రామాయణం, మహాభారతంలో మీకు మంచి ప్రేరణ ఇచ్చిన ఘట్టం (సంఘటన) ఏది? అందులోనుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు?

రామాయణం ఒక ధర్మశాస్త్రము. అన్నదమ్ములు, తండ్రి కొడుకు లు, భార్యాభర్తలు, సవతులు,సవతి పుత్రులు ,తల్లి కొడుకు లు ,అత్ తా కోడళ్ళు మామూలు గా ను కష్టాలు వచ్చిన పుడును ఎలా మెలగాలి, ఒకరినొకరు ఎలా అర్ధం చేసుకోవాలి, ఒకరికొకరు ఎలా సహాయం చేసుకోవాలి అనే విషయాలను తెలియజేస్తుంది.ఒక ఆదర్శకుటుంబము ఎలా జీవించాలి అనే విషయాన్ని చక్కగా తెలియజేస్తుంది.ఏకపత్నీవ్రతము యొక్క ప్రాముఖ్యత ను ప్రపంచానికి తెలియజేసిన గొప్ప కావ్యం. రామాయణమును ఆబాలగోపాలము చదివే ది అలా ఆదర్శజీవిత స్ఫూర్తి పొందడానికే.అది మన భారతీయ సంస్కృతి ని ప్రతిబింబించే అతి ప్రాచీన కావ్యము.
ఇకమహాభారతకధ నడచిన ది ద్వాపరయుగంచివరలో మరియు కలియుగంప్రారంభానికి కొంచెము ముందు. అప్పటికే ఆస్తుల కోసం రాజ్యాలకోసం.అన్నదమ్ములు కొట్టుకోవడం మొదలైంది. పాండవులపై విషప్రయోగము చేయడం‌,లక్క ఇంట్లోపెట్టి తగలపెట్టడం‌,మా యాద్యూతంలో రాజ్యాన్నిలాక్కోవడం,ఇల్లాలి ని నిండు సభలో వివస్త్రను చేయడం,అవమానించడం‌,బలవంతపు పెళ్లి ళ్ళు,ప్రేమవివాహాలు,ఆడపిల్లను ఎత్తు కుపోయి బలవంతులు పెళ్లి చేసుకోవడం లాంటివి అన్నీ చూస్తాము.ఇందులో అన్నదమ్ములు కొట్లాడుకుంటే ఎలా నష్టపోతారో తెలుసుకుంటాము.కష్టాలు వచ్చినప్పుడు ఎలా ధర్మంగా మెలగాలో పాండవులు ముఖ్యముగా ధర్మరాజు జీవితం ద్వారా తెలుసుకుంటాము.ఇందులో వచ్చే యక్షప్రశ్నలు వాటి సమాధానాలు ధర్మశాస్త్రసారమే.ఇందులో నున్న భగవద్గీత వజ్ర సమానము.ప్రతిమనిషి వివిధ దశలలో కర్మ,జ్ఞాన, భక్తి,వైరాగ్య యోగ ములతో జీవితాన్ని ఎలా సార్ధకం చేసుకోవాలి ఎలా ముక్తి పొందాలి అనే విషయాలను తెలియజేస్తుంది. అందుకే దీని ని పంచమ వేదమనికూడా పిలుస్తారు. ఒక ఆదర్శ కుటుంబ ము ఎలామెలగాలి,ఒక ఆదర్శ సమాజం ఎలా ఉండాలి అనేవిషయాలను ఈ రెండు మహా కావ్యాలు ప్రత్యక్ష ము గాను,పరోక్షముగాను తెలియజేస్తాయి.అధర్మముగా నడిస్తే ఎలా నష్టపోతారో అనే విషయాన్ని కూడాతెలియజేస్తాయి.

Related posts

%d bloggers like this: