మజ్జిగ

No photo description available.

మజ్జిగ చేసే మేలు గురించి మీకు పూర్తిగా తెలుసా ???ఆరోగ్యానికి అమృతం మజ్జిగ:-
మజ్జిగ ఆరోగ్యానికి అమృతంలాంటిది. మజ్జిగ తీసుకోవడం వలన పలు జబ్బులను దూరం చేస్తుంది. బజార్లో లభించే శీతలపానీయాలకన్నా మజ్జిగ లక్షలరెట్లు మంచిది. మజ్జిగతో ఎన్నో లాభాలున్నాయి.
1.ఎక్కుళ్ళు వస్తున్నప్పుడు ఒక చెంచా మజ్జిగలో సొంఠి కలుపుకుని సేవించండి. వెంటనే ఉపశమనం కలుగుతుంది.
2.వాంతులయ్యేటప్పుడు మజ్జిగతోపాటు జాజికాయను గీసుకుని మజ్జిగలో కలుపుకుని సేవించండి.
3.వేసవికాలంలో ప్రతిరోజు రెండుసార్లు మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో వేంచిన జిలకర కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
4.కాళ్ళ పగుళ్ళకు మజ్జిగ నుంచి తీసిన తాజా వెన్నను పూస్తే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
5.మజ్జిగతో చాలా సౌందర్య సాధనలు చేయవచ్చు. చర్మం కనుక ఎండ దెబ్బకి బాగా వాడిపోతే 5 చెంచాల మజ్జిగలో 2 చెంచాల టిమాటో రసం కలిపి రాసుకుని అరగంట తరువాత కడిగేసుకుంటే మంచిది. అలసి పోయిన కాళ్ళకి కూడా పెరుగు ఎక్కువగా ఉపయోగపడుతుంది. నాలుగు చెంచాల మజ్జిగలో కొంచెం వినిగరు కలిపి కాళ్ళకు పట్టిస్తే చర్మంలో నశించిన టిస్యూలను బాగుపరచి కాళ్ళలో బిరుసును లాగేస్తుంది. ఈ మిశ్రమాన్ని వారం రోజులదాకా ఫ్రిజ్‌లో ఉంచుకొని స్నానానికి ముందు కాళ్ళకు, పాదాలకు వాడవచ్చు.

మెంతి మజ్జిగ

%d bloggers like this:
Available for Amazon Prime