ఎయిర్‌పాడ్స్
ఇప్పటికీ ఇలాంటి ఫార్మ్ ఫ్యాక్టర్‌తో ఇంతటి పనితీరు ఉన్న ఇయర్‌ఫోన్స్ లేవు.
ఐఫోన్
యువతకు ఇది స్టైల్ స్టేట్‌మెంట్. మాట్లాడుతున్నప్పుడు చేతిలో ఐఫోన్ కనిపించినంత ట్రెండీగా వారికి మరేదీ కనపడదు.
వాచ్
ఇక వీటి గురించి ఏం చెప్పాలి?
ఆపిల్ ఉత్పత్తులేవైనా సరే డిజైన్ సరళంగా (uncluttered) ఉంటుంది.
పనితీరు కూడా సమాన ఉత్పత్తులతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. దీనికి ఒక కారణం, సాఫ్ట్‌వేర్ హార్డ్‌వేర్‌కు దగ్గరగా, వారే సొంతంగా డెవెలప్ చెయ్యటం.
ఉదా: ఓ పరికరం యొక్క సమర్థవంతమైన పనితీరుకు ఎంత శక్తివంతమైన ప్రాసెసర్ అవసరమో అదే పెట్టటం.
నేను 2010 నుంచి ఫోటోలు ఎడిట్ చేసేందుకు మ్యాక్‌బుక్ ప్రో వాడుతున్నాను. ఇంతదాక ఒక్క సారి కూడా అది ఫ్రీజ్ అవ్వటం, క్రాష్ అవ్వటం, వైరస్ సోకటం వంటివి జరగలేదు. మూడు సార్లు కింద పడింది – ఒక చోట చిన్న సొట్ట పడింది కానీ పనితీరులో ఏమాత్రం లోపం లేదు. ఇదే కాలక్రమంలో వివిధ లోపాల వల్ల మూడు విండోస్ ల్యాప్‌టాప్‌లు మార్చాను.
You must log in to post a comment.