ఆవర్తన పట్టిక (పీరియాడిక్ టేబుల్) ను సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు?

సులభంగా అనను కానీ ఆవర్తన పట్టిక ను ఒక నిర్ధిష్ట పధ్ధతి లోనే నేర్చుకోవాలి. అప్పుడే అది అలా ఎందుకు రాయబడింది అనే విషయం అవగాహన కి వస్తుంది. ఎలా పడితే ఆలా గుర్తుపెట్టుకుని పనైతే టేబుల్ లానే వ్రాయాలా? ఏ లిస్టుగానో రాసి చేతులు దులుపుకోవచ్చు కదా. ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తాను.
ముందుగా తెలుసుకోవాల్సింది, పీరియాడిక్ టేబుల్ లోని ఒకే నిలువు వరుసలో ఉండే ఎలెమెంట్స్ యొక్క ప్రవర్తన సుమారుగా ఒకే విధంగా ఉంటుంది. ఉదాహరణకి మొదటి వరుసలో ఉన్న ఎలెమెంట్స్ ని తీస్కోండి. లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీసియం లను చూడండి. ఇవన్నీ పెళుసు గా ఉంటాయి, వివిధ రంగులు వెదజల్లుతూ మండుతాయి, ఆక్సిడ్స్ గా మారుతాయి ఎక్సపోజ్ అయినప్పుడు, ఈ ఆక్సిడ్స్ నీళ్లలో వేస్తె చాలా ఎక్సప్లోజివ్ గా రియాక్ట్ అవుతాయి, కరిగాక స్ట్రాంగ్ bases గా మారుతాయి. అందుకే ఈ నిలువు వరుసను ఆల్కలీన్ మెటల్స్ అని కూడా అంటారు.
ఇలా ప్రతి నిలువు వరుసకు ఒకే విధమైన ప్రవర్తనలు ఉంటాయి. వాటికి తగ్గట్టుగా ఆ వరుసలకు పేర్లు కూడా పెట్టారు. ఈ వార్సులను గ్రూప్స్ అంటారు. ఉదాహరణకు పైన చెప్పినవి గ్రూప్ 1 మెటల్స్ అన్న మాట. అలానే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్ ఉండే వరుసను హాలోజెన్స్ అంటారు. వీటికి బ్లీచింగ్ ప్రాపర్టీ ఉంటుంది. మెటల్స్ తో చాలా కరోస్సివ్ గా రియాక్ట్ అవుతాయి. వీటి అక్సయిడ్స్ నీళ్లలో కలిపితే చాలా స్ట్రాంగ్ ఆమ్లాలు వస్తాయి. ఇలా ఇంకా ఎన్నో ఉంటాయి.
ఇలా ఆవర్తన పట్టిక ను ఈ విధంగా నేర్చుకోవాలి. అప్పుడే ఒక్కో ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్, ప్రవర్తనలను మనం సులభంగా గుర్తు పెట్టుకోవచ్చు.
%d bloggers like this:
Available for Amazon Prime