బిడ్డ పుట్టాక బొడ్డు తాడు కత్తిరించినప్పుడు, తల్లికి జతచేసి ఉన్న ముక్కకు ఏమవుతుంది?

తల్లికి జతచేసి ఉన్న బొడ్డుత్రాడు ముక్క ‘మావి’తో పాటు, (గర్భాశయంచే) విసర్జించబడుతుంది.
వివరము:
తల్లి గర్భాశయంలో మావి (placenta) ఉంటుంది. ఇది తల్లీ-బిడ్డల రక్తసరఫరా వ్యవస్థలకు మధ్యవర్తి.
మావి ఒక పళ్ళెం వలె ఉంటే, దాని చివర ఒక త్రాడు వలె ఉండి, అది బిడ్డ బొడ్డుకు సంధానింపబడి ఉంటుంది.
బిడ్డ పుట్టిన తరువాత కొద్ది నిముషాలలోనే బిడ్డ శరీరంలోని రక్తసరఫరా వ్యవస్థ చైతన్యవంతమౌతుంది. అప్పుడు బొడ్డు తాడులో గల రక్తాన్ని బిడ్డ వైపుకు పిండితే, కొద్దిపాటి రక్తం బిడ్డ శరీరంలోనికి చేరుతుంది. ఆ తరువాత బొడ్డుత్రాడును కత్తిరిస్తారు. అక్కడితో, తల్లీ-బిడ్డలకు గల రక్తసరఫరా బంధం తెగినట్లే!
తల్లి నుండి బిడ్డకు రక్తసరఫరా బంధం బొడ్డు అయినా, బ్లడ్ గ్రూపులు వేరుగా నుండవచ్చు.