ప్రొద్దున్నే ఫుట్ పాత్ మీద ఇడ్లీలు, వడలు అమ్ముతుంటారు. ఒక ప్లేట్ ఇరవై రూపాయలు చొప్పున ఒక వంద మందికి అమ్మినా 2000 రూపాయలు వస్తాయి. వెయ్యి రూపాయలు ఖర్చులకు పోయినా వేయి రూపాయలు మిగులుతాయి. ఈ వ్యాపారం లో కనీసం 50% లాభం ఉంటుంది. రోజుకు పని చేసేది 5 గంటలు మాత్రమే.(ఉదయం6 గంటలనుండి 11 గంంటల వరకే).
ట్రైన్స్ లో సమోసాలు అమ్మే వాళ్లు కూడా రోజుకు రెండు వేలు సంపాదిస్తారు.
తిరుమల వంటి పుణ్యక్షేత్రాలలో టాక్సీలు నడిపితే నెలకు లక్ష లేదా రెండు లక్షలు సంపాదించవచ్చును.
పట్టణాల్లో పని చేసే బార్బర్ షాపులు, యిస్త్రీ బళ్లు ,రైల్వే పార్టర్లు, రోజుకు వేయి రూపాయలు పైననే సంపాదిస్తారు
ఏపని అయినా చేసేందుకు సిద్ధంగా ఉంటే మన దేశంలో గవర్నమెంట్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదించవచ్చును.
You must log in to post a comment.