వేసవి కాలం వచ్చినచో మామిడి పండ్ల రోజులు వచ్చినట్లు. పండ్ల రాజా కూడా మామిడే. బంగారు రంగులో, నోరూరించే తీపితో ఎండాకాలానికే ప్రత్యేకంగా నిలిచే పండు మామిడి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడే అమృత ఫలమిదియే. పచ్చిది కానీ, పండుగానీ ఏదైనా సరే ‘ఆహా ఏమి రుచీ!’ అనుకోకుండా ఉండలేరు. పండ్లలలోనే రారాజుగా నిలిచిన మామిడిలో పోషక విలువలూ కూడా ఎక్కువే. పోషక విలువలున్న మామిడి పండ్లతో ఎన్ని రకాల వంటలు చేయవచ్చునో.
ప్రపంచంలో మామిడిలో వెయ్యికి పైగా రకాలున్నవి. మామిడి ఉత్పత్తిలో మన భారత దేశానిదే అగ్రస్థానం.అయితే ఇచట మామిడిలో ఎన్ని రకాలున్నా బంగినపల్లి రుచికి ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంటుంది. మరి వీటిలో కొల్లాపూర్, నీలం, రసాలు, చందూరా, రుమానియా, రాజమాను, పంచదార కలశ, కోలంగోవా, అల్పోన్సో, బదామీ, దుస్సేరీ, సువర్ణ, రేశ, ఇమాం పసంద్, చిలకముక్కు మామిడి, బెంగళూరు మామిడి, మల్గోవ… ఇలా ఎన్ని రకాలో. తన రుచితో రాజులను, చక్రవర్తులను సైతం ఆకట్టుకున్న ఘనత మామిడి పండ్లది. ఈ కాలంలో మరి మీరు అన్ని రకాల పండ్లను తిని రుచిచూసి, ఆనందించండి.
You must log in to post a comment.