బరువు

నేను త్వరగా బరువు తగ్గడం ఎలా?

ఈ క్రింది సూచనలు పాటించండి
1.  ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం కపాలభాతి ప్రాణాయామం చేయండి. ఇది బరువును తగ్గించడమే కాకుండా ముఖం మీద కాంతిని కూడా పెంచుతుంది మరియు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
2. మీరు తినే ఆహారంలో ఎక్కువ శాతం పచ్చి కాయగూరలు మరియు పండ్లు ఉండేలా చూసుకోండి. కనీసం 30% శాతం ఇవి ఉండాలి.
3.   ఒక తమలపాకులో 5 నుండి ఆరు మిరియాలు కలిపి చుట్టి రోజూ ఉదయం టిఫిన్‌‌‌కి ముందు తిని, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి. ఇది ఒంట్లో ఉన్న కొవ్వును కరిగిస్తుంది.
4.  కొద్దిగా కొత్తిమీర, 3 నుండి 4 చిన్న అల్లం ముక్కలు కలిపి నీళ్ళు వేసి మిక్సీకి వేసుకొని జ్యూస్ చేసుకోండి. అందులో 1 స్పూన్ తేనె మరియు సగం నిమ్మకాయ బద్దను పిండండి. ఇది రోజూ పరగడపున సేవించండి. సులువుగా బరువును తగ్గిస్తుంది.
5.  రోజుకి కనీసం 25 నుండి 30 నిమిషాల వరకు చమట కక్కేలా గుంజీలు తీయడం, స్కిప్పింగ్ చేయడం, నడవడం లాంటివి చేయండి. ఇది అన్నిటికన్నా ఎంతో ముఖ్యం.
ఈ 5 సూచనలు క్రమం తప్పకుండా పాటిస్తే సులువుగా బరువును తగ్గించుకోవచ్చు.
 

రాత్రి పూట అన్నం తింటే బరువు పెరుగుతారా

చాలా మంది ఇప్పుడు హెల్త్ కాన్షియెస్ అయ్యారు. ఎప్పుడు ఏం తినాలి.. ఎలా ఫిట్‌గా ఉండాలనే ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రి పూట అన్నం తినడాన్ని అవాయిడ్ చేస్తున్నారు. దానికి బదులుగా రోటీ, పుల్కా, వేరే ఏదైనా టిఫిన్స్, పండ్లలాంటివి తింటున్నారు. మరి ఇలా చేయడం నిజంగా ఫలితం ఉంటుందా అంటే.. ఉంటుందనే చెబుతున్నారు నిపుణులు..
వాస్తవానికి ఎక్కువగా శారరక శ్రమ చేసేవారు.. అన్నం ఎంత తిన్నా పర్లేదు.. ఎందుకంటే వారు శారరక శ్రమ పెరిగి ఎక్కువ కేలరలు ఖర్చు అయిపోతుంటాయి. కాన, కూర్చుని పనులు చేసేవారు అన్నం తినే విషయంలో జాగ్రత్తలు అవసరం. వారు కనీసం ఎక్సర్‌సైజ్ చేస్తుండాలి. లేకపోతే అధికంగా బరువు పెరిగి గుండె జబ్బులు, షుగర్ వంటి సమస్యలు వస్తాయి.

 

samayam telugu

అన్నం తినడం కూడా సమయానికి తగ్గట్లుగా తీసుకోవాలి.. పగటి పూట జీవక్రియలు బాగుంటాయి. ఈ సమయంలో అన్నం బాగా తినొచ్చు. అదే రాత్రి పూట అయితే అన్నం తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని ఇచ్చానా.. రాత్రి పూట మన శరీరం ఏ పని చేయదు.. కేలరీలు ఖర్చు కావు.. దీంతో అవి కొవ్వుగా పెరిగి ఫలితంగా బరువు పెరుగుతారు. ఈ నేపథ్యంలోనే పగటి పూట రైస్ తీసుకున్నా పర్లేదు కానీ, రాత్రి పూట అన్నం తీసుకోకపోవడమే మంచిది.. ఆ సమయంలో ఆహారం ఎంత తేలిగ్గా ఉంటే అంత మంచిది. త్వరగా జీర్ణమవుతుంది.. కడుపు కాస్తా ఖాళీగా ఉంటే నిద్ర కూడా బాగా పడుతుంది.

%d bloggers like this:
Available for Amazon Prime