మన చుట్టు పక్కల రోడ్ల మీద ఎటు చూసిన మ్యాన్ హోల్స్ వృత్తాకారంలోనే ఉంటాయి. దానికి గల కారణాలు:
- ఒక వేళ అవి చత్రుస, దీర్ఘ చత్రుస ఆకారాల్లో ఉంటే పొరపాటున అవి ఆ కాలువలోకి పడిపోయే అవకాశలు చాలా ఉన్నాయి. దాని వల్ల ఆ కాలువలోంచి మళ్లీ వాటిని తీయడం అనేది జరిగే పని కాదు. ఒక వేళ అవి అందులో పడితే వాటిని తీయడానికి అధిక ధన ఖర్చు, రోడ్డును మళ్లీ పగలగొట్టి పునర్నిర్మించాలి. కానీ వృత్తాకరంలో ఉంటే అది ఎటు తిప్పి కాలువలోకి తోద్దం అని చూసిన అది అందులో వెళ్లదు. వృత్తాకారనికి ఉన్న ప్రత్యేకత అదే అందుకే దాన్ని ఎక్కువగా వాడతారు.
- మ్యాన్ హోల్ అనేది చాలా బరువుగా ఉంటుంది కాబట్టి అది వృత్తాకారంలో ఉంటే దాన్ని ఒక చోటు నుంచీ మరో చోటుకి తరలించడం చాలా సులభం. గుండ్రంగా ఉంటుంది కాబట్టి దోల్లించుకుంటూ వెళ్లిపోవచ్చు. దాన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు లాంటివి కూడా ఒక కారణమే.
- వృత్తమే కాదు రీయులక్స్ త్రిభుజాకారం కూడా కాలువలోకి పడకుండా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అది కూడా వాడతారు. కానీ దీన్ని తయారీ ఖర్చు వృత్తనికంటే అధికం.
You must log in to post a comment.