ఆరోగ్యంగా ఉండటానికి నేను ఏమి తినాలి?

ప్రస్తుతం ఈరోజుల్లో అందర్నీ వేధిస్తున్న ప్రశ్న ఇదే. అయితే ఏమి తినాలో తెలుసుకోవడం ఒక ఎత్తైతే , తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టి సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యమైన అంశం. మానవ శరీరం అధిక భాగం ప్రోటీన్ తో నిర్మితమైంది. కాబట్టి మన ఆహారంలో అధిక భాగం ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. చికెన్, గుడ్లు, ఓట్స్, శెనగలు, పన్నీరు వంటి ఆహార పదార్ధాల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ తో పాటు ఆహారంలో కొద్ది మొత్తంలో కార్బోహైడ్రేట్స్, కొవ్వులు కూడా ఉండాలి. అయితే ఇవి పరిమితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో ప్రోటీన్ ను భాగంగా చేసుకుంటూనే అన్ని రకాల పండ్లు, తాజా కూరగాయలు తినాలి. ప్రతీ రోజూ ఒక పండును, పచ్చి కూరగాయల సలాడ్‌ లను ఆహారంలో భాగంగా చేసుకుంటే మీకు పీచు పదార్ధం సులువుగా దొరుకుతుంది. వీలైనంత మేర మాంసాహారాన్ని తగ్గిస్తే మంచిది. అలాగే వేపుడు పదార్ధాలు కూడా . పైన చెప్పుకున్న ఆహార పదార్ధాలతో పాటు ప్రతీరోజు వ్యాయామం చేయడం అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. అన్నింటికంటే చాలా ముఖ్యమైన విషయం ఎక్కువగా నీళ్లు తాగడం. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే. మంచి ఆహారం తీసుకుని వ్యాయామం చేయకున్నా, మానసిక ఆరోగ్యం సరిగా లేకున్నా వాళ్లు రోగగ్రస్తుల కిందే లెక్క.
%d bloggers like this:
Available for Amazon Prime