బూడిద గుమ్మడికాయ

వడియాలు

ఇది పాడైపోకుండా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకుని తినొచ్చు. టేస్ట్ గా అప్పటికప్పుడు మనం వేయించుకోవచ్చు. నిజంగా ఇది సులువుగా తయారు చేసుకుని దాచుకోవచ్చు. ఇవి పచ్చి వడియాలగా కూడా వేయించుకుంటే కూడా బాగుంటాయి పండు మిర్చి కారం వల్ల మరింత రుచిగా ఉంటుంది. అయితే గుమ్మడి వడియాలు పెద్దల నుంచి పిల్లల వరకు ఎవ్వరూ వదిలిపెట్టరు. తయారుచేసుకుని నచ్చినప్పుడు మనం తినవచ్చు.

దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. గుమ్మడి ఒడియాలు పూర్వ కాలం నుంచి కూడా మన పెద్దలు పెడుతూనే ఉన్నారు. ఇదేం నేటితరం ఫ్యాషన్ రెసిపీ కాదు కానీ ఇప్పటి వాళ్ళ కూడా ఈ వడియాలని ఇష్టపడతారు. నిజంగా ఒక్కసారి తింటే వదిలిపెట్టను. దీని కోసం ఎంత చెప్పినా తక్కువే ఈరోజు మాత్రం నిజంగా అద్భుతమే

అయితే ఇందులో ఏదో మాయ ఉన్నట్టు ఉంటుంది అయితే దీనిని ఎలా చేసుకోవాలి దీనికి కావలసిన పదార్థాలు ఏమిటి మరి ఈ రెసిపీ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నాను మరి ఆలస్యం చేయకండి ఆర్టికల్స్ చదవండి…

ముందుగా గుమ్మడి వడియాలు పెట్టుకోడానికి టిప్స్ చూద్దాం:

గుమ్మడి వడియాలు కి ముందు మనం మినప్పప్పు ఇందులో వాడతాము. రాళ్ళు లేకుండా మినపప్పు శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల ఒడియాలు బాగా ఉంటాయి మంచి ఇంగువ తెచ్చుకుని దీన్ని వాడడం వల్ల రుచి బాగుంటుంది. కాబట్టి దీన్ని చేసేముందు తాజాగా మంచిగా ఉన్న ఇంగువ ని వాడండి. అలానే ముక్కల్ని పొడవుగా తరుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ఒడియాలు బావుంటాయి. అయితే ఒక రోజు ముందే ఈ వడియాలకి మనం రెడీ పెట్టుకోవాలి ఈ ముక్కల్లో ఉప్పు పసుపు వేసుకొని మొఖం ఒక గుడ్డలో మూట కట్టి పెట్టుకోవాలి. ఇలా ఒక రోజు ముందే చేయడం వల్ల నీళ్లు మొత్తం ఓడిపోతాయి అలానే ఒడియాలు కూడా నీళ్లు లేకుండా చక్కగా వస్తాయి ఇలా ముక్కలు మాత్రం శుభ్రంగా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మీకోసం……

గుమ్మడికాయ వడియాలు కి కావాల్సిన పదార్థాలు

బూడిద గుమ్మడికాయ
మినపప్పు
పండు మిర్చి
ఉప్పు
పసుపు
ఇంగువ

తయారు చేసుకునే విథానం

ఒక రోజు ముందుగానే గుమ్మడికాయను ముక్కలుగా కోసుకొని అందులో ఉప్పు, పసుపు వేసుకుని ముక్కల్ని ఒక గుడ్డ లో వేసి ఒక మూటలా కట్టాలి. దానిపై ఏదైనా బరువైన వస్తువు పెడితే ఆ గుమ్మడికాయ లో ఉన్న నీరు పోతుంది అప్పుడు ఒడియాలు చక్కగా వస్తాయి. ఇలా ఒకరోజు ఉంచిన తరువాత ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన మినప్పప్పును మెత్తగా రుబ్బుకుని, అందులో సరిపడా ఉప్పు మరియు పండు మిర్చి పేస్టు వేసుకోవాలి . దీనిలో గుమ్మడికాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకొని, వాటిని ఒడియాలు లాగా పెట్టి ఎండలో పెట్టుకోవాలి. ఇలా మూడు నుండి నాలుగు రోజులు వరకు ఎండలో పెట్టాలి. బాగా ఎండిపోయిన తర్వాత బాగా కాగిన నూనెలో వేసి ఒడియాలు వేయించుకోవాలి.
%d bloggers like this:
Available for Amazon Prime