తెలుగు సామెతలు

worldmart theme
               Read

అచ్చోసిన ఆఁబోతు అంటూంటారు, అంటే ఏమిటి? ఆఁబోతుకీ ఎద్దుకీ మధ్య తేడా ఏమిటి? 

  

ఆబోతు, ఎద్దు రెండూ పుట్టినప్పుడు కోడెదూడలే. ఆవుకే పుడతాయి. కోడెదూడలు అంటే.. మగవి. పెయ్యదూడలు అంటే.. ఆడవి. పుట్టినప్పుడు కోడెదూడలుగా ఉన్నవాటిలో కొంత కాలం తర్వాత కొన్ని ఎద్దులు అయితే.. మరికొన్ని ఆబోతులు అవుతాయి. వ్యవసాయంలో రైతుకు ఆసరాగా ఉండేవి.. అంటే పొలం దున్నడానికి.. బండి నడపడానికి సాయం చేసేవి ఎద్దులు. ఏ కష్టం చేయకుండా.. చక్కగా తిని తిరిగేవి ఆబోతులు.

సాధారణంగా పల్లెటూర్లలో వివాహాలు, ఇతర శుభకార్యాలు జరిపేటప్పుడు కొంతమంది కోడె దూడలకు శంఖుచక్రాలు ముద్ర వేసి వాటిని దేవుని పేరు మీద వదిలేస్తారు. అప్పటి నుంచి ఆ కోడె దూడ ఆబోతు అవుతుంది. దానిని వెంకన్న స్వరూపంగా భావిస్తారు. కొన్ని ఊర్లలో ఆబోతు కోసం ప్రతి రోజూ ఉదయం గాని సాయంత్రం గాని ప్రత్యేకంగా చిట్టు, తవుడు, వేరుశెనగ అచ్చు… ఇలాంటివి ఆహారంగా పెడుతుంటారు. రోజూ ఏ సమయానికి ఆహారం పెడతారో.. ఆ సమయానికే వస్తూ ఉంటుంది. కొందరు పొలాల దగ్గర కూడా ఆబోతు కోసం ప్రత్యేకంగా పశుగ్రాసం లాంటివి పెడుతుంటారు.

పైగా దైవ స్వరూపంగా భావించడం వల్ల ఆబోతుని ఎవరూ ఏమీ అనరు. కొట్టరు. ఎప్పుడైనా అది అల్లరి చేస్తుంటే అది వెళ్లిపోవడానికి దానిపై పసుపు నీళ్లను చల్లుతారు. పంట పొలాలను తినేస్తున్నా దాన్ని కొట్టడానికి సాయం చేయరు. పంట చేలను తినకుండా ఉండాలనే.. దానికంటూ ప్రత్యేకంగా పొలం గట్టున పశుగ్రాసం పెడుతుంటారు.

ఆబోతు ఎదురుగా వస్తే దానికి ఎదురుగా వెళ్లే సాహసం కూడా ఎవరూ చేయరు. దానికి రెండు కారణాలున్నాయి. మొదటిది దాన్ని దైవ స్వరూపంగా భావించడం.. రెండోది.. ఉన్నట్టుండి ఆబోతు రంకె వేసిందంటే.. ఎదురుగా ఎవరుంటే వారిని కుమ్మి పడేస్తుంది. అందుకే దానికి వీలైనంత దూరంగా ఉంటారు. దాని బారిన పడి చనిపోయిన వాళ్లు కూడా ఉంటారు.

తెలుగునాట ఓ సామెత ఉంది. అదే ‘అచ్చోసిన ఆబోతులా తిరుగుతున్నాడని’ అంటూ ఉంటారు. పనీపాటా, భయమూ లేకుండా ఊరి మీద పడి ఆవారాగా తిరిగే వారిని అలా వ్యవహరిస్తుంటారు.


నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా” అనే జాతీయం/ సామెతకి అర్ధం ఏమిటి?
ఈ జాతీయం అర్థం భూమికి, స్వర్గ లోకానికి ఉన్నంత తేడా అని అర్థం

శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు

చాలా పనులు మనము సరైన ప్రణాళిక లేకుండా చేస్తూ ఉంటాము. మనవాళ్ళు చాలా లేఔట్లు వేస్తూ ఉంటారు. అక్కడ భూగర్భ జలాలు త్రాగడానికి పనికి వస్తాయో లేదో అని ఆలోచించరు. మురుగు నీరు ఎక్కడకు మళ్లించాలో తెలియదు. దానికి మునిసిపల్ అనుమతి కూడా ఉండదు. రాళ్లు పాతేసి మట్టిరోడ్లు పోసి అమ్మేస్తారు. ఆవేకొనుక్కొని అన్ని వసతులు ఏర్పాటు చేసుకొని కిందా మీదా పడి ఇళ్ళు కట్టుకొని నివసిస్తారు. ఇవన్నీ మొదటనే ఆలోచిస్తే ఎవరూ ప్లాట్ లు కొనే వారు కారు. ఇలాంటి సందర్భంలో కొనే వారికి ధైర్యాన్ని ఇచ్చే సామెత ఇదే.

ఇలాగే పేద మధ్య తరగతి వారు పెళ్లిళ్లు చేసేటప్పుడు కూడా వర్తిస్తుంది. పెళ్లి చేసుకున్న భార్యా భర్తలు స్వయంకృషితో ఆనంతకోటి ఉపాయాలతో అభివృద్ధి అయిన సందర్భాలు అనేకం. కావున ఏదైనా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక ఈ సామెత ను ఉదాహరిస్తూ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం లో మనం ముందుంటాము. చాలా పేదరిక నిర్మూలన కార్యక్రమాలు రూపొందిస్తూ ఉంటారు మన ప్రభుత్వ అధికారులు. వాటిలో చాలా లోపాలు ఉంటాయి. ఎవరైనా అభ్యంతరం లేవదీస్తే ఎదో కుంటి సమాధానం వస్తుంది. వినే వాళ్లు కూడా ఈ సామెతను గుర్తు చేసుకొని సరి పెట్టు కుంటారు.

సత్రం భోజనం మటం నిద్ర అన్నట్లు!

కొన్ని సందర్బాలలో పని వత్తిడి వలన ఇల్లు కూడా పట్టకుండా తిరగ వలసి వస్తుంది. అటువంటి వారి పరిస్తితి వర్ణనాతీతం.

అనగా ఇంట్లో కుటుంబ సబ్యుల వద్ద లభించే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు వేరు. అదే విధంగా వేరే చోట వున్నప్పుడు అక్కడి వాతావరణము వేరు.

ఇటువంటి సంధర్బంలో, ఈ సామెత ఇంట్లో వాటి ఆప్యాయతా అనురాగాలను బయటి వారి పరిచయాలను బేరీజు వేస్తుంది. అంతే కాకుండా ఇంటి వాతావరణమే గొప్పదని నిరూపిస్తుంది.

ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి

ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి” అని తెలుగులో ఒక సామెత ఉంది. దీనిని అదృష్టం కలిసి రాకపోతే పరిస్థితులు తారుమారై ఈ రోజు భాగ్యవంతుడు రేపటికల్లా కటిఖ ధరిద్రుడిగా కావచ్చు, ఈ రోజుటి బికారి రేపటికి భాగ్యవంతుడు కావచ్చు గనుక మనిషిని మనిషిగా గౌరవించాలి గాని ఉన్న సంపదను చూసుకుని మిడిసిపడడం తగదు అన్న అర్ధంలో ఒక హెచ్చరికగా వాడ బడుతోంది.

ఇంటికి ఇత్తడి పొరుగికీ పుత్తడి

కొంత మందికి ఇంట్లో వారి నుంచి తగిన గౌరవము, ఆదరణ లభించదు. కాని ఆ గౌరవము బయటి వారి నుంచి లభిస్తుంది. ఇటువంటి పరిస్తితులలో ఇంట్లో గౌరవం పొందక, బయట ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొనే వారి గురించి “ఇంటికి ఇత్తడి పొరుగికీ పుత్తడి” అనే సామెత చెపుతుంది.

%d bloggers like this:
Available for Amazon Prime