ఐఐటీల్లో ఎంటెక్ సీటు కావాలంటే సీఓఏపీలో నమోదు కావాల్సిందే!
గేట్లో మంచి పర్సంటైల్ వచ్చిందా.. ఐఐటీల్లో ఎంటెక్ చేయాలనుకుంటున్నారా.. ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువు వైపు మనసు లాగుతోందా.. అయితే మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంటెక్ సీటు, లేదా ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లో కొలువు దక్కాలంటే.. కామన్ ఆఫర్ యాక్సప్టెన్స్ పోర్టల్ (సీఓఏపీ)లో నమోదు చేసుకోవాల్సిందే!! కరోనా లాక్డౌన్ కారణంగా తాజాగా సీఓఏపీ షెడ్యూల్లో మార్పులు జరిగాయి.
|
ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా సీఓఏపీ పోర్టల్‌లో దరఖాస్తు విధానం, అర్హతలు, ప్రయోజనాలపై ప్రత్యేక కథనం..
ఐఐటీల్లో ఎంటెక్ ప్రవేశాలకు గేట్ స్కోరు ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక్కో ఐఐటీకి వేర్వేరుగా దరఖాస్తు చేసుకునే క్రమంలో విద్యార్థులు తమ ప్రాథమ్యాల పరంగా రాజీ పడే ఆస్కారం ఉంది. ఈ క్రమంలోనే కామన్ ఆఫర్ యక్సప్టెన్స్ పోర్టల్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం 21 ఇన్స్టిట్యూట్లు, ఒక పీఎస్‌యూ సీఓఏపీలో భాగస్వాములుగా ఉన్నాయి.
ఐఐటీలన్నీ…
ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ ఐఎస్ఎం ధాన్బాద్, ఐఐటీ భిలాయ్, భువనేశ్వర్, బాంబే, ఢిల్లీ, గోవా, గువహటి, హైదరాబాద్, ఇండోర్, జో«ద్ఫూర్, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, మండి, పాలక్కడ్, పాట్నా, రూర్కీ, రోపార్, తిరుపతిలతోపాటు పీఎస్‌యూ ఎన్పీసీఐఎల్.. సీఓఏపీలో భాగస్వామ్య ఇన్స్టిట్యూట్లుగా ఉన్నాయి. ప్రత్యేకతలు…
సీఓఏపీ–2020 అర్హతలు
గేట్ 2018, 2019, 2020లల్లో అర్హత సాధించిన అభ్యర్థులు సీఓఏపీలో నమోదు చేసుకోవచ్చు. వీరు సీఓఏపీ ప్రక్రియలో పాల్గొంటున్న ఇన్స్టిట్యూట్లో ఎంటెక్‌లో కాని లేదా పీఎస్యూలో జాబ్ కోసం కాని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్…
అభ్యర్థులు సీఓఏపీ రిజిస్ట్రేషన్ కోసం కింది వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. అవి..» పేరు, గేట్ రిజిస్ట్రేషన్ నంబర్ » వ్యాలిడ్ గేట్ స్కోరు, పుట్టిన తేదీ » ఇ–మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ » గేట్ పేపర్ కోడ్. రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకున్న అభ్యర్థులు సీఓఏపీ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్, పీఎస్‌యూ ఆఫర్స్‌కు సంబంధించిన వివరాలను పొందేందుకు అర్హులు. ఇన్స్టిట్యూట్లు, పీఎస్‌యూలు సీఓఏపీ రిజిస్ట్రేషన్ నంబర్‌తో ట్యాగ్ చేసి ఆఫర్స్‌ను అందిస్తాయి. రౌండ్లు– తేదీలు
కింది టైమ్ విండో రౌండ్లలో.. అభ్యర్థులు అందుబాటులో ఉన్న ఆఫర్లు చూసుకోవడంతోపాటు, ఏ ఇన్స్టిట్యూట్లో, ఏ ప్రోగ్రామ్‌లో చేరాలో నిర్ణయం తీసుకునే అవకాశం లభిస్తుంది. మెయిన్ రౌండ్లు
రౌండ్ 1 నుంచి రౌండ్ 4 వరకు అభ్యర్థులు ఆఫర్‌కు సంబంధించి యాక్సెప్ట్ అండ్ ఫ్రీజ్, రిటైన్ అండ్ వెయిట్, రిజెక్ట్ అండ్ వెయిట్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అయితే రిటైన్ అండ్ వెయిట్ ఆప్షన్‌ను రెండుసార్లు మాత్రమే వినియోగించుకోగలరు. రౌండ్ 5 నిర్ణయాత్మక రౌండ్‌గా ఉంటుంది. ఇందులో అభ్యర్థులకు యాక్సెప్ట్ అండ్ ఫ్రీజ్ లేదా రిజెక్ట్ ఆప్షన్‌ను మాత్రమే వినియోగించే అవకాశం ఉంటుంది.
అదనపు రౌండ్లు
సీఓఏపీ ఎఫ్‌ఏక్యూస్ |
You must log in to post a comment.