భూమి గుండ్రంగా ఉందని ఎవరు నిరూపించారు, రుజువు కోసం వారు ఎంచుకున్న పద్ధతి ఏమిటి?

అలెగ్జాండ్రియా కి చెందిన ఎరటోస్థెనెస్(eratosthenes)
మొట్ట మొదట మూడవ శతాబ్దం బిసిలో భూమి గుండ్రంగా ఉంటుంది అని మరియు భూమియొక్క చుట్టుకొలతని కనుగొన్నారు . ఎరటోస్థెనెస్ ఒక ఖగోళశాస్త్రవేత్త , చరిత్రకారుడు, భౌగోళిక శాస్త్రవేత్త, తత్వవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు మరియు ఒక కవి . ఆయన అలెగ్జాండ్రియా యొక్క గ్రేట్ లైబ్రరీ కి డైరెక్టర్ . ఒకసారి ఆయన లైబ్రరీ లోని పాపిరస్(papyrus) పుస్తకంలో సైనీ (syene) ( ఇప్పుడు ఆస్వాన్ అని పిలుస్తున్నారు) అనే ప్రాంతంలో మధ్యాహ్నం నిలువుగా వున్న కర్రలకు నీడలు వుండవు అని చదివాడు . అపుడు ఆయనకి ఒక సందేహం వచ్చింది అదే సమయంలో అలెగ్జాండ్రియా లో కర్రలకు నీడ వుంటుందా లేదా అని . ఆయన అలెగ్జాండ్రియా లో తాను వున్న ప్రాంతంలో కర్రలు నిలువుగా ఉంచి గమనించారు. కానీ సైనీ లో కర్రలకు నీడలు లేని సమయంలో అలెగ్జాండ్రియా లో ఉంచిన కర్రలకు నీడలు ఉండటం గమనించారు . అప్పటికాలంలో భూమి ఫ్లాట్ గా ఉంటుంది అని అనుకునేవారు . ఒకవేళ భూమి ఫ్లాట్ గా ఉంటే అన్ని చోట్ల వస్తువులకు నీడలు ఒకేలా ఉండాలి కానీ ఇలా నీడల్లో తేడాలు ఎందుకు వచ్చాయి అని ఎరటోస్థెనెస్ ఆలోచించారు అప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ప్రపంచాన్ని మార్చేసింది .
భూమి కర్వ్ గా ఉండటం వల్ల నీడల్లో తేడాలు వున్నాయి అని కనుగొన్నారు . కర్వ్ ఎంత పెద్దగా ఉంటే నీడల్లో అంత ఎక్కువ తేడాలు ఉంటాయి అని కనుగొన్నారు . ఆయన ఒక గణిత శాస్త్రజ్ఞుడు కాబట్టి సైనీ మరియు అలెగ్జాండ్రియా లో వున్న నీడల తేడాలు 7 డిగ్రీలు వున్నాయి అని కనుగొన్నారు .
అయన ఒక వ్యక్తిని సైనీ నుండి అలెగ్జాండ్రియా ఎంత దూరంలో వుంది అని లెక్కించడానికి నియమించారు . అపుడు సైనీ కి అలెగ్జాండ్రియా 800 కిలోమీటర్లు అని తెలిసింది . 7 డిగ్రీ అంటే 360 డిగ్రీస్ లో 1/50 వంతు . 800*50=40,000 కిలోమీటర్లు .
అయన అప్పుడు ఉపయోగించినవి కర్రలు, కళ్ళు మరియు ఆలోచనలు వాటితో ఆయన వున్న ప్రాంతం నుండే 2,200 సంవత్సరాల ముందు భూమి యొక్క చుట్టుకొలతను కనుగొన్నారు .
%d bloggers like this:
Available for Amazon Prime