గోదావరి జిల్లాలది భోజన ప్రియులది అవినాభావ సంబంధము.
గరాజీలు
అమలాపురం దగ్గరలో నగరం అనే ఊరిలో గరాజీలు తయారుచేస్తారు.వీటి రూపం ఆధారంగా ‘పిచ్చుక గూళ్ళు’అనే గమ్మతు అయిన పేరు కూడా వాడుక లో ఉంది.
- కాకినాడ గొట్టం కాజా ఇది కోటయ్య స్వీట్స్ షాపులో దొరుకుతుంది.
మడత కాజా
తాపేశ్వరం అనే ఊరిలో ఈ మడత కాజా లభిస్తుంది.ఈ ఊరు రాజమహేంద్రవరం కి సుమారుగా 25 కిలోమీటర్ లు దూరం లో ఉంది.
పాకం గారెలు
తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అంటారు.ఇది పాత సామెతే. కానీ పాకం గారెలు తినాలి అంటే పెరుమాళ్ళ పురం లొనే తినాలి.ఈ ఊరు కాకినాడ కు 30 కిలోమీటర్ల దూరం లో ఉంది.
పొట్టిక్కలు
పొట్టిక్కలు అంటే పనస ఆకుల్లో వేసే ఇడ్లీ లాంటిది.వీటినే పనస బుట్టలు అని కూడా అంటారు.అంబాజీ పేట పొట్టిక్కలు కి బాగా ప్రసిద్ధి.
చిట్టి పెసరట్టు
తొక్కుడు లడ్డు
కూరడ అనే ఊరు కాకినాడ దగ్గరలో ఉన్నది.
పాలకోవ
రావులపాలెం పక్కన అవిడి, ఖండ్రిగ ఊర్లలో పాలకోవ బాగా ప్రసిద్ధి.
రాజమండ్రి లో గంగరాజు కోవ కూడా నోరు ఊరించేలా ఉంటుంది.60 సంవత్సరాలు గా ఇక్కడ కోవ తయారు చేస్తున్నారు.
సీతాఫలం
రుచికరమైన సీతాఫలాల కోసం ఎవరైనా రాజమండ్రి దగ్గర దివాంచేరువు వెళ్లాల్సిందే.
జీడీ మామిడి కాయలు
ఈ మధ్య కనుమరుగు అవుతున్న వాటిలో జీడి మామిడి కాయలు కూడా ఒకటి.గోకవరం మండలం లో ఇవి విరివిగా లభిస్తాయి.
కుండ బిర్యాని
పులస చేప పులుసు
“పుస్తెలు అమ్మి అయిన పులస తినచ్చు”.గోదావరి జిల్లాల్లో ఇది తరచు గా వాడే నానుడి.అసలైన పులస కోసం ధవళేశ్వరం వెళ్లాల్సిందే.
పులస పులుసు గోదావరి జిల్లాల వాళ్ళు తినే కంటే చుట్ట పట్టాలకు పంపించేదే ఎక్కువ.
బ్యాంబో చికెన్
రాజమండ్రి భద్రాచలం జాతీయ రహదారి లో మారేడుమిల్లి అనే గ్రామం లో ఈ బ్యాంబో చికెన్ తయారు చేస్తారు.అడవి ప్రాంతంలో వెదురు బొంగులను ఉపయోగించడం వలన ఈ పేరు వచ్చింది.
పూతరేకులు
- ఆత్రేయపురము పూతరేకు అతిథిలా అది బహు రుచి అని ఒక పాటలో కూడా వాడుకున్నారు అంటే చూసుకోండి మరి.
అన్నవరం ప్రసాదం
- అన్నవరం ప్రసాదం ఆకులు కూడా వదలకుండా నాకేస్తారు అంటారు అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత రుచిగా ఉంటుందో.
రోజ్ మిల్క్
- రాజమండ్రీ రోజ్ మిల్క్ ఇక్కడికి వెళ్ళిన వారు ఒక రోజ్ మిల్క్ బాటిల్ ఇంటికి తెచ్చుకుని మరి ఉంచుకుంటారు.
You must log in to post a comment.