ఆవకాయ పచ్చడి

ఆవ‌కాయ ప‌చ్చ‌డి…ఎప్పుడు పుట్టింది? ఆవ‌కాయ ప‌చ్చ‌డిలో ఎన్ని ర‌కాలుంటాయ్.?

పచ్చడిలను తమిళులు, తెలుగు వాళ్లు ఎక్కువగా ఉపయోగించినప్పటికి తెలుగు వారే వీటిని కనిపెట్టారనడానికి ఆధారాలున్నాయి.. ఈ పచ్చళ్ల చరిత్ర నిన్న మొన్నటిది కాదు.. ఎప్పుడో 14వ శతాబ్దం నుండే ఇవి వాడుకలో ఉన్నాయని చరిత్ర చెబుతుంది. 14వ శతాబ్దంలోని క్రీడాభిరామంలో ప్రచురించపడిన పద్యంలో నాలుగు నైదు నంజులున్ (నాలుగైదు ఊరగాయలు) అని ఉండడాన్ని బట్టి గమనిస్తే ఇవి ఆ కాలం నుండి ఉన్నాయని తెలుస్తుంది.. ఆ పద్యం ఒకసారి చూడండి.
కప్పురభోగి వంటకము, కమ్మని గోధుమపిండి వంటయున్‌,

గుప్పెడు పంచదారయును, గ్రొత్తగ గాచిన యాల నే, పెస-
ర్పప్పును, గొమ్ము నల్లనటి పండ్లును, నాలుగు నైదు నంజులున్‌,
లప్పలతోడ గ్రొంబెరుగు, లక్ష్మణవజ్ఝల యింట రూకకున్‌.

దీని తర్వాత 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ఆముక్త మాల్యదలోనూ ఊరగాయను గురించి ప్రస్తావన ఉన్నది.ఆముక్తమాల్యదలో విష్ణుచిత్తుడు అతిధులకు ఏ ఏ కాలాలలో ఏఏ వంటలను వడ్డించేవాడు అనేది వివరించారు శ్రీకృష్ణ దేవరాయలు.. అందులో రకరకాల పచ్చళ్లను శీతాకాలపు ఆహారపు పదార్ధాలలో చేర్చాడు.. మనం వేసవిలో తయారు చేసిన పచ్చళ్లను తర్వాత వచ్చే కాలాల్లో వేడివేడి అన్నంలో నెయ్యితో పాటు వేసుకుని తినడానికి ఆసక్తి చూపుతాము.. ఇది 16వ శతాబ్దం నుండి ఉంది అనడానికి ఆముక్తమాల్యదలోని పద్యమే నిదర్శనం.


మామిడి కాయ పచ్చడిని ఎన్ని రకాలుగా పెడతారు: 
మామిడి కాయ పచ్చడి తెలుగు వంటకమే అయినప్పటికి దీన్ని తెలంగాణా,ఆంధ్రా రాష్ట్రాలలో విభిన్న పద్దతుల్లో పెడతారు..తెలంగాణా వాళ్లు ఆవపిండి,అల్లం,కారం, వెల్లులి,మెంతిపిండి వేసి చేసే కారంగా ఉండే మామిడికాయ పచ్చడిని తినడానికి ఇష్టపడతారు.. ఆంధ్రా వాళ్లు ఆవకాయని రెండు రకాలుగా పెడతారు అది కారం ఆవకాయ, రెండోది తీపావకాయ.. తీపావకాయకి బెల్లం వేసి బెల్లం ఆవకాయని పెడతారు..
అలవాట్ల ప్రకారం మరికొంతమంది మసాలా ఆవకాయలో మసాలాపొడి(లవంగాలు,చెక్క) , నీళ్లావకాయలో ఇంగువ , సున్నం వేసి చేస్కుంటారు..మాములుగా పెట్టుకునే పచ్చడికి నీటిని తగిలించరు..పచ్చడి పాడవుతుందని..కానీ నీళ్లావకాయలో నీటిని కలిపి చేస్తారు…ఇది కూడా ఏడాది కాలం పాటు నిల్వ ఉంటుంది..కానీ కొద్దిమంది మాత్రమే దీనిని వినియోగిస్తారు..
ఎండు మాగాయ్, పచ్చి మాగాయ్ అనే పచ్చళ్లు కూడా పెడతారు.. మామిడికాయ ముక్కల్ని తీగలుగా కట్ చేసి కాసేపు గాలికి ఆరబెట్టి పచ్చడి పెడతారు అది పచ్చిమాగాయ, అవే మామిడి ముక్కల తీగల్ని ఎండబెట్టి వాటిని పచ్చడిగా పెట్టుకుంటారు అది ఎండు మాగాయా..ఇలా ఎండబెట్టిన ముక్కల్నే ఏడాది పాటు నిల్వ ఉంచుకుని పప్పు వండుకునేటప్పుడు కూడా వాడుకుంటుంటారు..వేసవికాలంలో దొరికే మామిడికాయని ఏడాదిపాటు మిస్ అవ్వకుండా తినడానికి ఉంటుంది.
మామిడికాయ పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు..మన సినిమాల్లో పాటలుగా, మన రోజువారి జీవితంలో సామెతలుగా కూడా ఇది భాగమైపోయింది..


ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి..?

ఆవకాయ కి కావలసిన పదార్ధాలు…

ఒకటింపావు కప్పు మామిడికాయ ముక్కల కట్ చేసుకోవాలి
ఒక చెంచా ఆవాలు లేదా రెండు టేబుల్ స్పూన్లు ఆవాల పొడి
అర టీ స్పూన్ మెంతి గింజలు లేదా మెంతి పొడి
మూడు చెంచాల ఎర్రకారం
ఒకటిన్నర చెంచాలు ఉప్పు
4 వెల్లుల్లి రెబ్బలు
మూడు చెంచాల నూనె వేరుశనగ నూనె అయితే మరీ మంచిది

అయితే ఈ రెసిపీ లో కేవలం 240 ఎంఎల్ ఆవకాయ మాత్రమే పెట్టడం చూపిస్తున్నాం. ఈ కొలతలను బట్టి మీరు ఎంత చేసుకోవాలంటే దానికి సరిపడా తీసుకోండి. ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలి…

తయారు చేసుకునే విధానం:

ముందుగా పచ్చిగా ఉండే మామిడికాయలు ఎక్కువగా తీసుకోండి. పండిపోయిన మామిడి ఆవకాయ కి బాగోవు కాబట్టి, పచ్చిగా ఉన్న మామిడి కాయల్ని తీసుకుని కడగాలి. ఆ తర్వాత తడి ఆరే వరకూ ఎండబెట్టడం లేదా శుభ్రమైన గుడ్డతో తుడవడం చేయొచ్చు. అయితే ఇప్పుడు ఏ జాడీలో అయితే దానిని పెట్టబోతున్నారు అది కూడా పొడిగా ఉండేలా చూసుకోవాలి. పెట్టే చెంచాల కానీ కత్తి గాని ఏవి కూడా తడిగా ఉండకుండా చూసుకోండి. ప్రతిదీ పొడి గానే ఉండాలి ఎందుకంటే తడి తగ్గడం వల్ల త్వరగా పాడైపోతుంది పచ్చడి.అలానే మెంతులు కూడా బాగా వేగినట్టు చూసుకోండి..

ముందుగా ఒక పొడిగా ఉన్న గిన్నెను తీసుకుని అందులో ఎర్రకారం ఆవాల పొడి ఉప్పు దంచిన వెల్లుల్లి పాయలు వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత నూనె కూడా వేసుకుని 24 గంటలు దాన్ని అక్కడ ఉంచి ఇప్పుడు బాగా కలపాలి ఒకవేళ ఉప్పు కనక తగ్గితే కాస్త వేసుకోవచ్చు. ఇలా ఎండలో ఉంచాలి.

ఇలా చేసుకోవడం వల్ల ఆవకాయ పాడైపోకుండా నిల్వ ఉంటుంది ఒకవేళ ఎప్పుడైనా కావాలంటే వెల్లుల్లిపాయలు ఇంట్లోనే ఉన్న వేయించుకుని వాటిలో కలుపుకోవచ్చు ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు. నిజంగా ఆవకాయ చాలా రుచికరంగా ఉంటుంది అనేక ప్రాంతాల వారు కూడా ఆవకాయ పచ్చడి తయారు చేసుకుంటారు కారం ఆవకాయ ఆవకాయ పచ్చడి ఆవకాయ వెల్లుల్లి ఆవకాయ బెల్లం ఆవకాయ ఇలా రకరకాల స్టైల్స్ కూడా అవకాశాలు ఉన్నాయి

ఎవరికి నచ్చిన స్టైల్ లో వాళ్ళ పెట్టుకుంటారు. తరతరాల నుంచి పెట్టుకుంటున్న ఎప్పటి నుంచో చూస్తున్నదే నిజంగా ఆవకాయతో ఒక ముద్ద కలుపుకుంటే ఆ పూత స్వర్గంలా వుంటుంది ముద్ద పప్పు లో నెయ్యి వేసుకుని అన్నం కలుపుకుని పక్కన ఆవకాయ ఉంటే ఆ రుచే వేరు. కాబట్టి ఆవకాయతో ఎవరికి నచ్చిన కాంబినేషన్స్ వాళ్లకు ఉంటాయి. కొందరు మజ్జిగలో కూడా వేసుకుని నంచుకుంటారు. కాబట్టి ఎవరికి నచ్చిన రీతిలో ఆవకాయ తినేస్తుంటారు తినడం సులువే కానీ కొంచెం పెట్టడం కాస్త కష్టం కానీ ఈ టిప్స్ ని ఫాలో అయి పెట్టేస్తే ఇక ఆవకాయ సిద్ధమై పోతుంది.
%d bloggers like this:
Available for Amazon Prime