భూమికే కాదు మాస్( ద్రవ్యరాశి) వున్న ఏ వస్తువుకు అయిన గురుత్వాకర్షణ శక్తి వుంటుంది. గురుత్వాకర్షణ శక్తి ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని బట్టి వుంటుంది. ద్రవ్యరాశి ఎంత ఎక్కువ వుంటే గురుత్వాకర్షణ శక్తి అంత ఎక్కువ వుంటుంది. సూర్యుని ద్రవ్యరాశి భూమి యొక్క ద్రవ్యరాశి కంటే ఎక్కువ కాబట్టి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
ఒకవేళ భూమికి గురుత్వాకర్షణ శక్తి లేకపోతే భూమి మీద నీరు వుండేది కాదు. నీరు లేకపోతె జీవం సాధ్యం అవ్వదు.మనం ఆకాశంలో ఎగిరిపోకుండా భూమి మీదనే వున్నాము అంటే దానికి కారణం గురుత్వాకర్షణశక్తి.
ఒకవేళ వున్నట్లు వుండి భూమికీ గురుత్వాకర్షణ శక్తి పోతే భూమి మీద వున్న వస్తువులు, జీవం, నీరు అంతా ఆకాశంలోకి ఎగిరిపోతాయి.
You must log in to post a comment.