ఇంటర్‌తోనే ఐటీ కొలువు కావాలంటే ఈ కోర్సులో చేరాల్సిందే..!

ఇంటర్ పూర్తయిందా.. వెంటనే ఐటీ కొలువులో చేరాలనుందా.. అదే సమయంలో ఉన్నతవిద్యకు కూడా వెళ్లాలనుందా..?! అందుకు అనువైన కోర్సు.. హెచ్‌సీఎల్ అందిస్తున్న టెక్బీ ఎర్లీ కెరియర్ ప్రోగ్రామ్. హెచ్‌సీఎల్ టెక్బీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
Career guidanceఈ నేపథ్యంలో.. సదరు కోర్సు ప్రత్యేకత, దరఖాస్తుకు అవసరమైన అర్హతలు, ఎంపిక ప్ర్రక్రియ గురించి తెలుసుకుందాం…
హెచ్‌సీఎల్ టెక్బీ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్.. ఇంటర్ పూర్తయిన వెంటనే ఉద్యోగంలో చేరాలనుకునే అభ్యర్థుల కోసం రూపకల్పన చేసిన ప్రోగ్రామ్ ఇది. దీనికి ఎంపికైన అభ్యర్థులకు హెచ్‌సీఎల్‌లో ఎంట్రీ లెవల్ ఐటీ జాబ్‌కు సరితూగేలా 12 నెలల శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత హెచ్‌సీఎల్‌లో పూర్తి స్థాయి ఉద్యోగిగా పనిచేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో ఉద్యోగం చేస్తూనే బిట్స్–పిలానీ, లేదా సస్త్ర యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించొచ్చు. టెక్బీ ప్రోగ్రామ్‌కు ఎంపికైన విద్యార్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.10,000 స్టైపెండ్ చెల్లిస్తారు. అనంతరం పూర్తి స్థాయి ఉద్యోగిగా చేరాక రూ.2–2.20 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది.
శిక్షణ..
 • హెచ్‌సీఎల్ టెక్బీ ప్రోగ్రామ్ అభ్యర్థులను హెచ్‌సీఎల్ ప్రాజెక్టులపై పనిచేసేందుకు సన్నద్ధులను చేస్తుంది.
 • శిక్షణలో భాగంగా ఒక ప్రొఫెషనల్ ఐటీ ఉద్యోగిగా మారేందుకు అవసరమైన ఐటీ ఫండమెంటల్స్‌ను బోధిస్తారు.
 • అభ్యర్థులకు కంపెనీ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాక్సెస్ లభిస్తుంది. ఇందులో కంపెనీ విధులకు సంబంధించిన చర్చలు, ఆన్లైన్ అసెస్మెంట్లు, అసైన్మెంట్స్, కేస్ బేస్డ్ సబ్మిషన్స్ ఉంటాయి.
 • అభ్యర్థులకు టెక్నాలజీ సర్వీసెస్‌కు సంబంధించిన ఐటీ సర్టిఫికెట్ పొందవచ్చు.

ఉద్యోగ వివరాలు..

 • శిక్షణను పూర్తి చేసకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్ సంస్థలో ఉద్యోగిగా అవకాశం కల్పిస్తారు.
 • ఆఫర్ అందుకున్నవారు అప్లికేషన్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సపోర్ట్, డిజైన్ ఇంజనీర్ విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
 • హెచ్‌సీఎల్ హెల్త్‌కేర్ బెనిఫిట్స్, మెడికల్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్, హెల్త్ చెకప్స్ తదితర సౌకర్యాలు లభిస్తాయి.

అర్హత..

 • 2019లో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.
 • అలాగే 2020లో ఇంటర్ పూర్తి చేసుకోనున్న/ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
 • అభ్యర్థి ఇంటర్లో మ్యాథమెటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ను చదివుండాలి.

ఫీజు…

 • ప్రోగ్రామ్ ఫీజు ట్యాక్స్‌లతో కలిపి రూ.2.20 లక్షల వరకు ఉంటుంది.
 • అభ్యర్థులకు బ్యాంకు రుణ సదుపాయం కల్పిస్తారు.
 • శిక్షణ సమయంలో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు పొందిన వారికి 100 శాతం ఫీజు మాఫీ చేస్తారు. అలాగే 85–90 శాతం మార్కులు పొందిన వారికి 50 శాతం ఫీజు మాఫీ చేస్తారు.
 • దరఖాస్తులకు చివరి తేది: 30 జూన్ 2020
 • పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.hcltechbee.com
%d bloggers like this:
Available for Amazon Prime