శాస్త్రవేత్తలు భూమి బరువును ఎలా తెలుసుకుంటారు?

ముందుగా భూమి మీద మీరు మీ బరువును చూసుకున్నారని అనుకుందాం. తర్వాత చంద్రుడి మీద మీ బరువును చూసుకున్నారని అనుకుందాం. చంద్రుడి మీద మీ బరువు భూమి మీద మీరున్న బరువులో ఆరవవంతు వస్తుంది. చివరిగా అంతరిక్షంలో మీరు మీ బరువును చూసుకున్నారని అనుకుందాం. అంతరిక్షంలో మీ బరువు సున్నా వస్తుంది.
బరువు అనేది మీరున్న స్థలంలో,మీపై పని చేసే ఫోర్స్ మీద ఆధర‌పడి ఉంటుంది. మీరున్న స్థలంలో మీ పైన ఎక్కువ ఫోర్స్ పని చేస్తే, మీరు అక్కడ ఎక్కువ బరువు ఉంటారు.
ఇక్కడ మనం ఫోర్స్ని గురుత్వాకర్షణ శక్తిగా చెప్పుకోవచ్చు‌.‍‍ చంద్రుడి పైన గురుత్వాకర్షణ శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి, అక్కడ మనం తక్కువ బరువు ఉంటాం. అలాగే అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి దాదాపు ఉండదు కాబట్టి అక్కడ మన బరువు దాదాపు సున్నా. భూమి కూడా అంతరిక్షంలోనే ఉంది కాబట్టి భూమికి బరువు ఉండదు. కాని భూమికి మాస్ ఉంటుంది.
మాస్ అనేది ఒక వస్తువులో ఉండె మ్యాటర్(అణువుల సమూహం) కొలత గురించి చెప్తుంది. మాస్ ఎక్కువ ఉంటే మ్యాటర్ ఎక్కువ ఉన్నట్టు. ఉదాహరణ :-ఒక వ్యక్తి 70 కేజీలు ఉన్నాడంటే అతని మాస్ 70 కేజీలు అని అర్ధం.
ఇక భూమి యెక్క మాస్ ..లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ ఉపయోగించి తెలుసుకుంటారు.
M=(gr^2)/G
పైన చప్పిన సమీకరణంలో..
g అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ త్వరణం(acceleration of gravity)..దాని విలువ 9.8 మీటర్స్/సెకెండ్.
r అంటే భూమి యొక్క వ్యాసార్థం(radius)..దాని విలువ 6378.1 కిలోమీటర్లు.
G అంటే న్యూటన్స్ కాన్స్‌టంట్..దాని విలువ 6.67*10^-11 న్యూటన్ *మీటర్ స్క్వయర్/ కేజీ స్క్వయర్
M అంటే భూమి యొక్క మాస్..
పైన చెప్పిన విలువలన్నీ..సమీకరణంలో పెట్టి లెక్కించడం ద్వారా శాస్త్రవేత్తలు భూమి యొక్క మాస్ను తెలుసుకుంటారు.
M=5.972*10^24 కేజీలు
%d bloggers like this:
Available for Amazon Prime