విండోస్‌లో 1 టీబీ హార్డ్ డిస్క్ 931 జీబీ మాత్రమే చూపించడానికి కారణం ఏమిటి ?

ఇక్కడ విషయం ఏమిటంటే హార్డ్ డిస్క్ తయారు చేసే కంపెనీలు దాని యొక్క స్టోరేజీ స్పేస్ ను అంతర్జాతీయ ప్రమాణాల పద్దతి అనగా SI (system international) units ప్రకారం ఇస్తాయి. ఆ ప్రమాణాల ప్రకారం :
1 టీబీ = 1,000,000,000,000 (10^12) బైట్లు.
మన కంప్యూటరు లలో కూడాస్టోరేజీ స్పేస్ ను 10 పవర్లలో నిర్దేశిస్తే అప్పుడు ఎటువంటి తేడా వుండేది కాదు. కానీ మన కంప్యూటరు లలో స్టోరేజీ స్పేస్ ను వేరే విధంగా నిర్దేశిస్తారు. ఇక్కడ 2 యొక్క పవర్లలో నిర్దేశిస్తారు. దాని ప్రకారం ఒక కేబి అనగా 2^10 బైట్లు. => 1024 బైట్లు (1000 బైట్ల కన్న ఎక్కువ).
అలాగే ఒక ఎమ్బి అంటే 1024 కేబీలు, అనగా 1024*1024 బైట్లు. (10^6 బైట్ల కన్నా ఎక్కువ).
అలాగే ఒక జీబి అనగా 1024 ఎమ్ బీలు అనమాట.
=> 1024*1024*1024 బైట్లు (10^9 బైట్ల కన్నా ఎక్కువ).
అలాగే ఒక టీబి అనగా 1024 జీబీలు అనమాట.
=> 1024*1024*1024*1024 బైట్లు (10^12 బైట్ల కన్నా ఎక్కువ).
అందువలన 1టీబీ హార్డ్ డిస్క్ ను మన కంప్యూటరుకు కనెక్ట్ చేసినపుడు , మనకు 931 జీబీ అని చూపిస్తుంది.
931* (1024^3) = 10^12 బైట్లు అనమాట. (ఒక టీబి SI ప్రకారం). కానీ కంప్యుటరుకు ఒక టీబీ అంటే 1024^4 బైట్లు.
అందువలన మనకు 1టీబీ అని ఎప్పుడూ చూపించదు.
అందువలన మీరు ఏ కంపెనీ హార్డ్ డిస్క్ ను కొన్నా, అది ఏ కంప్యూటరుకు ఐనా కనెక్ట్ చేసినా ఇలాగే చూపుతుంది.
%d bloggers like this:
Available for Amazon Prime