పదవ తరగతి తర్వాత….కోర్సులు..అవకాశాలు

 
ఇంటర్మీడియెట్

 

పదోతరగతి తర్వాత ఎక్కువ మంది ఎంచుకొనే మార్గం ఇది. ఇంటర్మీడియెట్ను సైన్స్, కామర్స్, ఆర్ట్స్లుగా విభజించవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంపీసీ; బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీపై ఇష్టమున్న విద్యార్థులు బైపీసీని ఎంచుకుంటారు. ఎంపీసీలో చేరిన ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ను తమ గమ్యంగా ఎంచుకుంటారు. దాంతోపాటు ఫార్మసీలో కూడా చేరే అవకాశముంది. అలాగే డిగ్రీ స్థాయిలో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, జియాలజీ తదితర సబ్జెక్టుల్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్సీ)లో ప్రవేశం పొందొచ్చు. బైపీసీ విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడిసిన్ కోర్సులు; అలాగే మెడిసిన్ అనుబంధ బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. అదేవిధంగా డిగ్రీలో బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ సబ్జెక్టులతో బీఎస్సీ చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఇంజనీరింగ్
ఇంటర్లో ఎంపీసీ గ్రూపు చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్ (బీటెక్/బీఈ)లో చేరేందుకు అర్హులు. కాబట్టి ఇంజనీరింగ్ లక్ష్యంగా ఉన్న విద్యార్థులు పదోతరగతి తర్వాత ఇంటర్ ఎంపీసీ గ్రూప్లో చేరాలి. ఇంజనీరింగ్లో ప్రవేశానికి రాష్ట్ర స్థాయిలో ఎంసెట్, జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, బిట్శాట్ తదితర ప్రవేశ పరీక్షలకు సిద్ధమవ్వాలి.
మెడికల్..
ఎంబీబీఎస్, బీడీఎస్, వెటర్నరీ సైన్స్, ఆయుష్, ఆయుర్వేద, హోమియోపతి, అగ్రికల్చర్ కోర్సులు లక్ష్యంగా ఉన్న అభ్యర్థులు ఇంటర్ బైపీసీ గ్రూపులో చేరాలి. మెడికల్, అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకొనే అభ్యర్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్కు హాజరవడం తప్పనిసరి. బైపీసీ విద్యార్థులు బీఎస్సీ అగ్రికల్చరల్, ఫారెస్ట్రీ, ఫిషరీస్, న్యూట్రిషన్, హోమ్ సైన్స్ తదితర కోర్సులను కూడా ఎంచుకోవచ్చు.
ఆర్ట్స్, కామర్స్..
హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, జాగ్రఫీ, సోషియాలజీ తదితర సబ్జెక్టులపై ఆసక్తి ఉన్న వారు హెచ్ఈసీ, సీఈసీ గ్రూప్లను ఎంచుకోవచ్చు. సీఈసీ విద్యార్థులు డిగ్రీ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్(బీకామ్)లో చేరొచ్చు. దీంతోపాటు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్(బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ), బ్యాచిలర్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్(బీఏఎఫ్), బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్(బీఎంఎస్) తదితర కోర్సుల్లో చేరే వీలుంది. అలాగే కామర్స్ విద్యార్థులు జాబ్ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న ప్రొఫెషనల్ కోర్సులు.. చార్టెడ్ అకౌంటెన్సీ(సీఏ), కంపెనీ సెక్రటరీ(సీఎస్), కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ(సీఎంఏ)లనూ పూర్తి చేసుకోవచ్చు. హెచ్ఈసీ గ్రూపు విద్యార్థులకు బీఏలో ఎకనామిక్స్, సోషియాలజీ, హిస్టరీ, ఆర్కియాలజీ,జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
న్యాయశాస్త్రం..
న్యాయశాస్త్రం చదవాలనుకొనే విద్యార్థులు ఇంటర్లో ఏ గ్రూపులోనైనా చేరవచ్చు. ఇంటర్ అర్హతతో ఐదేళ్ల ఎల్ఎల్బీ, డిగ్రీతో మూడేళ్ల ఎల్ఎల్బీ అందుబాటులో ఉంది. ఇందులో ప్రవేశానికి రాష్ట్ర స్థాయిలో లాసెట్ ప్రవేశ పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది. నల్సార్ వంటి జాతీయ స్థాయి న్యాయ విశ్వవిద్యాలయాల్లో లా కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు.. కామన్ లా అడ్మిషన్ టెస్టు(క్లాట్)కు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇంటర్ అర్హతతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ, ఎల్ఎల్బీ కోర్సు కూడా అందుబాటులో ఉంది.
కోర్సులు -విభాగాలు
  • ఎంపీసీ
  • బైపీసీ
  • సీఈసీ
  • ఎంఈసీ
  • హెచ్‌ఈసీ

ఎంపీసీ: ఇంజనీర్‌గా కెరీర్‌లో స్థిరపడాలనుకునే వారు ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ) గ్రూపులో చేరొచ్చు. గణితంపై ఆసక్తి ఉండి, వివిధ సూత్రాలను వేగంగా అన్వయించే నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు ఎంపీసీ సరైన గ్రూప్. ఐఐటీ, నిట్‌లు, టాప్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ సీటు సంపాదించాలంటే ఇంటర్‌లో చేరిన రోజు నుంచి లక్ష్యం దిశగా కృషిచేయాలి. ఎంసెట్, జేఈఈ మెయిన్, బిట్‌శాట్ తదితర పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు కోసం కృషిచేయాలి. ఇంజనీరింగ్ కెరీర్‌పై ఆలోచన లేని వారు, ఎంపీసీ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీలో అడుగుపెట్టి, తర్వాత ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యను అభ్యసించి పరిశోధనలు దిశగా వృత్తి జీవితాన్ని సుస్థిరం చేసుకోవచ్చు.
బైపీసీ: మొక్కలు, జంతువులపై ఆసక్తి ఉండి, విశ్లేషణాత్మక నైపుణ్యాలున్న వారికి సరిపడే గ్రూప్ బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ). వైద్య వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తొలుత పూర్తిచేయాల్సిన గ్రూప్ ఇది. దీని సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కష్టపడి చదివే తత్వం ప్రధానం. ఈ గ్రూప్‌లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ప్రయోగశాలలో పరిశీలించే విధంగా సన్నద్ధత అవసరం. బైపీసీ తర్వాత ఎంసెట్, ఎయిమ్స్, జిప్‌మర్, సీఎంసీ పరీక్షల ద్వారా ఎంబీబీఎస్‌లో చేరి డాక్టర్‌గా స్థిరపడటం సుదీర్ఘ ప్రక్రియే. రెండేళ్ల పాటు ఇంటర్ చదివి.. ఎంబీబీఎస్, పీజీ కోర్సు చేయాలి. కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా బైపీసీలో చేరడంపై నిర్ణయం తీసుకోవాలి.
సీఈసీ, ఎంఈసీ: వ్యాపార వ్యవహారాలు, గణాంకాల విశ్లేషణపై ఆసక్తి ఉన్నవారికి సరైన గ్రూపులు సీఈసీ, ఎంఈసీ. ప్రస్తుత కార్పొరేట్ యుగంలో వ్యాపార, పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో కామర్స్‌లో నైపుణ్యాలున్న వారికి అవకాశాలు పలకరిస్తున్నాయి. చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెనల్ కోర్సుల్లో రాణించేందుకు అనుకూలమైన గ్రూప్‌లు సీఈసీ, ఎంఈసీ. ఏ కోణంలో చూసినా ఇవి అవకాశాలకు వేదికగా నిలుస్తున్నవే.

  • ఈ గ్రూప్‌లను ఎంపిక చేసుకునే విద్యార్థులకు సహనం ముఖ్యం. చిట్టాపద్దుల సమస్యలను సాధించే క్రమంలో ఒక్కోసారి చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది.


హెచ్‌ఈసీ: సామాజిక అంశాలపై అవగాహన, సమాజంలో ఎప్పటికప్పుడు చోటుచేసుకునే పరిణామాలను అన్వేషించే నైపుణ్యం ఉన్నవారికి సరైన గ్రూప్ హెచ్‌ఈసీ. ఇంటర్ హెచ్‌ఈసీ పూర్తిచేసిన తర్వాత ఉన్నత విద్యాపరంగా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికెట్ కోర్సుల నుంచి డిగ్రీ స్థాయి వరకు వివిధ కోర్సులను వీరు అభ్యసించవచ్చు. సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు జాబ్‌ఓరియెంటెడ్ డిప్లొమా కోర్సులు విద్యార్థులకు అందుబాటు లో ఉన్నాయి. ఉన్నతవిద్య మాత్రమే కాకుండా ఉన్నతోద్యోగాల దిశగా కూడా అనేక అవకాశాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ ఉద్యోగ నియామక పరీక్షల్లో విజయం సాధిస్తే ప్రభుత్వ ఉద్యోగం ఖాయం.

వొకేషనల్ కోర్సులు
  • క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్
  • అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్
  • ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్

అర్హత: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియెట్‌లో రెండేళ్ల కాల వ్యవధిగల ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. ఆరు కేటగిరీల్లో మొత్తం 27 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
కోర్సులు: క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆఫీస్ అసిస్టెన్స్‌షిప్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ వంటి గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో టెక్నికల్ గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించొచ్చు. అంతేకాకుండా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఐ విద్యార్థులకు నిర్వహించే అప్రెంటీస్ పరీక్ష రాసే అవకాశం కూడా ఇంటర్ వొకేషనల్ గ్రూపుల్లో టెక్నికల్ గ్రూప్ ఉత్తీర్ణులకు లభిస్తుంది.
కెరీర్: బ్రాంచ్‌కనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అవకాశాలుంటాయి. ప్రభుత్వ రంగంలో రైల్వేలు, గెయిల్, సెయిల్ వంటి భారీ కంపెనీల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. స్వయం ఉపాధి దిశగా వెళ్లొచ్చు.
ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లో ముఖ్యమైనవి ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులు. వీటిని పూర్తిచేసింది తడవు తక్షణ ఉపాధి లభిస్తుంది.వీటిలో ముఖ్యమైనవి:ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్:కరిక్యులం:వర్క్‌షాప్ టెక్నాలజీ, బేసిక్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటో పవర్ ప్లాంట్, ఆటో ట్రాన్స్‌మిషన్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్, ఆటో సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్..
ఉద్యోగావకాశాలు: ఆటో మెకానిక్, వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, ఆటో ఫిట్టర్, స్పేర్ పార్ట్స్ సేల్స్ అసిస్టెంట్/మ్యానుఫ్యాక్చర్ రిప్రెజెంట్, ఇన్సూరెన్స్ అండ్ లాస్ అసెసర్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, ఆటో ఎలక్ట్రీషియన్.

మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్:ఉద్యోగావకాశాలు: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మెకానికల్ విభాగాలు; ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్; రిఫ్రిజిరేషన్, ఎయిర్‌కండీషనింగ్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్; వర్క్‌షాప్ టెక్నీషియన్; పవర్‌ప్లాంట్ల టెక్నీషియన్; సోలార్ సిస్టమ్ టెక్నీషియన్.

  • ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్; డీటీపీ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.


ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్:ఉద్యోగావకాశాలు:ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ అసెంబ్లీస్, ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ టెస్టర్-రిపైరర్, ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్స్ సేల్స్ అండ్ సర్వీస్.

ఎలక్ట్రికల్ టెక్నీషియన్:ఉద్యోగావకాశాలు: ఎలక్ట్రిక్ ఉపకరణాల అసెంబ్లర్, టెస్టర్, ఇన్‌స్టలేషన్ అండ్ సర్వీస్, రిపైరర్, వైండర్/రివైండర్ (మోటార్), సేల్స్‌మ్యాన్.

పారామెడికల్..
పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు పారామెడికల్ కోర్సులు సత్వర ఉపాధి కల్పిస్తాయి. రెండేళ్ల డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ(డీఎంఎల్టీ), ఆప్తాల్మామిక్ అసిస్టెంట్ కోర్సు; ఏడాది వ్యవధితో కార్డియాలజీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్ తదితర డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బైపీసీ గ్రూప్తో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు బీఎస్సీ(నర్సింగ్), పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఎంఎల్టీ తదితర కోర్సుల్లో చేరొచ్చు. వీటితోపాటు ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ, రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ, పెర్ఫ్యూజన్ టెక్నాలజీ, కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో వ్యాస్కులర్ టెక్నాలజీ, అనెస్థీషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియటర్ డిగ్రీ, ఇమేజింగ్ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి చేయడం ద్వారా హాస్పిటల్స్లో ఆయా విభాగాల్లో టెక్నీషియన్స్గా స్థిరపడొచ్చు. పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్(కేఎన్ఆర్యూహెచ్ఎస్), ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలు ప్రత్యేక నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి.
ఐటీఐ/ఐటీసీ

కోర్సులు -విభాగాలు
  • ఫిట్టర్
  • ఎలక్ట్రీషియన్
  • ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్
  • వెల్డర్, టర్నర్, ప్లంబర్
  • కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్

ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ప్రభుత్వ), ఇండస్ట్రియ ల్ ట్రైనింగ్ సెంటర్ (ప్రైవేటు)లు సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇవి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (డీజీఈటీ) పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి.
అర్హత: ఐటీఐ/ఐటీసీలలోని ట్రేడ్లలో పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో చేరవచ్చు.
కోర్సులు: ఐటీఐ/ఐటీసీలలో మూడు నెలలు మొదలుకొని మూడేళ్ల కాల పరిమితి గల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ తదితర కోర్సులున్నాయి.
కెరీర్: కోర్సు పూర్తయ్యాక అప్రెంటీస్ చేయొచ్చు. ఈ సమయంలో విద్యార్థి వేతనం(స్టైఫండ్) లభిస్తుంది. వివిధ కో ర్సులను పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో ఉద్యోగావకాశాలుంటాయి. రైల్వే, ఆర్మీ, పోలీసు, పారా మిలిటరీ తదితర విభాగాల్లో అవకాశాలుంటాయి. స్వ యం ఉపాధి దిశగా కూడా అడుగులు వేయొచ్చు. ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే వారు ప్రవేశ పరీక్ష ద్వారా ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
వేతనాలు: ప్రారంభంలో నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనం పొందొచ్చు.
స్వయం ఉపాధి దిశగా..ఉన్నత విద్యనభ్యసించడానికి ఆర్థిక ఇబ్బందు లు ఎదురైతే స్వయంఉపాధి దిశగా కూడా ఎన్నో సంస్థలు స్వల్పకాలిక శిక్షణ కోర్సులను అందిస్తున్నాయి. సెట్విన్, స్వామిరామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్, ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వంటి సంస్థలు ప్రస్తుత జాబ్ మార్కెట్‌కు అవసరమైన ఎన్నో కోర్సులను అతి తక్కువ రుసుముకే అందిస్తున్నాయి. ఆయా సంస్థలు అందించే కోర్సుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్, సెల్‌ఫోన్ రిపేరింగ్, ట్రాక్టర్ డ్రైవింగ్, ఫుట్‌వేర్ డిజైన్, స్టోర్ కీపర్, హౌస్ కీపింగ్, గార్మెంట్ తయారీ, బేకరీ అండ్ కన్‌ఫెక్షనరీ, పుట్టవంటి ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

అప్రెంటీస్షిప్..వాస్తవ పరిస్థితుల్లో శిక్షణ అప్రెంటీస్షిప్ ప్రత్యేకత. అప్రెంటీస్షిప్ ప్రోగ్రామ్ చేసిన వారికి ఆటోమొబైల్, ఫార్మా, అగ్రికల్చర్, ఐటీ/ఐటీఈఎస్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. ఐటీఐ డ్యూయల్ లెర్నింగ్ మోడ్, పీఎంకేవీవై/ఎంఈఎస్–ఎస్డీఐ కోర్సులు, గ్రాడ్యుయేట్లు/ డిప్లొమా హోల్డర్లు (లేదా) 10+2 వొకేషనల్ సర్టిఫికెట్ హోల్డర్లు అప్రెంటీస్షిప్ ప్రోగ్రామ్స్కు దరఖాస్తు చేసుకోవచ్చు. రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ అప్రెంటీస్షిప్ ట్రైనింగ్(ఆర్డీఏటీ) వెబ్సైట్కు లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వ కొలువులు..
పదోతరగతి అర్హతతోనూ ప్రభుత్వ కొలువులో చేరే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) పదోతరగతి అర్హతతో పలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్..
కానిస్టేబుల్, రైఫిల్ మ్యాన్:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) మెట్రిక్యులేషన్ లేదా పదోతరగతి అర్హతతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్),సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్(ఐటీబీపీ), సహస్త్ర సీమ బల్(ఎస్ఎస్బీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ), సెక్రటేరియెట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్) ల్లో కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ); అస్సామ్ రైఫిల్స్లోని రైఫిల్మ్యాన్(జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేస్తోంది. ఆయా పోస్టుల భర్తీకి క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: పదోతరగతి అర్హతతో ఎస్ఎస్సీ భర్తీ చేసే కొలువుల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్) పోస్టులు ప్రముఖంగా నిలుస్తాయి. ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు రెండు దశల్లో రాత పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది.
రైల్వే ఉద్యోగాలు
  • భారతీయ రైల్వే శాఖ… ట్రాక్మ్యాన్, గేట్మ్యాన్, పాయింట్స్మ్యాన్, హెల్పర్ అండ్ పోర్టర్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులను పదోతరగతి ఉత్తీర్ణత/ఐటీఐ/ తత్సమానం/ నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ అర్హతతో భర్తీ చేస్తోంది. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టులు ఉంటాయి.
  • మెట్రిక్యులేషన్/ఎస్ఎస్ఎల్సీ+ఐటీఐ అర్హతతో రైల్వే శాఖ భర్తీ చేసే ఉద్యోగాల్లో అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ కొలువులు ముందు వరుసలో ఉంటాయి. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు రెండు దశల్లో ఉంటాయి.

 

%d bloggers like this:
Available for Amazon Prime