మహాభారతంలో ‘శిఖండి’ ఎవరు?

మహాభారతంలో శిఖండి ఒక విచిత్రమయిన పాత్ర. ద్రుపదమహరాజుకు కూతురుగా, శిఖండినిగా జన్మించి తరువాత మహారథుడయిన కొడుకుగా మారిన విచిత్ర కథ.
ద్రుపద మహారాజు తనకు కలిగిన కుమార్తెను లోకానికి కొడుకుగా పరిచయం చేసి పెళ్లి కూడా చేసేస్తాడు. అతడి భార్య తాను పెళ్లి చేసుకున్నది స్త్రీ అని గ్రహించి తన తండ్రికి తెలియబరిస్తే, ఆ రాజు మహా కోపంతో యుద్ధానికి తరలి వస్తాడు. ఈ లోగా ……
అవమానంతో , శిఖండి ఆత్మత్యాగానికి సిద్ధమయి అడవికి వెళితే , ఒకగంధర్వుడు ఆమె మీద జాలిపడి తాత్కాలికంగా తన పురుషత్వాన్ని ఆమెకిచ్చి తన స్త్రీత్వాన్ని స్వీకరిస్తాడు.
యుద్ధానికి వచ్చిన రాజు గారు తన మనుషులను పంపి తన అల్లుడు మగవాడేనని గ్రహించి క్షమాపణ కోరుకుని మరలి వెళ్తాడు.
శిఖండి ఇలా పబ్బం గడుపుకుని, గండం గట్టెక్కించుకుని , అన్న ప్రకారం గంధర్వుడి దగ్గరకు వెళ్తాడు. ఈ లోగా….
గంధర్వుడిని చూడడానికొచ్చిన దేవేంద్రుడు ఆతనుచేసిన పనిని తప్పుబట్టి , అదే స్త్రీ రూపంలో ఉండమని శపించి పోతాడు. యధా ప్రకారం తమ ఆకారాలు మార్చుకునే అవకాశం లేనందున శిఖండి మళ్ళీ స్త్రీ గా మారడు. తంతే,,,,… పడ్డట్టు. అది విధికృతం. ఆ విధంగా శిఖండి ‘అంగనా పూర్వుడు’ గా పిలువబడతాడు.
ఇంతకీ ఈ శిఖండి ఎవరంటే , పూర్వ జన్మలలో , భీష్ముడి ద్వారా ఎత్తుకు రాబడి , ఆ కారణంవల్ల తాను ప్రేమించిన సాళ్వభూపతి చేత తిరస్కరించబడి, భీష్ముడు కూడా నిరాకరించడంతో నొచ్చుకుని , పరశురాముడి సహాయం కూడా విఫలం అవ్వడంతో అన్ని విధాలా భంగపడిన అంబ. తన తపోబలంతో భీష్ముడి చావుకి కారణం అయ్యేలా వరం పొంది ద్రుపదుడుకి సంతానమయ్యిన శిఖండి, మహాభారత యుద్ధంలో భీష్ముడికి ఎదురు నిలుస్తాడు. అర్జునిడితో కలిసి బాణాలు వేస్తూ బీష్ముడిని గాయపరిచి అతని స్వర్గయానానికి దారి కల్పిస్తాడు.
%d bloggers like this:
Available for Amazon Prime