ఆధునిక దేశాల్లో చట్టం, న్యాయవిద్య, అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. న్యాయవిద్య కేవలం న్యాయవాదులను తయారుచేయడానికే పరిమితం కాదు..! భవిష్యత్ సమాజ రూపకల్పనలో కీలక ఉపకరణంగా కూడా ఉపయోగపడుతుంది. కానీ, ఎక్కువమంది విద్యార్థులు న్యాయవిద్య అనగానే వెనకంజ వేస్తుంటారు.
|
![]() లాతో కెరీర్లో స్థిరపడటానికి చాలా సమయం పడుతుందని భావిస్తుంటారు. వాస్తవానికి ప్రస్తుతం న్యాయవిద్యలోనూ కొత్త, కొత్త స్పెషలైజేషన్స్ అందుబాటులోకొచ్చాయి. నేడు లా విద్యార్థులకు కార్పొరేట్ రంగంలో ఉజ్వల అవకాశాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. 2019 ఎన్ఐఆర్ఎఫ్ (నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్)లో నిలిచిన లా ఇన్స్టిట్యూట్లు.. అందిస్తున్న కోర్సులు, ప్రవేశ విధానాల గురించి తెలుసుకుందాం..
కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఆర్డీ) ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) 2015 నుంచి మొత్తం తొమ్మిది కేటగిరీల్లో దేశీయ ఇన్స్టిట్యూట్లకు ర్యాంకులను ప్రకటిస్తోంది. కరోనా కారణంగా ఎన్ఐఆర్ఎఫ్– 2020 ర్యాంకింగ్స్ వాయిదా పడ్డాయి. 2019లో ఎన్ఐఆర్ఎఫ్ మొత్తం 15 లా ఇన్‌స్టిట్యూట్స్‌కు ర్యాంకులు ప్రకటించింది.
ఎన్ఎల్ఎస్ఐయూ, బెంగళూరు
నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ ఎస్ఐయూ).. 1986లో ఏర్పాటైంది. వరుసగా(2018,2019) రెండు సంవత్సరాల ర్యాంకింగ్స్‌లోనూ మొదటి స్థానం సొంతం చేసుకుంది.
నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీ
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం దక్కించుకుంది నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీ. బీఏ, ఎల్ఎల్బీ (హానర్స్)లో 123 సీట్లు, ఎల్ఎల్ఎం కోర్సులో 81 సీట్లు ఉన్నాయి. ఆలిండియా లా ఎంట్రన్స్ టెస్టు(ఏఐఈఎల్టీ) ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పీహెచ్డీ ప్రవేశాలను రాత పరీక్ష, రీసెర్చ్ ప్రపోజల్స్ ఎవాల్యూ యేషన్ ద్వారా ఖరారు చేస్తారు. పై కోర్సులతోపాటు విదేశీ యూనివర్సిటీల నుంచి మూడేళ్ల ఎల్ఎల్బీ డిగ్రీ ఉత్తీర్ణులకు రెండేళ్ల బ్రిడ్జ్ కోర్సు, నాలుగేళ్ల ఎల్ఎల్బీ డిగ్రీ పూర్తిచేసిన వారికి ఏడాది వ్యవధితో బ్రిడ్జి కోర్సు అందుబాటులో ఉంది. పీజీ డిప్లొమా కోర్సులు: » అర్బన్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అండ్ లా » టూరిజం అండ్ ఎన్విరాన్ మెంటల్ లాస్ » ఎన్విరాన్మెంటల్ లా అండ్ పాలసీ. పూర్తి వివరాలకు వెబ్సైట్: nludelhi.ac.in నల్సార్, హైదరాబాద్
ద నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్(నల్సార్) 1998లో ఏర్పాటైంది. ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం దక్కించుకుంది. నల్సార్.. బీఏ ఎల్ఎల్బీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఎంఫిల్, పీహెచ్డీ, ఎల్ఎల్ఎం పీహెచ్డీ, ఎంబీఏ కోర్సులు అందిస్తోంది. క్లాట్–యూజీ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్, క్లాట్–పీజీ ద్వారా పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. పీహెచ్డీ ప్రవేశాలకు ప్రత్యేక రాత పరీక్ష నిర్వహిస్తారు. యూజీసీ నెట్, సీఎస్ఐఆర్–యూజీసీ నెట్ ఉత్తీర్ణులకు రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.nalsar.ac.in ఐఐటీ, ఖరగ్‌పూర్
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానం దక్కించుకుంది.. ఐఐటీ ఖరగ్‌పూర్. ఇంజనీరింగ్, టెక్నాలజీ విద్యకు పేరుగాంచిన ఈ ఇన్స్టిట్యూట్.. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, పీహెచ్డీ కోర్సులను సైతం అందిస్తోంది. ఎల్ఎల్బీ మూ డేళ్ల కోర్సు. ఇంజనీరింగ్/టెక్నాలజీ/మెడిసిన్‌లో ప్రథమ శ్రేణిలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా సైన్స్/ఫార్మసీలో ప్రథమ శ్రేణిలో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎంబీఏలో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణులు ఎల్ఎల్బీ కోర్సుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు. ఎల్ఎల్ ఎం కోర్సులో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, కార్పొరేట్ లాస్, ట్యాక్సేషన్, క్రిమినల్ లాస్, ఇంటర్నేషనల్ లా, కాన్స్టిట్యూషనల్ లా, కాంపిటీషన్ లా స్పెషలై జేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారిలో నుంచి రాత పరీక్షకు అర్హులైన అభ్యర్థులను షార్ట్ లిస్టు చేస్తారు. అనంతరం వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశాలను ఖరారు చేస్తారు. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.iitkgp.ac.in వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడిషియల్ సైన్సెస్, కోల్‌కతా
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానం దక్కించుకుంది ఈ లా యూనివర్సిటీ. బీఏ/బీఎస్సీ ఎల్ఎల్బీ, ఎల్ఎల్ ఎం, ఎంఫిల్, పీహెచ్డీ, ఎల్ఎల్డీ కోర్సులను అందిస్తోంది. వీటితోపాటు ఎయిర్ అండ్ స్పేస్ లా, న్యూక్లియర్ లా, బిజినెస్ లాస్, హ్యూమన్ రైట్స్, పబ్లిక్ హెల్త్‌కేర్ అండ్ మెడికల్ లాస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లా స్పెషలైజేషన్స్‌తో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా, కన్జ్యూమర్ లాలో సర్టిఫికెట్ కోర్సును ఆఫర్చేస్తోంది. అదేవిధంగా కొలాబరేటివ్, ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులు సైతం అందిస్తోంది. యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలను క్లాట్(యూజీ,పీజీ) ద్వారా చేపడతారు. మిగిలిన కోర్సుల్లో సొంత ప్రవేశ విధానాన్ని అనుసరిస్తున్నారు.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.nujs.edu నేషనల్ లా యూనివర్సిటీ, జో«ద్‌పూర్
ఈ లా యూనివర్సిటీ 2001లో ఏర్పాటైంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో నిలిచింది. బీబీఏ ఎల్ఎల్బీ(హానర్స్), బీఏ ఎల్ఎల్బీ(హానర్స్) రెండు కోర్సుల్లో కలిపి 100 సీట్లున్నాయి. దీంతోపాటు కార్పొరేట్ లాస్, ఐపీఆర్ అండ్ టెక్నాలజీ లా స్పెషలైజేషన్లతో ఏడాది వ్యవధి గల ఎల్ఎల్ఎం కోర్సును అందిస్తోంది. వీటితోపాటు ఎంబీఏ ఇన్సూరెన్స్ కోర్సును ఆఫర్చేస్తోంది. ఎంబీఏ మినహా మిగిలిన కోర్సుల్లో క్లాట్(యూజీ, పీజీ) ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.nlujodhpur.ac.in సింబియాసిస్ లా స్కూల్, పుణె
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానం దక్కించుకుంది.. సింబియాసిస్ లా స్కూల్. ఇది ఐదేళ్ల బీఏ,ఎల్ఎల్బీ, బీబీఏ,ఎల్ఎల్బీ, మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సులు అందిస్తోంది. వీటిలో సింబియాసిస్ లా అడ్మిషన్ టెస్టు(స్లాట్) ద్వారా ప్రవేశం లభిస్తుంది. అదేవిధంగా ఒక ఏడాది వ్యవధి గల ఎల్ఎల్ఎం కోర్సును ఈ లా స్కూల్ అందిస్తోంది. ఆలిండియా అడ్మిషన్ టెస్టు(ఏఐఏటీ) ద్వారా ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఎల్ఎల్ఎంలో బిజినెస్ అండ్ కార్పొరేట్ లా, కాన్స్టిట్యూషనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా, ఇన్నోవేషన్, టెక్నాలజీ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, క్రిమినల్ అండ్ సెక్యూరిటీ లా, హ్యూమన్ రైట్స్ లా, ఫ్యామిలీ లా, యూరోపియన్ యూనియన్ లీగల్ స్టడీస్, లా, పాలసీ అండ్ గుడ్ గవర్నెన్స్ స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ లా స్కూల్ డిప్లొమా, పీహెచ్డీ కోర్సులను సైతం అందిస్తోంది. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.symlaw.ac.in జామియా మిల్లియా ఇస్లామియా, ఢిల్లీ
ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచింది.. జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ. వర్సిటీలో బీఏ ఎల్ఎల్బీ హానర్స్/బీఎ ఎల్ఎల్బీ (సెల్ఫ్ ఫైనాన్స్డ్), ఎల్ఎల్ఎం, ఎల్ఎల్ఎం ఎగ్జిక్యూటివ్ (సెల్ఫ్ ఫైనాన్స్డ్), ఎంఫిల్/ పీహెచ్డీ(లా), పీజీ డిప్లొమా ఇన్ లేబర్ లా, పీజీ డిప్లొమా ఇన్ ఎయిర్ స్పేస్ లా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు వర్సిటీ సొంత విధానాలను అనుసరిస్తోంది. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.jmi.ac.in గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ, గాంధీనగర్
ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానం దక్కించుకుంది… గుజ రాత్ నేషనల్ లా యూనివర్సిటీ. ఈ వర్సిటీలో ఐదేళ్ల వ్యవధితో బీఏ/బీకాం/ బీబీఏ/ బీఎస్సీ /బీఎస్‌డబ్ల్యూ ఎల్ఎల్బీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ఏడాది వ్యవధితో ఎల్ఎల్ఎం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ లాస్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ కోర్సును అందిస్తోంది. ఈ లా వర్సిటీలో పీహెచ్డీ ప్రోగ్రామ్ సైతం అందుబాటులో ఉంది. యూజీ, పీజీ కోర్సుల సీట్లను క్లాట్ ద్వారా భర్తీ చేస్తారు. పూర్తి వివరాలకు వెబ్సైట్: https://gnlu.ac.in రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా, పాటియాల
ఈ యూనివర్సిటీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో నిలిచింది. ఐదేళ్ల బీఏ ఎల్ఎల్బీ, ఏడాది వ్యవధితో ఎల్ఎల్ఎం కోర్సును అందిస్తోంది. క్లాట్ ద్వారా వీటిలో ప్రవేశాలను ఖరారు చేస్తారు. పీహెచ్డీ ప్రవేశాలకు వర్సిటీ సొంతంగా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.rgnul.ac.in ఇతర ఇన్స్టిట్యూట్లు..
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో భోపాల్‌లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ 11వ ర్యాంకు, భువనేశ్వర్‌లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ 12వ ర్యాంకు, న్యూఢిల్లీలోని ఇండియన్ లా ఇన్స్టిట్యూట్ 13వ ర్యాంకు, లక్నోలోని డా.రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ 14వ ర్యాంకు, విశాఖపట్నంలోని డా.బి. ఆర్.అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా 15వ ర్యాంకును దక్కించుకున్నాయి. అర్హతలు..
ఏదైనా గ్రూపుతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీ ర్ణులైన విద్యార్థులు క్లాట్–యూజీకి దరఖాస్తు చేసుకో వచ్చు. క్లాట్‌లో ప్రతిభ చూపడం ద్వారా క్లాట్ పార్టిసిపే టింగ్ ఇన్స్టిట్యూట్స్ అందించే ఇంటిగ్రేటెడ్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఎల్ఎల్బీ డిగ్రీ లేదా తత్సమాన అర్హతతో క్లాట్–పీజీకి హాజరవ్వొచ్చు. ఇందులో సాధించిన ర్యాంకు ఆధా రంగా క్లాట్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు దక్కించుకోవచ్చు. ఉపాధి వేదికలు
జాబ్ ప్రొఫైల్స్
టాప్ రిక్రూటర్స్
ఆలోచన మారాలి.. |
You must log in to post a comment.