మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలు:


ఇది నిజంగా చాలా ప్రమాదకరమని చెప్పొచ్చు ధూమపానం మద్యపానం వంటి వ్యసనాల కన్నా ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే ఈ మాదక ద్రవ్యం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6 శాతం జనాభా అనగా 185 మిలియన్ మంది ఇలా మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనా.

అయితే మాదకద్రవ్యాలు వల్ల నిజంగా కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా జీవితం కూడా నాశనం అయిపోతుంది. దీని వల్ల ఏమవుతుంది అంటే…? స్థిరత్వం ఉండగా మనుషుల్లో నిలకడ కోల్పోయి కేవలం చెడ్డ వాటికి ఆకర్షితులై చెడు మార్గాన్ని పోతూ ఉంటారు.

మాదక ద్రవ్యాలు వివిధ రకాలు:

మాదక ద్రవ్యాలు వివిధ రకాలు ఉన్నాయి అయితే దీనిలో నల్లమందు మార్ఫిన్ గంజాయి మారిజువానా కొకైన్ ఐఎస్డీ ఇలా ఎన్నో రకాలు వీటిలో ముఖ్యమైనది

అయితే ఇవి నిజంగా ప్రమాదకరం అని చెప్పవచ్చు బాగా బ్లాక్ మార్కెట్లో ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిని కొనుగోలు చేసి విద్యార్థులు యువత తప్పుదారి పట్టి పోతున్నారు.అయితే వీటిని కొనుగోలు చేయాలంటే బయట కొనుగోలు అవ్వదు. కేవలం బ్లాక్ మార్కెట్లో మాత్రమే దీనిని కొనుగోలు చేయడానికి వీలవుతుంది. వివిధ ప్రాంతాల్లో సంకేత నామాలతో చలామణి అవుతూ ఉంటాయి. ఇలా అక్రమ రవాణా గడిస్తూ ఉంటారు. దానినే యువత కొనుగోలు చేస్తూ వినియోగిస్తూ ఉంటారు. ఇలా యువత చెడిపోయి దేశానికి ద్రోహం చేస్తోంది.

అయితే వీటికి అలవాటుపడి విద్యార్థులు యువకులు కూడా సర్వస్వం కోల్పోయిన వారవుతున్నారు.దీని వల్ల తల్లిదండ్రులు కూడా బాధతో కుమిలిపోతారు. చదువుకోమని పిల్లలని పంపిస్తుంటే వెళ్లి చెడు అలవాట్లకు దగ్గరే జీవితాన్ని కోల్పోతుంటే తట్టుకోలేరు తల్లిదండ్రులు. ఒక సారి దీనికి బానిస అయితే దీన్ని వదులు కోవడం కష్టం. ఎంతటి ఆకృత్యాలు నేరాలు చేయడానికైనా ఇక వెనుకాడని దుస్థితి వాళ్ళకి చేరుతుందనే చెప్పొచ్చు.

అయితే మాదక ద్రవ్యాలు నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్ డ్రగ్స్ ఇన్ సైకో ట్రాఫిక్ సుబ్స్టెన్సు చట్టాన్ని చేసింది. అయితే ఎవరైతే ఈ డ్రగ్స్ ని పండిస్తారు అలానే ఎవరైతే డ్రగ్స్ తో వ్యాపారం చేస్తారో వీరందరికీ చట్టపరంగా కఠిన శిక్షలు తప్పక పడతాయి.

అయితే ఒకవేళ కనుక దీనిని తీసుకుని ఎడిక్ట్ అయిపోతే బయటపడడం కష్టం. ఈ వ్యసనపరులు మళ్లీ తిరిగి మామూలు మనుషులు చేయడం చాలా కష్టమైనది. కానీ డ్రగ్ అడిక్షన్ కేంద్రాలు అలానే మానసిక వైద్యులు కూడా మెరుగైన చికిత్స అందించి వీళ్ళని కాపాడవచ్చు. కానీ ఇది అతి సులభం కాదు కాబట్టి ఇటువంటి జోలికి పోకుండా ఉంటే మంచిది తిరిగి యథావిధిగా రావాలంటే నిజంగా చాలా కఠినం. జీవితాన్ని ప్రమాదంలో నెట్టు కోకండి… అనవసరమైన వాటికి బానిసై జీవితాన్ని వెలి వేసుకోకండి…
%d bloggers like this:
Available for Amazon Prime