పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఏమిటి?

పంచభక్ష్యాలు అంటే ఐదు రకాల తినబడదగిన ఆహారాలు- వాటిని కలిపితే మనం తినే పూర్తి స్థాయి భోజనం (ఇంగ్లీష్ లో‘full course meal’ అనుకోండి) అవుతుంది.

  • భక్ష్యం – కొరికి తినేది
  • భోజ్యం – నమిలి మింగేది
  • లేహ్యం – నాకి తినేది
  • చోష్యం – పీల్చుకొనేది/ జుర్రుకొనేది
  • పానీయం – తాగేది
మనం తినే ఆహారం సమీకృతంగా మరియు జీర్ణక్రియ సక్రమంగా ఉండాలని మన పెద్దలు తయారు చేసిన ఆహార ప్రణాళికలో భాగాలు ఇవి.
వర్గీకరణ ఇలా ఉంటుంది –
  • భ క్ష్యం – గారెలు, బూరెలు, బొబ్బట్లు లాంటివి
  • భోజ్యం – అన్నంతో చేసేన పులిహోరా లాంటివి
  • లేహ్యం – నేను మన పచ్చళ్ళని దీని క్రింద చేర్చుతాను
  • చోష్యం – సాంబార్, రసం. పాయసం, పెరుగు లాంటివి
  • పానీయం – మంచినీరు, పానకం, ఫలరసాలు వంటివి.
%d bloggers like this:
Available for Amazon Prime