బృహదీశ్వర ఆలయం-తంజావూరు

పెరువుదైయార్ కోయిల్ బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరు లో కలదు. ఇది శైవాలయం . దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయంయునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడినది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది.
చరిత్ర రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో మరోబృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళ పురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్బ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణం లో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె వున్నది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడ అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి. 

అంత ఎక్కువ బరువు గల రాయిని ఏ విధమైన సిమ్మెంట్, ఉక్కూ సహాయం లేకుండానే 13 అంతస్తులుగా మలిచి ఏరకమైన ఏటవాలూ లేకుండా నిర్మింపబడడం అనేది నిజంగా ఇప్పటికీ అంతుపట్టని ఓ విశేషమనే చెప్పుకోవాలి. మిట్టమధ్యాహ్నమైనా ఈ గోపురం యొక్క నీడ ఎక్కడా మనకి కనిపించకపోవడం మరో విశేషం. ఒక అంచనా ప్రకారం ఇక్కడికి నాలుగు మైళ్ల దూరం నుండి ఏటవాలుగా ఒక రాతి వంతెనను కట్టి దాని పైనుంది ఏనుగులతో అతి బరువైన ఆ రాతిని ఈ శిఖరంపైకి తరలించారని ఇక్కడ గైడ్ వివరించారు. ఈ ఆలయాన్నీ క్రీ.శ 1004లో ప్రారంభించి 1009 లో పూర్తి చేశారు. కేవలం ఐదు సంవత్సరాలలో ఇంతపెద్ద ఆలయాన్ని నిర్మించడం అప్పటి రాజుల నిర్మాణకౌశల్యతకు నిదర్శనం.
బృహదీశ్వరాలయం అన్నా తమిళంలో పెరియకోయిల్ అన్నా పెద్దగుడి అని అర్థం. ఆ పేరుకి తగ్గట్లే నిజంగా చాలా పెద్దగానే ఉంటుంది ఈ ఆలయం.
ఈ ఆలయంలో గర్బగుడిలోని శివలింగం 13 అడుగుల ఏకశిలా నిర్మితం.ఈ ఆలయ ప్రాకారాలు చాల విశాలమైనవి. ప్రాకారం పొడవు 793 అడుగులు కాగా వెడల్పు 393 అడుగులు. ఈ ఆలయంలో శివునికి ఎదురుగా కనిపించే నంది విగ్రహం కూడా చాలా పెద్దగానే ఉంటుంది. సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో ఈ నందీశ్వరుని విగ్రహాన్ని ఇక్కడ నిర్మించారు. ఈ నంది 2 మీటర్ల ఎత్తు 2.6 మీటర్ల పొడవు మరియు 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఈ ఆలయ ప్రాంగణం మొత్తం దాదాపు పర్లాంగు దూరం ఉంటుంది. మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని అప్పటి శిల్పులు , వేద శాస్త్రజ్ఞులూ నిర్మించారు
ఈ గుడి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఉంది. శైవ, వైష్ణవ, శాక్తేయ సంప్రదాయాలు కనిపించే ఈ ఆలయం మన ప్రాచీన భారతీయ సంఘ వైభవానికి, అప్పటి ప్రజల కళాత్మక జీవనవిధానానికీ ఓ మచ్చుతునక
కనుక తమిళనాడు వెళ్ళేవారు తప్పకుండా ఈ ఆలయాన్ని చూడటం మాత్రం మరవకండి
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

How to go : This temple is situated at Thanjavur city of Tamil Nadu. The nearest railway station is at Thanjavur junction. Nearest airport is the Tiruchirapalli Airport which is located at a distance of 65 km from Thanjavur.
Road distance from Chennai Central to Tanjavur : 320 km
Trains are available from Chennai Egmore to Tajnavur : 351 kms

%d bloggers like this:
Available for Amazon Prime