సాధారణంగా నౌకలో త్రాగే మరియు వాడుక నీరుని సముద్రపు నీరు నుండి ఉత్పత్తి చేయబడుతుంది. ఈ మంచినీరు ఎలా ఉత్పత్తి చేయబడుతుందో లోతుగా కాకుండా క్లుప్తంగా వివరిస్తాను.
మంచినీటిని రెండు పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేయవచ్చు
1. స్వేదనం(Distillation)
2.రివర్స్ ఓస్మోసిస్ (RO)
సాధారణంగా సరుకుల రవాణా నౌక లో(cargo ship) స్వేదనం(distillation) పధ్ధతి ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది పరిమాణంలో చిన్నది, ప్రభావంతమైనది మరియు ఖర్చు లేనిది. అయితే RO ఖరీదైనది మరియు పరిమాణంలో కూడా పెద్దది.ముఖ్యంగా ప్యాసింజర్ షిప్‌లో RO ఉపయోగించబడుతుంది, ఇక్కడ పెద్ద మొత్తంలో నీరు వినియోగించబడుతుంది కనుక.
1. స్వేదనం(Distillation) = ఆవిరి + సంక్షేపణం
(Evaporation + Condensation)
ఫ్రెష్ వాటర్ జనరేటర్ (fresh water generator)అనే పరికరం ద్వారా distillation పద్ధతి ద్వారా మంచినీరు ఉత్పత్తి చేసుకోవచ్చు.
పైన కనిపిస్తున్న ఫొటోలో ఉన్నదే ఫ్రెష్ వాటర్ జనరేటర్(shell&tube type). ఇవి ముఖ్యంగా రెండు రకాలు, ప్లేట్ టైపు మరియు షెల్ &ట్యూబ్ టైపు.
మంచినీటిని ఉత్పత్తి చేయడానికి నౌకలో రెండు విషయాలు పుష్కలంగా లభిస్తాయి – సముద్రపు నీరు మరియు వేడి. అందువల్ల ఏదైనా వేడి మూలం నుండి వేడిని ఉపయోగించి సముద్రపు నీటిని ఆవిరి చేయడం ద్వారా మంచినీరు ఉత్పత్తి అవుతుంది. ఆవిరైపోయిన సముద్రపు నీటిని మళ్ళీ సముద్రపు నీటితో చల్లబరుస్తుంది మరియు చక్రం పునరావృతమవుతుంది.
FWG(ఫ్రెష్ వాటర్ జనరేటర్) యొక్క ప్రాథమిక సూత్రం ఏమిటంటే, చుట్టుపక్కల(shell లో )వాతావరణం యొక్క ఒత్తిడిని తగ్గించడం ద్వారా నీటి మరిగే బిందువును(boiling point) తగ్గించవచ్చు. అల్పపీడనాన్ని(low pressure) నిర్వహించడం ద్వారా, తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అంటే 50 డిగ్రీల సెల్సియస్ వద్ద నీటిని మరగబెట్టవచ్చు . FWG యొక్క వేడి మూలం ప్రధాన ఇంజిన్(Main engine) జాకెట్ శీతలీకరణ నీటిచే తిరస్కరించబడిన వ్యర్థ వేడి. సులభంగా చెప్పాలంటే మన కార్స్ లో ఉండే రేడియేటర్ నీరు ఎలాంటిదో Main engine jacket water కూడ అంతే.
ఇలా ఉత్పత్తయిన మంచి నీరు mineralize ప్రాసెస్ తర్వాత త్రాగటానికి ఉపయోగిస్తారు.
2.రివర్స్ ఓస్మోసిస్(RO)
ఇది నీటి వడపోత ప్రక్రియ, ఇది పాక్షిక పారగమ్య పొర(Semipermeable membrane -SPM)పదార్థాలను ఉపయోగిస్తుంది
ఓస్మోసిస్ అనేది సహజంగా నీటిని SPM యొక్క ఒక వైపు నుండి మరొక వైపుకు తరలించే దృగ్విషయం(phenomenon )
రివర్స్ ఓస్మోసిస్ అనేది ఓస్మోసిస్ ప్రక్రియకు విరుద్ధం , అంటే దీనిలో ఉప్పునీరు SPM ద్వారా నిరోధించబడుతుంది.ఈ ప్రక్రియలో సముద్రపు నీరు పంపు ద్వారా ఒత్తిడి చేయబడుతుంది మరియు ఇది SPM గుండా వెళుతుంది. SPM కేవలం స్వచ్ఛమైన/ మంచినీరును వదిలి కలుషితమైన /ఉప్పు వ్యర్ధ content ని అడ్డుకుంటుంది.ముందుగా చెప్పినట్టు RO పద్ధతిని ఎక్కువగా పాసెంజర్ నౌకలో ఉపయోగించబడుతుంది.
You must log in to post a comment.