ఏదైనా ఒక వస్తువు గాలిలో ప్రయాణించేటప్పుడు అది గాలిలో ఉండే అణువులను నెట్టుకుంటూ వెళ్తుంది.ఒక వేళ ఆ వస్తువు ధ్వని కన్నా వేగంగా ప్రయాణిస్తే,అది ధ్వని కన్నా వేగంగా గాలిలో ఉండే అణువులను నెట్టుకుంటూ వెళ్తుంది.అప్పుడు ఆ వస్తువు వల్ల షాక్ వేవ్స్ ఏర్పడుతాయి.ఆ షాక్ వేవ్స్ వల్ల పెద్ద శబ్దం వస్తుంది.ఆ శబ్దాన్నే సోనిక్ బూమ్ అంటారు.దీన్ని మనం మిలిట్రీ ఎయిర్క్రాఫ్ట్స్ ప్రయాణించేటప్పుడు చూడొచ్చు.
ఇక్కడ కాంతి అనేది వస్తువు కాదు.అది ఒక ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్.కాబట్టి అది గాలిలో ఉండే అణువులను నెట్టకుండానే ప్రయాణించగలదు.కాబట్టి షాక్ వేవ్స్ ఏర్పడవు.అందుకే కాంతి ధ్వని కన్నా వేగంగా ప్రయాణించినప్పటికీ ,షాక్ వేవ్స్ ఏర్పడవు కాబట్టి ఫ్లాష్‌లైట్ ఆన్ చేసినప్పుడు సోనిక్ బూమ్ ఏర్పడదు.
You must log in to post a comment.