అబ్బాయి ఏం చదువుతున్నాడు…? ఇంటర్ అయిపోతోంది… తర్వాత ఏమి చదువుతాడో వాడిష్టం..! ఇంతకీ ఇంటర్లో ఏ గ్రూపు మీ వాడిది..?! మా వాడికి సైన్స్ అంటే ఇష్టం లేదు… అందుకే సీఈసీలో చేర్పించాం..అబ్బే సీఈసీ చదివిన వాళ్లకు ఒకటీ రెండు కోర్సులు తప్ప ఇంకేమున్నాయి…
|
![]() పైగా ఉద్యోగావకాశాలు కూడా తక్కువే…అందుకే మా అమ్మాయిని బలవంతంగా బైపీసీలో చేర్పించా…! ఇదీ ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య సంభాషణ..! వాస్తవానికి సీఈసీతో ఉన్నత విద్య, ఉపాధి మార్గాలు అనేకం!! ఈ నేపథ్యంలో.. ఇంటర్ సీఈసీ తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులపై ప్రత్యేక కథనం…
బీకామ్..సీఈసీ అనగానే గుర్తొచ్చే డిగ్రీ కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్(బీకామ్). ఇందులో ప్రాథమిక వ్యాపార సూత్రాలు, అకౌంటింగ్, ఫైనాన్స్, వ్యాపార నిర్వహణ, మానవ వనరులు, మార్కెటింగ్, ఎకనామిక్స్ అంశాలను బోధిస్తారు. బీకామ్లోనూ జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, బ్యాంకింగ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, మార్కెటింగ్, లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ వంటి జాబ్ మార్కెట్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్ స్పెషలైజేషన్లు దాదాపు అన్ని డిగ్రీ కళాశాలలు అందిస్తున్నాయి. ఇంటర్ మార్కుల ఆధారంగా బీకామ్‌లో ప్రవేశం పొందొచ్చు.
బీబీఏ..
ఇంటర్ సీఈసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో డిగ్రీ స్థాయి కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ). ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. ఇది వ్యాపార నిర్వహణ, నాయకత్వ నైపుణ్యాలపై శిక్షణ, విజ్ఞానాలను అందిస్తుంది. విద్యార్థులు ఈ కోర్సులో తరగతులు, ప్రాక్టికల్ సెషన్లు, ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్న్‌షిప్ ద్వారా వ్యాపార నిర్వహణపై పట్టుసాధిస్తారు. ఈ కోర్సును రెగ్యులర్, డిస్టెన్స్ విధానంలోనూ పూర్తి చేయొచ్చు. బీబీఏలో ఎంట్రపెన్యూర్షిప్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫైనాన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా పలు బిజినెస్ స్కూల్స్, ఇన్స్టిట్యూట్లు బీబీఏ కోర్సును అందిస్తున్నాయి. కామర్స్ విద్యార్థులతోపాటు ఆర్ట్స్, సైన్స్ విద్యార్థులు సైతం ఈ కోర్సులో చేరవచ్చు. చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ)..కామర్స్ ప్రొఫెషనల్ కోర్సుల్లో చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ) ముందు వరుసలో నిలుస్తుంది. ఇంటర్ సీఈసీ/ఎంఈసీ కోర్సులు విద్యార్థులకు ఈ కోర్సు అనుకూలమైనదనే అభిప్రాయముంది. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల విద్యార్థులు సైతం సీఏలో చేరవచ్చు. సీఏ కోర్సును ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) నిర్వహిస్తోంది. ఇంటర్ తర్వాత నాలుగున్నర సంవత్సరాల్లో ఈ కోర్సును పూర్తి చేయొచ్చు.
మూడు దశలు: సీఏలో ఫౌండేషన్(ఆరు నెలలు); ఇంటర్ (ఎనిమిది నెలలు); ఫైనల్ (మూడేళ్లు–ప్రాక్టికల్ శిక్షణతో కలిపి) దశలు ఉంటాయి. పరీక్షలు ఏటా మే, నవంబర్ నెలలో జరుగుతాయి. ఫౌండేషన్ ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్+డిస్క్రిప్టివ్; ఇంటర్, ఫైనల్ ప్రశ్నపత్రాలు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. సీఏ ఫౌండేషన్… సీఏ ఇంటర్…
సీఏ–ఇంటర్మీడియెట్‌లో గ్రూప్–1లో నాలుగు పేపర్లు, గ్రూప్–2లో నాలుగు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు. ఒక్కో పేపర్‌కు మూడు గంటల సమయం అందుబాటులో ఉంటుంది. గ్రూప్–1లో అకౌంటింగ్; కార్పొరేట్ చట్టాలు, ఇతర చట్టాలు; కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్; ట్యాక్సేషన్(ఇన్కమ్ ట్యాక్స్, ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్) ఉంటాయి. గ్రూప్–2లో అడ్వాన్స్డ్ అకౌంటింగ్, ఆడిటింగ్ అండ్ అస్యూరెన్స్; ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్; ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ సబ్జెక్టులు ఉంటాయి. సీఏ ఫైనల్… బీఏ ఎల్ఎల్బీ….
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ లా కోర్సు… బీఏ ఎల్ఎల్బీ. ఈ కోర్సులో ఫ్యామిలీ లా, ఇంటర్నేషనల్ లా, కాన్స్టిట్యూషనల్ లా తదితర న్యాయశాస్త్ర అంశాలతోపాటు సోషియాలజీ, ఫిలాసఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ వంటి ఆర్ట్స్ సబ్జెక్టులను సైతం బోధిస్తారు. కోర్సులో థియరీతోపాటు మూట్ కోర్ట్స్, కేస్ స్టడీస్, రీసెర్చ్ వర్క్, లా ఇంటర్న్షిప్స్ వంటి ప్రాక్టికల్ వర్క్ కూడా ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. క్లాట్, లాసెట్, ఏఐఎల్ఈటీ, టీఎస్‌లాసెట్, ఏపీ లాసెట్‌లకు హాజరవడం ద్వారా విద్యార్థులు బీఏ ఎల్ఎల్బీ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ముఖ్యంగా నేషనల్ లా యూనివర్సిటీలు అందించే బీఏ ఎల్ఎల్బీ కోర్సుకు మంచి గుర్తింపు ఉంది. జాబ్ ప్రొఫైల్స్: అడ్వకేట్, పారాలీగల్, ప్రైవేట్ ప్రాక్టీస్, లీగల్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ లాయర్, లా ఆఫీసర్, లా అసోసియేట్, స్టేట్ ప్రాసిక్యూటర్. వేతనాలు: కోర్సు అనంతరం సగటు వార్షిక వేతనం రూ.3 నుంచి రూ.6 లక్షలు ఉంటుంది. కంపెనీ సెక్రటరీ (సీఎస్)…
కంపెనీ నిర్వహణా నైపుణ్యాలనందించే కోర్సు… కంపెనీ సెక్రటరీ (సీఎస్). సీఎస్ కోర్సు పూర్తిచేసి.. ఐసీఎస్ఐ అసోసియేట్ మెంబర్షిప్ పొందిన అభ్యర్థులకు కార్పొరేట్ సంస్థల్లో కంపెనీ సెక్రటరీ, అసోసియేట్ కంపెనీ సెక్రటరీ, కంప్లయన్స్ ఆఫీసర్ హోదాలతో కొలువులు లభిస్తాయి. దీంతోపాటు కంపెనీ సెక్రటరీగా స్వయం ఉపాధి పొందొచ్చు. మూడు దశలు….
కంపెనీ సెక్రటరీ కోర్సులో మూడు దశలు ఉంటాయి. అవి.. ఫౌండేషన్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. ఇంటర్/తత్సమాన అర్హతతో ఫౌండేషన్ కోర్సులో ప్రవేశించొచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులు నేరుగా ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందవచ్చు. ఫౌండేషన్ ప్రోగ్రామ్…
ఇందులో బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ లా; బిజినెస్ మేనేజ్మెంట్, ఎథిక్స్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్; బిజినెస్ ఎకనామిక్స్; ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ పేపర్లు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్….ఇది మొత్తం 8 పేపర్లు.. రెండు మాడ్యూల్స్‌గా ఉంటుంది. మాడ్యూల్ 1లో.. జ్యూరిస్ప్రుడెన్స్, ఇంటర్‌ప్రిటేషన్ జనరల్ లాస్; కంపెనీ లా; సెట్టింగ్ అప్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్ అండ్ క్లోజర్; ట్యాక్స్ లాస్ పేపర్లు ఉంటాయి. మాడ్యూల్ 2లో.. కార్పొరేట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్; సెక్యూరిటీస్ లాస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్; ఎకనామిక్, బిజినెస్ అండ్ కమర్షియల్ లాస్, ఫైనాన్షియల్ అండ్ స్ట్రాటజిక్æ మేనేజ్మెంట్ పేపర్లు ఉంటాయి.
ప్రొఫెషనల్ ప్రోగ్రామ్….
ఇది 3 మాడ్యూల్స్.. 9 పేపర్లుగా ఉంటుంది. మాడ్యూల్ 1లో.. గవర్నెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, కాంప్లియన్స్ అండ్ ఎథిక్స్; అడ్వాన్స్డ్ ట్యాక్స్‌లాస్; డ్రాఫ్టింగ్, ప్లీడింగ్స్ అండ్ అప్పీరియెన్సెస్ పేపర్లు, మాడ్యూల్ 2లో.. సెక్రటరియల్ ఆడిట్; కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్, రిజల్యూషన్ ఆఫ్ కార్పొరేట్ డిస్ప్యూట్స్ పేపర్లు, మాడ్యూల్ 3లో.. కార్పొరేట్ ఫండింగ్ అండ్ లిస్టింగ్ ఇన్ స్టాక్ ఎక్స్ఛేంజెస్; మల్టీడిసిప్లినరీ కేస్ స్టడీస్, ఎలక్టివ్ సబ్జెక్ట్ పేపర్లు ఉంటాయి. ప్రాక్టికల్ ట్రైనింగ్…. సీఎస్ కోర్సు పూర్తిచేసే క్రమంలో విద్యార్థులు కేవలం రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా.. తప్పనిసరిగా అప్రెంటీస్‌షిప్ పేరుతో ఉండే ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ అప్రెంటీస్‌షిప్ గరిష్ట వ్యవధి మూడేళ్లు. అభ్యర్థులు సీఎస్ కోర్సు ఏ దశలో చేరారో దానికి అనుగుణంగా ఈ వ్యవధిలో మార్పు ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్సైట్: www.icsi.edu బీఏ ఎకనామిక్స్..సీఈసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కోర్సుల్లో ప్రముఖమైనది.. బీఏ ఎకనామిక్స్. ఈ కోర్సులో ఎకనామిక్స్, మేనేజ్మెంట్ విభాగాల్లో తాజా పరిణామాలు, పద్ధతులపై బోధన సాగుతుంది. ఆర్థిక అంశాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ కోర్సులో చేరడం లాభిస్తుంది. ఇంటర్లో కామర్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులను చదివిన విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు.
జాబ్ ప్రొఫైల్స్: స్టాటిస్టీషియన్, డేటా అనలిస్టు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, సర్వీస్ క్వాలిటీ లీడర్, స్టాటిస్టికల్ అసిస్టెంట్, కరిక్యులం డెవలపర్, లీడ్ మాడ్యులర్. వేతనాలు: కోర్సు అనంతరం రూ.2.80 నుంచి రూ. 3.60 లక్షల వార్షిక వేతనంతో ఆఫర్స్ అందుకోవచ్చు. సీఎంఏ..
ప్రొఫెషనల్ కోర్సుల్లో చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) తర్వాత ఎక్కువగా వినిపించే కోర్సు.. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ(సీఎంఏ). ఇటీవల కాలంలో సీఎంఏ కోర్సు పూర్తిచేసిన వారికి ఆకర్షణీయ వేతన ప్యాకేజీలతో ఉన్నత కొలువులు లభిస్తున్నాయి. విస్తృతమవుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సీఎంఏలకు డిమాండ్ పెరుగుతోంది. సీఎంఏ కోర్సును ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తోంది. పదో తరగతి తర్వాత నాలుగేళ్లలో, ఇంటర్ ఎంఈసీ గ్రూపు విద్యారులు రెండేళ్లలో, ఇతర గ్రూపు విద్యార్థులు రెండున్నరేళ్లలో కోర్సును పూర్తి చేయొచ్చు. డిగ్రీ/ఇంజనీరింగ్ తర్వాత రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయొచ్చు. బీటెక్ పూర్తిచేసిన వారు నేరుగా సీఎంఏ రెండో దశ ఎగ్జిక్యూటివ్ కోర్సు చదవొచ్చు. బీటెక్, సీఎంఏ చదివిన వారు తక్కువ మంది ఉంటారు. కాబట్టి ప్రాంగణ నియామకాల్లో వీరికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. దశలు: సీఎంఏ కోర్సులో మూడు దశలు ఉంటాయి. అవి.. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్. ఫౌండేషన్…ఫౌండేషన్ కోర్సులో ఎనిమిది సబ్జెక్టులను నాలుగు పేపర్లుగా విభజించారు. ప్రతి పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు. ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే.. మొత్తంమీద కనీసం 50 శాతం మార్కులు, ప్రతి పేపర్లోనూ కనీసం 40 శాతం మార్కులు రావాలి. పరీక్షను ఏటా జూన్, డిసెంబర్లో రెండుసార్లు నిర్వహిస్తారు.
సీఎంఏ ఇంటర్ (ఎగ్జిక్యూటివ్)…
సీఎంఏ ఫౌండేషన్‌ను పూర్తిచేసిన వారు సీఎంఏ ఇంటర్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఏడాది తర్వాత పరీక్ష రాసేందుకు అర్హులు. ఏటా జూన్, డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలో రెండు గ్రూపులుంటాయి. గ్రూప్–1లో ఫైనాన్షియల్ అకౌంటింగ్, లాస్ అండ్ ఎథిక్స్, డైరెక్ట్ ట్యాక్సేషన్, కాస్ట్ అకౌంటింగ్ పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు. మొత్తంమీద 50 శాతం, ఒక్కో పేపర్లో 40 శాతం మార్కులు సాధించినవారు ఉత్తీర్ణులవుతారు. గ్రూప్–2లో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్; కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్; ఇన్‌డైరెక్ట్ ట్యాక్సేషన్; కంపెనీ అకౌంట్స్ అండ్ ఆడిట్ పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు. మొత్తంమీద 50 శాతం, ఒక్కో పేపర్లో 40 శాతం మార్కులు సాధించినవారు ఉత్తీర్ణులవుతారు. వీలునుబట్టి రెండు గ్రూపులను ఒకేసారి లేదా విడివిడిగా ఆరు నెలల వ్యవధిలో రాయొచ్చు. సీఎంఏ ఫైనల్..ఆరు నెలల ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఫైనల్ పరీక్ష రాసేందుకు అర్హులు. ఫైనల్లో రెండు గ్రూపులు (గ్రూప్–3, గ్రూప్–4) ఉంటాయి. వీలునుబట్టి రెండు గ్రూపులను ఒకేసారి లేదా విడివిడిగా ఆరు నెలల వ్యవధిలో రాయొచ్చు. ఏటా జూన్, డిసెంబర్లో ఫైనల్ పరీక్షలు జరుగుతాయి.
గ్రూప్–3లో కార్పొరేట్ లాస్ అండ్ కంప్లయిన్స్; స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్; స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్–డెసిషన్ మేకింగ్; డైరెక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి. గ్రూప్–4లో కార్పొరేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్; ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ప్రాక్టీస్; కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్; స్ట్రాటజిక్ పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ వాల్యూయేషన్ పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి. సీఎంఏ ఫైనల్ తర్వాత ఇన్స్టిట్యూట్ నిర్వహించే కంప్యూటర్ శిక్షణను పూర్తిచేసుకున్న వారిని అర్హత పొందిన కాస్ట్ అకౌంటెంట్లుగా పరిగణిస్తారు. సీఎంఏ ఫైనల్ తర్వాత ఉద్యోగంలో చేరొచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేయాలనుకుంటే మాత్రం అదనంగా రెండున్నరేళ్ల ప్రాక్టికల్ శిక్షణ తీసుకోవాలి. ఈ ప్రాక్టికల్ శిక్షణ పూర్తిచేసిన వారికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా.. సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్(సీవోపీ) అందజేస్తుంది. పూర్తి వివరాల కోసం వెబ్సైట్: www.icmai.in బీబీఏ ఎల్ఎల్బీ..బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్–బ్యాచిలర్ ఆఫ్ లా (బీబీఏ ఎల్ఎల్బీ)… ఇది ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. ముఖ్యంగా పలు నేషనల్ లా యూనివర్సిటీలు అందించే బీబీఏ ఎల్ఎల్బీ కోర్సుకు మంచి గుర్తింపు ఉంది. క్లాట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఈ కోర్సులో భాగంగా కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌తోపాటు లా, లెజిస్లేటివ్ అంశాలపై బోధన సాగుతుంది. ప్రస్తుత కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా అభ్యర్థులను కార్పొరేట్ లాస్, రెగ్యులేటరీ అఫైర్స్‌లో సుశిక్షితులుగా తీర్చిదిద్దేందుకు ఈ కోర్సుకు రూపకల్పన చేశారు. ఈ కోర్సు కరిక్యులంలో మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఎన్విరాన్మెంట్ లా, కార్పొరేట్ లా తదితర అంశాలు ఉంటాయి. ఇతరులతో మాట్లాడేందుకు చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రదర్శించే వారు ఈ కోర్సులో చేరడం లాభిస్తుంది. జాబ్ ప్రొఫైల్స్: బిజినెస్ కన్సల్టెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, కార్పొరేట్ లాయర్, మేనేజ్మెంట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, ఫైనాన్స్ మేనేజర్, డిప్యూటీ లీగల్ అడ్వైజర్, లా రిపోర్టర్, లీగల్ అడ్వైజర్, డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్. వేతనాలు: కోర్సు పూర్తి చేసిన వారికి రూ. 3.2 నుంచి 4.5 లక్షల వార్షిక వేతనంతో కొలువులు దక్కుతున్నాయి. ఐసీఎస్ఐ ఈ లెర్నింగ్…
ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ)… కరోనా కారణంగా మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు ఈ లెర్నింగ్‌కు పాధాన్యం ఇస్తున్నట్లు తెలిపింది. ఆ దిశగా విద్యార్థులకు ఉపయోగపడేలా ఆన్లైన్ షార్ట్ టర్మ్ కోర్సులు, వీడియో లెక్చర్స్, మాక్ టెస్టులు నిర్వహిస్తోంది. ఐసీఎస్ఐ క్లాస్ రూం టీచింగ్‌కు నమోదు చేసుకున్న విద్యార్థుల కోసం ఉచిత ఆన్లైన్ కోర్సులను అందిస్తోంది. విద్యార్థులు ఉచిత వీడియో లెక్చర్స్‌ను https://elearning.icsi.in లో చూడొచ్చు. దీంతోపాటు ఇన్స్టిట్యూట్ సభ్యుల కోసం పలు ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులను, వెబినార్స్‌ను అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://www.icsi.edu |
google.com, pub-9453835310745500, DIRECT, f08c47fec0942fa0
You must log in to post a comment.