మనం చిన్నప్పటినుండి వేమన పద్యం చదువు కుంటూ ఉంటాము :
మేడిపండు చూడ మేలిమై యుండును పొట్టవిప్పి చూడ పురుగులుండు :పిఱికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినుర వేమా !
మేడిపండు- అత్తి పండు -అంజీర -రాస్ప్బెరి -పిగ్ వీటిలో ఓషధి గుణాలు చాల కలవు .
1 . రక్త దోషాలు అనగా రక్త హీనత, చర్మము ఫై మొటిమలు లాంటివి మేడిపండ్లును నీడలో ఆరబెట్టి పొడిచేసి పంచదార కలిపి తీసుకున్న ఫలితం ఉంటుంది.
2. మలబద్దకం. ఏ రూపములో తీసుకున్నా ఫలితం ఉంటుంది.
3. మేడిచెట్టు బెరడు నలగగొట్టి నీరు కలిపి (రెండు గ్లాసులు )అర గ్లాస్ వరకు మరిగించి, ఒక చేమ్చా తేనే కలిపి ఉదయం పరగడుపున రోజు తీసుకున్న యెడల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే డయాబెటిస్ వలన వచ్చే కాళ్ళు మంటలు, రెటినోపతి లాంటివి తగ్గుతవి.
4. స్త్రీల కుసుమ వ్యాధులు, నడుము నొప్పి, గర్భ స్రావం కాకుండా కాపాడుతుంది.
You must log in to post a comment.