అగ్రికల్చర్ కోర్సులు

 

బంగారు భవితకు అగ్రి కోర్సులు..!

 

కోర్సులందు.. వ్యవసాయ కోర్సులు వేరయా..! అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..! ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) నుంచి బీటీ (బయోటెక్నాలజీ) వరకూ.. మన భవితకు భరోసా ఇచ్చే కోర్సులు అనేకం! కానీ, ఆహార భద్రతకు కృషిచేస్తూ బ్రతుకులు నిలిపే కోర్సులు కొన్నే.. అవే వ్యవసాయ, అనుబంధ కోర్సులు!!

 

ఇంటర్ బైపీసీ అర్హతతో విద్యార్థులు పలు వ్యవసాయ అనుబంధ కోర్సుల్లో చేరొచ్చు. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, ఫారెస్ట్రీ, ఫిషరీస్.. ఇలా వివిధ కోర్సులు.. అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు.. వాటి ప్రవేశ విధానాలు.. కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం…
బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్
వ్యవసాయ పద్ధతులు, ఫుడ్ ప్రాసెసింగ్లో వినియోగించే సాంకేతిక విధానాల గురించి అధ్యయనం చేసే కోర్సు… బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. ఇది నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ఎంతో కీలకమైనది. కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత కల్పించడం.. దేశ జనాభాకు సరిపడా ఆహార పంటలను పండించడం సవాళ్లతో కూడిన వ్యవహారం. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ద్వారా పంటల ఉత్పత్తిని పెంచి ఆహార సమృద్ధిని సాధించొచ్చు.
అర్హతలు
పీసీబీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)/ పీసీఎంబీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ) సబ్జెక్టులతో ఇంటర్/10+2 ఉత్తీర్ణులై ఉండాలి. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో డిప్లొమా చేసిన విద్యార్థులు 15 శాతం సూపర్ న్యూమరరీ సీట్లలో ప్రవేశాలు పొందవచ్చు.
ప్రవేశ విధానాలు
ఎంసెట్: తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఏపీలో బాపట్ల, మడకశిర–అనంతపురం; తెలంగాణలో సంగారెడ్డి జిల్లా కందిలో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి.
ఐకార్ ఏఐఈఈఏ
ఎన్టీఏ నిర్వహించే ఐకార్–ఏఐఈఈ (యూజీ)కు హాజరై ఆలిండియా కోటా సీట్లకు పోటీ పడవచ్చు.
ఉన్నత విద్య
ఉన్నత విద్య పరంగా ఎంటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో చేరొచ్చు. అనంతరం పీహెచ్డీ చేసే అవకాశం ఉంది. ఇందిరాగాంధీ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు పీహెచ్డీలో అడ్మిషన్స్ కోసం ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నాయి.
టాప్ ఇన్స్టిట్యూట్లు
  • ఇందిరాగాంధీ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, రాయ్పూర్.
  • కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, భువనేశ్వర్.
  • తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ, కొయంబత్తూర్.
ఉపాధి వేదికలు
» ఆగ్రో–బిజినెస్ సంస్థలు » ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు » అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ కేంద్రాల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
బీఎస్సీ అగ్రికల్చర్
వ్యవసాయ కోర్సుల్లో ప్రముఖంగా నిలుస్తోంది.. బీఎస్సీ అగ్రికల్చర్. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఇందులో చేరిన విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరికరాలు, మెళకువలను ఉపయోగించి వ్యవసాయాభివృద్ధిని సాధించడం ఎలాగో నేర్చుకుంటారు. దీంతోపాటు జల వనరుల నిర్వహణ, ల్యాండ్ సర్వేయింగ్, సాయిల్ సైన్సెస్, పౌల్ట్రీ నిర్వహణ తదితరాలపై పట్టు సాధిస్తారు. పీసీబీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ /పీసీఎంబీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ)/పీసీఎం (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్)/అగ్రికల్చర్ సబ్జెక్టులతో ఇంటర్/10+2 ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కోర్సులో ప్రవేశానికి అర్హులు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్).. ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఈఈ)–యూజీకి హాజరవడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో ఆలిండియా కోటా సీట్లకు పోటీ పడవచ్చు.
ఇన్స్టిట్యూట్లు…
తెలంగాణలో రాజేంద్రనగర్, అశ్వారావుపేట, పొలజ (జగిత్యాల), నాగర్ కర్నూల్, సిరిసిల్లల్లో అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య దాదాపు నాలుగు వందలు. ఆంధ్రప్రదేశ్లో బాపట్ల, తిరుపతి, నైరా(శ్రీకాకుళం), మహానంది, రాజమండ్రిలలో ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి. వీటిలో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 560. వీటితోపాటు ఎచ్చెర్ల, కేసీ పురం (ప్రకాశం), మార్కాపురం, బద్వేల్, అనంతపురం, తాడిపత్రిలో అనుబంధ కళాశాలలు ఉన్నాయి. వీటిలో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య దాదాపు నాలుగు వందలు.
ఉపాధి అవకాశాలు…
ప్రైవేటు రంగంలో విత్తన ఉత్పాదక సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్లో అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ విభాగంలో వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కొలువులు లభిస్తాయి. వీటితోపాటు రూరల్ బ్యాంకింగ్ విభాగంలో ఉద్యోగాలు దక్కించుకోవచ్చు.
పూర్తి వివరాలకు వెబ్సైట్లుwww.angrau,ac.inwww.pjtsau.edu.in
బీఎస్సీ అగ్రిక్చరల్ బయోటెక్నాలజీ
ఇది నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు. ఇందులో టిష్యూ కల్చర్, జెనెటిక్ ఇంజనీరింగ్, మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్పై బోధన, ప్రాక్టికల్ శిక్షణ కొనసాగుతుంది. వీటితోపాటు కోర్సు కరిక్యులంలో క్రాప్, ప్లాంట్ బయోటెక్నాలజీ, ఉత్పాదకత, పర్యావరణ విపత్తుల నుంచి పంట నష్టాన్ని తగ్గించే చర్యలు, ఫెర్టిలైజర్స్ వాడకాన్ని తగ్గించే విధానాలు ప్రముఖంగా ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్/10+2 ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశానికి అర్హులు.
ఇన్స్టిట్యూట్లు
» యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ .సైన్స్, బెంగళూరు (హసన్ క్యాంపస్) » కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, అహ్మద్నగర్ ఈ కోర్సును అందిస్తున్నాయి.
ఉద్యోగ వేదికలు…
ఈ కోర్సు పూర్తి .చేసిన వారికి ఫెర్టిలైజర్ కంపెనీలు, పెస్టిసైడ్స్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి.
జాబ్ ప్రొఫైల్స్
» అప్లికేషన్ సపోర్ట్ స్పెషలిస్ట్ » కన్సల్టెంట్ సెకండరీ అగ్రికల్చర్ » రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అసోసియేట్ » సేల్స్, మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్.
బీబీఏ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్
బయోటెక్నాలజీ, ఫార్మ్ మేనేజ్మెంట్, ఎథిక్స్, ఇంటర్నేషనల్ ఫుడ్ ట్రేడ్ పాలసీలపై .బోధన, శిక్షణ అందించే కోర్సు ఇది. దీని కాల వ్యవధి నాలుగేళ్లు. ఈ కోర్సులో ప్రవేశానికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షలు లేవు. కోర్సులను అందిస్తున్న కళాశాలలకు దరఖాస్తు చేసుకొని నేరుగా ప్రవేశం పొందవచ్చు. పీసీఎం(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్)/పీసీబీ(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)/ఇంటర్ అగ్రికల్చర్/కామర్స్ సబ్జెక్టులతో ఇంటర్/10+2 ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
ఇన్స్టిట్యూట్లు
  • సామ్ హిగ్గిన్బాటమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ సైన్స్, అలహాబాద్
  • సింబయాసిస్ యూనివర్సిటీ, పుణే.

జాబ్ ప్రొఫైల్స్

  • అగ్రి బిజినెస్ మేనేజర్
  • మార్కెటింగ్ మేనేజర్
  • ఫైనాన్స్ మేనేజర్
  • ట్రేడర్
  • అనలిస్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.

బీవీఎస్సీ అండ్ ఏహెచ్
బైపీసీ విద్యార్థులకు మెడిసిన్కు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ (బీవీఎస్సీ, ఏహెచ్). కోర్సు కాల వ్యవధి ఐదున్నరేళ్లు. జంతువులకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు, పశువుల గర్భధారణ పద్ధతులు తదితర అంశాలపై ఈ కోర్సులో భాగంగా బోధన, శిక్షణ ఉంటుంది. ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ, తెలంగాణలో పీవీ నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఇంటర్(బైపీసీ)/10+2. ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
అవకాశాలు
ఈ కోర్సును పూర్తిచేసుకున్న అభ్యర్థులు ఫౌల్ట్రీ ఫారాలు, ప్రభుత్వ, ప్రైవేటు పశు వైద్య ఆసుపత్రులు, పశుసంవర్థక శాలలు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు, డెయిరీ ఫామ్స్, గొర్రెల పెంపకకేంద్రాల్లో ఉద్యోగాలు దక్కించుకోవచ్చు.

 

ఇన్స్టిట్యూట్లు

 

  • కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి » ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, గన్నవరం
  • కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, ప్రొద్దుటూరు
  • కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, గరివిడి, విజయనగరం
  • కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, రాజేంద్రనగర్
  • కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, కోరుట్ల
  • కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, మామ్నూర్–వరంగల్ జిల్లా.
  • పూర్తి వివరాలకు వెబ్సైట్స్: http://www.svvu.edu.in, http://www.tvu.nic.in
బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్
బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్ఎస్సీ).. చేపల పెంపకం, సేకరణకు సంబంధించి ప్రత్యేక పద్ధతులు, అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చే కోర్సు ఇది. ఈ కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. పీసీబీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)/ పీసీఎంబీ(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ)/ పీసీఎం (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్)/అగ్రికల్చర్ సబ్జెక్టులతో ఇంటర్/10+2 ఉత్తీర్ణులైన అభ్యర్థులు బీఎఫ్ఎస్సీలో ప్రవేశానికి అర్హులు. తెలంగాణలో పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఈ కోర్సును అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా ముతుకూర్లో ఫిషరీసైన్స్ కళాశాల ఉంది. అలాగే తెలంగాణలో వనపర్తి జిల్లా పెబ్బేరులో ఫిషరీ సైన్స్ కళాశాల ఉంది. రాష్ట్ర స్థాయిలో ఎంసెట్ ర్యాంకు ఆధారంగా బీఎఫ్ఎస్సీ సీట్లను భర్తీ చేస్తారు. ఆలిండియా కోటా సీట్ల భర్తీ ఐకార్ ఏఐఈఈఏలో ప్రతిభ ఆధారంగా జరుగుతుంది. కోర్సు పూర్తి చేసిన వారికి ఆక్వాకల్చర్ సంస్థలు, ఆక్వా రీసెర్చ్ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
పూర్తి వివరాలకు వెబ్సైట్లుwww.svvu.edu.inwww.tvu.nic.in
బీటెక్ డెయిరీ టెక్నాలజీ
డెయిరీ పదార్థాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, క్వాలిటీ కంట్రోల్లపై బోధన, శిక్షణ అందించే కోర్సు.. బీటెక్ డెయిరీ టెక్నాలజీ. పాల రసాయన, భౌతిక ధర్మాలు, డెయిరీ మైక్రోబయాలజీ పరిచయం, చీజ్ టెక్నాలజీ, డెయిరీ ఇంజనీరింగ్ తదితరాలు ఈ కోర్సు ప్రధాన అంశాలు. ఇది నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు. ఎంపీసీ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) /ఎంపీసీబీ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) సబ్జెక్టులతో ఇంటర్/10+2 ఉత్తీర్ణులైన వారు కోర్సులో ప్రవేశానికి అర్హులు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఐకార్ ఏఐఈఈఏ–యూజీ ద్వారా జాతీయ కోటా సీట్లను దక్కించుకోవచ్చు.
ఇన్స్టిట్యూట్లు
» కాలేజ్ ఆఫ్ డెయిరీ టెక్నాలజీ, తిరుపతి
» కాలేజ్ ఆఫ్ డెయిరీ టెక్నాలజీ, కామారెడ్డి
» కాలేజ్ ఆఫ్ డెయిరీ టెక్నాలజీ, రాయ్పూర్
» కాలేజ్ ఆఫ్ డెయిరీ అండ్ ఫుడ్ టెక్నాలజీ, ఉదయ్పూర్
» తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ
» వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ యానిమల్ అండ్ ఫిషరీ సైన్సెస్.
బీఎస్సీ హార్టికల్చర్ సైన్స్…
మొక్కల పెంపకం, విత్తనాలు, మొక్కలు– వ్యాధులు, మొక్కల జెనిటిక్స్ను అధ్యయనం చేసే కోర్సు.. బీఎస్సీ హార్టికల్చర్ సైన్స్. దీంతోపాటు మొక్కల పెంపకంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని ఉపయోగించి అధిక ఉత్పత్తిని సాధించడం ఎలాగో నేర్చుకుంటారు. ఇందులో భాగంగా బయోకెమిస్ట్రీ, బయాలజీ, జెనిటిక్ ఇంజనీరింగ్ భావనలను అధ్యయనం చేస్తారు. ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. తెలంగాణలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఏపీలో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలు ఈ కోర్సును అందిస్తున్నాయి.
ఇన్స్టిట్యూట్…»ఏపీలో వెంకట్రామన్నగూడెం–పశ్చిమగోదావరి »పార్వతీపురం » చిన్నలతరపి– గూడూరు » అనంతరాజుపేట–కడప » అనంతపురం » తాడిపత్రి » సీఎస్పురం–ప్రకాశం » దారిమడుగు–మార్కాపురంలలో హార్టికల్చర్ కళాశాలలు ఉన్నాయి. ఏపీలో ఎంసెట్, ఐకార్ ఏఐఈఈఏ–యూజీ ఎగ్జామ్, వర్సిటీ నిర్వహించే హార్టీసెట్ ద్వారా ప్రవేశం పొందొచ్చు. తెలంగాణలో రాజేంద్రనగర్, మోజర్లలో హార్టికల్చర్ కళాశాలలు ఉన్నాయి. ఎంసెట్, ఐకార్ ఏఐఈఈఏ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. పీసీబీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)/పీసీఎంబీ(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ)/ పీసీఎం(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్)/అగ్రికల్చర్ సబ్జెక్టులతో ఇంటర్/10+2 ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కోర్సులో ప్రవేశానికి అర్హులు.
ఉపాధి అవకాశాలు…
స్టేట్ హార్టికల్చర్ మిషన్, నాబార్డ్ సహా పలు బ్యాంకుల్లో కెరీర్ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా.. ప్రైవేట్ డ్రిప్ ఇరిగేష¯Œ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ల్లో హార్టికల్చర్ గ్రాడ్యుయేట్లకు కొలువులు లభిస్తున్నాయి. ఉన్నత విద్య పరంగా.. పీజీ స్థాయిలో ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్, ప్లాంటేషన్ అండ్ స్పైస్ క్రాప్ ప్రత్యేక అంశాలుగా ఎమ్మెస్సీ చదవొచ్చు.
జాబ్ ప్రొఫైల్స్….
  • హార్టికల్చరిస్ట్ »
  • ప్లాంటేషన్ మేనేజర్ »
  • హార్టికల్చర్ స్పెషలిస్టు
  • టెక్నికల్ అసిస్టెంట్
  • పూర్తి వివరాలకు వెబ్సైట్లు: http://www.drysrhu.edu.in, http://www.skltshu.ac.in
బీఎస్సీ సెరికల్చర్
ఇది మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు. పట్టు ఉత్పత్తి, పట్టుపురుగుల్లోని వాణిజ్య అంశాలపై బోధన సాగుతుంది. పీసీబీ/పీసీఎంబీ/పీసీఎం సబ్జెక్టులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కోర్సులో ప్రవేశానికి అర్హులు. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, తెలంగాణలోని కాకతీయ విశ్వవిద్యాలయాలు(బీఎస్సీ సెరికల్చర్, ఎమ్మెస్సీ సెరికల్చర్) బీఎస్సీ సెరికల్చర్ కోర్సును అందిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఎన్టీఏ నిర్వహించే ఐకార్ ఏఐఈఈఏ–యూజీ ద్వారా ఆలిండియా కోటా సీట్లలో ప్రవేశాలు దక్కించుకోవచ్చు.

 

» జాబ్ ప్రొఫైల్స్: »

 

  • సెరికల్చర్ ఇన్స్పెక్టర్
  • సెరికల్చర్ ఫార్మ్ మేనేజర్
  • సెరికల్చర్ ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్
  • సిల్క్ వీవర్.



అగ్రికల్చర్ కోర్సులు….

నేటికీ 60 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడటం.. జీడీపీలో వ్యవసాయం వాటా 25 శాతం ఉండటం దేశంలో వ్యవసాయ రంగం ఆవశ్యకతను తెలుపుతోంది. జనాభా పెరుగుదలకు సరిపోయేలా వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం అనివార్యం. దీంతో వ్యవసాయ విద్య పరిధులు, అవకాశాలు రెండూ విస్తరించాయి. అగ్రికల్చర్, అనుబంధ కోర్సులు, అవకాశాలపై స్పెషల్ ఫోకస్ ఈ రోజు కెరీర్స్ స్పెషల్…
బీటెక్ ఫుడ్ సైన్స్కోర్సు కాలవ్యవధి: నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 104 (ఇన్‌టేక్ కెపాసిటీ 90, ఐసీఏఆర్ 14)
అర్హత: ఇంటర్మీడియెట్ (ఫిజికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్)
వయసు: 17-22 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు

కాలేజీలు:

  • కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బాపట్ల, గుంటూరు జిల్లా
  • కాలేజ్ ఆఫ్ ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ, పులివెందుల, కడప జిల్లా

ఉన్నత విద్య: బీటెక్ ఫుడ్ సైన్స్ విద్యార్థులు ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో చేరొచ్చు.

అవకాశాలు: ఫుడ్ సైన్స్ కోర్సును పూర్తి చేసుకున్నాక ఫుడ్ టెక్నాలజిస్టుగా, బయోటెక్నాలజిస్టుగా పనిచేయొచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో, లేబొరేటరీల్లోనూ ఫుడ్ సైంటిస్టులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రధానంగా హోటళ్లు, ఫుడ్ అండ్ ప్యాకేజింగ్ పరిశ్రమలోనూ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

బీఎస్సీ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్కాల వ్యవధి: నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 46
అర్హత: ఇంటర్మీడియెట్ (ఫిజికల్ సెన్సైస్, బయలాజికల్ , లేదా నేచురల్ సెన్సైస్)
వయసు: 17-22 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు

కోర్సు అందించే సంస్థ: 
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్

ఉన్నత విద్య: బీఎస్సీ(సీఏబీఎం) పూర్తయ్యాక ఉన్నత విద్య కోసం ఎంఎస్సీ అగ్రికల్చర్, ఎంఏబీఎం, ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంఎస్సీ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంఎస్సీ వాటర్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సుల్లో చేరొచ్చు. పీజీ పూర్తయ్యాక సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ కూడా చేసుకోవచ్చు.

అగ్రికల్చరల్ పాలిటెక్నిక్కాల వ్యవధి: రెండేళ్లు
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత, విద్యార్థి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చుండాలి. తన ఏడేళ్ల విద్యాభ్యాస కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామంలో చదివి ఉండాలి. పదో తరగతిలో 55 శాతం మార్కులు(హిందీ కాకుండా) రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 45 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.

వయసు: 15-22 ఏళ్లు

సీట్లు: 13 ప్రభుత్వ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 545 సీట్లు, 4 ప్రైవేట్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్‌ల్లో 150కుపైగా సీట్లు ఉన్నాయి.

అగ్రికల్చరల్ ఇంజనీరింగ్..
కోర్సు: బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్
కాల వ్యవధి: నాలుగేళ్లు
అర్హత: ఇంటర్మీడియెట్ (ఫిజికల్ సెన్సైస్, బయలాజికల్, లేదా నేచురల్ సెన్సైస్)
మొత్తం సీట్లు: 113
వయసు: 17-22 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు

కాలేజీలు:

  • కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బాపట్ల, గుంటూరు జిల్లా
  • కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, మడకసిర, అనంతపురం జిల్లా
  • కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, సంగారెడ్డి, మెదక్ జిల్లా

ఉన్నత విద్య:
బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఎంటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌తోపాటు ఎంఏబీఎం, ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంఎస్సీ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంఎస్సీ వాటర్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సుల్లో చేరొచ్చు. పీజీ పూర్తయ్యాక సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ కూడా చేసుకోవచ్చు

ఉద్యోగాలిక్కడ: అమూల్ డెయిరీ, ఐటీసీ, ఎస్కార్ట్స్, శ్రీరాం హోండా, నెస్లే ఇండియా, ప్రో ఆగ్రో సీడ్స్, డెయిరీ కంపెనీల్లో అవకాశాలుంటాయి.

ఫిషరీ సైన్స్మన రాష్ట్రంలో విశాలమైన తీర ప్రాంతం… పౌష్టికాహారంగా చేపలకున్న ప్రాధాన్యం…. మత్స్యఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్.. ఫిషరీ కోర్సులకు గిరాకీ పెంచాయి. రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్, మాస్టర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ అందించే ఏకైక కాలేజీ నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఉంది.

కోర్సు పేరు: 
బీఎఫ్‌సీ(ఫిషరీ సైన్స్)
కోర్సు కాల వ్యవధి: నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 29
అర్హత: ఇంటర్మీడియెట్(ఫిజికల్ సెన్సైస్, బయలాజికల్, లేదా నేచురల్ సెన్సైస్)
వయసు: 17-22 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు
అవకాశాలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో, ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా, నాబార్డ్ వంటి వాటిల్లో అసిస్టెంట్ ఫిషరీ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు(ఏఎఫ్‌డీవో), ఫిషరీ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు(ఎఫ్‌ఈవో)లుగా చేరొచ్చు. దీంతోపాటు ప్రైవేట్ రంగంలోని సీ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్‌పోర్టు యూనిట్లలో, ఆక్వా ఫీడ్ ప్లాంట్‌లలో, ఫిషింగ్ గియర్ ఇండస్ట్రీల్లో ఆఫీసర్లుగా, మేనేజర్లుగా కెరీర్ సొంతం చేసుకోవచ్చు.

హోంసైన్స్కోర్సు పేరు: బీఎస్సీ(ఆనర్స్) హోంసైన్స్
కోర్సు కాలవ్యవధి: నాలుగేళ్లు. సీట్లు: 80
అర్హత: అమ్మాయిలకు మాత్రమే. ఇంటర్మీడియెట్(ఫిజికల్ సెన్సైస్, బయలాజికల్, లేదా నేచురల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్)
వయసు: 17-22 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 25

కోర్సును అందిస్తున్న కాలేజీలు..

  • కాలేజ్ ఆఫ్ హోంసైన్స్, హైదరాబాద్
  • డి.కె.గవర్నమెంట్ కాలేజీ ఫర్ ఉమెన్, నెల్లూరు(శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ)
  • శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ -అనంతపురం
  • జోసెఫ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
  • గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్, నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు.

ప్రముఖ హోంసైన్స్ కాలేజీలు:

  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోం ఎకనామిక్స్, న్యూఢిల్లీ
  • జి.బి.పంత్ యూనివర్సిటీ, పంత్ నగర్
  • ఎంఎస్ యూనివర్సిటీ, బరోడా

అవకాశాలు: టూరిజం, హెల్త్‌కేర్, సర్వీస్ ఇండస్ట్రీ, ప్రొడక్షన్ పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందొచ్చు.

బీఎస్సీ అగ్రికల్చరల్కాల వ్యవధి: నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 695 (మన రాష్ట్రంలో)
అర్హత: ఇంటర్మీడియెట్(ఫిజికల్ సెన్సైస్; బయలాజికల్, లేదా నేచురల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్)
వయసు: 17-22 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు

రాష్ట్రంలోని కాలేజీలు:

  • కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్
  • అగ్రికల్చరల్ కాలేజీ, బాపట్ల, గుంటూరు జిల్లా
  • ఎస్.వి.అగ్రికల్చరల్ కాలేజీ, తిరుపతి, చిత్తూరు జిల్లా
  • అగ్రికల్చరల్ కాలేజీ, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా
  • అగ్రికల్చరల్ కాలేజీ, నైరా, శ్రీకాకుళం జిల్లా
  • అగ్రికల్చరల్ కాలేజీ, మహానంది, కర్నూలు జిల్లా
  • అగ్రికల్చరల్ కాలేజీ, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా
  • అగ్రికల్చరల్ కాలేజీ, జగిత్యాల, కరీంనగర్ జిల్లా

దేశంలో ప్రముఖ అగ్రికల్చరల్ యూనివర్సిటీలు:

  • ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, హైదరాబాద్
  • ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆనంద్, గుజరాత్
  • బెనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి, యూపీ
  • చౌదరీ చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చరల్ యూనివ ర్సిటీ, హిస్సార్, హర్యానా
  • గోవింద్ వల్లభ్‌పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ,పంత్‌నగర్, ఉత్తరాఖండ్
  • పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, లూధియానా, పంజాబ్
  • రాజస్థాన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, బికనుర్, రాజస్థాన్
  • సర్దార్ కృషినగర్ దంతెవాడ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, బనాస్‌కాంథా, గుజరాత్
  • తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ, కోయంబత్తూర్, తమిళనాడు
  • యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్, బెంగళూరు, కర్ణాటక
  • యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్, ధార్వాడ్, కర్ణాటక
  • విశ్వభారతీ శాంతినికేతన్, పశ్చిమబెంగాల్
  • అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, అలీగఢ్, యూపీ
  • కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఎర్నాకులం, కేరళ

ఉన్నత విద్య: బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తయ్యాక ఉన్నత విద్య కోసం ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో చేరొచ్చు. పీజీ పూర్తై తర్వాత పరిశోధనలవైపు దృష్టిసారించాలనుకుంటే పీహెచ్‌డీ చేయొచ్చు.

అవకాశాలిక్కడ: ఫెర్టిలైజర్ కంపెనీలు, అగ్రిబయోటెక్ సంస్థ లు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు, విత్తన కంపెనీలు, రిటైల్ మార్కెటింగ్, వ్యవసాయ పరిశోధనలు, బోధన తదితర రంగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు.

హార్టికల్చర్…ాష్ట్రంలో… ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ యూనివర్సిటీని 2007లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని వెంకటరామన్నగూడెంలో ఏర్పాటుచేశారు. దీన్ని 2011 నుంచి వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీగా పేర్కొంటున్నారు. ఇది దేశంలోనే రెండో హార్టికల్చర్ యూనివర్సిటీ.
కోర్సు: బీఎస్సీ(హానర్‌‌స) హార్టికల్చర్
కోర్సు కాలవ్యవధి: నాలుగేళ్లు
అర్హత: ఇంటర్మీడియెట్(ఫిజికల్ సెన్సైస్, బయలాజికల్, లేదా నేచురల్ సెన్సైస్, అగ్రికల్చరల్ సెన్సైస్, అగ్రికల్చర్‌లో ఒకేషనల్ కోర్సులు)
వయసు: 17-22 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు
మొత్తం సీట్లు: 230

హార్టికల్చర్ కోర్సులను అందిస్తున్న కాలేజీలు:

  • కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, వెంకటరామన్న గూడెం, పశ్చిమగోదావరి జిల్లా
  • కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్
  • కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, మోజెర్ల, మహబూబ్‌నగర్ జిల్లా
  • కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, అనంతరాజుపేట, కడప జిల్లా

హయ్యర్ ఎడ్యుకేషన్:పీజీ స్థాయిలో ఎంఎస్సీ హార్టికల్చర్‌లో చేరొచ్చు. పరిశోధనలు చేయాలనుకుంటే ఎంఎస్సీ తర్వాత పీహెచ్‌డీ చేయొచ్చు.

ఉద్యోగాలు: ఫుడ్ రిటైలర్ సంస్థలు, వ్యవసాయ క్షేత్రాల్లో సూపర్‌వైజర్లు, ఫార్మ్ మేనేజర్లు, ఎస్టేట్ మేనేజర్లుగా కెరీర్ ప్రారంభించొచ్చు. ప్రభుత్వ రంగంలో అసిస్టెంట్లు, ఆఫీసర్లు, డెరైక్టర్ల హోదా పొందొచ్చు. నర్సరీలు, ఫార్మ్ సెంటర్స్‌ను నెలకొల్పుకోవచ్చు.

డెయిరీ టెక్నాలజీ…కోర్సు పేరు: బీటెక్ డెయిరీ టెక్నాలజీ
కోర్సు కాలవ్యవధి: నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 38
అర్హత: ఇంటర్మీడియెట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్)

కాలేజీలు:

  • కాలేజ్ ఆఫ్ డెయిరీ టెక్నాలజీ, తిరుపతి
  • డెయిరీ టెక్నాలజీ ప్రోగ్రామ్, కామారెడ్డి

ఉన్నత విద్య: ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, ఎంబీఏ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సుల్లో చేరొచ్చు. తర్వాత పీహెచ్‌డీ కూడా చేయొచ్చు.

అవకాశాలు: ప్రభుత్వ, ప్రయివేట్ పాల ఉత్పత్తుల పరిశ్రమలు, డెయిరీ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. సొంతంగా డెయిరీ పెట్టుకోవచ్చు.

బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో చేరాలనుకుంటున్నాను. ఈ కోర్సును అందిస్తున్న యూనివర్సిటీలు/ ఇన్స్టిట్యూట్ల వివరాలు.. ప్రవేశ విధానం.. ఎంఎస్సీ అగ్రికల్చర్తో ఎలాంటి కెరీర్ అవకాశాలు లభిస్తాయో చెప్పండి?

ఎంఎస్సీ అగ్రికల్చర్ రెండేళ్ల కాలపరిమితి గల పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సు. ఇందులో చేరేందుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ అగ్రికల్చర్/ హార్టికల్చర్/ఫారెస్ట్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంఎస్సీ అగ్రికల్చరల్ కోర్సులో దాదాపు 12 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఆగ్రోనమీ, బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అండ్ ఫార్మ్ మేనేజ్మెంట్, ప్లాంట్ ఫిజియాలజీ, ఎంటమాలజీ, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్, హార్టీకల్చర్, ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్, ప్లాంట్ పాథాలజీ, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ, ఫారెస్ట్రీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’’ వంటి స్పెషలైజేషన్స్ ఎంచుకోవచ్చు.

ప్రవేశాలుఆయా అగ్రికల్చర్ యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ద్వారా ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో చేరవచ్చు. దీనికి ప్రతి ఏటా జూన్లో నోటిఫికేషన్ విడుదల చేసి, ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. దీంతోపాటు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐకార్)– ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ పీజీ ఎంట్రన్స్ ద్వారా దేశంలోని వివిధ అగ్రికల్చరల్ యూనివర్సిటీలు/ కాలేజీల్లో చేరవచ్చు. దీనికి ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్లు ప్రారభమై ఏప్రిల్లో పరీక్ష నిర్వహిస్తారు.

» తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, గుంటూరు » ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, హైదరాబాద్ » ఎస్.వి.అగ్రికల్చర్ కాలేజీ, తిరుపతి వంటి వాటిల్లో ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సు అందుబాటులో ఉంది.

అవకాశాలుభారత్ వ్యవసాయ ఆధారిత దేశం. దాంతో మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం అత్యంత కీలకంగా మారింది. అగ్రికల్చర్ కోర్సులు చదివిన వారికి దేశంలో ఉద్యోగ అవకాశాలకు కొదవ లేదు. ఎంఎస్సీ అగ్రికల్చర్ ఉత్తీర్ణులైన చాలామందికి హార్టికల్చర్, పౌల్ట్రీ ఫార్మ్స్, ప్లాంట్ సైన్స్, సాయిల్ సైన్స్, ఫుడ్ సైన్స్ మొదలైన విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. రీసెర్చ్ ల్యాబ్స్, ఫుడ్, బేవరేజెస్, డెయిరీ ఫార్మ్తోపాటు అగ్రికల్చర్ యూనివర్సిటీలు/ ఇన్స్టిట్యూట్స్లో ఉద్యోగాలు పొందవచ్చు. అగ్రికల్చరల్ సైంటిస్ట్, రీసెర్చ్ సైంటిస్ట్, లెక్చరర్/ప్రొఫెసర్, అగ్రికల్చరల్ ఆఫీసర్గా కొలువులు దక్కించుకోవచ్చు. ఆయా రాష్ట్ర ప్రభుత్వ అగ్రికల్చర్ విభాగాల్లో ఆఫీసర్ కేడర్ ఉద్యోగాలు పొందవచ్చు. వ్యవసాయ రుణాలు అందించే ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం అగ్రికల్చర్ కోర్సులు పూర్తిచేసిన వారిని నియమించుకుంటున్నాయి. కొంత అనుభవంతో సొంతంగా వ్యవసాయ సంస్థలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పవచ్చు. ఎంఎస్సీ అగ్రికల్చర్ తర్వాత పీహెచ్డీ కూడా పూర్తిచేసుకుంటే సైంటిస్ట్లుగా స్థిరపడొచ్చు. నూతన ఆవిష్కరణలు చేస్తూ ఉజ్వల కెరీర్ను సొంతం చేసుకోవచ్చు.
 
%d bloggers like this: