Posted in Temples

మధురై

మీనాక్షి అమ్మవారి ఆలయం.
మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం లేదా మీనాక్షి అమ్మవారి ఆలయం. లయ కారకుడైన పరమేశ్వరుడు సుందరేశ్వరుడిగా ఇక్కడ నెలకొని వున్నారు. ఒక చారిత్రక హిందూ ఆలయం ఇది భారతదేశంలో తమిళనాడులో మదురై పవిత్ర నగరంలో ఉంది. ఇది సుందరేశ్వర్ లేదా సుందరనాథుడు – రూపంలో శివ దేవుడికి- మరియు మీనాక్షి రూపంలోని అతడి దేవేరి పార్వతికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటి పాత మదురై నగరపు జీవన విధానాన్ని కలిగి ఉంది. ఆలయ సముదాయం ముఖ్య దేవతలకు రెండు బంగారు గోపురాలతో పాటు 14 అద్భుతమైన గోపురాలు లేదా టవర్లకు నిలయంగా ఉంది, ఇవి అద్భుతమైన శిల్ప, చిత్రకళా రీతులతో ఉంది వైగై నది తీరంలోని ఈ క్షేత్రం నిత్యం వేలాదిమంది భక్తులతో సందడిగా ఉంటుంది. 2500 ఏళ్ల క్రితమే సుందరేశ్వర్ నిర్మించారని చారిత్రక ఆనవాళ్లు తెలుపుతున్నాయి అయితే ఆలయ ప్రస్తుత రూపం 1600 సంవత్సరంలో నిర్మించబడిందని నమ్మిక. ఎత్తైన ఆలయ 170 అడుగుల ఎత్తులో ఉంది ఇది నాలుగు ముఖాలలో నాలుగు ప్రవేశ ద్వారాలతో ఉన్న తమిళనాడులోని అతి కొద్ది ఆలయాలలో ఒకటి.
తెలుగు నాయక రాజులతో పునరుద్దరణ
శైవ తత్వశాస్త్రానికి చెందిన తిరుజ్ఞాన సంబన్దార్ ఈ ఆలయం గురించి ఏడవ శతాబ్దంలోనే పేర్కొన్నాడు. ఖిల్జీ సేనాని దురాక్రమణదారుడు మాలిక్ కపూర్ దీన్ని కూల్చి వేయించినట్లు చెప్తారు. ఈ దాడిలో గుడికి సంబంధించిన ఆనవాళ్లన్నీ ధ్వంసమైపోయాయి. 16వ శతాబ్దంలో మదురై మొదటి నాయక రాజు విశ్వనాథనాయకుడు ఈ గుడి పునర్నిర్మాణానికి పూనుకున్నాడు. తరువాత తిరుమల నాయక రాజు దీని అభివృద్ధికి పెద్ద ఎత్తున ధన సహాయం చేశాడు. గోపురాలే ప్రధాన ఆకర్షణ
ఈ ఆలయం నలుదిక్కులా నాలుగు ఎత్తైన రాజగోపురాలతో గంభీరంగా గోచరిస్తుంది. సుందరపాండ్యన్, పరాక్రమ పాండ్యన్లు 13,14 శతాబ్దాల్లో తూర్పు, పశ్చిమ గోపురాలను, 16వ శతాబ్దంలో శివ్వంది చెట్టియార్ దక్షిణ గోపురాన్ని కట్టించారని స్థల పురాణం. తూర్పు గోపురం సమీపంలో అష్టలక్ష్మీ మండపం ఉంటుంది. ఇక్కడ మొత్తం 16 గోపురాలు ఉన్నాయి. గుడి సంప్రదాయం ప్రకారం మొదట మీనాక్షీ అమ్మవారిని దర్శించుకోవాలి. కానీ ఇక్కడికి రావాలంటే తూర్పు వైపున ఉన్న అష్టలక్ష్మీ మంటపం ద్వారా ఆలయ ప్రవేశం చేయాలి. చూపరులను కట్టిపడేసే మరో అద్భుత నిర్మాణం స్వర్ణ కమల తటాకం. ఆలయ ప్రవేశ ద్వారంపై అమ్మవారి కల్యాణ ఘట్టాలు శిల్పాల రూపంలో చెక్కబడ్డాయి.
ముఖ్యమైన పండుగలు……..
మీనాక్షి తిరుకల్యాణం ఈ ఆలయంలో జరిగే ముఖ్యమైన పండుగ. దీన్ని ఏటా ఏప్రిల్లో నిర్వహిస్తారు. రథోత్సవం, తెప్పోత్సవంతో పాటు పలు ఉత్సవాలు జరుపుతారు. అమ్మవారి కల్యాణంలాగే అవని మూలోత్సవం ఇక్కడ ప్రధానంగా నిర్వహించే పండుగ. పదిరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని సుందరేశ్వరుడికి అంకితం చేశారు. నవరాత్రి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

 1. ఈ గుడి లోపల అంతా తిరిగి చూచుటకు కనీసము 3 గంటలు పట్టును. ఇచట వెయ్యి స్తంభముల మండపము తప్పనిసరిగా చూడవలెను.
 • తరువాత మీనాక్షి అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న పుదు మండపము ఉన్నది. ఇచట అబ్బురపరిచే శిల్పములు ఉన్నవి. చుట్టూ ఇళ్లు, అంగడులు ఉండుట వలన ఇది ఎక్కువ ప్రసిద్ధి చెందలేదు, కానీ ఇది కూడా గొప్ప చోటు.
 • తిరుమలై నాయక్కర్ మహాల్ – పూర్వము ఇది భవంతి, ఇప్పుడు ఇది సంగ్రహాలయము (మ్యూజియం).అబ్బురమైన నాయక్కర్ పాలకుల వాస్తు శిల్పకళ చూడవచ్చును. మండపము లో గొప్ప స్తంభములు ఉన్నవి.
 • తిరుప్పరంకుండ్రం – మురుగన్ ఆరుపడైవీడు అనబడే కార్తికేయ స్వామి ఆరు నివాసములలో ఒక్కటయినది. మదురై పట్టనము నుండి 20 నిమిషములులో చేరుకోవచ్చును. గుడి ఉన్న కొండ దూరమునుండి చూచినచో అందముగా ఉండును.
 • పళముదిర్ చోలై – కార్తికేయ స్వామి గుడి, అళగర్ మలై పర్వతపాదము లో ఉన్నది. అళగర్ కోవెలకు వెళ్లే దారిలో ఉన్నది.
 • అళగర్ మలై కోవెల – విష్ణు స్వామి వారి గుడి. మదురై పట్టనము నుండి 21 కి.మీలో ఉన్నది.
 • గాంధీ సంగ్రహాలయము / మ్యూజియం.
ఒక్కరోజు పర్యటన కొఱకు ఈ ప్రదేశములు సరిపొతాయి.
ఏ చోటుకు వెళ్ళినను అచటి ఆహారమును కూడా తినవలె, అందుకొఱకు వీటి తో పాటు కొన్ని ప్రసిద్ధమైన భోజనశాలలు, ఆహారములు కూడా చేర్చుదును.
 1. ప్రొద్దున అల్పాహారము – వెన్న పొంగల్, ఇడ్లీ, మరియు వడా (గారె) కొఱకు మురుగన్ ఇడ్లీ కొట్టు.
 2. సంప్రదాయమైన తమిళనాడు భోజనము కొఱకు సరవన భవన్, అమ్మా మెస్, మీనాక్షి భవన్.
 3. సాయంత్ర అల్పాహారము – వడా, బజ్జి, కొఱకు వీధి ప్రక్కకు ఉండే కొట్లు.
 4. మదురై లో మాత్రము తప్పక త్రాగ వలసిన చల్లటి పానియము జిగర్తండా ఇది తమిళనాడు లో చాలా ప్రదేశములలో దొరుకును, కాని మదురై లోని ఫేమస్ జిగర్తండా కొట్టు లో మాత్రముయే సరియైన రుచిగా ఉండును.
ఇంకా కొన్ని రోజులు ఉండి చూచుటకు వైగై ఆనకట్ట, తెప్పకులం మారియమ్మన్ కోవెల, సేయింట్ మేరి చర్చి, కజిమర్ పెద్ద మసిదు, గోరిపాలయం దర్గా కూడా ఆకట్టుకునే ప్రదేశములే.
ఎలా వెళ్లాలి….?
తమిళనాడులోని మదురై నగరంలో ఆలయం ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి మదురైకు రైలు సౌకర్యం ఉంది. చెన్నై నుంచి ఏడు గంటల ప్రయాణం. చెన్నై, మదురై మధ్య వైగై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజూ నడుస్తుంది.
విమానమార్గం : మదురై విమానాశ్రయానికి చెన్నై, తిరుచ్చి, బెంగళూరు, కోయంబత్తూరు నుంచి రోజూ విమాన సర్వీసులు ఉన్నాయి. మదురైకు దేశంలోని ప్రధాన ప్రాంతాలనుండి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

How to go : This tremendous architectural wonder is situated in Madurai (Tamilnadu).
from chennai : Bus route : 464 km
Trains : Chennai Egmore : 497 km
Official Website : www.maduraimeenakshi.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s