైజేషన్లు: పీరియోడాంటిక్స్, పెడోడాంటిక్స్, ప్రోస్థోడాంటిక్స్, ఆర్థోడాంటిక్స్, ఓరల్ సర్జరీ, పీడియాట్రిక్ డెంటిస్ట్రీ, కాస్మొటిక్ డెంటిస్ట్రీ

రాష్ట్రంలో: మన రాష్ట్రంలో 19 కాలేజీలు బీడీఎస్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో 1600 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి.

టాప్ కాలేజెస్ ఇన్ ఏపీ

  • గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్-విజయవాడ
  • గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్-హైదరాబాద్
  • మమత డెంటల్ కాలేజ్-ఖమ్మం

దేశంలో ప్రముఖ డెంటల్ కాలేజీలు

  • కాలేజ్ ఆఫ్ డెంటల్ సెన్సైస్-మణిపాల్
  • మౌలానా ఆజాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సెన్సైస్-న్యూఢిల్లీ.
  • భారతి విద్యాపీఠ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్-పుణే

కెరీర్ గ్రాఫ్: డాక్టర్‌గా సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు. లేదా ఏదైనా హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్/హౌస్ స్టాఫ్‌గా, మెడికల్ కాలేజ్‌ల్లో క్లినికల్ అసిస్టెంట్/క్లినికల్ ట్యూటర్‌గా పనిచేయొచ్చు. పీజీ డిగ్రీ ఉంటే బాగా రాణించొచ్చు. ప్రభుత్వ రంగంలోనైతే.. డెంటల్ సర్జన్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది.

ఫిజియోథెరపీహెల్త్ కేర్ రంగంలో అవకాశాలకు వేదికగా నిలుస్తోన్న మరో రంగం ఫిజియోథెరపీ.
అన్ని కోర్సుల్లో మాదిరిగానే ఫిజియోథెరపీలో కూడా బ్యాచిలర్, పీజీ కోర్సులు ఉంటాయి. బ్యాచిలర్ డిగ్రీ కోర్సును బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ)గా వ్యవహరిస్తారు. దీని తర్వాత పీజీ స్థాయిలో వివిధ స్పెషలైజేషన్లతో ఎంపీటీ (మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ) కోర్సులు ఉంటాయి.

బీపీటీ: ఈ కోర్సులో చేరడానికి అర్హత ఇంటర్మీడియెట్(బైపీసీ) లేదా ఇంటర్మీడియెట్ ఓకేషనల్(ఫిజియోథెరపీ). కోర్సు కాల వ్యవధి నాలుగున్నరేళ్లు(ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌తో కలిపి). దేశంలో సుమారు 300 ఫిజియోథెరపీ కళాశాలలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 38 కాలేజీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో 1500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ప్రవేశానికి ఎటువంటి ఎంట్రెన్స్ టెస్ట్ ఉండదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇంటర్మీడియెట్ మార్కుల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.

ఉన్నత విద్య: రాష్ట్రంలో దాదాపు 17 కాలేజీలు వివిధ స్పెషలైజేషన్స్‌తో ఎంపీటీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.
ఎంపీటీ-స్పెషలైజేషన్లు: ఆర్థోపెడిక్స్, స్పోర్ట్స్, కార్డియోపల్మనాలజీ, పీడియాట్రిక్స్..
అవకాశాలు: ప్రతి పదివేల మందికి ఒక ఫిజియోథెరపిస్ట్ ఉండాలి. ఈ లెక్కన చూసుకుంటే ఇప్పుడున్న ఫిజియోథెరపిస్ట్‌లు భవిష్యత్తు అవసరాలకు ఏమాత్రం సరిపోరు. శారీరక, మానసిక వికలాంగుల కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవే ట్ ఆసుపత్రులు, పునరావాస కేంద్రాలు, స్పోర్ట్స్ క్లినిక్స్, ఫిట్‌నెస్ సెంటర్లలో పనిచేయొచ్చు.

దేశంలో ప్రముఖ సంస్థలు:

  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్- న్యూఢిల్లీ
  • అపోలో-హైదరాబాద్
  • పీజీఐఎంఈఆర్-చండీగఢ్
  • గవర్నమెంట్ మెడికల్ కాలేజ్-నాగ్‌పూర్
  • నిమ్స్-హైదరాబాద్

హోమియోపతిబీడీఎస్ తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు హోమియోపతి కోర్సుల వైపు ఆకర్షితలవుతున్నారు. హోమియోకు ఆదరణ పెరగడంతో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.

కోర్సులు: హోమియోపతిలో కూడా బ్యాచిలర్, పీజీ కోర్సులు ఉన్నాయి. బీహెచ్‌ఎంఎస్(బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ)గా పేర్కొంటారు. బీహెచ్‌ఎంఎస్ తర్వాత పీజీ కోర్సు చేయొచ్చు. దీన్ని ఎండీ (హోమియోపతి)గా వ్యవహరిస్తారు.

బీహెచ్‌ఎంఎస్: ఈకోర్సులో చేరడానికి అర్హత బైపీసీతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. కోర్సు కాల వ్యవధి ఐదున్నరేళ్లు(ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్‌తో కలిపి). దేశ వ్యాప్తంగా దాదాపు 180కి పైగా కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీహెచ్‌ఎంఎస్ పూర్తై తర్వాత ఎండీ (హోమియోపతి) కోర్సులో చేరొచ్చు. ఇందులోకూడా వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.

రాష్ట్రంలో: మన రాష్ట్రంలో 6 కాలేజీలు బీహెచ్‌ఎంఎస్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో 300కు పైగా సీట్లున్నాయి.

ఆఫర్ చేస్తున్న కాలేజ్‌లు:

  • జేఎస్‌పీఎస్ ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల-హైదరాబాద్.
  • డాక్టర్ గురురాజు ప్రభుత్వ హోమియో కళాశాల-గుడివాడ(కృష్ణా జిల్లా)
  • డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాల-రాజమండ్రి.
  • ప్రభుత్వ హోమియో కళాశాల-కడప.
  • మహారాజ హోమియో కళాశాల-విజయనగరం.
  • డీఈవీఎస్ హోమియో కళాశాల-కీసర (రంగారెడ్డి జిల్లా).

దేశంలో ప్రముఖ హోమియో కాలేజీలు

  • నెహ్రూ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్-న్యూఢిల్లీ
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి – కోల్‌కతా
  • డాక్టర్ బీఆర్ సుర్ మెడికల్ కాలేజ్ ,హాస్పిటల్ అండ్ రీసెర్చ్-న్యూఢిల్లీ
  • బరోడా హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ -వడోదరా

ఆయుర్వేదంఇటీవల ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షిసున్న మరొక మెడికల్ విభాగం ఆయుర్వేదం. ఇందులో కూడా బ్యాచిలర్, పీజీ కోర్సులు ఉన్నాయి. అవి బీఏఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ), ఎండీ (ఆయుర్వేద).

బీఏఎంఎస్: ఈకోర్సులో చేరేందుకు అర్హత ఇంటర్మీడియెట్ బైపీసీతో ఉత్తీర్ణత. కోర్సు కాల వ్యవధి ఐదున్నరేళ్లు(ఇంటర్న్‌షిప్‌తో కలిపి). దేశ వ్యాప్తంగా దాదాపు 100 కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

మన రాష్ట్రంలో: 7 కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. వీటిలో సుమారు 330 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

పీజీ: బీఏఎంఎస్ తర్వాత పీజీ స్థారుులో ఎండీ (ఆయుర్వేద), ఎంఎస్ (ఆయుర్వేద) కోర్సులు చదవొచ్చు. పీజీలో 22 స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. కాయచికిత్స, పంచకర్మ, కిషార్‌సూత్ర..ముఖ్యమైన స్పెషలైజేషన్లు. పీజీ పూర్తై తర్వాత ఆయుర్వేదలో పీహెచ్‌డీ చేసుకోవచ్చు. పీజీ కోర్సులు చదివినవారికి కోర్సు సమయంలో ఆకర్షణీయ స్టైపెండ్ చెల్లిస్తారు. డిప్లొమా కోర్సులు కూడా చదువుకోవచ్చు.

దేశంలో ప్రముఖ ఆయుర్వేద కళాశాలలు:

  • బెనారస్ హిందూ యూనివర్సిటీ-వారణాసి
  • గుజరాత్ ఆయుర్వేద యూనివర్సిటీ
  • పొడార్ ఆయుర్వేద కాలేజ్-మహారాష్ట్ర,
  • ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలు-కేరళ

ఉద్యోగాలు: ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రుల్లో వైద్యుడిగా సేవలందించొచ్చు. ఆయుర్వేద కళాశాలల్లో బోధనా సిబ్బందిగా పనిచేయొచ్చు. ఆయుర్వేద ఫార్మా కంపెనీల్లో మందులు తయారీలో స్థిరపడొచ్చు లేదా సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

వెటర్నరీ సైన్స్వ్యవసాయానుబంధ రంగాలకు ప్రాధాన్యం పెరుగుతుండడంతో… వెటర్నరీ సైన్స్.. సంబంధిత కోర్సులను అభ్యసించిన వారికి డిమాండ్ ఏర్పడింది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగం, స్వయం ఉపాధి అవకాశాలు అనేకం.

కోర్సులు: వెటర్నరీ సైన్స్‌లో కూడా బ్యాచిలర్, పీజీ కోర్సులు ఉన్నాయి. బీవీఎస్సీ అండ్ ఏహెచ్ (బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ ), ఎంవీఎస్సీ (మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్)గా వ్యవహరిస్తారు.

బీవీఎస్సీ అండ్ ఏహెచ్: ఈ కోర్సులో చేరడానికి అర్హత బైపీసీతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. కోర్సు కాల వ్యవధి: ఐదున్నరేళ్లు(ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్‌తో కలిపి). దేశ వ్యాప్తంగా దాదాపు 35కి పైగా కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

రాష్ట్రంలో: 3 కాలేజీలు బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. అవి…

  • కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ – తిరుపతి.
  • ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్- గన్నవరం (కృష్ణా జిల్లా)
  • కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్- హైదరాబాద్

ఎంవీఎస్సీ: ఇందులో 22 స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
స్పెషలైజేషన్లు: వెటర్నరీ అనాటమీ అండ్ హిస్టాలజీ, వెటర్నరీ పాథాలజీ, యానిమల్ రిప్రొడక్షన్ గైనకాలజీ ఆబ్‌స్టెట్రిక్స్, క్లినికల్ వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ సర్జరీ అండ్ రేడియాలజీ, వెటర్నరీ మైక్రోబయాలజీ, యానిమల్ న్యూట్రిషన్, పౌల్ట్రీ సైన్స్…

దేశంలో ప్రముఖ సంస్థలు:

  • మద్రాస్ వెటర్నరీ కాలేజ్-చెన్నై
  • లాలా లజిపతిరాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సెన్సైస్-హిస్సార్
  • కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ
  • ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-ఇజాత్‌నగర్
  • కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ-ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ-ఆనంద్
%d bloggers like this:
Available for Amazon Prime