రుద్రాక్ష చెట్లు

రుద్రాక్ష చెట్లు అని ఫేక్ పిక్చర్స్ వస్తున్నాయి…..

అసలైన రుద్రాక్షలను గుర్తించడం ఎలా??
రుద్రాక్షలు చెట్లకి పళ్ళలాగా ఉంటాయి. వాటిలోపల టెంకలాగా గట్టిగా ఉండేవి మనం చూసే, వాడే రుద్రాక్షలు. రుద్రాక్షలు పండుగా మారాక నీలం రంగులో ఉంటాయి. అవి ఎండిపోయాక గట్టి బెరడుగా రుద్రాక్షపై అంటుకోపోయి చిన్న సైజ్ కార్క్ బాల్ లా ఉంటుంది.
వేడి నీళ్ళలో వేసి నానబెట్టి వాటిని జాగ్రత్తగా పై బెరడును చెక్కి బ్రష్ వంటి దాంతో తీసి శుభ్రం చేస్తే మనం వేసుకునే రుద్రాక్ష వస్తుంది. అంతే తప్ప మనం వేసుకునే రుద్రాక్షలు తిన్నగా చెట్టుకి అలానే కాసెయ్యవు.
ఆ రుద్రాక్షల లోపల ఎన్ని ముఖాల రుద్రాక్షైతే అన్ని అరలుంటాయి. ఆ అరల్లో చిక్కుడు గింజలలాగా నున్నగా ఉండే గింజలుంటాయి. నిజానికి ఆ గింజలు ఎలక్ట్రో మాగ్నెటిక్ తరంగాలను విడుదల చేస్తాయి. రుద్రాక్ష నాణ్యత దాని బరువు మీద ఆధారపడి ఉంటుంది. పురుగులు, పుచ్చులు ఉన్నవైనా చాలా పాత రుద్రాక్షలైనా తేలికగా అయిపోయాయి అంటే వాటిలోపల ఉండే గింజలు కుళ్ళిపోవడం, కుళ్ళిపోయి ఎండిపోవడం లేదా ఎండిపోవడం జరిగిందని గుర్తు.
కొత్తగా వచ్చిన పంటలోని రుద్రాక్ష ఐతే బరువుగా ఉండి నీళ్ళలో వేస్తే మునుగుతుంది. కొన్నేళ్ళ క్రితంది ఐతే నీళ్ళలో తేలుతుంది.
చాలా రుద్రాక్షలు పరిశీలిస్తే ఏది నిజమో ఏది నిజమైనది కాదో గుర్తు పట్టేయవచ్చు.
రుద్రాక్ష మధ్యలో రంధ్రం సన్నగా ఉన్నదని కొందరు పెద్ద రంధ్రం చేయిస్తారు. దాని వల్ల ఆ రుద్రాక్షలోపల ఉండే గింజకు దెబ్బ తగిలి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. చాలా చోట్ల గుళ్ళ బైట
రూ.50-100 కి అమ్మే రుద్రాక్ష మాలలు ఈ కోవవే. కర్రా మాల్ అంటారు వీటిని, పాతబడిపోయిన ఎర్ర రంగు వేసిన రుద్రాక్షలు ఇవి ఎక్కువగా పంచ ముఖియే ఉంటాయి. ఒక లారీడు రుద్రాక్ష పంట దింపితే ఒక సంచీడు ఇతర ముఖాల రుద్రాక్షలు లభిస్తాయి. మిగతా అన్నీ పంచముఖి, నాలుగు ఆరు ముఖాలు కూడా పంచముఖి అంత కాకున్నా దానిలానే విరివిగా లభ్యంలో ఉంటాయి. కాబట్టి వీటిపైన రంపాలతో గీతలు గీసి ఎక్కువ ముఖాల రుద్రాక్షలుగా అమ్మేస్తుంటారు. గమనించుకోవాలి.
రుద్రాక్షకి స్వతహాగా రంధ్రముంటుంది. సృష్టిలో రుద్రాక్ష వంటిది మరొకటి లేదు. ఒక్క రుద్రాక్షకు మాత్రమే మధ్యలో రంధ్రం ఉంటుంది. ఇంక ఏకాయకి, పండుకి, గింజకీ దేనికీ ఇలా ఉండదు. అలా ఉండి ఎటువంటి బలవంతపు శక్తినీ ప్రయోగించి రంధ్రము చేయనవసరంలేకుండా ఒక దండలాగా ఏర్పడడానికి సిద్ధంగా మధ్యలో రంధ్రంతో ఉంటుంది. మనం కూడ
మన జీవితాన్ని ఆ పరమేశ్వరునికి దండలాగా సమర్పించ యోగ్యమైన దానిగా గడపాలని సూచిస్తుంది.
*తస్మాత్ జాగ్రత్త*
కార్క్, బోన్స్, ప్లాస్టిక్, ఫైబర్ మెటీరియల్తో రుద్రాక్షలు ముఖ్యంగా ఏకముఖి (చంద్రముఖి) రుద్రాక్షని కవచం అని టీవీల్లో కొన్ని షాపుల్లో అమ్మేస్తున్నారు. అప్పట్లోనే వాళ్ళమీద యుద్ధం చేసి కొంత ఆపడం జరిగింది.
%d bloggers like this: