Before it found its way into your kitchen, the onion plant was happily making food from the sun and absorbing minerals from the soil. It turns out that onions are particularly good at absorbing sulfur, which they use in a number of amino acids.
Onions contain sulfur compounds in their cells that are released as soon as the knife cuts into the poor cells releasing the liquidy contents within. The substance that causes the greatest trouble is a compound known as propanethial S-oxide, This is a highly volatile substance, which means it rises into the air and combines with water in our tear ducts to form stinging sulfuric acid, which is what makes us cry.
How to make chopping onions a joyful moment?
Only way to stop chopping onions being such a tearful business is to prevent all, or at least some, of the oxide (sulfur compound) from getting into the eyes. This could be done by
-
cutting the onions under water,
-
turning your face away or
-
wearing protective goggles – even wearing contact lenses can help.
-
Also, the more coarsely you chop the onion and the sharper the knife the less oxide is released.
-
It is not clear whether it is also helpful to chill the onion prior to chopping it. Some people do this too.
ఉల్లి గడ్డ కోసేటపుడు కళ్ళు మండడానికి, కళ్ళల్లో నీళ్ళు రావడానికి కారణం ఏమిటి?
మనిషి కంట్లో లాక్రిమల్ గ్రంధులు లేదా కన్నీటి గ్రంథులు– కన్నీటిని పుట్టిస్తాయి. కనురెప్పల వంటి వస్తువులు కంటిలో చిక్కుకున్నప్పుడు, దుమ్ము పడినప్పుడు, కనుగుడ్డుకి ఏదైనా రసాయనం అసౌకర్యం కలిగినప్పుడు – కంటిలో ఉండే నరాలు, మెదడుకు సంకేతాలు పంపుతాయి. మెదడు వాటిని వదిలించుకునే ప్రయత్నంలో భాగంగా కన్నీటి గ్రంధులను ఉత్తేజపరిచినప్పుడు కన్నీళ్లు వస్తాయి.కన్నీళ్లు ఈ దుమ్ముని/రసాయనాన్ని కొట్టుకుపోయేలా చేసి కంటిని కాపాడతాయి.
మనకు కంటికి అసౌకర్యం కలిగించే అన్నిటినీ మనం చూడలేకపోవచ్చు. ఇలా అసౌకర్యం కలిగించే వాటిని ‘లాక్రిమల్ ఏజెంట్‘ అంటారు.
ఉల్లిపాయలను తరిగినప్పుడు, వాటి కణాల నుండి ‘అల్లీనేసేస్‘ (alliinases) అనే ఎన్జైమ్ విడుదల అవుతుంది. ఇది మొదట సల్ఫాక్సైడ్ గా, తర్వాత సల్ఫీనిక్ యాసిడ్ గా రూపాంతరం చెందుతుంది. సల్ఫీనిక్ యాసిడ్ కొద్ది క్షణాల్లోనే ‘లాక్రిమేటరీ ఫ్యాక్టర్ సింథేస్'(LFS) గా మారుతుంది. ఈ ఎల్.ఎఫ్.ఎస్ ఒక లాక్రిమల్ ఏజెంట్ లా పని చేస్తుంది.
ఎల్.ఎఫ్.ఎస్ గాలి ద్వారా వ్యాపించి, కంటిని చేరినప్పుడు, కంటి నరాలు అసౌకర్యాన్ని గ్రహించి మెదడుకి సంకేతాలు పంపుతాయి. అప్పుడు మెదడు కన్నీటి గ్రంథుల నుండి కన్నీళ్లు విడుదలయ్యేలా చేసి ఈ రసాయనాన్ని కంటి నుండి కొట్టుకుపోయేలా చేస్తుంది.
You must log in to post a comment.