రుచికరమైన ఉతప్పం మీకోసం


1. రవ్వ ఉతప్పం :
రవ్వ ఉతప్పం వేడిగా తిన్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు :
బ్యాటర్ కోసం :
రవ్వ
పెరుగు
ఉప్పు
నీరు
టాపింగ్స్ కోసం :
ఉల్లిపాయ
క్యాప్సికమ్
క్యారెట్
టమోటా
కొత్తిమీర
అల్లం
పచ్చి మిర్చి
కరివేపాకు

తయారీ విథానం :
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో రవ్వ, పెరుగు మరియు ఉప్పు తీసుకుని, బాగా కలపాలి. దీని లో కొంచెం నీళ్లు వేసుకోవాలి. 20 నిమిషాలు లేదా రవ్వ బాగా గ్రహించే వరకు ఉండాలి. అవసరమైతే ఇంకా నీటిని జోడించవచ్చు. స్థిరత్వం ఉండేలా కలపాలి. ఇప్పుడు రవ్వ పిండిని చిన్న ఉతప్పంలా వేసి తరిగిన కూరలు వేసుకోవాలి. ఉతప్పం చుట్టూ 1 చెంచా నూనె పొయ్యాలి. మూత పెట్టి ఒక నిమిషం ఉడికించాలి ఇలాగే రెండు వైపులా ఉడికించాలి. అంతే రెండు వైపులా ఉడికితే ఉతప్పం తయారీ అయినట్టే.

2. ఉల్లి ఉతప్పం :
వీటిని ఎక్కువగా హోటల్స్ లో అమ్ముతారు. అదే రుచి కావాలంటే ఇలా చెయ్యాలి.

కావాల్సిన పదార్థాలు :

బ్యాటర్ కోసం :
బియ్యం
మినప్పప్పు
మెంతులు
ఉప్పు
నీరు


టాపింగ్స్ కోసం :
ఉల్లిపాయ
కొత్తిమీర
అల్లం
పచ్చి మిర్చి

తయారీ విథానం :
నానబెట్టిన బియ్యం, మినప్పప్పు,మెంతులను మెత్తగా రుబ్బుకోవాలి దీనిలో తగినంత ఉప్పు కలిపి ఉంచుకోవాలి. దీని లో కొంచెం నీళ్లు వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు పిండిని చిన్న ఉతప్పంలా వేసి ఉల్లి, అల్లం, మిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. ఉతప్పం చుట్టూ 1 చెంచా నూనె పొయ్యాలి. మూత పెట్టి ఒక నిమిషం ఉడికించాలి ఇలాగే రెండు వైపులా ఉడికించాలి. అంతే రెండు వైపులా ఉడికితే ఉల్లి ఉతప్పం అయినట్టే.

3. మిక్సిడ్ వెజిటబుల్స్ ఉతప్పం :
ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.


కావాల్సిన పదార్థాలు :
బ్యాటర్ కోసం :

బియ్యం
మినప్పప్పు
అటుకులు
ఉప్పు
నీరు

టాపింగ్స్ కోసం :

ఉల్లిపాయ
క్యాప్సికమ్
క్యారెట్
టమోటా
కొత్తిమీర
అల్లం
పచ్చి మిర్చి
కరివేపాకు

తయారీ విథానం :
నానబెట్టిన బియ్యం, మినప్పప్పు,అటుకుల ను మెత్తగా రుబ్బుకోవాలి దీనిలో తగినంత ఉప్పు కలిపి ఉంచుకోవాలి. దీని లో కొంచెం నీళ్లు వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు పిండిని చిన్న ఉతప్పంలా వేసి తరిగిన కూరలు వేసుకోవాలి. ఉతప్పం చుట్టూ 1 చెంచా నూనె పొయ్యాలి. మూత పెట్టి ఒక నిమిషం ఉడికించాలి ఇలాగే రెండు వైపులా ఉడికించాలి. అంతే రెండు వైపులా ఉడికితే అల్పాహారంగా తినవచ్చు.


4. పోహ ఉతప్పం :
అటుకులు ఇష్టమైన వారికి ఈ అల్పాహారం ఎంతో నచ్చుతుంది.

కావాల్సిన పదార్థాలు :

బ్యాటర్ కోసం :
అటుకులు
రవ్వ
పెరుగు
ఉప్పు
నీరు


టాపింగ్స్ కోసం :
ఉల్లిపాయ
కొత్తిమీర
అల్లం
పచ్చి మిర్చి

తయారీ విథానం :

ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో అటుకులు పేస్టు, పెరుగు మరియు ఉప్పు తీసుకుని, బాగా కలపాలి. దీని లో కొంచెం నీళ్లు వేసుకోవాలి. స్థిరత్వం ఉండేలా కలపాలి. ఇప్పుడు రవ్వ పిండిని చిన్న ఉతప్పంలా వేసి తరిగిన కూరలు వేసుకోవాలి. ఉతప్పం చుట్టూ 1 చెంచా నూనె పొయ్యాలి. మూత పెట్టి ఒక నిమిషం ఉడికించాలి ఇలాగే రెండు వైపులా ఉడికించాలి. అంతే రెండు వైపులా ఉడికితే ఉతప్పం తయారీ అయినట్టే.
%d bloggers like this:
Available for Amazon Prime