మానస సరోవరం మరియు కైలాస పర్వత యాత్ర

mansarovar

సాక్షాత్తు శివుడు కొలువైన ఆ కైలాస పర్వతాన్ని, దేవతల సరస్సుగా భావించే మానస సరోవరాన్నీ చూడాల్సిందే తప్ప వర్ణించటం వీలుకాదు.
మానస సరోవరం, కైలాస శిఖరం రెండూ టిబెట్‌లోనే ఉన్నాయి.
భారతీయులకు, నేపాలీలకు, టిబెటన్లకు మానససరోవరం ఓ పవిత్రవైన స్థలం. మానససరోవరంలోని మంచినీరు ప్రపంచంలోనే స్వచ్ఛమైన జలంగా పేరుపొందినది. ఈ సరోవరంలో తిరిగే తెల్లని హంసలు చూపరులకు కనువిందు చేస్తాయి.
టిబెట్‌ ఓ ఎత్తైన పీఠభూమి. ప్రస్తుతం టిబెట్ చైనా వారి ఆక్రమణలో ఉన్నది. అక్కడ పగలు ఎండా, రాత్రి చలీ విపరీతంగా ఉంటాయి.
మానససరోవరం వెళ్లాలంటే ముందుగా నేపాల్ లోని లఖ్‌నవూకి వెళ్లాలి. అక్కడి నుండి ట్రావెల్‌ ఏజెన్సీ వాళ్లు నేపాల్‌ గంజ్‌కు తీసుకువెళతారు. నేపాల్‌ గంజ్‌ కు నాలుగు గంటల రోడ్డు ప్రయాణం. అన్ని సౌకర్యాలూ ఉన్న హోటల్‌ గదులు ఇక్కడ ఉంటాయి.. నేపాల్‌ గంజ్‌లో శక్తిపీఠంగా పిలవబడే భాగేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది.
దేవలోకం!
మానస సరోవరంలోని పవిత్ర జలాలను తాకాలనే సంకల్పం ఉంటే సరిపోదు. ఓపిక, సహనం ఉండాలి. కష్టాలను తట్టుకోవాలి. ఊహించని వాతావరణ పరిస్థితులు, మంచుగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఎగుడు దిగుడు పర్వతాల మీదుగా యాత్రంతా సాహసోపేతంగా సాగిపోతుంటుంది
టిబెట్‌ పీఠభూమిలోని సరస్సులన్నీ ఉప్పునీటి సరస్సులే కాని.. మానస సరోవరం మాత్రం పూర్తిగా మంచినీటి సరస్సే. దీనికి సమీపంలో ఉన్న రాక్షస్‌తాళ్‌ కూడా ఉప్పునీటి సరస్సే.
మానస సరోవర్‌ లోతు 300 అడుగులు. పరిధి సుమారు 90 కిలోమీటర్లు. ఉపరితల విస్తీర్ణం 320 చదరపు కిలోమీటర్లు. ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఇదొకటి.
మానస సరోవరం… ఆసియాలోని పలు దేశాలకు జీవనదులైన.. సింధు, సట్లెజ్‌, బ్రహ్మపుత్ర, కర్నాలి (గంగానదికి ఉపనది) పుట్టినిల్లు.
అక్కడనుండి హిల్‌సా అనే గ్రామానికి వెళ్లవలసి ఉంటుంది. ఈ గ్రామం సముద్ర మట్టానికి 3640 మీ. ఎత్తులో నేపాల్‌కీ టిబెట్‌కీ సరిహద్దులో ఉంది. చుట్టూ కొండలూ వాటిమధ్యలోంచి పారే సెలయేర్లూ… ఆ ప్రదేశం ఎంతో మనోహరంగా ఉంటుంది.
ఈ వాతావరణంలో ఆల్టిట్యూడ్‌ సిక్‌నెస్‌ కారణంగా తలనొప్పి వస్తుంది. అది తగ్గాలంటే డయామాక్స్‌ మాత్రలు వేసుకోవాలి.
మానస సరోవరం!
తరువాత హిల్‌సా నుంచి సరిహద్దు దాటి చైనాలోకి వెళ్లాల్సి ఉంటుంది. యాత్రా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ చేస్తారు. ఈ యాత్రకు పాస్‌పోర్టు తప్పనిసరి. ప్రభుత్వంతోబాటు ప్రైవేటు సంస్థలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి, మన పాస్‌పోర్టును వాళ్లకు పంపిస్తే, వాళ్లే చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు. అదే గతంలో అయితే ప్రభుత్వం మాత్రమే కైలాసమానస సరోవర యాత్రను నిర్వహించేది.
చైనా ఇమిగ్రేషన్‌ చాలా కఠినం. అక్కడినుండి నాలుగు చెక్‌పాయింట్లు దాటి తకలా కోట్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ తకలా కోట్‌ సముద్ర మట్టానికి 4025 మీ. పైన ఉంది. అక్కడ మన రూపాయల్ని చైనా యెన్‌ల్లోకి మార్చుకోవాలి. మళ్లీ ఓ చెక్‌ పాయింట్‌ దాట వలసి ఉంటుంది. దారిలో ముందుగా రాక్షస స్థల్‌ అనే ప్రాంతం వస్తుంది. ఇది రావణాసురుడు సృష్టించుకున్న ఓ పెద్ద సరోవరం అని చెబుతారు.
ఇది మానస సరోవరానికి పడమర దిక్కుగానూ కైలాసానికి దక్షిణంగానూ ఉంటుంది.
అక్కడి నుంచి మానస సరోవరం 23కి.మీ. దూరంలో ఉంది.. నీలం రంగులో ఎంతో ప్రశాంతంగా ఉంటుందీ సరస్సు. సుమారు 88 కి.మీ. చుట్టుకొలత ఉంటుంది. మానససరోవరంలో స్నానం చేయటం ఓ అదృష్టంగా భావిస్తారు.
సరోవరంలో నీరు చాలా చల్లగా తేటగా మెరుస్తుంటాయి. టూర్ నిర్వాహకులు సమీపంలోనే సుమారు 20 అడుగుల దూరంలోనే గుడారాలు వేసి వసతి ఏర్పాట్లు చేస్తారు.

రాత్రివేళలో రెండు నుంచి నాలుగు గంటల మధ్యలో ఈ సరోవరానికి దేవతలూ గంధర్వులూ యక్షులూ స్నానాలు చేయడానికి వస్తారనీ వీళ్లు నక్షత్ర కాంతి మాదిరిగా కనిపిస్తారనీ పురాణాల్లో చెబుతుంటారు. ఈ సమయంలో చూస్తే సరోవరానికి అవతలి వైపునా సరోవరం మధ్యలోనూ ఆకాశంలోంచి సరోవరంలోకి దిగుతున్నట్లు నక్షత్ర కాంతులు కనిపిస్తాయి.
తరువాత చూడవలసినది కైలాస పర్వతం ఈ దారిలో యమ ద్వారం వస్తుంది. ఇక్కడ వచ్చిన వారు అందరూ తమ పితృదేవతల్ని స్మరించుకుని, నమస్కరిస్తారు. అక్కడి నుంచే కైలాస పర్వత దర్శనం చేసుకోవచ్చు. కైలాస పర్వతంమీద మాత్రమే మంచు కనిపిస్తుంది. పక్కనే అదే ఎత్తులో ఉన్న కొండలమీద ఎలాంటి మంచూ కనిపించదు. ఎంతో చిత్రంగా అనిపిస్తుంది.
కైలాస పర్వతం చుట్టూ పరిక్రమణ చేస్తే దేవతల లోయనీ, శివస్థల్‌, గౌరీకుండ్‌… వంటి ప్రదేశాలన్నీ కనిపిస్తాయంటారు.

కైలాసగిరి.

Image

ఈ పర్వతం హిందువులకు మాత్రమే కాకుండా బౌద్ధులకు, టిబెట్‌లోని ప్రధాన మతాచారమైన బోన్‌లకు, జైనులకు కూడా అత్యంత పవిత్రమైనది. ప్రపంచ దేశాల నుంచి ఏటా వేలమంది యాత్రికులు, పర్యాటకులు కైలాస, మానస సరోవర సందర్శనకు వస్తుంటారు.

కైలాస పర్వతంపై ప్రత్యేక కోణంలో సూర్యుని వెలుగు పడినప్పుడు కైలాస పర్వతం బంగారు వర్ణంలో మెరిసిపోతుంది… అలా కొన్ని క్షణాల పాటు మాత్రమే కనిపిస్తుంది… ఇది కూడా కొన్ని ప్రత్యేక రోజులలో మాత్రమే… అలాంటి సమయంలో కైలాస పర్వతాన్ని దర్శించడం… అదృష్టం…    

ఈ రోజు వరకు ఎవరూ కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేదు?  

హిందూ మతంలో కైలాస పర్వతం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది, ఎందుకంటే ఇది శివుని నివాసంగా పరిగణించబడుతుంది. అయితే దీని గురించి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ప్రపంచంలోని ఎత్తైన శిఖరం అయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటివరకు 7000 మందికి పైగా ప్రజలు అధిరోహించారు, ఇది 8848 మీటర్ల ఎత్తులో ఉంది, కానీ, ఈ రోజు వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేదు, దాని ఎత్తు దాదాపు ఎవరెస్ట్ కంటే 2000 మీటర్లు తక్కువ అంటే 6638 మీటర్లు. ఇది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది.   మీడియా నివేదికల ప్రకారం, ఒక పర్వతారోహకుడు తన పుస్తకంలో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడని వ్రాశాడు, కాని ఈ పర్వతం మీద ఉండడం అసాధ్యం, ఎందుకంటే అక్కడ శరీర జుట్టు మరియు గోర్లు వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి. ఇది కాకుండా, కైలాస పర్వతం కూడా చాలా రేడియోధార్మికత కలిగి ఉంది.   కైలాస పర్వతం ఎక్కలేకపోవడం వెనుక చాలా కథలు ఉన్నాయి. శివుడు కైలాస పర్వతం మీద నివసిస్తున్నాడని, అందువల్ల జీవించే వ్యక్తి అక్కడికి చేరుకోలేడని కొంతమంది నమ్ముతారు. కైలాస శిఖరాన్ని మరణం తరువాత మాత్రమే లేదా ఎప్పుడూ పాపం చేయని వ్యక్తి మాత్రమే అధిరోహించగలడు.   కైలాష్ పర్వతం మీదుగా కొంచెం ఎక్కిన వెంటనే ఆ వ్యక్తి దిక్కులేనివాడు అవుతాడని కూడా నమ్ముతారు. దిశ లేకుండా ఎక్కడం అంటే మరణం మీద విందు చేయడం, అందుకే ఇప్పటివరకు ఏ మానవుడు కైలాస పర్వతం ఎక్కలేదు.   1999 లో, రష్యన్ శాస్త్రవేత్తల బృందం కైలాస పర్వతం క్రింద ఒక నెల పాటు ఉండి దాని పరిమాణం గురించి పరిశోధించింది. ఈ పర్వతం యొక్క త్రిభుజాకార ఆకారం సహజమైనది కాదని, మంచుతో కప్పబడిన పిరమిడ్ అని శాస్త్రవేత్తలు తెలిపారు. కైలాస పర్వతాన్ని “శివ పిరమిడ్” అని కూడా పిలుస్తారు.   ఈ పర్వతం ఎక్కడానికి బయలుదేరిన వారెవరైనా చనిపోయారు, లేదా ఎక్కకుండా తిరిగి వచ్చారు.   2007 లో, రష్యన్ అధిరోహకుడు సెర్గీ సిస్టికోవ్ తన బృందంతో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు. సెర్గీ తన అనుభవాన్ని ఇలా వివరించాడు: “కొంత దూరం ఎక్కడం నా తలపై మరియు మొత్తం జట్టులో తీవ్రమైన నొప్పిని కలిగించింది. అప్పుడు మా అడుగులు సమాధానం ఇచ్చాయి. నా దవడ కండరాలు సాగడం ప్రారంభించాయి, మరియు నాలుక స్తంభింపజేసింది. నోటి నుండి శబ్దాలు రావడం ఆగిపోయింది. ఎక్కేటప్పుడు, ఈ పర్వతం ఎక్కడానికి నేను సరిపోనని గ్రహించాను. నేను వెంటనే టేకాఫ్ చేయడం మొదలుపెట్టాను, అప్పుడు నాకు విశ్రాంతి వచ్చింది.   “కల్నల్ విల్సన్ కూడా కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించాడు, అతను ఇలా వివరించాడు:” నేను శిఖరానికి చేరుకోవడానికి కొంచెం మార్గం చూసిన వెంటనే, మంచు కురుస్తుంది. మరియు ప్రతిసారీ నేను బేస్ క్యాంప్‌కు తిరిగి రావలసి వచ్చింది. “అప్పుడు చైనా ప్రభుత్వం కొంతమంది అధిరోహకులను కైలాస శిఖరాన్ని ఎక్కమని కోరింది. అయితే ఈసారి ప్రపంచం మొత్తం ఈ చైనా చేష్టలను  వ్యతిరేకించడంతో చైనా ప్రభుత్వం ఈ పర్వతం ఎక్కడం మానేసింది. అతను ఎక్కడానికి ప్రయత్నిస్తాడు, అతను ఎక్కలేకపోతున్నాడు, అతని గుండె మారుతుంది. గాలిలో ఏదో భిన్నంగా ఉంటుంది. మీ జుట్టు మరియు గోర్లు 2 రోజుల్లో పెరుగుతాయి, ఇది 2 వారాలలో పెరుగుతుంది. కనిపిస్తోంది. వృద్ధాప్యం ముఖం మీద కనిపించడం ప్రారంభిస్తుంది. కైలాస శిఖరం ఎక్కడం క్రీడ కాదు.   29,000 అడుగులకు పెరిగిన తర్వాత కూడా ఎవరెస్ట్ ఎక్కడం సాంకేతికంగా సులభం. కానీ కైలాస పర్వతం ఎక్కడానికి మార్గం లేదు. నిటారుగా ఉన్న రాళ్ళు మరియు మంచుకొండలతో చేసిన కైలాష్ పర్వతాన్ని చేరుకోవడానికి మార్గం లేదు. అతి పెద్ద అధిరోహకులు కూడా ఇలాంటి కష్టతరమైన రాళ్ళను ఎక్కడానికి మోకరిస్తారు.ప్రతి సంవత్సరం లక్షలాది మంది కైలాష్ పర్వతం చుట్టూ కక్ష్యలోకి వస్తారు. మార్గంలో, మానస సరోవరంను కూడా సందర్శిస్తాడు, కాని ఈ రోజు వరకు ఒక విషయం మిస్టరీగా మిగిలిపోయింది. ఈ పర్వతం తగినంతగా తెలిస్తే, ఈ రోజు వరకు ఎవరూ ఎందుకు ఎక్కలేదు?

కైలాస శిఖరం ఉత్తరభాగం దగ్గరగా

మానససరోవరం చూడాలంటే ఆరోగ్యవంతులై ఉండాలి. అక్కడి వాతావరణానికి తట్టుకోవాలి. 4000 మీటర్ల ఎత్తులో శ్వాస అందటం కష్టంగా ఉంటుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి రావచ్చు. డాక్టర్ సలహాతో మందులు దగ్గర ఉంచుకోవటం తప్పనిసరి
పగలు తేలికైన నూలు దుస్తులూ రాత్రివేళలో ధరించడానికి ఉన్ని దుస్తులూ కావాలి. ముఖ్యంగా కైలాస పర్వత పరిక్రమణ చేయాలనుకునేవాళ్లు సన్‌స్క్రీన్‌తోబాటు, ప్రథమ చికిత్సకు అవసరమైన మందులూ బ్యాండేజీలూ దగ్గర ఉంచుకోవాలి. యాత్రకు అవసరమైన మందులూ, థెర్మల్‌ దుస్తులూ, నూలుదుస్తులూ, షూ, గ్లోవ్స్‌… అన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ప్రభుత్వంవారు నిర్వహించే అన్ని శారీరక వైద్య పరీక్షలలో నెగ్గాలి. ఉబ్బసం, సైనస్, అంగవైకల్యం, గుండెజబ్బులు, మధుమేహం ఉన్నవారిని అనుమతించరు.
కేంద్ర ప్రభుత్వంలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏటా కైలాస యాత్ర జరుగుతుంది.
పాస్‌పోర్టు, ఫొటోలు, ఇతర వివరాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది చాలా సుదీర్ఘంగా, సంక్లిష్టంగా సాగే ప్రక్రియ. జూన్‌లో జరిగే యాత్రకు మార్చిలోనే గడువు ముగుస్తుంది. యాత్రికులను కంప్యూటర్‌ లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు. రూ. 1,60,000 చెల్లించాలి. మొత్తం ఖర్చు రూ.2 లక్షలు దాటుతుంది. (2018)
ప్రైవేటు యాత్రా సంస్థలు కైలాసయాత్ర మొదలుపెట్టాక యాత్రికుల సంఖ్య పెరిగింది. వీరు ఎక్కువగా నేపాల్‌ మీదుగా యాత్ర నిర్వహిస్తుంటారు. ప్యాకేజీ ధరలు రూ.1.80 లక్షల నుంచి 2.50 లక్షల వరకు ఉన్నాయి.
అన్ని యాత్రలలాగే మానస సరోవరం వెళ్లాలంటే కుదరదు. తప్పనిసరిగా పాస్ పోర్ట్ ఉండాలి. ప్రభుత్వ అనుమతులు తప్పని సరి. చైనా ప్రభుత్వ అనుమతి కూడా తప్పనిసరి. ఈ అనుమతులు యాత్రా నిర్వాహకులు లేక ప్రభుత్వం వారే తీసుకుంటారు. భారతప్రభుత్వం వారు మరియు ప్రైవేట్ ట్రావెల్స్ వారు ఈ యాత్రలు నిర్వహిస్తారు. ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. భారత ప్రభుత్వం ద్వారా వెళ్లాలంటే పూర్తి వివరాలకోసం ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి. లేక మీకు దగ్గరలోని యాత్రా నిర్వాహకులను సంప్రదించండి.
How to apply Manasarovar-Click here

%d bloggers like this:
Available for Amazon Prime