Dwadasa Jyothirlingalu

Somanath, Gujarat…సోమనాథ్ – సోమనాథుడు – గుజరాత్ Srisail Mallikarjunudu…శ్రీశైలం మల్లికార్జునుడు- కర్నూలు Ujjain Maha Kaleswaswarudu…ఉజ్జయని – మహాకాళేశ్వరుడు – ఉజ్జయని< Omakr, Omkareswarudu….ఓంకార్ – ఓంకారేశ్వరుడు – మధ్యప్రదేశ్ vidyanath, Vaidyanathudu… వైద్యనాధ్ – వైద్యనాథుడు – మహారాష్ట్ర Bhimasankar, Bhimasankar…భీమశంకర్ – భీమశంకరుడు – మహారాష్ట్ర Rameswaram….రామేశ్వర్ – రామేశ్వరం – తమిళనాడు Nageswar…నాగేశ్వర్ – నాగేశ్వరుడు – గుజరాత్ Kasi Visweswarudu….కాశీ – విశ్వేశ్వరుడు – వారణాశి Nasik Trayambakeswarudu…నాసిక్ – త్రయంబకేశ్వరుడు – మహారాష్ట్ర Kedareswar….కేదారనాథ్ – కేదారేశ్వరుడు-ఉత్తరాంచల్ Grushneswar…ఘృశ్నేశ్వర్ – ఘృశ్నేశ్వరుడు – మహారాష్ట్ర

Read More

Sri Ghusmeswara Lingam…. ఘుశ్మేశ్వరము లింగము

ఘుశ్మేశ్వరము లింగము ఒకప్పుడు దేవగిరి అను ఊరునందు సుదర్ముడనే బ్రాహ్మాణుడు ఉండేవాడు. అతని భార్య సుదేహ. వీరికి సంతానము లేదు. ఒకనాడు వారి ఇంటికి ఒక యతి వచ్చాడు. ఆ యతీంద్రునికి అతిధి సత్కారము చేసి భిక్ష స్వీకరించమని కోరగా సంతానహీనుల ఇంట భిక్ష స్వీకరించరాదనే నియమం ఉందని తెలిపి వెళ్ళిపోయాడు. భార్యా భర్తలు మిక్కిలి దుఖించి …సుధర్ముని భార్య సుదేహ స్వామీ మన వంశము అంతరించకుండా మీరు నా చెల్లెలు ఘుశ్మను వివాహమాడవలసిందని కోరటంతో వారి విహాహం జరుగుతుంది. ఘుశ్మ మహప్రతివత. భర్తనే ప్రత్యక్ష దైవంగా సేవించే ఆమె మనస్సున శివుని క్షణక్షణము స్మరించేది. ఆమె గర్భవతియై ఒక బాలునికి జన్మనిస్తుంది. బాలుడు శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతుంటాడు. ఆ బాలుని గాంచి తనకి సంతానము కలగలేదేనే బాధ సుదేహకు అధికమై అది ఆ బాలునిపై ద్వేషముగా…

Read More

Kedarnath Temple…కేదార్ నాద్

Kedarnath Temple కేదార్నాథ్ దేవాలయం, కేదార్నాథ్ కేదార్ నాద్ ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 3,584 మీ. ల ఎత్తున కల ఈ ప్రదేశం హిమాలయాల ఒడి లో హిందువులకు ఒక ప్రసిద్ధ, పవిత్ర యాత్రా స్థలంగా కూడా పేరు గాంచినది. వేసవి కాలంలో అనేక మంది హిందూ యాత్రికులు కేదార్ నాద్ సందర్శించి శివ భగవానుడి ఆశీస్సులు పొందుతారు.. ఇక్కడ కల కేదార్ నాద్ టెంపుల్ సుమారు వేయి సంవత్సరాల కిందట నిర్మించిన ఒక రాతి నిర్మాణం. పర్వత శ్రేణి మధ్య ఉన్న కేదార్నాథ్ దేవాలయం, హిందూ మతం పరమ శివుని యొక్క జ్యోతిర్లింగా ను ప్రతిష్టించారు. దీనికి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరు ఉంది. కేదార్నాథ్ జ్యోతిర్లింగా మొత్తం12 జ్యోతిర్లింగాలలో అత్యున్నతమైనది. ఆది శంకరాచార్య…

Read More

Trayambakeswaram Jyothirlingam

Trayambakeswaram….త్రయంబకేశ్వరం : వనవాస కాలంలో శ్రీరామచంద్రుని మోహించిన రావణాసురుని చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులను లక్ష్మణుడు కోస్తాడు. ఈ ప్రాంతాన్నే నాశిక్ అంటారు. ఇక్కడకు దగ్గరలోనే బ్రహ్మగిరి అనే పర్వతం ఉంది. ఈ పర్వతం దగ్గర సప్తర్షులో ఒకరైన మహాముని గౌతముడు తన భార్య అహ్యలతో నివసించేవాడు. ఒకసారి ఈ ప్రాంతంలో కరువు వచ్చి మునులందరూ నీరు లభించక అనేక ఇబ్బందులు పాలయ్యారు. గౌతముడు తన తపశ్శక్తితో దేవతల అనుగ్రహంతో నీటి సౌకర్యాన్ని కల్పించి పంటలు పండిస్తాడు. తోటి మునులు అసూయతో ఒక మాయాగోవును సృష్టించి గౌతముని పోలంలోనికి వదలుతారు. గౌతముడు పంటను పాడుచేస్తున్న ఆవును ఆదిలించటానికి ఒక దర్భను (గడ్డిపోచ) విసురుతాడు. దానితో ఆ మాయాగోవు మరణిస్తుంది. గౌతముడు గోహత్యా నివారణకై శివుని కొరకు ఘోర తపస్సు చేస్తాడు. గౌతముని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శివభగవానుని…

Read More

Sri Kasi Visweswara Lingam..కాశీ విశ్వేశ్వర లింగము

కాశీ విశ్వేశ్వర లింగము సృష్టిని నిర్మించతలచి పరమేశ్వరుడు శివశక్తి స్వరూపము దాల్చినాడు. ఆ అర్థనారీశ్వరరూపము నుండి పురుషుడగు నారాయణుడు, ప్రకృతి అవతరించారు. వారికి తామెవరో ఎక్కడ నుండి వచ్చారో తెలియలేదు. అప్పుడు అశరీరవాణి అఖిలాండ కోటి బ్రహ్మాండములను సృష్టించుటకు మీరు సృజించబడ్డారు. ఆ శక్తిని పొందుటకు, పరబ్రహ్మము గూర్చి తపస్సు చేయండి అని అని వినిపించింది. అయితే ఎటుచూసినా జలమే తప్ప నివశించుటకు స్థలమే కానరానందున ఎక్కడ తపస్సు చేయాలో వారికి తెలియలేదు. అప్పుడు పరబ్రహ్మ తేజము నుండి ఐదు క్రోసుల విస్తారము గల ఒక పట్టణము ఉద్భవించినది. అదేకాశీ పట్టణం. నారాయణుడు కాశీ పట్ఠణము నందు ఘోర తపస్సు చేయగా ఆ తపోవేడిమికి అతడి శరీరమున చెమటలు పట్టగా ఆ నీరు కాలువలై ప్రపవహించినది నారాయణుడా జలములను ఆశ్ఛర్యముతో తిలకించగా అతడి చెవికమ్మ జారి జలమునందు పడిపోయినది.…

Read More

Nageswar Jyothirlingam

Nageswaralayam, Gujarat…నాగేశ్వరాలయం (నాగేశ్వర్‌) – గుజరాత్‌ఈ పవిత్ర నాగేశ్వరాలయానికి సంవత్సరం పొడుగు భక్తులు వస్తారు. ఈ స్వామిని దర్శించుకుంటే అన్నిరకాల విషప్రయోగాల నుండి విముక్తులవుతారని భక్తుల విశ్వాసం. స్థలపురాణం : శివపురాణం ప్రకారం ఇక్కడ దారుకా వనంలో దారుకుడనే రాక్షసుడు తన భార్య దారుకితో నివసిస్తాడు. శివభక్తుడైన సుప్రియడు మరియు అనేక మందిని చెరసాలలో బంధిస్తాడు. సుప్రియుని ప్రేరణతో అందురూ ఓంనమఃశ్శివాయ మంత్రాన్ని జపిస్తారు. కోపోద్రేకుడైన దారుకుడు వారిని సంహరించబోగా శివభగవానుడు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై పాశాపతాస్త్రంతో దారుకుని సంహరిస్తాడు. ఎలా వెళ్ళాలి : ఈ పవిత్ర నాగేశ్వరాలయం గుజరాత్‌ రాష్ట్రంలో గోమటి ద్వారక మరియు బేయిట్‌ ద్వారకా దీవి మార్గంలో కలదు. బెట్‌ద్వారకా, జామ్‌నగర్‌, అహ్మదాబాద్‌, రాజ్‌కోట్‌ నుండి రోడ్డుమార్గాలలో వెళ్ళవచ్చు. దగ్గరలోని రైల్వే స్టేషన్‌ లు జామ్‌నగర్‌, రాజ్‌కోట్‌, ద్వారక, పోర్‌బందర్‌ అహ్మదాబాద్‌.

Read More

Rameswaram Jyothirlingam

Rameswaram…రామేశ్వరం … రామేశ్వరం తమిళనాడులోని రామేశ్వరం అనే దీవిలో ఉన్నది. సముద్రం మీదుగా నిర్మించిన పంబన్‌ అనే వంతెన మీదగా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఆలయం పొడవైన వసారా(నడవా) తో అలంకారంతో చూడచక్కగా నిర్మించబడింది. ఇక్కడ 36 తీర్థాలు కూడా కలవు. స్థలపురాణాం : శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించి లంకపై విజయం సాధించిన తరువాత తిరుగు ప్రయాణంలో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించదలచి హనుమంతుని కాశీనుండి శివలింగాన్ని తేవలసిందిగా కోరతాడు. హనుమంతుని రాక ఆలస్యమైనందున శ్రీరాముడు సీతాదేవిచే చేయబడిన ఇసుక లింగాన్ని ఇక్కడ ప్రతిష్టాడు. తరువాత హనుమంతునిచే తేబడిన శివలింగం (విశ్వనాధ శివలింగంగా పేరుపొందినది) కూడా ఇక్కడ ప్రతిష్టించబడుతుంది. రామేశ్వరం 15 ఎకరాలలో చూడముచ్చటైన గోపురాలతో చుట్టూ ఆలయ ప్రాకారాలతో నిర్మించబడినది. ఎత్తైన వేదిక మీద నాలుగు వేల స్థంభాల మీద నిర్మించ బడిన వసారా ప్రపంచంలో అతి…

Read More

Bhimasankar Jyothirlingam

భీమశంకరాలయం మహారాష్ట్రలోని పూనాకు దగ్గరగా భావగిరి గ్రామంలో ఖేడ్‌కు సుమారు 50 కి.మీ దూరంలో సహ్యాది పర్వతాలలో భీమా నది ఒడ్డున కలదు. భీమానది ఇక్కడ నుండి ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది. మహారాష్ట్రలోని గృష్ణేశ్వర్‌ మరియు త్రయంబకేశ్వరం అనే జ్యోతిర్లింగాలు కూడా కలవు. స్థలపురాణం : రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుని కొడుకు భీముడు తన తల్లి కర్కాటితో ఇక్కడ అరణ్యాలలో నివసిస్తుంటాడు. రావణాసురుని మరియు తన తండ్రి కుంభకర్ణుని చంపిన మహావిష్ణువు మీద పగతో బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి అపారమైన శక్తులు పొందుతాడు. వరగర్వంతో ఇంద్రుని జయిస్తాడు. మూడులోకాలను పీడించసాగాడు. మరియు శివభక్తుడైన గృష్ణేశ్వర్‌ ను పాతాళచెరలో బంధిస్తాడు. దేవతలంతా బ్రహ్మతో కలసి భీముడి ఆగడాలను గురించి శివునితో మొరపెట్టుకుంటారు. భీముడు శివునికి బదులుగా తనని ప్రార్థించవసినదిగా కమృపేశ్వర్‌ను ఆజ్ఞపించగా అతను తిరస్కరిస్తాడు. అపుడు…

Read More

వైద్యనాధేశ్యరుడు

వైద్యనాధేశ్యరుడుపూర్వోత్తరే ప్రజ్వలికానిధానే,, సదా వసంతం గిరిజాసమేతమ్,నురాసురారాధిత పాదపద్మం, శ్రీవైద్యనాథం తమహం నమామిలంకాధిపతి అయిన రావణుడు మహఆశిభక్తుడు. అతడు కోరినపుడలు కైలాసమునకు వెళ్ళి శివదర్శన భాగ్యము పొందేటంతటి గొప్పవాడు. ఒకసారి శివుని ఆత్మలింగం పొందగోరి ఘోరతపస్సచేసి శివుని దర్శనం పొందిన తరువాత శివుని ఆత్మలింగాన్ని కోరతాడు. . శివుడు తన ఆత్మలింగాన్ని ఇస్తూ దీనిని నీ లంకారాజ్యంలో ప్రతిష్టించు కానీ మార్గమధ్యమున ఈ ఆత్మలింగాన్ని నేలపై ఉంచరాదు. అలా ఉంచిన ఆత్మలింగం అక్కడే ప్రతిష్టమవుతుంది. దానిని కదిలించడం నావల్ల కూడా కాదు. అని హెచ్చరించాడు. రావణుడు సంతోషంతో ఆత్మలింగాన్ని దోసిట్లో ఉంచుకొని లంకకు బయలు దేరతాడు. దారిలో అఘుశంక తీర్చుకోవలసిన అవసరం వచ్చింది. రావణనికి సమీపంలో గోవులను మేపుకుంటున్న ఒక బాలకుడు కన్పిస్తాడు. రావణుడు ఆ బాలుని పిలచి కొంతసేపు ఆత్మలింగాన్ని పట్టుకోవాల్సిందిగా కోరతాడు. ఆ బాలుడు ముమ్మారు…

Read More

Omkareswara Lingam…. ఓంకారేశ్వరుడు

ఓంకారేశ్వరుడు నారదుడు ఒకసారి భూలోక సంచారం చేస్తూ వింధ్య పర్వతాలకు వస్తాడు. వింధ్యపర్వతుడు నారద మహర్షికి గౌరవ మర్యాదలతో అతిధి సత్కారాలు చేస్తాడు. తదుపరి ఇరువురి ప్రసంగంలో వింధ్య పర్వతుడు నా యందు సమస్త సంపదలు సకల ధాతువులు మిక్కిలిగా ఉన్నాయి. కాబట్టి నేనే పర్వతాలన్నిటి సార్వభౌముడని అన్నాడు. అందులకు నారదుడు వింధ్యా నీ ఎలా పర్వత సార్వభౌముడవు కాగలవు. మేరు పర్వత శిఖరాలు మహోన్నతాలై దేవలోకము వరకు వ్యాపించి ఉన్నాయి. ఇంద్రాది దేవతలు ఆ పర్వతంపై విహరిస్తుంటారు. నీకా భాగ్యం లేదు కదా. అని అన్నాడు. వింధ్యుడు విచారించి మేరు పర్వతం కన్నా తానే గొప్పవాడనిపించుకోవటానికి నిశ్ఛయించుకొన్నాడు. వింధ్యుడు తన శిఖరమున ఓంకార యంత్రమును నిర్మించి దాని మధ్య పార్థివ లింగమును స్థాపించి శివుని కొరకై ఘోర తపమాచరించాడు. ఇట్లు నూరు మాసములు కఠోర తపస్సు సాగిన…

Read More

Mahakaleswar Jyothirlingam

Makaleswar, Ujjain…మహాకాళేశ్వర్‌ ఉజ్జయని …. మహాకాళేశ్వరాయం ఉత్తరభారత దేశంలోని జ్యోతిర్లింగాలో ముఖ్యమైనది. స్థలచరిత్ర : పురాణ ప్రకారం ఉజ్జయనీ రాజైన చంద్రహాసుని శివభక్తికి ఆకర్షితుడైన 5 సంవత్సరాల బాలుడు శ్రీకరుడు ఒక రాయిని తీసుకొని అదే శివలింగంగా భావించి రోజూ పూజించసాగాడు. అక్కడి ప్రజలు అతనిని అనేక రకాలుగా నిరుత్సాహపరచారు. వారి ప్రయత్నాలన్నీ విఫలంకాగా శ్రీకరుని భక్తికి మెచ్చి శివభగవానుడు జ్యోతిర్లింగ రూపంలో అక్కడ వెలిశాడు. ఇంకొక కథóనం ప్రకారం దుశాన అనే రాక్షసుడు అవంతీ నగరప్రజలను పీడించుచుండగా శివభగవానుడు ఆ రాక్షసుని సంహరించి ప్రజల కోరిక మేరకు అక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడంటారు.మహాకాళుని ఆలయం విశాలమైన ప్రాంగణంలో చుట్టూ గోడలతో 5 విభాలుగా ఉన్నది. భూగర్భంలో ఉన్న మహాకాళుని గర్భగుడిలోనికి ఇత్తడి దీపాల వెలుగులో వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడి శివలింగం పెద్దదిగాను మరియు వెండితో చేయబడిన సర్పం…

Read More

శ్రీశైల మల్లికార్జునుడు

ద్వాదశ జ్యోతిర్లింగములలో శ్రీశైలం రెండవది. ఈ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలో దట్టమైన నల్లమల అడవులలో ఉంది. స్థలపురాణం : పార్వతి పరమేశ్వరుల కుమారులు గణేశుడు, స్కందుడు రుద్రగణాధిపత్యంకై జరిగిన పోటీలో వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షణం చేసి గెలిచి గణాధిపత్యం దక్కించుకుంటాడు. స్కందుడు అలిగి కైలాసం వదలిపెట్టి శ్రీశైలం వచ్చి క్రౌంచపర్యతం మీద తన కాళ్ళకు మంత్రబద్ధంగా బంధనములు ఏర్పాటు చేసుకొని ఆసీనుడు అవుతాడు. కుమారుని అలక తీర్చి కైలాసమునకు తీసుకురమ్మని శివపార్వతులు నారదుని పంపుతారు. నారదుడు వచ్చి ఎంత నచ్చ చెప్పినా స్కందుడు వినేలేదు. పార్వతీ దేవి పుత్రవాత్సల్యము చేత శ్రీశైలమునకు వచ్చి కుమారునకు నచ్చచెప్పినా వినలేదు. అప్పుడు పార్వతీ దేవి శ్రీశైలంలోని స్థిరనివాసం ఏర్పరుచుకొంటొంది. శివుడు కూడా ఆమెను అనుసరించి శ్రీశైలంలో జ్వోతిర్లింగ స్వరూపుడై వెలుస్తాడు. నారదుడు, బ్రహ్మాది దేవతలు అచ్చటికి వచ్చి శివపార్వతులు, స్కందుని…

Read More

సోమనాథక్షేత్రం – గుజరాత్‌

జ్యోతిర్లింగాలో మొదటిది ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నది. స్కందపురాణంలో ఈ క్షేత్రం గురించి వివరించబడి ఉన్నది. దక్షప్రజాపతి యొక్క పుత్రికలలో 27 మందిని చంద్రుడు పెళ్ళాడుతాడు. వారిలో రోహిణి పట్ల ప్రత్యేక ప్రేమ కనపరుస్తాడు. దీంతో కోపోద్రికుడైన దక్షుడు చంద్రుని శపిస్తాడు. దీంతో చంద్రుడు తన తేజస్సును, కళను కోల్పొతాడు. అప్పుడు చంద్రుడు రోహిణితో సహా ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఉన్న స్పర్శలింగన్ని కొలిచి తన తేజస్సును తిరిగి పొందుతాడు. అప్పటినుండి ఈ క్షేత్రం ప్రభాస తీర్థంగా పేరు పొందినది. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ ఇక్కడ బ్రహ్మశిలను స్థాపిస్తాడు. దేవతల కోరిక మేరకు శివభగవానుడు సోమనాధుడి పేరిట ఇక్కడ నివసిస్తాడు. ఈ పవిత్ర క్షేత్రం మహ్మద్‌ గజని చేత 1025లో నాశనం చేయబడినది. ఇక్కడ ఉన్న అపారసంపద ధనరాశులు గజనీ చేత కొల్లగొట్టబడినవి.…

Read More

షిరిడీ సాయిబాబా ఆలయం

దేవస్థానం వారి వసతి సౌకర్యాలు ద్వారావతి భక్తినివాస్‌ : బస్‌స్టాండ్‌ నుండి నడచి వెళ్ళవచ్చు ( ధర్మశా తరువాత రెండు నిమిషాలప్రయాణం) 334 రూములు. సత్రాలు, 6 నుండి 10 మంది సభ్యులకు సరిపోవు రూములు కలవు. 80 ఎ.సి రూములు కలవు. పార్కింగ్‌ స్పేస్‌, 24 గంటలు నీటివసతి, కరెంట్‌ సౌకర్యం కలదు.సామాన్య భక్తులకు : కామన్‌ బాత్‌ రూమ్స్‌, టాయ్‌లెట్స్‌ : రూ.50 మాత్రమే.ఎ.సి. సూట్స్‌ : ఒక రోజుకు రూ.700 భక్తినివాస్‌ (కొత్తది)542 రూములు గల విశామైన కాంప్లెక్స్‌ సాయి మందిరానికి దక్షిణము వైపున గల హైవేలో ఉన్నది. షుమారు 1 కిలో మీటరు దూరం. మందిరం కాంప్లెక్స్‌ నుండి న్యూ భక్తినివాస్‌కు 24 గంటలు ఉచిత బస్సులు కలవు. పార్కింగ్‌ సౌకర్యం, 24 గంటలు విద్యుత్‌ మరియు నీటి సౌకర్యం, ఫలహారశాలు…

Read More

ఏటూరునాగారం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం అభయారణ్యం వేసవి తాపం కనిపించదు. ఎండ పడదు పెద్ద పెద్ద చెట్లు చక్కటి చల్లదనాన్నిస్తాయి. పచ్చని చెట్లు మధ్య వడగాలి మాట మర్చిపోతారు. అటవీశాఖ వారు దట్టమైన అడవి మధ్యలో తాడ్వాయి దగ్గర ఏర్పాటు చేసిన వనకుటీరాలలో బస చేయవచ్చ.ఈ అరణ్యంలో సమయం ఆనందంగా గడిచిపోతుంది. ఉదయాన్నే.. చెట్ల నుంచి తొంగిచూసే సూర్యుడి లేత కిరణాలు .. మనసుకు ఆనందం కలిగిస్తాయి. ఈ వనంలో సైకిల్‌ సవారీ కోసం ప్రత్యేకమైన ట్రాక్‌ కూడా ఏర్పాటు చేయబడింది. సైకిళ్లు అద్దెకు ఇస్తారు. స్వచ్ఛమైన గాలి పీలుస్తూ.. సైకిల్ మీద తిరుగుతూ… ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. జింకలు, కుందేళ్లు .. కనిపించ వచ్చు. అడవిలో తిరగటానికి సహాయంగా గైడ్‌ ఉంటారు. అభయారణ్యం విశేషాలన్నీ చెప్పగలరు. వనంలోని విశేషాలను చూపిస్తాడు. ఆదిమమానవుల కాలంనాటి దామెరవాయి రాక్షస…

Read More

బతుకమ్మ పండుగ

బతుకమ్మలో దైవత్వం కంటే మానవత్వమే ఎక్కువగా కనిపిస్తుంది. సామాన్యమైన పూలు తంగేడు, గునుగు, కట్ల, బంతిపూలతో బతుకమ్మను చేస్తారు. బతుకమ్మ గురించి పురాణాల్లో ప్రస్తావన లేదు. పల్లెజనం జానపదాలతో గుండెల్లో ప్రతిష్టించుకున్నారు. బతుకమ్మ పండుగకు కులబేధాలు లేవు. అందరూ చేయీ చేయీ కలిపి ఆడతారు పాడతారు. మహాలయ అమావాశ్య నుంచి సద్దుల బతుకమ్మ దాకా తొమ్మిది రోజులూ సందడే సందడి. తెలంగాణా ఆడపడుచులకు బతుకమ్మ పండగకు రావాలె బిడ్డా! అన్న పిలుపు పుట్టింటి నుండి వస్తుంది. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళతో అనుబంధాలు, చిన్ననాటి నేస్తాలతో కబుర్లు. ఆనందంగా బతుకమ్మ ఆడతారు. బతుకమ్మకు మంత్రాలుండవు..కలిసి పాడుకునే పాటే మంత్రం! బతుకమ్మకు గుడులుండవు… నలుగురు గుమిగూడిన చోటే గుడి. బతుకమ్మ ఆటకు నిబంధనలు ఏమీ లేవు. నాలుగు చేతులు కలిస్తే ఆట..జనజీవన సౌందర్యమే బతుకమ్మ! బతుకమ్మను అంకరించడం ఒక కళ. .…

Read More

బోనాల పండుగ

తెలంగాణా సంస్కృతి, సంపప్రదాయాలకు పట్టుగొమ్మ… బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా వేపాకులతో వీధుల అలంకరణ, నెల రోజుల పాటు జంటనగరాలు ఆధ్యాత్మిక సంద్రంగా మారుతాయి. జంట నగరాలలో 115 ఆలయాలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆషాఢమాసం ప్రారంభమైన తొలి ఆదివారం నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తొలివారం గోల్కొండ కోటలో వెలసిన శ్రీజగదాంబా మహంకాళి (ఈ దేవతనే ఎల్లమ్మ తల్లిగా పిలుచుకుంటారు) ఆలయం నుండి ప్రారంభమవుతాయి. తరువాత లష్కర్‌ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్‌లోని ఉజ్జయనీ మహంకాళి ఆలయం, కట్ట మైసమ్మ ఆలయం మీదుగా పాతబస్తీకి చేరుతాయి. ఎల్లమ్మ దేవతతో మొదలయ్యే బోనాలు అఖరి రోజున ఎల్లమ్మ దేవత అర్చనతోనే ముగుస్తాయి. రంగురంగుల కాగితాలతో కట్టిన తొట్లు బోనాల ప్రత్యేక ఆకర్షణ. బోనం తమ ఇష్టదైవాలకు సమర్పించే నైవేద్యమే బోనం. కొత్త కుండలో బియ్యం, బెల్లం, పాలతో వండి నైవేద్యంగా…

Read More

సమ్మక్క సారమ్మ జాతర

సమున్నతమైన ఆశయంకోసం, జనం కోసం, నమ్ముకున్న వారి కోసం ప్రాణాల్ని సైతం తృణపాయంగా అర్పించిన అమరవీరుల్ని దైవస్వరూపులుగా భావించి పూజించి వారికి కృతజ్ఞాతా పూర్వకంగా మొక్కుబడులు సమర్పించుకోవటం గిరిజనుల సాంప్రదాయం. సమ్మక్క సారమ్మ త్యాగాలకు గుర్తుగా ప్రారంభమైనది సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. ప్రజలకు ఆపద వచ్చినపుడు యుద్ధానికి నడుం బిగించి ఆ పోరులో ప్రాణాలు అర్పించిన గిరిజన వీరులు వీరు. వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి మాఘమాసంలో జరుగుతుందీ జాతర. ఆసియాలోనే అతి పెద్ద జాతలరలో ఒకటిగా పేరుగాంచిన జాతర ఇది. 2109 వ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఘనంగా జరిగుతుంది. ఈ ఉత్సవాల వెనుక చాలా చరిత్ర ఉంది. 13వ శతాబ్బంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని కాలంలో గోదావరి తీర ప్రాంతం మేడరాజు అనే కోయదొర ఏలుబడి…

Read More

అనంతగిరి – తెలంగాణా ఊటి

సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యంతో పర్యాటకులకు కనువిందు చేసే ప్రాంతం అనంతగిరి. ఈ ప్రాంతం అంతగా ప్రచారంలోకీ రాలేదు. కానీ ఇటీవల ఈ ప్రాంతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. అక్కడి జలపాతాల గలగలలు, పక్షుల కిలకిల రావాలు, కొండ కోనలు, సేలయేటిధారలు, రాతి కట్టడాలు,సహజసిద్ధంగా ఏర్పడినగుహలు ప్రకృతి ప్రేమికులకు ఆహ్వానం పలుకుతాయి. దట్టమైన అడవుల మధ్య నెలకొ ఉన్న అనంతగిరి ప్రాంతం మూసీనది జన్మస్థానం కూడా. అనంతగిరిని తెలంగాణీ ఊటిగా పేర్కొంటారు. అనంతగిరికి వేళ్తే పట్టణ బిజీ జీవితం మరచి పోవచ్చు. మనసుకెంతో హాయి కలుగుతుంది. ఆధ్యాత్మికం, ఆహ్లాదం ఈ రెండింటి కలయికే అనంతగిరి ప్రత్యేకం. హైదరాబాద్ కు సుమారు 90 కిలో మీటర్ల దూరంలో కనువిందు చేస్తూ తెలంగాణ ఊటీగా పేరుగాంచిన పర్యాటక కేంద్రం అనంతగిరి. వికారాబాద్‌ నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి…

Read More

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయం

రామలింగేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్‌ జిల్లా ములుగు తాూకా, వెంకటాపురం మండలంలోని పాలంపేట అనే గ్రామనికి దగ్గరలో ఉన్నది. 5 ఎకరాల స్థలం ఈ గుడి నిర్మించబడినది. మరియు చుట్టుప్రక్కల ఇంకా 20 ఎకరాల స్థలంలో పచ్చదనం అభివృద్ధిచేయబడినది. నక్షత్రాకార కట్టడం మీద ఉన్న ఈ శివాలయం 12, 13వ శతాబ్దాలకు చెందినది. ఈ దేవాలయం చెక్కిన ప్రధానశిల్పి రామప్ప. ఇతని పేరుతోనే ఈ దేవాలయం వ్వవహరించబడటం విశేషం. తూర్పుదిశగా ఎత్తైన వేదిక మీద గర్భాలయం, అంతర్భాగంలో మూడువైపుల ప్రవేశద్వారాలు గల మహామండపం కలిగియున్నది. ఈ దేవాలయం తేలికైన ఇటుకలతో నిర్మించబడినది. ఈ ఇటుకలు నీటిపై తేలతాయని చెబుతారు. ఈ దేవాలయం గోడమీద రామాయణ, మహాభారత గాథలు చెక్కబడి ఉన్నవి. పైకప్పు క్రింది భాగాన నల్లని నునుపు రాతిపై చెక్కబడిన మదనిక, నాగిని శిల్పాలు కాకతీయుల…

Read More

వేయు స్థంభాల గుడి, హనుమకొండ…(వరంగల్‌)

కాకతీయ వంశస్థుడైన రుద్రదేవునిచే నిర్మించబడినది. కాకతీయుల శిల్ప కళావైభవానికి మచ్చు తునక ఈ దేవాలయం. నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు (శివుడు లింగరూపంలో) ప్రధాన అర్చామూర్తిగా కొలువై ఉన్నాడు. ప్రధాన ఆయం తూర్పుకు అభిముఖంగా అధ్బుతమైన శిల్పకళతో చూపరులను ఆకట్టుకుంటుంది. నందీశ్వరుని విగ్రహం ప్రధానాలయానికి ఎదురుగా ఠీవిగా దర్శనమిస్తుంది. ఆలయంలోకి ప్రవేశించగానే పానపట్టం లేని నిలువెత్తు శివలింగం దర్శనమిస్తుంది. ఆలయం లోపల లతలు పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులను, పురాణ ఘట్టాలు చూపరులను ఆకట్టుకుంటాయి. కళ్యాణమంటపం మరియు ప్రధానాలయాన్ని మొత్తం వేయు స్థంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వేయు స్థంభాల దేవాలయమనే పేరు వచ్చింది. కానీ ప్రస్తుతం వేయు స్థంభాలు లేవు. విదేశీయులు, మహ్మదీయుల దండయాత్రలో మరియు ప్రకృతి వైపరీత్యాల వలన ఆయం కొంతవరకు దెబ్బ తిన్నది. ఆలయ ప్రాంగణంలో మారేడు, రావి, వేప వృక్షాలు…

Read More

యాదగిరిగుట్ట – పంచనారసింహ క్షేత్రం

దక్షిణాదిలో …తెలుగు రాష్ట్రాలలో నారసింహ క్షేత్రాలుఎక్కువ. దేశంలోనే ఏకైక నవనారసింహక్షేత్రం అహోబిలం. ఆ తరువాత అంత ప్రాముఖ్యత ఉన్న క్షేత్రం యాదగిరిగుట్ట. ఎందుకంటే ఇది పంచనారసింహక్షేత్రం. సృష్టికి పూర్వం శ్రీ మహావిష్ణువు నరసింహరూపంలోనే బ్రహ్మకు దర్శనం ఇచ్చాడట.‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యుం నమామ్యహం’అని మంత్రోపదేశం చేశారట. దీనివల్లే బ్రహ్మకు వేద దర్శనమై ఆ తరువాత సృష్టి మొదలు పెట్టాడట. అంతటి ప్రాముఖ్యం ఉన్న అవతారం నృసింహావతారం. అలాంటి నారసింహుడు వెసిన పవిత్రక్షేత్రం యాదగిరి. రామాయణ కాలం నాటి విభాండక రుషి, అతడి పుత్రుడైన రుష్యృశృంగ్నుడి కుమారుడు యాదరుషి. అతడ్ణే యాదర్షి అంటారు. చిన్నప్పట్నుంచి నరసింహుడి భక్తుడైన అతడికి ఆస్వామిని దర్శించాలని బలమైన కోరిక ఉండేదట. నరసింహుడ్ని అన్వేషించడానికి అడవులు, కొండలు, కోనలు తిరిగాడు. నరసింహుని దర్శనం కాలేదు. అలా సంచరిస్తున్న…

Read More

భద్రాచలం శ్రీరామాలయం

1730 (17వ శతాబ్దం) ప్రాంతంలో… భద్రాచలం సమీపంలోని భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే ఆమె భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలుస్తుండేది. ఆ మహా భక్తురాలి భక్తికి మెచ్చి ఒక రోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించాడట! తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం… భద్రగిరిపై ఉన్నానని.. నన్ను మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చెయ్యండి.. ఈ కార్యక్రమంలో నీకు మరో పరమభక్తుడు సాయంగా నిలుస్తాడు.. అని ఆదేశించారట! ఆ మేరకు దమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం తెలియజేసి.. భద్రగిరిపైకి వెళ్లి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించిందట. ఆపై అక్కడ పందిరి నిర్మించి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చిందట. ప్రతీ సంవత్సరం సీతారాముల కల్యాణం కూడా నిర్వహించేవారని స్థలపురాణం చెబుతుంది. అనంతరం రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి ఇప్పుడున్న బ్రహ్మాండపై…

Read More

బిర్లామందిర్‌

280 అడుగుల ఎత్తున్న కాలాపహాడ్‌ అనే కొండపై ప్రముఖ పారిశ్రామిక వెత్తలైన బిర్లాలచే ఈ దేవాలయం నిర్మించబడినది. ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి. ఈ దేవాలయం మొత్తం రాజస్థాన్‌ నుండి తెప్పించబడిన తెల్లరాయితో నిర్మించబడినది. ఇక్కడ కానుకలు స్వీకరించరు. నిర్వహణ మొత్తం బిర్లాలదే. రాజస్థాన్‌ మరియు ఉత్కళ సాంప్రదాయాలలో కట్టబడినది. దేవాలయం దర్శనం వేళలు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 3 గంటల నుండి 9 గంటల వరకు. ఎలా వెళ్ళాలిబిర్లా మందిర్‌కు హైదరాబాద్‌ సిటీ బస్సులో లేక ఆటోలో చేరుకోవచ్చు. దగ్గరలో గల బస్‌ స్టాప్‌ సెక్రటరియేట్‌ మరియు లకడీ-కా-పూల్‌.సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుండి 7 కి.మీ. నాంపల్లి రైల్వే స్టేషన్‌ నుండి 3 కి.మీ. కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుండి 5 కి.మీ. దూరంలో…

Read More

బాసర జ్ఞానసరస్వతి

ద్వాపరయుగంలో కురుక్షేత్ర యుద్ధం పూర్తి అయిన తరువాత ప్రశాంతంగా తపస్సు చేసుకునేందుకని వ్యాసమహర్షి, విశ్వామిత్ర మహర్షి మొదలగు వారు శిష్యసమేతంగా ఈ ప్రాంతానికి వచ్చారట. ఈ ప్రదేశంలో ప్రశాంత వాతావరణానికి ముగ్ధులై.. ఇక్కడే తపస్సు కొనసాగించారంటానే. వ్యాస భగవానులు రోజూ పావన గోదావరిలో స్నానం చేశాక.. పిడికెడు ఇసుక చొప్పున తీసుకెళ్లి.. సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని రూపొందించారట! ఆ మూర్తికే ఆయన నిత్యపూజలు చేసేవారని.. ఇప్పుడు ఇక్కడున్న విగ్రహం అప్పట్లో వ్యాస మహర్షి ఆరాధించిన మూర్తేనని స్థలపురాణం! అలా వేద వ్యాస ప్రతిష్ఠగా పరిగణించే బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి సన్నిధిలో నిత్యం వేల మంది చిన్నారులు అక్షరాభ్యాసం చేసుకుంటూ.. ఆ తల్లి దీవెనలు.. చల్లని చూపులతో విజ్ఞానవంతులుగా ఎదుగుతున్నారు. ఆలయం తెరచే సమయాలు– రోజూ ఉదయం 4 గంటలకే ఆలయద్వారాలు తెరుస్తారు.– ఉదయం 4.30 గంటలకు అమ్మవారికి…

Read More

టిక్‌టాక్ పోయింది..’చింగారి’ వ‌చ్చేసింది

తిండి తిన‌కుండా ఉంటాం కానీ టిక్‌టాక్ లేకుండా ఉండ‌లేం అంటున్నారు కొంద‌రు టిక్‌టాక్ యూజ‌ర్లు. అందుకే టిక్‌టాక్ స‌హా 59 చైనీస్ యాప్‌లను ప్ర‌భుత్వం నిషేదించ‌డంతో ముఖ్యంగా ప‌లువురు సెల‌బ్రిటీలు అయోమ‌యంలో ప‌డిపోయారు. ఇప్ప‌టికే ఈ యాప్‌ను భార‌త్‌లో దాదాపు 20 కోట్ల మంది వినియోగిస్తున్నారు. దీంతో ఉన్న‌ప‌లంగా తీసేయాలంటే ఇంకోటి రిప్లేస్‌ చేయాల్సిందే అనుకున్నారేమో వెంట‌నే టిక్‌టాక్ ప్ర‌త్యామ్నాయం ఏంటా అని శోధించారు. అదృష్ట‌వ‌శాత్తూ మ‌న భార‌తీయులు త‌యారు చేసిన ‘చింగారి’ యాప్ క‌ళ్లెదుట ప్ర‌త్య‌క్ష‌మయ్యింది. ఇంకేముంది గంటలోనే ఈ యాప్‌ను ల‌క్ష‌మంది దాకా డౌన్‌లోడ్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. షార్ట్ వీడియో స‌ర్వీస్‌తో అచ్చం టిక్‌టాక్ మాదిరే ఉన్న ఈ యాప్‌పై ప్ర‌స్తుతం భార‌తీయులు మ‌క్కువ చూపిస్తున్నారు.  తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ,  గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం భాష‌ల్లో ఈయాప్ అందుబాటులో ఉంది. దీంతో స్వ‌దేశీ ప‌రిఙ్ఞానంతో…

Read More

Rights of an Arrested Person

“Every right is a moral as well as legal entitlement to have or do something”“Every right is a moral as well as legal entitlement to have or do something”“Every right is a moral as well as legal entitlement to have or do something” Every human is born with certain basic rights that he is entitled to for instance, right to live and right to freedom etc. Similarly every citizen of every country is presented with certain rights that are absolutely fair without any prejudice in the spirit of common brotherhood…

Read More

డైరీ వ్రాసుకోవడం వల్ల ప్రయోజనాలు

మీ ఆలోచనలను క్రమబద్ధంగా ఉంచండి:డైరీలు మన ఆలోచనలను క్రమ బద్ధీకరించడానికి మరియు వాటిని భయ పెట్టడానికి సహాయ పడతాయి. మీరు కొన్ని అనుభవాలు లేదా అభిప్రాయాల గురించి రోజు వారీ సంఘటనలు, ఆలోచనలు మరియు భావాలను రికార్డ్ చేయవచ్చు. మీ డైరీ ఎంట్రీలను ట్యాగ్ చేయడానికి జర్నీ మిమ్మల్ని అనుమతిస్తుంది.మీ రచనను మెరుగు పరచండి.మీ రచనకు శిక్షణ ఇవ్వడానికి జర్నలింగ్ మీకు సహాయ పడుతుంది. మీరు మీ రచనను అభ్యసించాలనుకుంటే లేదా మెరుగు పరచాలనుకుంటే, ఒక పత్రికను ప్రారంభించడమే మంచి పని. మీకు ఖచ్చితమైన అంశం ఉండక పోవచ్చు. మీరు చేయ వలసిందల్లా జర్నీ లో మీ ఆలోచనలను రాయడం ప్రారంభించడమే. మీరు ఎంత ఎక్కువ వ్రాస్తారో, మీ రచన మరింత మెరుగు పడుతుంది.మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి.మీ లక్ష్యాలు, ఆశయాలు, ఆకాంక్షలు మరియు నూతన సంవత్సర తీర్మానాలను…

Read More

వివిధ రకాల చీరలు

వెంకటగిరి చీరలు వెంకటగిరి పేరు చెబితే గుర్తుకు వచ్చేది జీరీ చీరె. ముడున్నర శతాబ్ధాల చరిత్ర ఉన్న ఈ చీరెలను అతి సన్నని నూలు పోగుతో నేయటం ఇక్కడి కళాకారుల ప్రత్యేకత. వెంకటగిరి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఉన్న ఒక కళాకారుల సమూహం నివసించే గ్రామం. ఈ గ్రామం ఇదివరకు వెంకటగిరి రాజుల రాజవంశం పరిపాలనతో ఉండేది. ఇక్కడ తయారయ్యే చీరలలో వెంకటగిరి చీరలు మరియు రాజమాత చీరలు ప్రసిద్ది చెందినవి. వార్ప్ మరియు వెఫ్ట్ కోసం 100 మరియు 120 కౌంట్ లతో నూలుతో చక్కగా తయారైన అడ్డపోగులను ఉపయోగిస్తారు. ఈ చీరలు సాధారణ బంగారు అంచులతో నేయబడి పల్లూ మాత్రం బుటా వర్క్ తో నేయబడినవి జమ్దాని పద్ధతిలో పనిచేసే మందమైన రంగుల నూలుతో కలిపి నేయబడినవి. వెంకటగిరికి చెందిన దాదాపు 14…

Read More

ప్రశాంతి నిలయం, పుట్టపర్తి

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మరియు పుట్టపర్తి సాయిబాబా వారి జన్మస్థలం. పుట్టపర్తికే తలమానికం సాయిబాబా వారి ప్రశాంతి నిలయం. నిత్యం కొన్ని వేలమంది భక్తులు ఈ ఆశ్రమం చూసేందుకు వస్తారు. విదేశాలనుండి కూడా సాయిభక్తులు వస్తారు. పుట్టపర్తిలో సాయి సేవాసంస్థల వారు పేదవారికి ఉచిత హాస్పటల్‌,విద్యా సంస్థలు ఇంకా అనేక సేవా కార్యక్రమములు నిర్వహించుచున్నారు. భక్తులు, పర్యాటకుల కోసం ప్రభుత్వం 1.5 కోట్ల రూపాయలతో శిల్పారామం నిర్మించారు. ఎలా వెళ్ళాలిపుట్టపర్తికి రైలు మరియు రోడ్డు మార్గాలలో వెళ్ళవచ్చు. పుట్టపర్తికి 5 మైళ్ళ దూరంలో రైల్వేస్టేషన్‌ కలదు. హైదరాబాద్‌, ముంబై, విశాఖపట్నం, భువనేశ్వర్‌, కొత్త ఢిల్లీ నుండి రైళ్ళు కలవు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ముఖ్యపట్టణముల నుండి బస్సులలో వెళ్ళవచ్చు. పుట్టపర్తిలో విమానాశ్రయము కూడా కలదు.

Read More